10, డిసెంబర్ 2012, సోమవారం

చట్టాల గౌరవాన్ని కాపాడండి


TATA- గత వాగ్దానాలు వీడొద్దు.. రెట్రోస్పెక్టివ్ యాక్ట్ వద్దు
- కుంభకోణాలు, అవినీతి ఆందోళన కలిగిస్తున్నాయి
- ప్రభుత్వ తీరుపై రతన్ టాటా వ్యాఖ్యలు
- రిట్మైంట్ ముందు కొనసాగుతున్న విమర్శల పర్వం

ముంబై, డిసెంబర్ 9: ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ దాకా తయారు చేసే వందకు పైగా సంస్థలున్న టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా మరోసారి ప్రభుత్వం తీరుపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. మొన్నటికి మొన్న ఫైనాన్షియల్ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యవస్థలో అవినీతి దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టాటా.. ఈసారి ప్రభుత్వంపై విదేశీయుల్లో ఉన్న అభివూపాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 28న రిటైర్ కాబోతున్న సందర్భంగా రతన్ టాటా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు. గత యాభై ఏళ్లుగా గ్రూపులో పనిచేస్తున్న టాటా.. తన చైర్మన్ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడుల పరిస్థితులు, వ్యాపార నీతి, క్రోనీ క్యాపిటలిజం అంశాలపై ఇంటర్వ్యూలో తన అభివూపాయాలు పంచుకున్నారు. దేశ న్యాయ చట్టాల గౌరవాన్ని, పవివూతతను కాపాడాలని కోరారు. వరుస కుంభకోణాలు, రెట్రోస్పెక్టివ్ టాక్స్ (చట్టం అమలయ్యే తేదీ కంటే ముందు లావాదేవీలపైనా పన్ను విధించడం) విధాన ప్రతిపాదనతో ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని టాటా అన్నారు.

ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషనల్ బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతితో ఇండియాలో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలను మూడేళ్ల తర్వాత అనుమతులు చెల్లవని అనడం వ్యవస్థలో అనిశ్చితికి దారితీస్తుందన్నారు. గతంలో దేశంపై ఈ తరహా అభివూపాయం ఎన్నడూ కలుగలేదని చెప్పారు. పెట్టుబడిదారులకు గతంలో ఇచ్చిన వాగ్దానాలను వీడరాదని ఆయన సూచించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతులను తేలిగ్గా తీసుకుంటూ పోతే.. విదేశీ వర్గాలు భారత్‌ను తేలిగ్గా తీసుకుంటాయని ఆయన అభివూపాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అంత ఆశాజనక పరిస్థితులు లేనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై రతన్ టాటా పూర్తి ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎకనామిక్ సూపర్ పవర్‌గా ఎదగగల శక్తి భారత్‌కుందని అన్నారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం చేసిన కృషితో పెట్టుబడిదారుల్లో కొంత నమ్మకం పెరగనుందని, అయినప్పటికీ ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ చర్యలు సరిపోవని ఆయన అన్నారు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలు ప్రవేశించడం ద్వారా వినియోగదారుడికి తక్కువ ధరకు వస్తువులు లభించే అవకాశాన్ని కల్పించాలన్నారు. లేదంటే ఎఫ్‌డీఐ మోడల్ విఫలమైన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను టాటా ఆకాశానికెత్తారు. 90 దశక సంస్కరణ కర్తగా ఆయన్ని అభివర్ణించారు. ప్రధాని వేసే ప్రతి అడుగునూ విమర్శిస్తూ పోతుంటే చివరికి ఆయన ఏం చేయకుండా అవుతుందని అన్నారు. క్రోని క్యాపిటలిజం(రాజకీయ, ప్రభుత్వ అధికారుల అండదండలతో వ్యాపారాల్లో లబ్ధి పొందడం)పై టాటా మాట్లాడుతూ..ఇండియానే కాదు ప్రపంచమంతా ఈ సమస్య ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఈ విషయంలో భారత్ అగ్రగామి కాకపోయినా చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. క్రోని క్యాపిటలిజం వల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించం..
పోటీ తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా విమానరంగంలోకి ప్రవేశించబోమని రతన్ టాటా చెప్పారు. గతంలో ఉన్నప్పటి పరిస్థితులు లేవని, సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని, పోటీ ఎక్కువగా ఉందని, ఫలితంగా కొన్ని కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి