20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సీమాంధ్ర జనం వీధుల్లో నేతలు భూముల్లో


9/20/2013 3:31:50 AM
సీమాంధ్ర జనం వీధుల్లో నేతలు భూముల్లో
కోట్ల రూపాయలు మళ్లిస్తున్న పెట్టుబడిదారులు, నేతలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేతులు
మారుతున్న వేల ఎకరాలు

-భూముల కొనుగోళ్లలో సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు
-రానున్న కొత్త రాజధాని.. సీమాంధ్రలో రియల్ రెక్కలు
-వెయ్యి ఎకరాలు కొనేసిన సమైక్య నాయకుడు
-అదే దారిలో గుంటూరు కాంగ్రెస్ నేత..
-తానూ తక్కువ తినలేదన్న టీడీపీ మాజీ మంత్రి
-వాటా కోసం మూడు సీమాంధ్ర చానళ్ల పోటాపోటీ


lands001విజయవాడ/హైదరాబాద్, సెప్టెంబర్ 19 (టీ మీడియా):సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజలను ఉద్యమాలకు ఉసికొలుపుతున్న నేతలు, టీవీ చానెళ్ల యజమానులు రాష్ట్ర విభజనను లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. సీమాంవూధలో రియల్ వ్యాపారానికి ఈ వర్గాలవారు భారీగా నిధులు తరలిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ సాగిన వీరి రియల్ దందా గత రెండు నెలలుగా సీమాంధ్ర జిల్లాల చుట్టూ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కాంగ్రెస్ అధిష్ఠానం కొంతకాలం క్రితమే సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు చెప్పేసింది. అప్పటినుంచే ఆయా ప్రముఖులు తమ వ్యాపారాభివద్ధికి రియల్ ఎస్టేట్ ప్రణాళికలు వేసుకున్నారు. రాజధాని నగరం ఏ ప్రాంతంలో రావచ్చో కూడా అంచనాలు వేసుకుని అనుచరులతో ఆ ప్రాంతాల్లో భూముల అన్వేషణ చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒకవైపు రాజీనామా డ్రామాలు, మరోవైపు ప్రజలను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. అదే సమయంలో తమ ఆస్తుల విస్తరణకు ఈజీ మనీ...తక్కువ సమయంలో గడించేందుకు అడుగులు వేస్తున్నారు.

గతంలో తెలంగాణ ప్రాంతంలో అలైన్‌మెంట్ల మార్పులు-చేర్పులతో అడ్డదిడ్డంగా అక్రమార్జనకు అలవాటుపడిన సీమాంధ్ర పెట్టుబడిదారులు తాజాగా సీమాంవూధలో అలాంటి నాటకాలే ఆడుతున్నారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, ఎక్కడ కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్నారు...అనే విషయాలు అన్నీ క్షుణ్ణంగా తెలిసిన నేతలు తెలివిగా చౌక ధరలకు భూములను కొనుగోలుచేస్తూ సీమాంధ్ర ప్రజలకు శఠగోపం పెడుతున్నారు. సమైక్య ఉద్యమం నడిపిస్తున్న రాజకీయ నేతలే భూవ్యాపారం జోరుగా జరుపుతున్నారని ఇటీవలి భూముల క్రయవిక్షికయాలను గమనిస్తే వెల్లడవుతోంది.

ఇందులో ట్విస్టు ఏమిటంటే తెలంగాణ రానే రాదని.. హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు ఉన్నాయని తమకు తెలిసిందని రోజుకో సోది చెబుతున్న సీమాంధ్ర వార్తా చానళ్లు కూడా భూముల కొనుగోలులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుండి రెచ్చగొట్టి మరీ వార్తలు ప్రసారం చేస్తున్న 3 సీమాంధ్ర చానళ్లు ఢిల్లీలోని తమ లాబీని ఉపయోగించి ఎక్కడ రాజధానికి అనుకూల పరిస్థితి ఉందోనని తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా చవక ధరలకు భూములను కొనుగోలుచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొనుగోలు అగ్రిమెంట్లు కూడా చేయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ వచ్చే పరిస్థితి లేదంటూ ప్రజల ఉద్యమాలను భూతద్దంలో చూపుతున్నాయి. సీమాంవూధకు చెందిన రాజకీయ పెట్టుబడిదారులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవంగా ఇపుడు సీమాంవూధకు కొత్త రాజధాని ఏర్పాటుపై స్థల అన్వేషణ జరుగుతున్నది. ఫలితంగానే గత ఆరేడు ఏళ్ల క్రితం హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో వచ్చిన రియల్ ఊపు ఇపుడు సీమాంవూధలో కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు తమ అనుచరగణం ద్వారా గుంటూరు నుంచి ఒంగోలు వరకు భూములు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

కొనుగోళ్లలో నేతలు బిజీబిజీ..
సమైక్యాంవూధకు మారుపేరుగా నిలబడిన ఒక ప్రజావూపతినిధి ఇప్పటికే ఒంగోలు సమీపంలో వెయ్యి ఎకరాలకు పైగానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సీమాంవూధకు కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య లేదా ఒంగోలు సమీపంలో నిర్మాణం జరుగుతుందని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు తెనాలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా గతంలో పనిచేసిన ఒక ప్రజా ప్రతినిధి సూచనలు, సలహాలతో పలువురు ప్రజావూపతినిధులు గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, మార్కాపురం చుట్టువూపక్కల భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అదే విధంగా విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే మార్గంలో హనుమాన్‌జంక్షన్, నూజివీడు, అగిరిపల్లి చుట్టు ప్రక్కల సైతం భూములు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు-విజయవాడ మార్గ మధ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజావూపతినిధి సంయుక్తంగా సుమారు 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పడితే వాటి చుట్టు ప్రక్కల ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. రాజధానికి మెరుగైన అవకాశాలున్నాయనే ప్రచారం ఉన్న ప్రకాశంజిల్లాలో ఇప్పటికే రాజకీయ నేతలు భారీగా భూములను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కనిగిరి, పొదిలి, మార్కపురం ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రకటన రాకముందే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా రాయించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యాపార వేత్త, పార్లమెంట్ సభ్యుడు ఒకరు గుంటూరు జిల్లా చిలుకలూరి పేట నుంచి వినుకొండకు వెళ్లే మార్గంలో 800 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు కూడా జోరుగా భూములు కొనుగోలు చేస్తున్నారు. చోటా, మోటా నాయకులు కూడా భూ కోనుగోలుపైనే దృష్టి సారిస్తున్నారు. విజయవాడ నుంచి నందిగామ వరకు రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇబ్రహింపట్నం- కంచికచర్ల మధ్యలో కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు చెబుతున్నారు. విజయవాడ -ఆగిరిపల్లి మధ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత వంద ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ-ఏలూరు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మూడు వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. సీమాంధ్ర సమ్మె నేపథ్యంలో అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. దీన్ని గమనించిన పెట్టుబడిదారులు తెలంగాణలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు అనుమతించాలని సీఎంను ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి