15, సెప్టెంబర్ 2013, ఆదివారం

హైదరాబాద్‌పై దండయావూతను ధిక్కరిద్దాం


9/14/2013 11:50:49 PM
హై దరాబాద్ నవాబ్‌ను 17 సెప్టెంబర్ 1948న సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి కలిగించాడు. 2013 సెప్టెంబర్ 7న సీమాంవూధు లు మహ్మద్ ఘోరీ, గజినీలను, పిండారీలను మైమరపించే విధంగా దండయాత్ర చేశారు. ఔరంగజేబు గోలకొండ కోటను జయించి ఫతే (విజయం) మైదాన్‌ను ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని సీమాంవూధులు తమ విజయోత్సవ సభాస్థలిగా ఎన్నుకున్నారు. సీమాంధ్ర నుంచి రౌడీలను, గూండాలను కోట్లాది రూపాయలు వెచ్చించి, ప్రభుత్వ ఎస్కార్ట్‌లతో, కేశినేని, జేసీ బస్సులలో విస్కీ సీసాలతో, కత్తులతో ప్రభుత్వఅండతో విజయోత్సవ మైదాన్‌కు కదిలివస్తూ..మా ఎంటిక పీకుతారా, మీ తలలు తీస్తామంటూ సైగలు చేస్తూ.. హైదరాబాద్‌పై దండయాత్ర చేసే దుండగుల్లా సభాస్థలికి చేరారు. వారికి ఆంధ్ర ప్రాంత డీజీపీ రక్షణ కల్పించా డు. 5000 మంది పోలీసు సిబ్బందితో వారి రక్షణతో నిర్బయంగా హైదరాబాద్‌ను జయించినట్టు అన్ని అండదండలు కల్పించిన ముఖ్యమంవూతిని సీమాంవూధుల బ్రహ్మాస్త్రముగా తెలంగాణపై విసిరారు. విజయవిహారం చేస్తూ తెలంగాణవారు అసమర్థులు, తాగుబోతులు 11 గంటల వరకు తాగి పడుకుంటారని విషం వెళ్లగక్కారు. సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద కండీషన్లతో సభా నిర్వహణకు అనుమతి పొందారు. ఉద్యోగులు కాని వారిని సభకు అనుమతించమని, ఎలాంటి గొడవలు జరగకుండా అహింసాయుతంగా సభను నిర్ణీత సమయంలో నిర్వహించుకుంటామని హైకోర్టుకు హామీ ఇచ్చా రు. సీమాంధ్ర పోలీసులు, గూండాలు జై తెలంగాణ నినా దం చేసిన ఉద్యమకారులను, విద్యార్థులను పోలీసులను పశువులను బాధినట్టు బాదారు. పిడిగుద్దులతో రక్తాని చవిచూశారు.

హైదరాబాద్ మాకు పుట్టిన కొడుకు, మా వరసుడని రాజకీయ నాయకుల లాగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు స్పందించాడు. హైదరాబాద్ సీమాంవూధలో అంతర్భాగమని,దాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. దీన్ని అధికార పార్టీ ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గుడ్లప్పగించి చూడడం తప్ప, ఏమీ చేయలేకపోయారు.ఎందుకంటే వారికి పదవి ముఖ్యం. కానీ హైదరాబాద్ ముఖ్యంకాదు. అందుకే సీమాంధ్ర నాయకులు సభను నిర్వహించిన ఏపీఎన్జీవోలను అభినందిస్తూ, వారికి కితాబిచ్చారు. అసమర్థ అధికార తెలంగాణ నాయకుల వల్ల జరిగిన ఈ దురాక్షికమణ హైదరాబాద్‌పై ప్రజాస్వామ్య దండయావూతగా చరివూతలో లిఖించబడుతుంది. సీమాంవూధకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమాన్ని మహాభారతంలో పోల్చి,తెలంగాణ ఉద్యమకారులను కౌరవులలాగా, సీమాంధ్ర ఉద్యమకారులను పాండవులగా అభివర్ణించారు.

గాంధారి అవతారాన్ని ఎత్తి తెలంగాణ దేవతలను తాను కొలిచే ఆంధ్రమాతగా భావించుకొని, మేధావుల్లారా ఏమీ పట్టనట్టుగా చూస్తూ.. భీష్మునిలాగా శాపక్షిగస్తులు కాకూడదన్నారు. హైదరాబాద్‌ను ఆక్రమించి సీమాంవూధలో కలిపి సమైక్యాంవూధగా చేసి ధర్మం నాలుగుపాదాలలో నడుచునట్లు చేయండని పిలుపునిచ్చారు. అప్పుడే భారతదేశం సిరిసంపదలతో తులతూగుతుందని సెలవిచ్చింది. ఆమె మాటలకు ఉబ్బితబ్బిబ్బులై సీమాంధ్ర మహిళలు ఆలింగనం చేసుకున్నారు. పురుషులు ఆహాకారాలు చేశారు. ఆమె ప్రజాస్వామ్య హిందూవాహిణిలో హిందూ ధర్మం కాపాడే కరుడుగట్టిన సీమాంద్ర ప్రాంతీయ మాతగా నిలిచిపోగలిగింది. రాజ్యాధికారం అండతో న్యాయస్థానానికి ఇచ్చిన హామీ ఉల్లంఘించి, బరితెగించి ఏపీఎన్జీవోలు తెలంగాణ ప్రజలను నానా దుర్భాషలాడి, భౌతిక దాడులు చేసి హైదరాబాద్‌ను వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సమైక్యాంవూధుల చర్యలను తీవ్రంగా పరిగణిం చి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కలిసి సమైక్యాంవూధలో ఉండకూడదని నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయాలి.

ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ఆంధ్రుల కాలనీగా మారే ప్రమాదముందని, ఎలాంటి ఒప్పందాలు ఆమోదయోగ్యం కాదని, కాబట్టి హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని సూచించింది. అయినా నాటి ప్రధాని, కేంద్ర హోంమంత్రి సమక్షంలో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేశారు. ఆంధ్ర నాయకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుం గలో తొక్కి, తెలంగాణ భూములను ఆంధ్రులు కొనకూడదన్న ఆంక్షలున్నా.. తెలంగాణ రైతుల వద్ద అడ్డికి పావుసేరు చొప్పున కొన్నారు. తెలంగాణ రైతులు, రైతు కూలీలు అన్నమో రామచంద్రా అంటూ దుబాయి గల్ఫ్ దేశాలకు వలసలు పరిస్థితి ఏర్పడింది.లక్షలాది ఉద్యోగాలు కాజేశారు. తెలంగాణ నిధులను దోచుకున్నారు. కృష్ణా,గోదావరి జలాలను యథేచ్ఛగా సీమాంధ్ర పంట పొలాలకు తరలించుకున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో తెలంగాణ యువకులు స్వరాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. గాంధేయమార్గంలో ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమాలు చేశారు. ఈ ప్రజా ఉద్యమానికి తలొగ్గిన రాజకీ య పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని, మద్దతు తెలుపుతామన్నాయి. తెలంగాణ ప్రజలు ఆ పార్టీల తీర్మానాలను, ఎన్నికల మానిఫెస్టోలను విశ్వసించారు.

డిసెంబర్ 9 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని నాటి హోంమంత్రి ప్రకటించారు. దశాబ్దాల మా పోరాటం ఫలించింది అని ప్రజల ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. వచ్చిన తెలంగాణ వెనక్కి దేశ, సమాజ ద్రోహులు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి పొంచిఉన్నారనే నిజాని మరిచి, అప్రమత్తంగా లేకపోవడం వల్ల, అధికారమే పరమావధిగా భావించే తెలంగాణ ద్రోహుల వల్ల తెలంగాణ రాకుండాపోయింది. వారి చరిత్ర అధికారదాహానికి, తర్వా త ప్రలోభాలకు గురై సొంత గడ్డకు ద్రోహం తలపెట్టి, ప్రజలను దోచుకునే వారితో తెలంగాణ ఏర్పాటు అంత సులభం కాదని గుర్తించాలి. అలాంటి ద్రోహులకు బుద్దిచెప్పి తెలంగాణను సాధించుకోవాలి.హైదరాబాద్‌పై దండయా త్ర జరిగిన ఈ ఏడాదే మనం కాళోజీ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటు న్నాం. కాళోజీ తెలంగాణ ప్రజల దిక్సూచి. వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సాధించుకోవాలి.

జూలై 30న సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణపై ఏకక్షిగీవ తీర్మానం చేశాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మద్దతు పలుకుతామని లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలిపారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్‌పై మూడు ఆప్షన్లు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు. అంటే కాంగ్రెస్ ఓట్లు, సీట్ల గురించి ఆలోచిస్తున్నది. కానీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధి కాదని తేలిపోయింది. ఇది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచాలి. ప్రజలు కాళోజీ చూపిన బాటలో పయనించాలి. కాళోజీ గాంధేయవాది. అతను హింసను వ్యతిరేకిస్తాడు. అదే సమయంలో పిరికితనం కన్నా హింసను ఎన్నుకుంటాడు. అందుకే అంటాడు ‘ప్రభుత్వ హింస అధీకృత హింసకు వ్యతిరేకతకు ప్రతిహింస ఎప్పుడూ సమర్థనీయం’ అని. ప్రభుత్వం ప్రజలను హింస చేయాలని ప్రోత్సహిస్తుంది. అందుకు అనుగుణంగా పరిస్థితులు కల్పిస్తూ సహాయ సహకారాలు అందిస్తుంది. ఇది సమర్థనీయం కాదు. ప్రభుత్వాలు విఫలమైననాడు ప్రజలు తిరగబడక తప్పదు. ఆనాడు మనం మన నేల అభివృద్ధి కోసం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వం తు కృషి చేస్తాం. కాళోజీ ఇచ్చిన స్ఫూర్తితో, విలువలతో విలసిల్లే తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడదాం. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒకప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. సిరిసంపదల తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చిన తెలంగాణ రచయితల వేదిక కల సాకారం చేద్దాం. ప్రజలు ఐక్యంగా హైదరాబాద్‌పై జరిగిన దండయావూతను తిప్పికొట్టాలి. అందుకోసం అధికారపార్టీ నాయకులు ప్రధాన పాత్ర పోషించాలి. తాము అసమర్థులం కామని తెలంగాణ ప్రజల ముందు నిరూపించుకోవాలి.
-మేచినేని కిషన్‌రావు
బీజేపీ సీనియర్ నాయకులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి