15, సెప్టెంబర్ 2013, ఆదివారం

హైదరాబాద్‌ను కాదు, ఆత్మగౌరవాన్ని అడగడం


9/14/2013 12:11:49 AM
విశాలాంద్ర వాదం బూటకం. సమైక్యవాదం ఇంకా బూటకం. విభజ న నిజం. విభజన తథ్యం. గొడవంతా హైదరాబాద్ కోసమేనని ఏపీఎన్జీవోల సభ రుజువు చేసింది. ‘పచ్చని పంటపొలాల్లో రాజధాని కట్టుకోవాలా?’ అని విజయవాడకు చెందిన ఒక మహిళ ఏదో ఒక సీమాంధ్ర టీవీలో ఆవేశంగా ప్రశ్నించారు. అంటే పంచాయతీ అంతా హైదరాబాద్‌కోసం, హైదరాబాద్ చుట్టూ. సమైక్యత ఉత్త ముసుగు. కానీ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తు దుఃఖభాజనమవుతుం ది. ఆంధ్ర నాయకత్వం మద్రాసు విభజన నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. హైదరాబాద్‌పై సీమాంధ్ర మిత్రులు చేస్తున్నవాదనలు ఏమాత్రం కొత్తగా, వాస్తవికంగా కనిపించవు. ఈ వాదనలన్నీ మునుపు ఎప్పుడో ఒకప్పుడు విన్నవి, తిరస్కారానికి గురైనవే. ఇప్పుడు కాదు యాభై ఏడేళ్ల క్రితమే ఫజల్ అలీ, నెహ్రూ...ఇద్దరూ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలను సీమాంధ్ర మిత్రులకు మరోసారి గుర్తు చేయాలి. జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమిషన్(ఎస్సార్సీ) 1955లోనే చాలా దూరదృష్టితోనే తన నివేదికను రూపొందించింది. మళ్లీ మళ్లీ చెప్పాల్సి వచ్చినా చెప్పక తప్పదు.

ఎస్సార్సీలోని సంబంధిత భాగాలను ఒక్కసారి చూడండి:
ఎస్సార్సీ 370 పేరా: విశాలాంధ్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే వదలివేయడం జరిగింది.
ఎస్సార్సీ 385 పేరా: ఈ దశలో తెలంగాణను ఆంధ్ర తో కలపడం రెండు ప్రాంతాల వారికీ పాలనాపరమైన ఇక్కట్లను సృష్టించే అవకాశం ఉంది.
ఎస్సార్సీ 386 పేరా: ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత విలీన ప్రతిపాదనను భవిష్యత్తులో పరిశీలించే ప్రతిపాదనతోనే ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రం పేరుతోవూపత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం రెండు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తుది అవగాహనకు వచ్చాం. 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత మిగిలిన హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదంతో విలీన ప్రతిపాదనను పరిశీలించవచ్చు.

ఇంకా ఏమి చెప్పిందో చూడండి
ఎస్సార్సీ పేరా 368: హైదరాబాద్ రాష్ట్ర ప్రస్తుత స్వభావాన్ని మార్చే విషయం పరిశీలించాల్సి వస్తే ఒక అంశాన్ని తప్పక గమనించాల్సి ఉంటుం ది. హైదరాబాద్-సికింవూదాబాద్ జంట నగరాల్లో ప్రస్తుతం ఉన్న ఉర్దూ మాట్లాడే 45.4 శాతం ప్రజల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌ను తెలంగాణకు లేక విశాలాంవూధకు రాజధానిగా చేస్తే సాంస్కక్షుతికం గా, ఆర్థికంగా నష్టపోతామని వారికి భయాలు ఉన్నాయి. వారి ఆందోళనలో కొంత వాస్తవం ఉంది. దీనికి పరిష్కారంగా కొందరు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సూచిస్తున్నారు. కానీ అది ఎంతమాత్రం ఆచరణయోగ్యం కాదు. అందువల్ల జంటనగరాల్లోని అసంఖ్యాక ఉర్దూ మాట్లా డే ప్రజల భాష, సాంస్కక్షుతిక, ఇతర ప్రయోజనాలను కాపాడడానికి ఇతరత్రా తగినన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థ లు, పాలనా వ్యవహారాల్లో ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ఈ రక్షణ చర్యల్లో భాగంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఉర్దూ మాట్లాడే వారిపట్ల వివక్ష చూపించకుండా చర్యలు తీసుకోవాలి.

నెహ్రూ ఏం చెప్పారు?
‘ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణల విలీనం వివాహం వంటిది. వివాహంతోపాటు తరచూ తలెత్తే మంచి చెడులన్నీ ఈ విలీనంలో కూడా ఉన్నాయి. ఇరువురూ పరస్పరం సహకరించుకుని, అభివృద్ధిని సాధిస్తే ఇరు ప్రాంతాల కూ మంచిది. అయితే ఈ బంధం విజయవంతం కావడానికి ఇరువురూ సాఫీగా నడచుకోవడం అత్యవసరం. విభిన్న మనస్తత్వాలు, ఇతర అంశాలు వివాహ బంధాన్ని ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది. అందువల్ల మరింత జాగ్రత్తగా పరస్పరం సర్దుబాటుతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. అవతలివారి అభివూపాయాలను గౌరవించడం, వారు ఎదిగేందుకు సహకరించడం, తన అభివూపాయాలను అవతలివారిపై రుద్దకపోవడం ఈ బంధం విజయవంతం కావడానికి అవశ్యం.’
(ఇండియన్ ఎక్స్‌వూపెస్, 2 నవంబర్ 1956)

‘తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలసిపోయాయి. ఇదోరకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషవూపదమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. మానవ సంబంధాలకు మూలమైన మనస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖ హేతువవుతుంది...కొత్త ఆంధ్ర మంత్రులూ, శాసనసభ్యులూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఇది పరీక్షా సమయం. వారు ఉదారంగా వ్యవహరిస్తారో, లేక సంకుచితంగా వ్యవహరిస్తారో ఇక చూడవలసి ఉంది. అందరినీ కూడగట్టుకుని నడుస్తారో లేక దురహంకారంతో వ్యవహరిస్తారో చూడవలసి ఉంది. అందరి భయాలనూ తొలగించి, అందరికీ న్యాయం చేకూర్చి రక్షణ, ధీమా కలుగడానికి అనుగుణంగా పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుతారో లేదో చూడవలసి ఉంది. శత్రువుతో కూడా మైత్రిని కాంక్షించేవాడే ఘనమైన వ్యక్తి. హైదరాబాద్‌లో ఇకముందు ఏం జరుగుతుందోనని కేవలం హైదరాబాద్ వాసులే కాదు ఇతర ప్రాంతాలవాందరో శ్రద్ధగా గమనిస్తుంటారు.’
(ఆంధ్రపత్రిక, 3 నవంబరు 1956 ఐదవ పేజీ)
ఫజలలీ తన నివేదికలో చెప్పిన భయాలు, నెహ్రూ వ్యక్తం చేసిన అనుమానాలు...అన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు చెప్పండి-వివాహ బంధాన్ని కాపాడలేకపోయిన దురహంకారం, వివక్ష ఎవరు ప్రదర్శించారు? యాభైఏడేళ్ల ఆంధ్రవూపదేశ్‌లో యాభయ్యేళ్లకు పైగా ఆంధ్రా నాయకులే రాష్ట్రాన్ని పరిపాలించారు. వెంగళరావు తెలంగాణ నాయకుడు ఎప్పుడూ కాదు. ‘విడిపోవడమంటూ జరిగితే ఖమ్మం జిల్లాను ఆంధ్రాతో కలపాల’ని బాహాటంగా ప్రకటించినవాడు. తెలంగాణ నాయకులు రాష్ట్రాన్ని ఏలిన కాలం కేవలం ఆరు సంవత్సరాల మూడు మాసాలు. ఏ ముఖ్యమంత్రీ పూర్తి ఐదేళ్లకాలం నిలబడలేకపోయారు. కాదు, సీమాంధ్ర రాజకీయ ఆధిపత్య వ్యవస్థ నిలబడనివ్వలేదు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర నాయకులకు జరిగిందీ ఇదే. మద్రా సు రాష్ట్ర తొలి ప్రధానిగా ఎన్నికయిన ప్రకాశం పంతులును మూణ్ణాళ్లు కూడా ప్రశాంతంగా పరిపాలించనివ్వలేదు. రాజాజీ అనేక కుట్రలు చేసి ఆయనను దించేశారు. దించేయడమే కాదు ఆయన అక్రమంగా పర్మిట్లు, లైసెన్సులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని నివేదికలు తెప్పించారు.

మీడియాలో యాగీ చేయించారు. ‘ఇవన్నీ నేను చేస్తున్న విమర్శలు కాదు, కాంగ్రెస్ మంత్రులే చేస్తున్నారు. ఆయన అధికారం నుంచి వైదొలగగానే, ఆ స్థానంలో రాజాజీ వచ్చారు. ప్రకాశంపై కొన్ని ఆరోపణలు బయటికి వచ్చాయి. విచారణ జరిపితే ఆయన లంచాలు తీసుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జించాడని తేలింది. ఆయన వేలాది లైసెన్సులు, పర్మిట్లు జారీ చేశారు’ అని బీఆర్ అంబేద్కర్ స్వయంగా 1952లో పంజాబ్‌లోని పాటియాలాలో చేసిన ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మద్రాసు ఎస్టాబ్లిష్‌మెంట్ చేసే ప్రచారాలే అంబేద్కర్ వ్యాఖ్యలకు ప్రాతిపదిక అయి ఉండవచ్చు. మెజారిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసే కుట్రలన్నీ ఆరోజు రాజాజీ అండ్ కో ప్రకాశంకు వ్యతిరేకంగా చేసి ఉండవ చ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పీవీ నరసింహారావు, చెన్నాడ్డి, అంజయ్యలకు వ్యతిరేకంగా అటువంటి దుర్మార్గమే జరిగింది.

అంతదూరం ఎందుకు ఏ అధికారం అనుభవించకుండా పన్నెండేళ్లుగా ఉద్యమాలు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకులపై ఎన్ని ఆరోపణలు, ఎన్ని దాడులు చేశారని! ఎంత విషం చిమ్మారు?
ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చరిత్ర తెలియని ఒక కొత్త రాజకీయ బిచ్చగత్తె ‘పదిహేనేండ్లు మీరే ఏలుకోండి’ అని తెలంగాణ ప్రజలకు ఆఫర్ ఇస్తున్నారు. చరిత్ర తెలిసిన మనం స్వీకరించగలమా? సీమాంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెంపొందించలేదు సరికదా, అవిశ్వాసం, అపనమ్మకం పెంచి పోషిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రజలను సెకండ్ క్లాస్ సిటిజన్స్‌గా పరిగణిస్తూ వచ్చారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో ‘మీదే ప్రాంతం, మీదే కులం’ అన్నవి సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అంతర్లీనంగా పనిచేస్తూ వచ్చాయి. అభివృద్ధి చేస్తున్నామన్న పేరుతో హైదరాబాద్‌పై సాం స్కక్షుతిక, ఆర్థిక, రాజకీయ దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ తనను తాను కోల్పోయింది. భూములు, కంపెనీలు, వనరులు అన్నీ అన్యాక్షికాంతం అయ్యాయి.

వీరు అభివృద్ధి అని చెబుతున్న ఏ ప్రక్రియలోనూ తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేయలేదు. ఎక్కడ రోడ్డు వేస్తారో, ఎక్కడ టవర్లు కడతారో, ఎక్కడ ప్రాజెక్టులు వస్తాయో అక్కడ ముందుగానే తమ వారితో భూములు కొనిపించడం ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని పరాయీకరించడం నీలం సంజీవడ్డి మొదలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌డ్డిల వరకు అందరి అభివృద్ధి నమూనా ఇదే. శత్రు దేశాలను యుద్ధంలో ఓడించి, ఆక్రమించినవాడు ఎలాగైతే కొల్లగొడతాడో, ఎలాగైతే శత్రు శేషం లేకుండా చేస్తా రో సీమాంధ్ర నాయకులు కూడా చాలా సందర్భాల్లో యుద్ధంలో గెలిచినవాడిలాగే ప్రవర్తించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణకే దిక్కులేకుండా పోయింది. ఇక ఉర్దూ పరిరక్షణ కాదు కదా, అది అవసాన దశకు చేరుకుంది. ఇవ్వాల్టి పరిస్థితికి కారకుపూవరు? నేరం ఎవరిది? దోషులు ఎవరు? హైదరాబాద్‌పై ఏవో హక్కులు కావాలని అడుగుతున్నారు.

రాజాజీ హెచ్చరిక
మద్రాసుపై ఇలాగే అడిగారు. ‘చెన్నపట్నం నిర్మించింది తెలుగువారే. చెన్నపట్నం భూములన్నీ చంద్రగిరి రాజులవే. మద్రాసులో తెలుగు ప్రజలు మెజారిటీ ఉన్నారు. అందువల్ల మద్రాసుపై మాకు ప్రత్యేక హక్కులు కావా లి’ అని 1952లో కూడా యాగీ చేశారు. మద్రాసుపై పేచీ కారణంగానే పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షను పొడిగింపజేసి, ఆయన ప్రాణాలు తీశారు టం గుటూరి ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి వంటి నాయకులు. ‘మవూదాసు నగరం తమిళదేశంలోఅంతర్భాగం. మద్రాసుకు ఉత్తరంగా చాలా దూరం వరకు తమిళ ప్రాంతం, తమిళ భాష మాట్లాడేవారు ఉన్నారు.

తమి ళ దేశంలో భాగమైన పట్నాన్ని తమిళులు వదులుకోలేరు. ప్రత్యేక పరిపాల న రావడానికీ అంగీకరించరు...మద్రాసు భవిష్యత్తును గూర్చి కొందరు ఆంధ్ర నాయకులు తెలిపే నిరాధారమైన హక్కులే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆటంకంగా ఉన్నవి. కొందరు ఆంధ్ర నాయకుల వైఖరే ఆలస్యం కావడానికి కారణం. మద్రాసులో నూటికి 68 శాతం మంది తమిళులు ఉన్నారని,16 శాతం మంది మాత్రమే తెనుగువారు ఉన్నారని చెప్పింది పూర్తిగా యథార్థం’ అని మద్రాసు ముఖ్యమం త్రి రాజగోపాలచారి 1952 డిసెంబరు 10 అసెంబ్లీలో చెప్పారు. ‘శ్రీరాములు వంటి మం చి మనిషిని ప్రేరేపించినవారు దాన్ని విరమింపజేసేట్లు చేయడం వారి విధి. లేకపోతే ఉద్రేకాలు, ద్వేషాలు రెచ్చిపోగలవు’ అని కూడా ఆయన హెచ్చరించారు. అయినా ఆంధ్ర నాయకులు ఆరోజు శ్రీరాములును బలితీసుకున్నారు.ఇప్పుడు హైదరాబాద్‌పై కూడా అటువంటి వాదనలే చేస్తున్నారు సీమాంధ్ర మిత్రులు. హైదరాబాద్‌పై పేచీతో ఆంధ్రను ఇప్పుడు రావణకాష్టంగా మార్చారు. ఆ ప్రాంతాన్ని ఇంకా సంక్షోభంలోకి నెడుతున్నారు.

హైదరాబాద్‌లో 30 లక్షలమంది ఆంధ్ర ప్రజలు ఉన్నారని ఒకరు, నల భై లక్షల మంది ఉన్నారని ఇంకొకరు వాదిస్తున్నారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల జనాభా లెక్కల్లోకి వెళితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. అదేమంత పెద్ద విషయం కాదు. పోనీ 30 లక్షల మందే ఉన్నారనుకుందాం. మీరు చెప్పే జన సంఖ్య హైదరాబాద్ పరాయీకరణను నిర్ధారిస్తుంది. అది కూడా పక్కనబెడదాం. హైదరాబాద్‌కు వచ్చి బాగుపడ్డారా చెడిపోయారా? మీరు హైదరాబాద్‌కు ఉపయోగపడ్డారా? హైదరాబాద్ మీకు ఉపయోగపడిందా? రాష్ట్రం విడిపోతే మద్రాసులో ఉన్నవారికి కలిగిన నష్టం ఏమిటి? రేపు హైదరాబాద్‌లో ఉన్నవారికి మాత్రం ఏవిధంగా నష్టం? హైదరాబాద్‌పై హక్కు లు, హైదరాబాద్‌లో రక్షణలు అడగడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడం. తెలంగాణవారికి పరిపాలించుకోవడం తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు, హక్కులు తెలియవు, నాగరికత తెలియదు, అభివృద్ధి తెలియ దు...ఇలా అనేకానేక దురభివూపాయాల నుంచి ఈ హక్కులు, రక్షణల డిమాం డు మొదలవుతుంది.

హైదరాబాద్‌పై ఆంక్షలు, హక్కులు సాధించడమంటే ఆంధ్రులకు విజయం కాదు, తెలంగాణ వారిని శాశ్వతంగా శత్రువులను చేసుకోవడం. హైదరాబాద్‌లో శాశ్వత వైరిభావానికి విత్తనాలు వేయ డం. ఇటువంటివి ఏమీ లేకుండా తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినవారినయినా అక్కున చేర్చుకుని ఓట్లు వేస్తున్నారు. జయవూపకాశ్ నారాయణ్, జయసుధ అలా గెలిచినవారే. రేపు వేరయిన తర్వాతయినా అటువంటి సుహృద్భావం కొనసాగాలి అంటే హైదరాబాద్‌పై పంచాయతీ చేయడం మానుకోవాలి.
(కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డికి ధన్యవాదాలతో...)
kattashekar@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి