27, డిసెంబర్ 2012, గురువారం

Meteora, Thessaly, Greece







The Theodora caves 5 kilometers (3.1 mi) south of Meteors had inhabitants fifty millennial ago.[4]The oldest known example of a man-made structure was found within a prehistoric cave in central Greece, according to the Greek culture ministry. The structure is a stone wall that blocked two-thirds of the entrance to the Theodora cave near Kampala on the north edge of the Thessalonian plain. It was constructed 23,000 years ago, probably as a barrier to cold winds. “An optical dating test, known as Optically Stimulated Luminescence, was applied on quartz grains nested within the stones. We dated four different samples from the sediment and soil materials, and all provided identical dates,” Nikolaos Zacharias, director of the laboratory of archaeology at the University of Peloponnese, told Discovery News. According to a statement by the ministry of culture, “the dating matches the coldest period of the most recent ice age, indicating that the cavern’s inhabitants built the stone wall to protect themselves from the cold.” Excavated since 1987, the Theodora cave is well known to palaeontologists as it was used and inhabited continuously from the Palaeolithic period onwards (50,000 to 5,000 years ago)

రతన్ నావల్ టాటా



I do not know how history will judge me, but let me say that I’ve spent a lot of time and energy trying to transform the Tatas from a patriarchal concern to an institutional enterprise. It would, therefore, be a mark of failure on my part if it were perceived that Ratan Tata epitomizes the Group’s success. What I have done is establish growth mechanisms, play down individuals and play up the team that has made the companies what they are. I, for one, am not the kind who loves dwelling on the ‘I’. If history remembers me at all, I hope it will be for this transformation.

- Ratan Tata
2012 డిసెంబర్ లో యుగాంతం కాలేదు కానీ, భారతదేశపు పారిశ్రామిక రంగంలో మాత్రం ఒక శకం ముగుస్తోంది. 1991 నుంచి అంటే 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ని విజయపథంలో నడిపిన రతన్ నావల్ టాటా (రతన్ టాటా)  75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈరోజు (28/12/2012) చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. వంటింట్లో ఉండే ఉప్పు, పంచదారల నుంచి ఆకాశం లో ఎగిరే విమానాల  తయారీ లో వాడే స్టీల్ వరకు, ప్రధానమైన ఏడు బిజినెస్ సెక్టార్స్ లో  (Communications & Information Technology, Engineering, Materials, Services, Energy, Consumer products and Chemicals)  దరిదాపు 85 దేశాలలో,  100 కు పైగా కంపెనీలతో,  సుమారు 100 బిలియన్ US డాలర్ల పైగా బిజినెస్ చేసే  ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా  పరిచయం చేయనక్కర్లేదు. కానీ అత్యంత successful గా తన tenure ని పూర్తి చేసుకున్న ఈ iconic man  deserves resepect, love, affection and recognition from every individual Indian అని నా అభిప్రాయం, అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం.

రతన్ టాటా JRD టాటా మునిమనవడు. రతన్  టాటా వ్యక్తిగతజీవితం గురించి పబ్లిక్ డొమైన్ లో తెలిసింది చాలా తక్కువ.  ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబం లో 1937 డిసెంబర్  28 న  జన్మించిన రతన్ టాటా బాల్యం అంత సాఫీగా గడవలేదు. రతన్ నావెల్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూనావెల్ H టాటాని  JRD టాటా చిన్నకొడుకు వారికి పిల్లలు లేకపోవటం తో  దత్తత తీసుకున్నారు .  రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ పెంచి పెద్ద చేసారు.  ఆ తరవాతి కాలంలో నావెల్ H టాటా వేరే వివాహం చేసుకున్నారు ఆ వివాహం ద్వారా కలిగిన సంతానం నోయెల్ టాటా (ప్రస్తుత Trent Ltd  వైస్ చైర్మన్ & టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ). 

Campion స్కూల్ (అప్పటి బొంబాయి ఇప్పటి ముంబై ),  బిషప్ కాటన్ స్కూల్ సిమ్లా,  Cathedral  & Jhon Connon స్కూల్ ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసిన రతన్ టాటా ,  1962 లో Cornell University నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లో టాటా స్టీల్ లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగి గా చేరారు . ఆ తరవాత 1971 లో అప్పట్లో  ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న NELCo  (National Radio & Electronics Company) లో Director in-charge  గా బాధ్యతలు తీసుకున్నారు.  40% లాభాలు , 2% మార్కెట్ వాటా తో కష్టాలలో ఉన్న NELCo ని మూడు సంవత్సరాలలో అంటే 1975 నాటికి,  2% నష్టాలు, 25% శాతం మార్కెట్ వాటా ఉన్న కంపెనీ గా మార్చగలిగారు. కానీ తరవాతి కాలం లో దేశం లోని ఎమర్జెన్సీ మూలం గా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బందులు వీటి ప్రభావం తో లాకౌట్ ప్రకటించారు. 1981 లో డైరెక్టర్, టాటా  ఇండస్ట్రీస్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా  మరోసారి 1986 లో Empress మిల్స్ విషయం లో ఇటువంటి చేదు  అనుభవాన్ని చూసారు. ఈ చేదు అనుభవాలతో 1991 లో,  లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన  JRD టాటా వారసుడిగా  టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శల్ని ఎదుర్కొవాల్సి వచ్చింది.  

1991 లో  టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరవాత అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని  అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చారు (ప్రస్తుత టాటా గ్రూప్ ఆదాయంలో  48 %  ఇండియా వెలుపలి నుంచి వచ్చేదే).  

ఈ ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు :
1.యంగ్ మానేజర్స్ కి   ప్రాధాన్యతనివ్వటానికి రతన్ టాటా చేపట్టిన చర్యలు ముందుతరం వారినుంచి కొద్ది పాటి విమర్శలు ఎదుర్కునప్పటికీ ఈరోజు ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో టాటా గ్రూప్ అతి పెద్ద బిజినెస్ హౌస్ గా ఎదగటానికి ఉపయోగపడ్డాయి.
2. TCS పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళటంతో పాటు అతి పెద్ద ఇండియన్ బేస్డ్ , మల్టీనేషనల్ IT సంస్థ గా ఎదిగింది. 
3. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్టు అయ్యింది.
4. 2007 లో 11.6 బిలియన్ US డాలర్ల డీల్ తో, ఆంగ్లో డచ్ కంపనీ అయిన Corus ని టాటా స్టీల్ తో చేసిన  విలీనం టాటా స్టీల్ ని ప్రపంచం లోని 5వ అతిపెద్ద స్టీల్ కంపెనీ గా మార్చడంతో పాటు రతన్ టాటా కు బిజినెస్ సెలబ్రిటీ గుర్తింపు తెచ్చింది.
5. 2008 లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ ని టాటా మోటార్స్ లో విలీనం చేయడం.
6. వీటన్నిటికి మించి తరతరాలా నుంచి  టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటం లో 100 శాతం విజయాన్ని సాదించారు.
అంతర్జాతీయం గా ఇన్ని విజయాలు సాదించిన టాటా గ్రూప్ కి స్వదేశం లో మాత్రం నానో కార్ల ప్రాజెక్ట్ ని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ కి మార్చాల్సి రావటం వంటి కొన్నిచికాకులు మాత్రం  ఎదుర్కోవాల్సి వచ్చింది .

లభించిన కొన్ని గుర్తింపులు :
1. 2008 లో "టైం మాగజైన్" ప్రకటించిన  100  World's most influential people లో ఒకరు గా నిలిచారు.
2. భారత ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరం లో పద్మభూషణ్,  2008 లో పద్మవిభూషణ్ అవార్డ్ ని అందుకున్నారు .
3. 2007 లో రతన్ టాటా ను  "Fortune" పత్రిక ప్రకటించిన  25 most influential business people లో ఒకరు గా గుర్తించింది.
4. 2008 లో తాజ్ హోటల్ పై జరిగిన దాడుల తరవాత స్పందించిన తీరుతో టైం మాగజైన్ "Forbes "  పత్రిక రతన్ టాటాని India 's  most respected business leader గా కొనియాడింది(రాజకీయ రంగం లో అడుగుపెట్టాల్సింది గా అభిప్రాయపడింది).
5. 2008 లో సింగపూర్ గవర్నమెంట్ Honorary Citizenship  తో సత్కరించింది. రతన్ టాటా ఈ గొరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు.
6. 2009 లో honorary  Knight Commander of British Empire గా నియమించబడ్డారు.
7. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో Ohio State University నుంచి, టెక్నాలజీ రంగం లో Asian Institute of Technology నుంచి, సైన్స్ లో Warwick university నుంచి గౌరవడాక్టరేట్లతో పాటు  , London School of Economics నుంచి Honorary fellowship ని అందుకున్నారు.


ఇన్ని విజయాలు సాధించి, 100 బిలియన్ డాలర్ల కి పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకి అధిపతి అయినా  ఈయన lifestyle మాత్రం చాలా సింపుల్.  సెల్ఫ్ డ్రైవింగ్ లో వర్క్ ప్లేస్ కి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. ఇప్పటి వరకు  పుస్తకాలు, CD లతో నిండివుండే  సౌత్ ముంబై లోని  బాచలర్ పాడ్ లో నివసిస్తున్న ఈ బిజినెస్ టైకూన్ రిటైర్మెంట్ తరవాత ముంబై లో తన కోసం ప్రత్యేకం గా రూపుదిద్దుకున్న మాన్షన్ కి మారబోతున్నారు. స్మోకింగ్ & డ్రింకింగ్ కి దూరం గా ఉండే ఈయనకు  రెండు జర్మన్ షెపర్డ్ డాగ్స్ ప్రియనేస్తాలు, అలాగే ఫాస్ట్ కార్స్ ని డ్రైవ్ చేయడం , జెట్స్ నడపటం , స్పీడ్ బోటింగ్ రేస్ లు హాబీలు. బాచలర్ గా జీవితం గడుపుతున్న రతన్ టాటా  ఇద్దరు అమ్మాయిలని దత్తత తీసుకున్నారు . 

Now What ? Today December 28th 2012, Ratan Naval Tata turned 75 and gracefully walking out of his position by leaving healthy legacy to his successor. I wish the  iconic man Mr. Ratan Naval Tata, who immensely contributed for growth of modern India a very happy birthday and wonderful retirement life ahead.
- madhu

Flying car concept from Volkswagen fulfills sci-fi fantasies


Flying cars are a common site in sci-fi movies. The floating auto has won hearts of many science fiction fanatics. Be it the glass bubble from “The Jetsons” or the cab from “The Fifth Element,” all these autos have mesmerized audiences for long now. Another runaway hit in this realm were the super duper flying cars from “Back to the Future II” that dash around on airborne roadways. Some designs show flying cars, also known as hovercars, soaring high up in the air while other models drift just a few inches above the ground. However, with claims that the car can be manufactured in actuality too, people are waiting eagerly for the concept to roll out. Volkswagen floating car

So, Volkswagen thought of creating a prototype of this futuristic car model. Dubbed as the “The People’s Car Project”, the company invited people to design their car of the future. A young girl from Chengdu city, who is actually a student of gaming design and animation, came up with a brilliant concept. Her design bagged the contest and the prototype crafted was turned into a video. You can check it out below.
Volkswagen floating car
The car basically has a spherical shape with space for two people inside. It has no wheel and floats a few inches above the ground. The image of the car floating in the middle of the street, when other autos are running on the road, is absolutely amazing. Circular glass discs have been fitted on the two ends of the car and an elongated glass panel has been fixed at the front. The glass and metal bubble looks utterly stupendous.
The concept car utilizes magnetic force to float in middle of the air. A magnetic suspension system is used in most of these designs, but the mechanism is not very stable, and hence wide scale implementation of the cars is not possible. Some of the models also make use of repulsion technology, which is basically a type of short range anti-gravity principle, to whizz around smoothly in mid air.

19, డిసెంబర్ 2012, బుధవారం

తరలిపోతున్న నల్లధనం


అక్రమార్కులు యధేచ్చగా నల్లధనాన్ని తాము అనుకున్న చోటుకు తరలిస్తున్నారు. గత పది సంవత్సరాల్లో మన దేశం నుంచి అక్షరాలా ఆరు లక్షల 74 వేల కోట్ల రూపాయలు పరాయి దేశాలకు తరలిపోయాయి.
Written by Parvathi On 12/19/2012 2:39:00 PM
దేశంలో నల్లధనానికి అడ్డుకట్ట పడటం లేదు. ప్రపంచం మొత్తమ్మీద నల్లధనం భారత్ నుంచి ఎక్కువగా తరలిపోతుంది. స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బును దాచిపెడుతున్నవారిలో మన దేశానికి చెందినవారే అగ్రస్థానంలో ఉంటున్నారు. మనదేశం నల్లధనం రూపేణా నష్టపోయిన మొత్తం దాదాపు 123 బిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

అక్రమార్కులు యధేచ్చగా నల్లధనాన్ని తాము అనుకున్న చోటుకు తరలిస్తున్నారు. గత పది సంవత్సరాల్లో మన దేశం నుంచి అక్షరాలా ఆరు లక్షల 74 వేల కోట్ల రూపాయలు పరాయి దేశాలకు తరలిపోయినట్టు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటి సంస్థ తన నివేదికలో పేర్కొంది. అక్రమ మార్గాల్లో డబ్బు తరలివెళ్తున్న 150 దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. 2001 - 2010ల మధ్య 6లక్షల 74 వేల కోట్ల రూపాయలు దేశం నుంచి తరలిపోయింది.

భారత్ ఆర్ధిక వ్యవస్థకు ఆరు లక్షల కోట్లు చాలా పెద్ద మొత్తమని జీఎఫ్‌ఐ పేర్కొంది. విద్యా, ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగాలను ఈ డబ్బుతో అభివృద్ది చేసే అవకాశముందని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. 123 బిలియన్ డాలర్లు తరలిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్ధ తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచం మొత్తమ్మీద చూసినప్పుడు భారతదేశం నుంచి వస్తున్న నల్లధనమే ఎక్కువనే విషయాన్ని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అస్సాంజే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

అసలు నల్లధనం అంటే ఏమిటి? ఆదాయపు పన్ను సహా ఏ ఇతర పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా దాచుకున్న సొమ్మును ‘నల్లధనం’గా వ్యవహరిస్తారు. విదేశీ బ్యాంకుల్లో ఇది డిపాజిట్ల రూపంలో ఉంటే దేశీయంగా అక్రమ లావాదేవీలతో పోటీ ఆర్థిక వ్యవస్థను నడుపుతుంటుంది.

ధనం అంటే ఒక్క కరెన్సీ (రూపాయలు లేదా డాలర్లు వగైరా) రూపంలోనే ఉండనక్కరలేదు. బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు తదితర విలువైన లోహాల రూపంలో ఉన్నా, ఇతర వస్తువులు, ఆస్తుల రూపంలో ఉన్నా, పన్నులు చెల్లించకుండా, లెక్కలు చూపకుండా ఉంటే అది నల్లధనంగానే పరిగణించబడుతుంది.

అక్రమ, చట్టవిరుద్ధ లావాదేవీల ద్వారానే నల్లధనం సృష్టించడం సాధ్యమవుతుంది. భారీగా డబ్బు కేటాయింపులు జరిగే అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, షేర్‌మర్కెట్, ఎగుమతులు-దిగుమతుల వ్యాపారం, ఇతర వర్తక-వాణిజ్యాల్లో దొంగ లెక్కలు చూపడం ద్వారా ఆయా వ్యక్తులకు నల్లధనం సమకూరుతుంది.

గత సంవత్సరం జనవరిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం వివిధ విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం నిల్వల గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తిరిగి మన ఖజానాకు చేరితే రాత్రికి రాత్రే భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటం ఖాయం.

కాగా నల్లధనం తరలించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. పదేళ్ల కాలంలో చైనాకు చెందిన కోటి కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలివెళ్లిందని జీఎఫ్‌ఐ నివేదిక పేర్కొంది. తర్వాత స్థానాల్లో మెక్సికో,మలేషియా ,సౌదీ అరేబియా , రష్యా , ఫిలిప్ఫీన్స్, నైజీరియా దేశాలు నిలిచాయి. 

13, డిసెంబర్ 2012, గురువారం

సోలార్ పవర్చేదిన కొద్దీ చేవ!

సూర్యుడు... యుగాలుగా భూమి మొత్తానికి శక్తినిస్తున్న నక్షత్రం. ఈ శక్తిలో ఏ కొంచెం ఒడిసిపట్టుకోగలిగినా 700 కోట్ల జనాభా ఇంధన అవసరాలు ఇట్టే తీరిపోతాయి. ఇందుకోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా మనిషి సాధించింది మాత్రం అణువంతే. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. సోలార్ ప్యానెల్స్ డిజైన్‌లో మార్పులు... నానో టెక్నాలజీల పుణ్యమా అని సౌరశక్తి మనకు దగ్గరవుతోంది. అన్నీ సవ్యంగా సాగితే... కాలుష్య హేతువైన ముడిచమురుకు మరో ఐదారేళ్లలోనే గుడ్‌బై చెప్పేసినా ఆశ్చర్యం లేదు. 

సోలార్ ప్యానల్స్‌ను మీరు చూసే ఉంటారు. సూర్యకిరణాలను శోషించుకుని విద్యుత్తుగా మార్చి మనకందిస్తాయి ఈ పరికరాలు. అయితే వీటి సామర్థ్యం చాలా తక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సోలార్ ప్యానల్ సైతం కేవలం 15 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తుంది. అంటే... అందే సౌరశక్తిలో 15 శాతం మాత్రమే విద్యుత్తుగా మారుతోందన్నమాట. పైగా దీర్ఘచతురస్రపు ఆకారంతో లభిస్తున్న సోలార్ ప్యానెల్స్ వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. దశాబ్ద్దకాలంలో ధరలు తగ్గుతున్నా... ఇప్పటికీ సామాన్యుడికి అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో సౌరశక్తిని మరింత చౌకగా మార్చేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి గురించి స్థూలంగా...

ఎంఐటీ త్రీడీ మార్గం!

సంప్రదాయ సోలార్ ప్యానల్స్‌లో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దాదాపు అయిదు ఎకరాల స్థలం కావలసి ఉంటుందని అంచనా. సోలార్ ప్యానల్స్ 2డీ (పొడవు, వెడల్పు)లో మాత్రమే అందుబాటులో ఉండటం దీనికి కారణం. అమెరికాలోని ప్రసిద్ధ టెక్నాలజీ సంస్థ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ సమస్యను అధిగమించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. కంప్యూటర్ల సాయంతో త్రీడీ సోలార్ ప్యానల్స్‌కు రూపకల్పన చేసింది. అంతేకాదు... జెఫ్రీ గ్రాస్‌మాన్, కార్ల్ రిచర్డ్ సోడెర్‌బెర్గ్‌లతో కూడిన శాస్త్రవేత్తల బృందం నమూనా త్రీడీ సోలార్ ప్యానల్స్‌ను తయారు చేసింది కూడా. నిట్టనిలువుగా స్తంభాల మాదిరిగా కనిపించే ఈ సోలార్ ప్యానల్స్ రకరకాల కోణాల నుంచి సూర్యకిరణాలను శోషించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ఫలితంగా నిర్దిష్ట స్థలం ద్వారా సాధారణ సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుకు రెండు నుంచి 20 రెట్లు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగారు. వెలుతురు తక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్తును ఉత్పత్తి చేయగలగడం ఈ సోలార్‌ప్యానల్స్ గొప్పదనం. అంతా బాగానే ఉంది... మరి మనకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? నమూనా ప్యానల్స్‌ను మరింత ఆధునికీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తవగానే!

నానో టెక్నాలజీతో క్షణాల్లో నీటిఆవిరి...

భూతద్దంతో సూర్యకిరణాలను కేంద్రీకరిస్తే కాగితం భగ్గున మండిపోతుంది. మరి... ఇదే పని నీటిపై చేస్తే? గంటల సమయం భూతద్దం పట్టుకుంటే నీటి ఉష్ణోగ్రత కొంత పెరగవచ్చు. కానీ.. ఆ నీటిలో మీరు నానో ద్రావణమేదైనా కలిపారనుకోండి... కళ్లు మూసి తెరిచేలోపు నీళ్లు కాస్తా ఆవిరైపోతాయి! హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న రైస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాధించిన అద్భుతమిది. శాటిలైట్ డిష్ ఆకారాన్ని పోలిన సోలార్ కలెక్టర్‌ను ఉపయోగించి వారు అతి తక్కువ సమయంలో నీటిని ఆవిరిగా మార్చగలిగారు. నానోద్రావణంలోని కణాలు వేగంగా వేడెక్కడం వల్ల ఇలా జరుగుతుందని అంచనా. ఆవిరి తయారైతే మనకేంటనుకుంటున్నారా? అక్కడే ఉంది కిటుకు. అతితక్కువ కాలంలో నీటిఆవిరిని ఉత్పత్తి చేస్తున్నామంటే... విద్యుత్తును తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నట్లే లెక్క. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్‌తో పోలిస్తే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా అందే విద్యుత్తు దాదాపు రెట్టింపు ఉంటుందని అంచనా.

ఇంజిన్ రయ్యి... రయ్యి...

వాహనాల్లోని ఇంటర్నెట్ కంబశ్చన్ ఇంజిన్ తెలుసుగా... పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న ఈ ఇంజిన్‌నే కొంచెం మార్చి... కేవలం సౌరశక్తితో నడిచేలా చేశారు ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు. అదెలా అన్నదేనా మీ ప్రశ్న... చదవండి మరి... సాధారణ ఇంజిన్‌లో ఏం జరుగుతుంది? పిస్టన్ పైభాగంలో ఉన్న ప్రాంతంలో ఇంధనం మండుతుంది. ఫలితంగా వాయువు వ్యాపనం చెంది పిస్టన్‌ను కిందకు తోస్తుంది. ఇదే ప్రక్రియ మళ్లీమళ్లీ జరిగి వాహనం ముందుకెళుతుంది. ఇప్పుడు పెట్రోలు, డీజిళ్ల స్థానంలో చమురులాంటి నూనెను ఊహించుకోండి. డిష్ ఆకారంలో ఉండే సోలార్ కలెక్టర్ ద్వారా ఈ నూనెను వేడి చేస్తారు. ఇది పిస్టన్ ఛాంబర్‌లోకి చేరుతుంది.

ఈ దశలో అతిసూక్ష్మస్థాయిలో నీటిబిందువులు ఛాంబర్‌లోకి పంపుతారు. వేడివేడి నూనెకు నీళ్లు తగిలితే ఏమవుతుందో మనం చూసే ఉంటాం. అలాగే ఇక్కడ కూడా నూనె, నీళ్లు పేలిపోయి శక్తి విడుదలవుతుంది. ఈ దశ తరువాత పిస్టన్ అడుగున ఉన్న ప్రాంతంలో నూనె, నీళ్లు వేరైపోతాయి. వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చునన్నమాట. ‘‘మా ప్రయోగాల్లో మేం 31 సిసి ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేసి ఉపయోగించాం. ఇందుకోసం దాదాపు 12 అడుగుల వెడల్పయిన సోలార్ కలెక్టర్‌ను వాడాం. అయితే ఇది ప్రయోగాత్మకంగా చేసిన డిజైన్ మాత్రమే. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా మరింత సమర్థంగా పనిచేసేలా చేస్తాం. తద్వారా ఇళ్లల్లో, చిన్నచిన్న పరిశ్రమల్లోనూ సౌరశక్తిని విసృ్తతంగా వాడుకునే అవకాశమేర్పడుతుంది’’ అని ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు మ్యాట్ బ్లూ, బెన్ కూపర్‌ను ‘సాక్షి’కి ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రిన్స్‌టన్ ట్రిపుల్ ధమాకా

సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ సామర్థ్యం తక్కువని ముందుగానే చెప్పుకున్నాం కదా! తనపై పడే సూర్యకాంతిలో ఎక్కువభాగాన్ని తిప్పికొట్టడం దీనికి ఒక కారణమైతే... పరారుణ, అతినీలలోహిత కిరణాలను శోషించుకోకపోవడం మరో కారణం. రకరకాల పదార్థాలను కలిపి వాడటం ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి పలకలను వాడటం ద్వారా ఈ సమస్యను విజయవంతంగా అధిగమించడమే కాకుండా... ఈ క్రమంలో సౌరశక్తి ఉత్పత్తిని మూడురెట్లు ఎక్కువ చేయగలిగారు. కేవలం 30 నానోమీటర్ల మందం ఉండే బంగారు నానో షీట్‌తోపాటు కొన్ని లోహ, ప్లాస్టిక్ షీట్స్‌ను వాడినప్పుడు సోలార్ ప్యానెల్‌పై పడే వెలుతురులో కేవలం నాలుగుశాతం మాత్రమే వెనక్కు ప్రతిఫలిస్తోంది. శోషించుకునే వేడి కూడా ఎక్కువయిందని వీరు గుర్తించారు. వీటి ద్వారా సాధారణ సోలార్ ప్యానెల్స్ కంటే దాదాపు 175 శాతం ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అంతేకాదు... ఈ టెక్నాలజీ వాడకం ద్వారా సిలికాన్ సోలార్ ప్యానెల్స్ ధర కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనా.

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

10, డిసెంబర్ 2012, సోమవారం

సూర్యతేజంతో ఉత్తేజం


* పెద్దఎత్తున సౌర, పవన విద్యుత్తు పథకాలు
* ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటున్న సర్కారు
* అక్కడి గ్రామాల్లోనూ సోలార్‌ వెలుగులే

రష్యాలో ఓ వ్యోమగామి భార్య.. బడికి వెళ్తున్న కొడుకుతో చెప్పింది... ''కన్నా నేను రొట్టెల కోసం రేషన్‌ దుకాణానికి వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంత్రమైపోతుందేమో! నాన్న నిన్ను బడిలో దించేసి 'చంద్రమండల యాత్రకు' వెళ్తారట... సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు కనుక వస్తూ నిన్ను బడినుంచి తీసుకువచ్చేస్తార్లే''...
సోవియట్‌ రష్యా పతనానికి ముందు అక్కడ వ్యాప్తిలో ఉన్న ఓ జోక్‌ ఇది. అప్పట్లో ఆ దేశంలో చంద్రమండలానికి వెళ్లి రావడం సులభంగానూ, రేషన్‌ దొరకడం మాత్రం గగనంగానూ ఉండేదట! తర్వాత రష్యా ఎలా పతనమైందో అందరికీ తెలిసిందే!
నాయకులు ప్రజావసరాలను గుర్తించకుండా తమ ప్రాధాన్యాలను తాము ఏర్పరుచుకుని సాగిపోతుంటే అంతేమరి! నేతలకైనా... పార్టీలకైనా... చివరకు దేశాలకైనా అదే సూత్రం!! విద్యుత్తు విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సహా చాలా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులు ఇలాగే ఉన్నాయి.
...గుజరాత్‌ మాత్రమే దీనికి కాస్త మినహాయింపులా కనిపిస్తోంది.
ప్రకృతి వరప్రసాదమైన సూర్యుడి నుంచి వచ్చే కాంతిని ఒడిసిపట్టుకుంటున్న గుజరాత్‌ సౌర విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశం మొత్తంమీద ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్తులో సగానికి పైగా ఇక్కడిదే కావడం విశేషం. భూసేకరణ అవసరం లేకుండా సాగునీటి కాలువపై సౌర ఫలకాలను ఏర్పాటుచేయడం గుజరాతీల సృజనకు, వ్యాపార దృక్పథానికి నిదర్శనం. అక్కడ గ్రామాల్లో వీధి దీపాలకూ సోలార్‌ ప్యానెళ్లు కనిపిస్తాయి. భవనాల మీద సెల్‌టవర్లకు అద్దెకిచ్చినట్లుగా సౌర ఫలకాల ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చుకోవచ్చు.
బొగ్గు ఆధారిత థర్మల్‌ ప్రాజెక్టులతో కాలుష్య భయం వెంటాడుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. గ్యాస్‌ ప్రాజెక్టులకేమో సరఫరా లేదు. ఇక అణు విద్యుత్తు ప్రాజెక్టులపై దాదాపు యుద్ధాలే నడుస్తున్నాయి. జల విద్యుత్తేమో వరుణుడి కరుణపైనే ఆధారం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఏ వివాదమూ, కాలుష్యం భయం లేనివి సంప్రదాయేతర వనరులైన పవన, సౌర విద్యుత్తు ప్రాజెక్టులే. వాటిని ఒడుపుగా పట్టుకోవడంలో గుజరాత్‌ దేశంలోనే ముందుంది.
దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తు సామర్థ్యం మొత్తం 1,010 మెగావాట్లు. ఇందులో గుజరాత్‌ వాటా సగానికి పైనే... అంటే 695 మెగావాట్లు. చెట్టూపుట్టలపైనా, కాలువలపైనా, చివరకు ఇళ్లపైనా ఎక్కడ చూసినా సోలార్‌ ఫలకాలే కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుల కేటాయింపులో అవకతవకలు, అధికార దుర్వినియోగం జరిగాయనే అభియోగాలు ఉన్నా... వాటిని పక్కన పెట్టి రాష్ట్రానికి అందుతున్న విద్యుత్తు వెలుగుల్ని చూస్తే మాత్రం ఆశ్చర్యమేస్తుంది! స్వల్ప వ్యవధిలో ఇది సాధ్యమేనా? అనిపిస్తుంది. ప్రకృతిపరంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న తీరు చూసి ముచ్చటేస్తుంది.
ప్రకృతి వరం...
మనదేశంలో సూర్యకాంతి దేదీప్యమానంగా వెలుగొందే ప్రాంతాల్లో గుజరాత్‌ ఒకటి. భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువునా పడతాయి. అందుకే సోలార్‌ విద్యుత్తులో ఉత్పదకత గరిష్ఠంగా 25 శాతం ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని ఆ రాష్ట్రం సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుంటోంది. పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు జారీచేయడంతో సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు బారులు తీరుతున్నాయి. అక్కడ సౌర విద్యుత్తు యంత్రాల తయారీ పరిశ్రమను కూడా నెలకొల్పనున్నట్లు గుజరాత్‌ విద్యుత్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. దీని వలన ప్రస్తుతం యూనిట్‌ రూ. 15 పడుతున్న సౌర విద్యుత్తును ఎనిమిది రూపాయలకే ఉత్పత్తి చేయొచ్చని తెలిపాయి. ఇది కూడా పూర్తయితే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది.
ఆసియాలోనే పెద్ద సౌర విద్యుత్తు పార్కు
పటాన్‌జిల్లా చర్నక గ్రామ సమీపంలో ప్రభుత్వం మూడువేల ఎకరాలలో 'సౌర విద్యుత్తు పార్కు' ఏర్పాటుచేసింది. ప్రభుత్వం 971 మెగావాట్లకు ఒప్పందాలు పూర్తి చేసింది. ఇందులో 601 మెగావాట్లు ఉత్పత్తిలోకి వచ్చింది. 2017 నాటికి 2000 మెగావాట్లు సాధించాలనేది లక్ష్యం.
ఒక మెగావాట్‌ యూనిట్‌ నుంచి రోజుకు తక్కువలో తక్కువ 5 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతుందని సౌర విద్యుత్తు పార్కు నిర్వహణ మేనేజర్‌ తాకరి 'ఈనాడు-ఈటీవీ'కి తెలిపారు.
'సౌర విద్యుత్తు ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా ఉంటామని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం తమ కర్తవ్యమని' ఆ రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి సౌరభ్‌ పటేల్‌ తనను కలిసిన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధులతో పేర్కొన్నారు.




కృష్ణా జలాల వినియోగం - వాస్తవాలు



జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 కృష్ణాజలాల వినియోగానికి సంబంధించి ఏప్రిల్ 20న మూడు రాష్ట్రాలకు కొన్ని తాజా ప్రతిపాదనలు అందజేసింది. వాటిపై ఇటీవల రాష్ట్రాల అభిప్రాయాలు తెలియజేయాలని వాటిని కోరింది. మూడు రాష్ట్రాలకు అది కేటాయించిన నీటి వివరాలు ఆసక్తిదాయకం. 75 శాతం విశ్వసనీయత, పునరుత్పాదక జలం ఆధారంగా బచావత్ ట్రైబ్యునల్ (ట్రైబ్యునల్-1) కేటాయించిన 585 శతకోటి ఘనపుటడుగు(టీఎంసీ)లను మహారాష్ట్ర, 734 టీఎంసీలను కర్ణాటక, 811 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వాడుకొన్న తరవాతనే... మూడు రాష్ట్రాలు 65శాతం విశ్వసనీయతతో ట్రైబ్యునల్-2 అదనంగా కేటాయించిన నీటిని వాడుకోవాలి. ఆపై మూడు రాష్ట్రాలు ట్రైబ్యునల్-2 కేటాయించిన మిగులు నీటిని ఉపయోగించుకోవాలి. నీటి సంవత్సరంలో ఒక రాష్ట్రం వినియోగం, మళ్లింపుతోపాటు, నిల్వచేసే నీటినీ ఆ సంవత్సరం కేటాయింపులో భాగంగానే పరిగణిస్తారు. ట్రైబ్యునల్ చేసిన సిఫార్సుల అమలు, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత కృష్ణాజలాల తీర్పు అమలు బోర్డుదే! కృష్ణా ట్రైబ్యునల్-2 మూడు రాష్ట్రాల ముందుంచిన ఈ ప్రతిపాదనలు, సిఫార్సులు చదువుకోవడానికి, వినడానికి బాగానే ఉంటాయి. సిబ్బందిని కేటాయించకుండా, నేరస్థులను దండించే అధికారం లేకుండా- వాటిని అమలుచేయడం బోర్డుకు సాధ్యం కాదు. మూడు రాష్ట్రాలకు వర్షాకాలం, పంటకాలం ఏక సమయంలో వస్తాయి. కేటాయించిన నీటిని అందరికీ ఒకేసారి పంపిణీ చేయవలసి వస్తుంది. దిగువన ఉన్న జలాశయాలకు నీటిని విడుదల చేయడానికి క్రమబద్ధీకరణ కట్టడాలు లేవు. నదులపై ఎన్నో జలాశయాలు, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి.వాటివద్ద ప్రతిరోజూ నీటిమట్టాలను నమోదుచేసి, విడుదలయ్యే నీటిని నియంత్రించాల్సి ఉంటుంది. 75శాతం, 65శాతం విశ్వసనీయతతో కేటాయించిన నీరు, మిగులు నీరు మూడు రాష్ట్రాలు వరసగా ఒకదాని తరవాత మరొకటి వినియోగించేలా చూడాలి. ఈ ప్రక్రియలన్నీ ఎంతో కష్టతరమైనవి. తగిన దండనాధికారాలు లేకపోవడంవల్ల విధుల నిర్వహణలో గతంలో తుంగభద్ర బోర్డు విఫలమైంది. దానివల్ల దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీరెప్పుడూ అందక, రైతులెన్నో కష్టనష్టాలకు గురయ్యారు. ఈ అంశాలన్నింటినీ ట్రైబ్యునల్-2 దృష్టికి తీసుకువెళ్లాలి. ట్రైబ్యునల్ తీర్పును అమలుచేసే బోర్డుకు అవసరమైన సదుపాయాలు, అధికారాలు కల్పించి, దాన్ని పటిష్ఠపరచాల్సిందిగా కోరాలి.
ట్రైబ్యునల్-2 ఉత్తర్వులోని ఇతర అసంగతాలు
1. నికర జలాల విశ్వసనీయత శాతం: 
1960లో జాతీయాభివృద్ధి సంస్థ, 1969లో భారతీయ ప్రమాణాల సంస్థ, 1972లో రెండో సాగునీటి సంఘం చేసిన సూచనలు, సిఫార్సులు, అంతర్జాతీయ ప్రమాణాలు భారతదేశంలో అనుసరిస్తున్న విధానాలను బచావత్ ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకొంది.తదనుగుణంగా 75శాతం విశ్వసనీయతతోనే, అప్పటివరకు అందుబాటులో ఉన్న 78సంవత్సరాల్లో (1894-95నుంచి 1971-72 వరకు) కృష్ణానదీ వార్షిక ప్రవాహాన్ని లెక్కగట్టి, మూడు రాష్ట్రాలకు కేటాయించింది.ఎగువ రాష్ట్రాలు 50శాతం, దిగువ రాష్ట్రం 86శాతం విశ్వసనీయతతో నికర జలాలను లెక్కించాలని కోరినా, ఆ అభ్యర్థనలను ట్రైబ్యునల్-1 తోసిపుచ్చింది.
ఈ 75శాతం విశ్వసనీయతను 2002కు ముందే నిర్ధారించినందువల్ల, దాన్ని పరిష్కరించిన వివాదంగానే పరిగణించాలి. 2002లో సవరించిన 'అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం' ఇందులో మార్పులకు అంగీకరించదు. అయినా, ట్రైబ్యునల్-2 దాన్ని పట్టించుకోలేదు. నదీజల ప్రవాహ పరిమాణాన్ని కొంతభాగం 75శాతం, మరికొంత భాగం 65శాతం విశ్వసనీయతతో బుద్ధిపూర్వకంగా నిర్ధారించి, మూడు రాష్ట్రాలకు కేటాయించడం చట్ట ఉల్లంఘనే. ఇలా గతంలో ఏ ట్రైబ్యునలూ నదీజలాలను విభజించలేదు. అదీగాక, రెండు విధాలుగా నదీజలాలను విడుదలచేసి, వినియోగించడం ఆచరణ సాధ్యంకాని పని. మన రాష్ట్రప్రభుత్వం ఈ అంశాన్ని ట్రైబ్యునల్‌కు సోదాహరణంగా వివరించి, అసంగతాన్ని సరిదిద్దాల్సిందిగా కోరాలి.
2. ప్రవాహశ్రేణి ఎంపికలో వ్యత్యాసం: 
బచావత్ ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 78సంవత్సరాల ప్రవాహ వివరాలకు తదుపరి లభ్యమైన 34 సంవత్సరాల (1972-73నుంచి 2005-06 వరకు) వివరాలను ఆంధ్రప్రదేశ్ జతచేసింది. మొత్తం 112 సంవత్సరాల వివరాలను పరిగణనలోకి తీసుకొని, 75శాతం విశ్వసనీయతతో వార్షికంగా లభ్యమయ్యే నికర జలాల లెక్కలను ట్రైబ్యునల్-2కు సమర్పించింది. ఇది గతంలో ట్రైబ్యునల్-1 అనుసరించిన విధానానికి అనుగుణంగా ఉంది. కానీ, 1894-95నుంచి 1950-51 వరకు 56సంవత్సరాల్లో నదీప్రవాహాన్ని అనుభవంలోని సూత్రాలు, సమీకరణల ప్రకారమే లెక్కించారని, 1951-52నుంచి 1960-61 వరకు విజయవాడ వద్ద ఆనకట్టకు గండిపడి, తిరిగి ప్రకాశం బ్యారేజి నిర్మించే వరకు ప్రవాహ పరిమాణాన్ని సక్రమంగా నమోదు చేయలేదని ట్రైబ్యునల్-2 అభిప్రాయపడింది.
1961-62నుంచి 2007-08 వరకుగల 47 సంవత్సరాల్లో మాత్రమే ఆధునిక పద్ధతిలో ప్రవాహాన్ని కొలిచి, నమోదు చేశారంటూ- దాన్నే పరిగణనలోకి తీసుకొంది.దీన్ని ఏ రాష్ట్రమూ కోరలేదు. అదీగాక ఈ 47 సంవత్సరాల్లోనూ ఒకే సంస్థ ద్వారా,ఒకే పద్ధతిలో కాకుండా, మొదటి 12 సంవత్సరాలకు(1961-62నుంచి 1973-74 వరకు) బచావత్ నివేదికలోని ప్రవాహ వివరాలను, తదుపరి 35 సంవత్సరాలకు (1974-75నుంచి 2007-08 వరకు) కేంద్ర జలసంస్థ నమోదు చేసిన ప్రవాహ వివరాలను పరిగణనలోకి తీసుకొంది.వీటిలో మొదటిది అనుభవంలోని సూత్రాలపై ఆధారపడింది. రెండోది కంప్యూటర్‌పై లెక్కించినది.ఈ రెండు వివరాల మధ్య సామ్యం ఏముందని ట్రైబ్యునల్ వాటిని పరిగణనలోనికి తీసుకుందో అర్థం కావటం లేదు. అదీగాక, వార్షిక ప్రవాహశ్రేణి ఎంత పెద్దదిగా ఉంటే, వార్షిక ప్రవాహ పరిమాణం వాస్తవికతకు అంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి, ట్రైబ్యునల్-1 పరిగణనలోకి తీసుకొన్న 78 సంవత్సరాల ప్రవాహశ్రేణికి ఏ ఒక్క రాష్ట్రమూ అభ్యంతరం చెప్పనప్పటికీ దాన్ని అంగీకరించకుండా, కేవలం 47సంవత్సరాల ప్రవాహశ్రేణినే ట్రైబ్యునల్-2 పరిగణనలోకి తీసుకోవడం సక్రమంగా లేదని సమీక్షా సమావేశంలో మనరాష్ట్రం గట్టిగా వాదించాలి.
3. మిగులు నీటి కేటాయింపు: 
75శాతం విశ్వసనీయతతో నికర జలాలను ట్రైబ్యునల్-1 నిర్ధారించింది. 25శాతం కాలావధిలో నీటి కొరత వల్ల ఎగువ రాష్ట్రాలకన్నా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోతుందని భావించింది. 75శాతం కాలావధిలో లభించే మిగులు జలాలను వినియోగించుకోటానికి ఆంధ్రప్రదేశ్‌కు వెసులుబాటు కల్పించింది.ఈ మిగులు జలాల్లో ఎగువ రాష్ట్రాలకు భాగం కల్పించలేదు.ట్రైబ్యునల్-2 అందుకు భిన్నంగా 65శాతం విశ్వసనీయతతో నికర జలాలను నిర్ధారించడంవల్ల, నీటికొరత 25శాతంనుంచి 35శాతానికి పెరిగింది.మళ్లీ సగటు వార్షిక ప్రవాహాన్ని (58 శాతంతో) 2,578 టీఎంసీలుగా లెక్కించి, మూడు రాష్ట్రాలకు పంచడంవల్ల నీటికొరత 42 శాతానికి పెరిగి,ఆంధ్రప్రదేశ్‌కు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
2,130టీఎంసీలకు మించి లభించే మిగులు జలాలను కట్టకడనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రమే వినియోగించుకొనేటట్లు ట్రైబ్యునల్-1 కల్పించిన వెసులుబాటును మార్చకుండా ఉంచాలని మన రాష్ట్రప్రభుత్వం ట్రైబ్యునల్-2ను గట్టిగా కోరాలి.
4. మిగులు జలాలతో పాటు తరుగు జలాల విభజన: 
ట్రైబ్యునల్-2 ఎంచుకొన్న 47 సంవత్సరాల ప్రవాహశ్రేణిలోని 20సంవత్సరాల్లో వార్షిక ప్రవాహ పరిమాణం మూడు రాష్ట్రాలకు విభజించిన సగటు వార్షిక ప్రవాహ పరిమాణం (2,578 టీఎంసీల) కన్నా తక్కువ. 27 సంవత్సరాల్లో మాత్రమే అది ఎక్కువగా ఉంది.ఎక్కువగా ఉన్న ప్రవాహ పరిమాణాన్ని మూడు రాష్ట్రాలకు కేటాయించినప్పుడు, తక్కువగా ఉన్న ప్రవాహ పరిమాణాన్నీ విభజించి ఉండాల్సింది.అలా జరగనందువల్ల,ఆస్తులను మాత్రమే పంచి,అప్పులను పంచకుండా వదిలివేసినట్లయింది.దీనివల్ల, ఇబ్బందులు ఎదుర్కొనేది దిగువనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రమే.ఇలా తక్కువ ప్రవాహం ఉన్న సంవత్సరాలు కూడా వరసగా రెండు సంవత్సరాలు ఒక్కసారి, నాలుగు సంవత్సరాలు రెండుసార్లు, ఆరు సంవత్సరాలు ఒక్కసారి సంభవించాయి.
ఈ శ్రేణుల్లో మొదటి సంవత్సరాలు నాల్గింటికి మాత్రమే భవిష్యదుపయోగానికి జలాశయాల్లో నిల్వచేసిన నీటివల్ల ప్రయోజనం ఉంటుంది. మిగతా సంవత్సరాల్లో దిగువనున్న రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి, మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు కేటాయించే అంశాన్ని ట్రైబ్యునల్-2 పునర్విచారణ చేయాలి.
5. ఆలమట్టి పూర్తి జలాశయ మట్టం: 
కర్ణాటక ప్రభుత్వం 1996లో భారతీయ విజ్ఞానసంస్థ ద్వారా బెంగళూరు, ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయించింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు కింద కేటాయించిన 173 టీఎంసీల వినియోగానికి ఆలమట్టి జలాశయ నీటిమట్టం +519.6 మీటర్లుంటే సరిపోతుందని నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ట్రైబ్యునల్-2 పరిగణనలోకి తీసుకోలేదు. కర్ణాటక ప్రభుత్వ కోరికను మన్నించింది. పూర్తి జలాశయ మట్టాన్ని, కేంద్ర జలసంఘం ఆమోదం లేకుండానే +519.6మీటర్ల నుంచి +524.256 మీటర్లకు, జలాశయ నిల్వ సామర్థ్యాన్ని 173టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెంచింది.
దీనివల్ల ఆగస్టునుంచి అక్టోబరు వరకు మూడు నెలల్లో నదిలో దిగువకు ప్రవాహ పరిమాణం తగ్గి, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సకాలంలో నీరందక, ఖరీఫ్ పంట బొత్తిగా లేకుండాపోయే ప్రమాదమేర్పడింది.ప్రస్తుతం జూన్, జులై మాసాల్లో ఖరీఫ్ పంటకు ఆంధ్రప్రదేశ్‌కు 94 టీఎంసీల నీరు అవసరమవుతుంది.ట్రైబ్యునల్-2 అనుమతించిన ఎనిమిదినుంచి 10 టీఎంసీల నీరు ఏ మాత్రం చాలదు. రాష్ట్ర అవసరాలను ఇలా సోదాహరణంగా వివరించి, జూన్, జులై మాసాల్లో ఆలమట్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 94 టీఎంసీల నీటిని విడుదల చేయటంతోపాటు, వరసగా సంభవించే నీటికొరత సంవత్సరాల్లో దిగువ జలాశయాల్లో నీటి నిల్వ లేనప్పుడు, ఖరీఫ్ పంటకు అవసరాన్నిబట్టి, నీటిని విడుదల చేసేటట్లు ట్రైబ్యునల్-2ని కోరాలి.
అందుబాటులో ఉన్న జలరాశి అంచనాలు టీఎంసీల్లో:
వివరాలు
మహారాష్ట్రకు
కర్ణాటకకు
ఆంధ్రప్రదేశ్‌కు
మొత్తం
వ్యాఖ్య
75 శాతం విశ్వసనీయతతో పునరుత్పాదక జలం
560
25
700
34
800
11
2060
70
ట్రైబ్యునల్-1 కేటాయింపు
65 శాతం విశ్వసనీయతతో అదనంగా మిగులు జలాలు
46
35
72
105
45
145
163
285
ట్రైబ్యునల్-2 కేటాయింపు
మొత్తం
666
911
1001
2578
 
6. అనావృష్టి ప్రాంతాలకు నీటి కేటాయింపులో విచక్షణ: 
అనావృష్టి ప్రాంతాల సాకుతో ట్రైబ్యునల్-2, ఎగువ తుంగ, ఎగువ భద్ర, సింగటలూరు ప్రాజెక్టులకు తుంగభద్ర జలాశయం నుంచి 40టీఎంసీలు, ఆలమట్టినుంచి ఎగువ కృష్ణా ప్రాజెక్టుకు అదనంగా 130టీఎంసీల నీటిని కేటాయించింది.ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, రాయలసీమ ప్రాంతంలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవా, దక్షిణ తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు దుర్భర అనావృష్టి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంలో ఉన్నప్పటికీ, వీటికి అవసరమైన 197టీఎంసీల్లో ఏ మాత్రం కేటాయించలేదు. కాబట్టి, మూడు రాష్ట్రాల్లోని అనావృష్టి ప్రాంతాల విస్తీర్ణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌కూ తగిన పరిమాణంలో నీటిని కేటాయించి, రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల్లోని అసమానతలను సర్దుబాటు చేయాల్సిందిగా అర్థించాలి.
7. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరం తెలిపే హక్కు: 
ఎగువ రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకంగా ప్రాజెక్టులను అసంఖ్యాకంగా నిర్మిస్తున్నారని, దానివల్ల తమకు కేటాయించిన నీరు అందదని దిగువ రాష్ట్రం ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా, దిగువ రాష్ట్రంలోనూ అనధికారికంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఎగువ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.ఒక రాష్ట్రం నిర్మించే ప్రాజెక్టువల్ల మరో రాష్ట్రానికి తగినంత నష్టం ఉంటే తప్ప, ఆ రాష్ట్రానికి అభ్యంతరం తెలిపే హక్కు ఉండదని ట్రైబ్యునల్-2 స్పష్టం చేసింది. దీనివల్ల ఎగువ రాష్ట్రాలను, దిగువ రాష్ట్రాల్ని ఒకేగాటన కట్టినట్లయింది.నదికి దిగువనున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణంవల్ల, ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదు.కానీ, కృష్ణా బేసిన్‌లో ఎగువ రాష్ట్రాల్లోని ఆలమట్టి, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల ద్వారా గణనీయమైన పరిమాణంలో నీటిని పొందే వీలుంది.
ఎగువ రాష్ట్రాలు విచక్షణ రహితంగా ప్రాజెక్టులు నిర్మించి, ఎక్కువ నీటిని వినియోగించుకొంటున్నప్పుడు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీరందక విపరీతమైన నష్టం కలుగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి, ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులపై ట్రైబ్యునల్-2 తగిన చర్యలు తీసుకోకపోతే, తాజా తీర్పే నిరర్థకమవుతుంది.
8. తీర్పు పునఃపరిశీలన గడువు: 
గతంలో బచావత్ ట్రైబ్యునల్ 1976 మే నెలలో తుది తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును 2000 మే 31 తరవాత, అంటే- 24 సంవత్సరాల అనంతరం పునఃపరిశీలన చేయించవచ్చునని సూచించింది. ట్రైబ్యునల్-2 తమ తీర్పును 2010 డిసెంబరు 30న జారీ చేస్తూ, 40 ఏళ్ల తరవాతే పునఃపరిశీలన జరపాలని సూచించింది.మూడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుల పనితీరును, తీర్పు అమలులో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకొని, పునర్విచారణను 25 ఏళ్ల అనంతరం, అంటే- 2035 మే 31 తరవాత చేయించాలని రాష్ట్రప్రభుత్వం సూచించాలి.
పైన వివరించిన సూచనలన్నింటినీ రాష్ట్రప్రభుత్వం ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చి, తీర్పులో అవసరమైన మార్పులు చేయవలసిందిగా కోరాలి. ఈ ట్రైబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు జీవన్మరణ సమస్య. కాబట్టి ఇంతటి కీలక సమస్యపై ప్రభుత్వం తన అభిప్రాయాలు తెలియజేయడానికి రాష్ట్రంలోని వివిధ రైతు సంఘాలకు, ప్రభుత్వేతర రైతు సేవాసంస్థలకు అవకాశం కల్పించాలి.

చట్టాల గౌరవాన్ని కాపాడండి


TATA- గత వాగ్దానాలు వీడొద్దు.. రెట్రోస్పెక్టివ్ యాక్ట్ వద్దు
- కుంభకోణాలు, అవినీతి ఆందోళన కలిగిస్తున్నాయి
- ప్రభుత్వ తీరుపై రతన్ టాటా వ్యాఖ్యలు
- రిట్మైంట్ ముందు కొనసాగుతున్న విమర్శల పర్వం

ముంబై, డిసెంబర్ 9: ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ దాకా తయారు చేసే వందకు పైగా సంస్థలున్న టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా మరోసారి ప్రభుత్వం తీరుపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. మొన్నటికి మొన్న ఫైనాన్షియల్ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యవస్థలో అవినీతి దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టాటా.. ఈసారి ప్రభుత్వంపై విదేశీయుల్లో ఉన్న అభివూపాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 28న రిటైర్ కాబోతున్న సందర్భంగా రతన్ టాటా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు. గత యాభై ఏళ్లుగా గ్రూపులో పనిచేస్తున్న టాటా.. తన చైర్మన్ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడుల పరిస్థితులు, వ్యాపార నీతి, క్రోనీ క్యాపిటలిజం అంశాలపై ఇంటర్వ్యూలో తన అభివూపాయాలు పంచుకున్నారు. దేశ న్యాయ చట్టాల గౌరవాన్ని, పవివూతతను కాపాడాలని కోరారు. వరుస కుంభకోణాలు, రెట్రోస్పెక్టివ్ టాక్స్ (చట్టం అమలయ్యే తేదీ కంటే ముందు లావాదేవీలపైనా పన్ను విధించడం) విధాన ప్రతిపాదనతో ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని టాటా అన్నారు.

ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషనల్ బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతితో ఇండియాలో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలను మూడేళ్ల తర్వాత అనుమతులు చెల్లవని అనడం వ్యవస్థలో అనిశ్చితికి దారితీస్తుందన్నారు. గతంలో దేశంపై ఈ తరహా అభివూపాయం ఎన్నడూ కలుగలేదని చెప్పారు. పెట్టుబడిదారులకు గతంలో ఇచ్చిన వాగ్దానాలను వీడరాదని ఆయన సూచించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతులను తేలిగ్గా తీసుకుంటూ పోతే.. విదేశీ వర్గాలు భారత్‌ను తేలిగ్గా తీసుకుంటాయని ఆయన అభివూపాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అంత ఆశాజనక పరిస్థితులు లేనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై రతన్ టాటా పూర్తి ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎకనామిక్ సూపర్ పవర్‌గా ఎదగగల శక్తి భారత్‌కుందని అన్నారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం చేసిన కృషితో పెట్టుబడిదారుల్లో కొంత నమ్మకం పెరగనుందని, అయినప్పటికీ ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ చర్యలు సరిపోవని ఆయన అన్నారు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలు ప్రవేశించడం ద్వారా వినియోగదారుడికి తక్కువ ధరకు వస్తువులు లభించే అవకాశాన్ని కల్పించాలన్నారు. లేదంటే ఎఫ్‌డీఐ మోడల్ విఫలమైన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను టాటా ఆకాశానికెత్తారు. 90 దశక సంస్కరణ కర్తగా ఆయన్ని అభివర్ణించారు. ప్రధాని వేసే ప్రతి అడుగునూ విమర్శిస్తూ పోతుంటే చివరికి ఆయన ఏం చేయకుండా అవుతుందని అన్నారు. క్రోని క్యాపిటలిజం(రాజకీయ, ప్రభుత్వ అధికారుల అండదండలతో వ్యాపారాల్లో లబ్ధి పొందడం)పై టాటా మాట్లాడుతూ..ఇండియానే కాదు ప్రపంచమంతా ఈ సమస్య ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఈ విషయంలో భారత్ అగ్రగామి కాకపోయినా చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. క్రోని క్యాపిటలిజం వల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించం..
పోటీ తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా విమానరంగంలోకి ప్రవేశించబోమని రతన్ టాటా చెప్పారు. గతంలో ఉన్నప్పటి పరిస్థితులు లేవని, సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని, పోటీ ఎక్కువగా ఉందని, ఫలితంగా కొన్ని కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయని అన్నారు.

4, డిసెంబర్ 2012, మంగళవారం

జలదోపిడీయే హంద్రీ నీవా



హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వదిలితే అభ్యంతరమమేటి? హంద్రీనీవా ప్రాజెక్టు పొడుగునా మంత్రి రఘువీరాడ్డి పాదయాత్ర చేపట్టడం, దానికి అన్ని ప్రాంతాల నాయకులు, మంత్రులు హాజరవుతున్నారు గదా మరేమిటీ గందరగోళం?

-పిడమర్తి వీరేశం, ఓయూ క్యాంపస్, హైదరాబాద్

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కృష్ణానదిలో లభించే సర్‌ఫ్లస్ వాటర్స్ అంటే మిగులు జలాలను 40 శతకోటి ఘనపు అడుగుల మేరకు ఉపయోగించుకుంటూ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం,కడప, చిత్తూరు జిల్లాల్లోని 6,02,500ఎకరాల భూమికి సాగునీరందివ్వడమేకాక, 33లక్షల జనా భాకు తాగునీరు అందించే ఉద్దేశ్యంతో రూపొందించబడింది. ఇది ప్రధానంగా కాలువ స్కీం. ఈ కాలువను కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మల్యాల గ్రామ సమీపంలో హంద్రీ అనే ఉపనది నుంచి, చిత్తూరు జిల్లాలోని ‘నీవా’ ఉపనది వరకు తవ్వుతారు. కనుకనే దీనిపేరు ‘హంద్రీనీవా’ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ జలాశయం వెనుకనుంచి (బ్యాక్‌వాటర్స్) 266.60 మీటర్లస్థాయి నుంచి ప్రధాన కాలువ మార్గంగా 9 లిఫ్ట్‌ల ద్వారా మొత్తం 203 మీట ర్ల ఎత్తుకు జలాలను అంచెంచెలుగా తరలిస్తూ, మార్గమధ్యంలో కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి చెర్లోపల్లి, అడవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఉపయోగించుకుంటూ మొత్తం 6 కిలో మీటర్లపాటు మూడు సొరంగ మార్గాలు కూడా ఉపయోగించుకుంటూ, 500 కిలోమీటర్ల దూరం ప్రయోణంచేసి నిర్ధారిత ఆయకట్టును సాగుచేసే పథకమిది. ప్రధాన కాలువ రెండు లక్షల 54 వేల ఎకరాలకు సాగునీరందివ్వగా, పేరూర్, ఆత్మకూరు, మడకశిర, పుంగనూరు, తంబళ్లపల్లి, నీవా, వాయల్వాడు బాంచి కాలువలు 3,48,500 ఎకరాలకు నీరందిస్తాయి.
వెనుకబడిన,కరువు ప్రాంతాలకు నిలయమైన, రాయలసీమకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుంది. ఈ బృహత్ ప్రణాళికను దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొదటిదశలో కర్నూలు, జల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో లక్షా18వేల ఎకరాలకు నీరందిస్తారు. ఈ మొదటిదశ పనులను జలయజ్ఞంలో భాగంగా 2774కోట్ల ఖర్చుతో జీవో- 2ను 3-1-2007 నాడు పాలనాపరమైన ఆమోదం తెలపడంతో పనుల ను చకచక ముగించి, హడావిడిగా ప్రారంభోత్సవం జరిపించారు. ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తన జీవితం ధన్యమైందని ఉప్పొంగిపోతూ హంద్రీనీవా ప్రాజెక్టులోకి నీరు వదిలారు. (ఆనీరు శ్రీశైలం జలాశయం నుంచి వదిలిన నికర జలాలు అని గమనించాలి) ఇంతవరకు బాగానే ఉన్నది. ఇంత అద్భుతమైన స్కీం మరొకటి లేదంటూ మంత్రి రఘువీరాడ్డి కాలువ పొడువునా కాలినడకన పయనిసూ,్త రోజుకో అధికార ప్రతిపక్ష నాయకుడిని తన యాత్రలో భాగస్వామిని చేస్తూ, చిలుకపలుకులు వల్లింపచేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు.

సమస్య ఎక్కడ? అంటే.. హంద్రీనీవా స్కీం కృష్ణానదిలో వరదలు వచ్చినప్పుడు, నికర జలాలపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీరంది, మిగతా నీరు సమువూదంలోకి వృధాగా పోతున్నప్పుడు, ఆవృధాగా పోయే నీటిని ఒడిసిపట్టుకుని కరవు క్షేత్రాలకు తరలించాలి. మరి ఈసంవత్సరం వర్షాలులేవు. వచ్చిన నీటి ని పైరాష్ట్రాలు తమ జలాశయాలు నింపుకుని, మిగతా నీటిని మాత్రమే మన కు వదలడం జరిగింది. శ్రీశైలం,నాగార్జునసాగర్ జలాశయాలలో కనీస నీటి మట్టాలను కూడా‘మెయిన్‌టెయిన్’చేయలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాం. కృష్ణా డెల్టా రైతులు తమకు సకాలంలో నీరందివ్వలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సాగర్ ఆయకట్టు దారులు డిసెంబర్ ఒకటిన పంటలు వేసుకోవడానికి చెరో 15 టీఎంసీలు తప్ప అధికంగా లేవనీ, కనుకవిధిగా ఆరుతడి పంటలను మాత్రం వేసుకోమని ప్రభుత్వమంటున్నది. జంటనగరాలకు, కృష్ణాబేసిన్‌లోని పట్టణాలకు, పల్లెలకు, తాగునీటి అవసరాలకు సరిపడా నీరందవ్వడమే కష్టమైన ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రీశైలం నీటిని నిలువ చేస్తూ, అటు విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా, ఇటు సాగర్ ఆయకట్టుదారులకు నీరందివ్వకుండా రాయల సీమకు తరలిస్తున్నారు. తమ ఇష్టారాజ్యమన్నట్టు పోతిడ్డిపాడు గేట్లు తెరిచి కొంతనీరు, ఇప్పుడు హంద్రీనీవాకు మరికొంత నీరు వదలడంలో ఉద్దేశమేమిటో స్పష్టమవుతూనే ఉన్నది. కృష్ణా నికరజలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారుల(కుడి,ఎడమ కాలువలు)ది. కృష్ణా డెల్టా రైతుల గోడు పట్టించుకోకుండా, ఎలాంటి హక్కులేని తెలుగు గంగకు కానీ, హంద్రీనీవాకు గాని కృష్ణా జలాలను వదలడమంటే నీటి దొంగతనం తప్ప మరొకటి కాదు. సీఎం రాయలసీమ పక్షపాతి అనడానికి ఇంకేం రుజువు కావాలి?

ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఏం చెప్పుతున్నాయో చూద్దాం. శ్రీశైలం జలాల నిర్వహణ కోసం ఇప్పటికీ చెలామణి అవుతున్న జీవో-69 జారీ చేసిం ది.15-6-1996 తదనంతరం జీవో-698(14-8-2005),జీవో-233 (19-12-2005), జీవో 3 (4-1-2006) విడుదలైనా,జీవో-69లోని నిర్వహణకు సంబంధించిన ప్రాధాన్యంగాని, నీటి మట్టాలతో ముడిపడి నీటి విడుదలపై ఉన్న ఆదేశాలను గాని మార్చలేదు. జీవో-69 విడుదలయ్యే నాటికి తెలుగుగంగ ప్రాజెక్టు మాత్రమే ఉన్నది. హంద్రీనీవా గానీ ఇంకా ఇతర ప్రాజెక్టులు-గాలేరు నగరి, వెలిగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు రూపుదిద్దుకోనందున వాటి ప్రసక్తిలేదు. కనుక తెలుగుగంగ లాగే హంద్రీనీవా, ఇంకా ఇతరప్రాజెక్టులు (పైన చెప్పినవి) అన్నీ మిగులు జలాల ఆధారంగానే నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులు. కాబట్టి ఆ ఆదేశాలే వీటికి వర్తిస్తాయి.జీవో- 69 లో పేర్కొన్న ముఖ్యమైన అంశమేమంటే శ్రీశైలం నీటిమట్టం 875 అడుగుల (266.70 మీటర్లు)కు ఎగువన ఉన్నప్పుడు ప్రాధాన్యతాపరంగా మద్రాసు తాగునీటి అవసరాలు, శ్రీశైలం విద్యుత్తు ఉత్పాదన, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలు, శ్రీశైలం కుడిగట్టు కాలువ అవసరాలు, ఆతర్వాత తెలుగుగంగకు నీరు వదలాలని స్పష్టంగా ఉన్నది.శ్రీశైలం జలాశయంలో 885 అడుగులు పూర్తి జలస్థాయి కంటే 10అడుగుల కింద ఉన్నప్పుడు ఆరోప్రాధాన్యం తెలుగుగంగకు నీరు వదలాలన్నది ఆదేశం.ఇదే జీవోలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 875 అడుగులకు దిగువన ఉన్నప్పుడు తెలుగుగంగకు నీరు వదలరాదన్నది ప్రభుత్వ ఆదేశం. ముందొచ్చిన తెలుగుగంగకే నీరు లేనప్పుడు కొత్తగా వెలిసిన హంద్రీనీవాకు నీరెక్కడిది? అంటే హక్కు లేకపోయినా హంద్రీనీవా ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని ప్రభుత్వమే తరలించడం విడ్డూరం.అంటే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలనే బుట్టదాఖలు చేసి ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నది.


ఇక మిగులు జలాల విషయంలో మన రాష్ట్రానికున్న హక్కు ఏమిటి? దాన్ని మనంఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న సంగతి కూడా అర్థం చేసుకోవా లి. బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మనరాష్ట్రానికి 811 టీఎంసీల నికర జలాలు లభ్యమయ్యాయి. వాటిని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. నికర జలాలకు తోడు మిగులు జలాలపై సంపూర్ణమైన వినియోగపు స్వేచ్ఛను మనకు బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చింది. ఇది స్వేచ్ఛ మాత్ర మే అని, హక్కుకాదని అనేక సార్లు ట్రిబ్యూనల్ మనకు గుర్తుచేయడం గమనించదగ్గ విషయం. మనమేం చేయాలి? మనకు లభించిన స్వేచ్ఛను హక్కు అని భావిస్తూ, మన ప్రజలను కూడా భ్రమింప చేస్తూ కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించుకున్నాం. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు, సీమాంవూధలో నాలుగు. రాష్ట్రంమొత్తంగా 227.50టీఎంసీల మిగులు జలాల వినియోగంతో ఏడు ప్రాజెక్టులను జలయజ్ఞ కార్యక్షికమంగా చేపట్టడమేగాక కొత్త ట్రిబ్యూనల్ ముందు కూడా ఈ ప్రాజెక్టులను అనుమతించవలసిందిగా అర్జీలు పెట్టాం. ఎలాంటి హక్కులేకుండా మిగులు జలాల వినియోగంతో చేపట్టిన ప్రాజెక్టులపైన తీవ్రమైన అభ్యంతరం వెలిబుచ్చడమే కాకుండా, వెంటనే ఈ అనధికార ప్రాజెక్టులను ఆపేయవలసిందిగా కర్ణాటక కొత్త ట్రిబ్యూనల్‌ను కోరింది.‘మేం ఎలాంటి హక్కు కోరం,మిగులు జలాల్లో ఎంత నీటినిస్తే దాన్నే వాడుకుంటాం. ఎలాంటి క్లెయిమ్స్ పెట్టం’అని అఫడివిట్ రాసిచ్చాకే మన ఈ ప్రాజెక్టులను కొత్త ట్రిబ్యూనల్ అనుమతించాలి. కొత్త బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచి, ఒక ప్రాథమిక తీర్పును వెల్లడించింది. అయితే ఆ తీర్పును మనం అంగీకరించక పునఃసమీక్ష కోసం ట్రిబ్యూనల్‌ని అర్థించాం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాం. ప్రాథమిక తీర్పులో ట్రిబ్యూనల్ 227.50 టీఎంసీల వినియోగంతో మనం చేపట్టిన ఏడు ప్రాజెక్టులలో దేన్నీ పూర్తిగా అనుమతించలేదు. గుడ్డిలో మెల్లఅన్నట్టు తెలుగుగంగకు మాత్రం 29కి బదులుగా 25 టీఎంసీల మిగులు జలాలను కేటాయించడం జరిగింది. అంటే హంద్రీనీవాకు ఎలాంటి పరిస్థితుల్లో కొత్త ట్రిబ్యూనల్ ఇటు నికర జలాలు, అటు మిగులు జలాలను కేటాయించజాలదన్నది స్పష్టం. మరి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కాలువ నీరులేక వెల నీళ్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం నీటి కేటాయింపులేని కారణంగా ప్రాజెక్టును ఆమోదించలేదని తెలిసి కూడా హంద్రీనీవా ప్రాజెక్టును కట్టుకున్నాం. కనుక తెలిసికూడా కట్టుకున్నాక నీరు రాకపోతే వెల మరో ప్రత్యామ్నాయ మే ముంది? ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని, నికర జలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారులు, కృష్ణా డెల్టా రైతులు ఎంత గొడవ పెట్తున్నా పట్టించుకోకుండా ఎంతో కొంత నీరు హంద్రీకి వదలడం జరిగింది.


ప్రభుత్వానికి తెలుసు, తాము చేస్తున్నది అక్రమమని. తమ అనైతిక చర్య డెల్టా రైతాంగాన్ని సాగర్ రైతులను అన్యాయం చేయడ మే నని కూడా తెలుసు. కాని సీమ వాసులకు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలకు మేలుకలిగించే స్కీంను చూస్తూ చూస్తూ అలక్ష్యం చేయ డం ముఖ్యమంత్రి వల్ల కాలేదు. ఇప్పుడు జరుగుతున్న డ్రామా అంతా అదే. అయితే హంద్రీనీవా కట్తున్నప్పుడు గొడవపెట్టకుం డా, తీరా మొదటి దశపనులు పూర్తయి, నీరు వదిలాక అంటే ఏడెమిదేళ్ల తర్వాత ఈ హడావిడి ప్రకటనలు ఎందుకు గుప్పిస్తున్నారని మీరగడవచ్చు. మహామాంవూతికుడు వైఎస్‌ఆర్ అన్ని ప్రాంతాల వాళ్లను బుట్టలో వేసుకుని తన పనిని కానిచ్చుకుంటూ ముందుకు సాగాడు. మహబూబ్‌నగర్ వాళ్లకు భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఇచ్చాడు. నల్లగొండవాళ్లకు ఎస్‌ఎల్‌బీసీ (సొరంగం) ఇచ్చాడు. డెల్టావాళ్ళకు పులిచింతల సాంక్షన్ చేశాడు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఆహా ఓహో అన్నారు. అపర భగీరధుడు, మరోకాటన్ అని అభివర్ణించారు. అట్లాగే గోదావరిపైన పోలవరం, దుమ్ముగూడెం లిఫ్ట్ స్కీం, కంతనపల్లి, ప్రాణహిత చేవెళ్ల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజీ-2 వరద కాలువ, దేవాదుల అడిగిందే తడువుగా సాంక్షన్ చేయడంతో కాంగ్రెస్‌నాయకులు ముఖ్యంగా జీవన్‌డ్డి, చిన్నాడ్డి, ప్రతిపక్షనాయకులు యలమంచిలి శివాజీ అందరూ వైఎస్‌ఆర్‌ను పొగిడినవారే. మా లాంటి వాళ్లం మొదట్నుంచీ ఈ మెగా స్కీంల వెనుక జరుగుతున్న మోసం, కుట్రను, అస్మదీయులకు దోచిపెట్టే ప్రయత్నాన్ని ఖండించాం. పోతిడ్డిపాడు దుర్మార్గం. జీవో107 ద్వారా శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని పెంచడం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లాంటి తెలంగాణను ముంచే అనేక కార్యక్షికమాల గురించి మనవాళ్లకు చెప్పినా నాయకుల్లో ఎలాంటి చలనం లేదు. మాలాంటి వాళ్ల ప్రోదల్భం మీద అప్పుడప్పుడు కొందరు మాతో గొంతు కలపడం తప్ప ఏనాడూ సీరియస్‌గా కృష్ణా, గోదావరి జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించే ఈదుర్మార్గపు ప్రభుత్వ చర్యలను ఎదిరిం చలేదు. ఒక్కదివంగత పీజేఆర్ మాత్రం ధైర్యంగా పోతిడ్డిపాడు అక్రమాలపై శాసనసభలో వైఎస్‌ఆర్‌ను ఇబ్బందిపెట్టాడు. ఇప్పడనుకుంటే ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టున్నది మన ఏడుపు. సామాన్యు డి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. మనకు రోజూనాలుగు బిందెల నీళ్లువస్తాయని ప్రభుత్వం ప్రకటించిందనుకోండి, బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు కూడా వదుల్తామని హమీ ఇచ్చిందనుకోండి మనమేం చేస్తాం? నాలుగు కాకపోతే మరో బిందె అదనంగా తెచ్చిపెట్టుకుని, వచ్చినప్పుడు అది నింపిపెట్టుకుంటాం.అదిమన సంస్కృతి.మన పక్కింటివాడికి నీటి కనెక్షన్ లేదు. వరదలు వచ్చినప్పుడు మీకు కూడా నీరిస్తాం అంటే మనతోపాటుగా అయిదు బిందెలు అతనూ సమకూర్చుకున్నాడు. ఇప్పుడు బిందెలు కొనుక్కున్నాను కాబట్టి మన నీళ్లు కట్ చేసైనా సరే వాడికివ్వాలని డిమాండ్ చేస్తూ జబర్దస్తీ చేస్తూ, సాధించుకుంటున్నాడు. అది పొరుగువాడి సంస్కృతి. ఇక ఈ పంచాయితీకి పరిష్కారం ఏమిటి? ప్రత్యేక రాష్ట్రమొస్తే ఎవడి నీళ్లు వాడికి వదిలేటట్టు రెగ్యులేటరీ ఏర్పాటు ఎట్లాగూ చేస్తారు.సమైక్య రాష్ట్రంలో కొనసాగితే తెలంగాణ వాడి పరిస్థితి అధోగతే. కోస్తాంధ్ర వాడికున్న ఆర్థిక సత్తా సీమవాడికున్న కండ బలం,ఈ తెలంగాణకు లేదు. పైగా ఐక్యత అన్నది మనవాళ్లలో మృగ్యం. కనుక ఆ మంచిరోజు వచ్చేదాక ఈ యాతన తప్పదు.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com

Other Articles