సామాన్యుడిని భయపెడుతున్న ధరల బూచీని
పారదోలేందుకు అలుపెరుగని పోరాటం చేసిన యోధుడతడు. ఎవరి ఒత్తిళ్లకు
తలొగ్గకుండా కామన్ మ్యాన్‌ను సేవ్ చేయడానికే మొగ్గుచూపాడతడు. ఆయనే దువ్వూరి
సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా తన పదవీకాలంలో తీసుకున్న
ముక్కుసూటి నిర్ణయాలతో కొందరి విమర్శపూదుర్కొన్నా.. అశేష జన అభిమానాన్ని
గెలుచుకోగలిగారు. దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో
రిజర్వ్ బ్యాంక్‌కు 22వ గవర్నర్‌గా సెప్టెంబర్ 5, 2008న బాధ్యతలు చేపట్టారు
దువ్వూరి సుబ్బారావు. తన ఐదేళ్ల పదవీకాలంలో ధరల సూచీని కట్టడి చేసేందుకు
నిర్విరామంగా కృషి చేశారాయన. ద్రవ్యోల్బణం నియంవూతణకు మాత్రమే పెద్దపీట
వేసి వృద్ధి రేటు మందగించడానికి కారణమయ్యారని విమర్శలొచ్చినా ఆయన మాత్రం
ధరలు తగ్గించే విషయంలో వెనుకడు గేయలేదు. వృద్ధికి దోహదపడేలా వడ్డీరేట్లు
తగ్గించాలని ప్రభుత్వం, పారిక్షిశామిక వర్గాల నుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా
లెక్కచేయకుండా సామాన్యుడి పక్షానే పోరాడారు. వ్యవస్థలో సరఫరా అడ్డంకులు,
అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి కార్పొరేట్ రంగాన్ని
గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ద్రవ్య ఉద్దీపనల ప్రభావంతో మూడేళ్ల
క్రితం ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి పెరిగింది.
ప్రజలపై ధరాభారం తగ్గించేందుకు ఆయన మార్చి 2010 నుంచి అక్టోబర్ 2011 మధ్యకాలంలో పదమూడు సార్లు పాలసీ రేట్లను పెంచి రికార్డు సృష్టించారు. ఆయన తీసుకున్న చర్యల ఫలితంగానే టోకు ధరల సూచీ ఇప్పుడు సాధారణ స్థాయికి తగ్గింది. కానీ ఈ నిర్ణయాలు కార్పొరేట్ వర్గాలకు రుచించలేదు. దీంతో ఆయన విధానాలను చాలా మంది బాహాటంగానే విమర్శించారు. తమ గోడు చెప్పుకోవడానికి ఇండస్ట్రియలిస్టులకు కనీసం వేదికైనా ఉందని, ఆ అవకాశం లేని సామాన్య జనాల కోసమే నేనున్నాని ఆయన కూడా ఓపెన్‌గానే చెప్పారు. ఒకానొక సమయంలో ఆర్థికమంత్రి చిదంబరం కూడా దువ్వూరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధికి ఒక్కడినే ప్రయత్నిస్తానన్న విత్తమంవూతి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘‘ చిదంబరం గారు ఒంటరి పయనం చేసినా.. ఆర్‌బీఐ ఉన్నందుకు ఏదో ఒకరోజు దేవుడికి ధన్యవాధాలు చెప్పుకోవాల్సిన సమయం వస్తుంది’’అని అన్నారు. రూపాయి పతనానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమన్న ప్రభుత్వాన్నీ ఆయన తీవ్రంగా ఎండగట్టారు. వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మకపరమైన లోపాలను సరిదిద్దకుండా కేవలం గ్లోబల్ పరిణామాలే రూపాయి పతనానికి కారణమనడం సరికాదని, దేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులకు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఇన్ని సంచలనాలకు నెలవైన దువ్వూరి పదవీకాలం ఈనెల 4తో ముగియనుంది. ఆయన స్థానంలో ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా రఘురాం రాజన్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆద్యంతం సంక్షోభాలమయమే..
దువ్వూరి తన పదవీ కాలంలో ఆద్యంతం సంక్షోభాపూదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా మాంద్యం ముగిసిన తర్వాత ద్రవ్యోల్బణ సమస్య, ఆతర్వాత అమెరికాకు రేటింగ్ డౌన్‌క్షిగేడ్ గండం.. యూరోపియన్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం.. రికార్డు స్థాయికి పెరిగిన ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు.. దశాబ్ద కనిష్ఠానికి కుంటుపడ్డ దేశ వృద్ధిరేటు, బ్యాంకుల్లో కేవైసీ నిబంధనల ఉల్లంఘన కుంభకోణం.. ఇలా సమస్యలు ఒకదాని ఒకటిగా వచ్చిపడ్డాయి. పదవి చివరికాలంలో రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థను పట్టి కుదిపేస్తోంది. రూపాయి మారకం విలువను స్థిరీకరించేందుకు సైతం ఆర్‌బీఐ గవర్నర్‌గా తన పరిధిలో వీలైనన్ని ప్రయత్నాలు చేశారు.ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రారంభమైన సంక్షోభం తన పదవీకాలం ముగిసేనాటికి సద్దుమణుగుతుందంటూ పలు సందర్భాల్లో దువ్వూరి హాస్య చతురతను కూడా బయటపెట్టారు.
దువ్వూరి ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు
ఎన్ని సంక్షోభాలొచ్చినా.. సమస్యపూదురైనా బ్యాంకులు తమ ఖాతాదారులకు మెరుగైన సేవలందించే దిశగా దువ్వూరి తన హయాంలో పలు విధానపరమైన మార్పులు తీసుకురాగలిగారు. అన్నిటికంటే ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకును ప్రజలకు చేరువ చేయడంలో విజయం సాధించారనే చెప్పొచ్చు. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థలో పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగారు.
- వినియోగదారులకు నాణ్యమైన సేవలందించే దిశగా దామోదరన్ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించి, వాటిని అమలు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించారు. గృహ రుణాలను నిర్దేశిత కాలం కంటే ముందే చెల్లిస్తే బ్యాంకులు అప్పట్లో పెనాల్టీ ఫీజును వసూలు చేసేవి. దామోదరన్ కమిటీ సూచనల ఆధారంగానే ఈ విధానానికి స్వస్తి పలికారు.
- బ్యాంకు ఖాతాలపై రోజువారి వడ్డీ లెక్కింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సేవింగ్ ఖాతా వడ్డీపై నియంవూతణను ఎత్తివేశారు. దీంతో బ్యాంకుల మధ్య పోటీ పెరిగి వడ్డీరేట్లు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది.
- బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘అంబుడ్స్‌మన్’ వ్యవస్థ పరిధిని మరింత విస్తృతపరిచారు.
- కనీస డిపాజిట్ పరిమితి లేని బ్యాంకు ఖాతాలను ప్రవేశపెట్టడం, బిజినెస్ కరెస్పాండెంట్ల వ్యవస్థ ఏర్పాటు ద్వారా మారుమూల గ్రామాలకు సైతం బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ చర్యల ఫలితంగానే దేశంలో బ్యాంకింగ్ సేవల పరిధి గణనీయంగా పెరిగింది.
- రిజర్వ్ బ్యాంకు విధానాలను తెలియపర్చేందుకు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసే సంస్కృతి కూడా దువ్వూరి హయాంలోనే ప్రారంభమైంది.
- గతంలో మూడు నెలల కొకసారి మాత్రమే ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించేవారు. దువ్వూరి గవర్నర్‌గా చేపట్టాకే సమీక్షల సంఖ్య రెట్టింపైంది. ఇప్పుడు మూడు నెలలకు రెండు సార్లు సమీక్ష నిర్వహించే పద్ధతి కొనసాగుతున్నది.
- మనీలాండరింగ్ బాగోతంపై కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ వివరాలు బయటపెట్టిన నేపథ్యంలో దేశంలోని బ్యాంకులన్నింటిపైనా దర్యాప్తు జరిపి ఆర్‌బీఐ భారీ జరిమానాలు విధించింది.
- కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా అర్హులైన దరఖాస్తుదారులకు లైసెన్సులు మంజూరు చేసే అవకాశం ఉంది.
-కేరళలోని ఎర్నాకుళం జిల్లా ఆర్థిక సమక్షిగాభివృద్ధి సాధించడంలో దువ్వూరి కీలక పాత్ర పోషించారు.
దువ్వూరి పర్సనల్ ప్రొఫైల్
జననం : ఆగస్టు 11, 1949
స్వస్థలం : ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా)
విద్యార్హతలు : ఐఐటీ-ఖరగ్‌పూర్ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్‌సీ(1969), ఐఐటీ కాన్పూర్ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ(1978), క్వాంటి ఎకనామిక్ మోడలింగ్‌పై మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి ఫెలోషిప్, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ.
వృత్తి : ఐఏఎస్ అధికారి (1972లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి..)
కీలక పదవులు : 1988-93 మధ్యలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లో సంయుక్త కార్యదర్శి , 1993-98 వరకు ఆంధ్రవూపదేశ్ ఆర్థిక కార్యదర్శి, 1994-2004 వరకు ప్రపంచ బ్యాంకులో ప్రధాన ఆర్థిక వేత్త, 2005-07 మధ్యలో ప్రధాని ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) సభ్యులు, సెప్టెంబర్ 5, 2008 నుంచి ఆర్‌బీఐ 22వ గవర్నర్‌గా బాధ్యతలు
కుటుంబం : భార్య, ఇద్దరు పిల్లలు.
భార్య పేరు : ఊర్మిళ సుబ్బారావు
పిల్లలు : మల్లిక్ (ఐఐటీ కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రపంచ బ్యాంకులో పనిచేస్తున్నారు)
రాఘవ్ ( ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టాపొంది లండన్‌లో జాబ్ చేస్తున్నారు)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి