28, అక్టోబర్ 2013, సోమవారం

తెలంగాణ విద్యుత్ కేంద్రాలపై కుట్రలు


-కేటీపీఎస్‌ను కాదని వీటీపీఎస్‌కు భారీగా బొగ్గు తరలింపు
-బొగ్గు నిల్వలు నిండుకుంటున్నా పట్టించుకోని అధికారులు
-బలవంతంగా 24 గంటలపాటు కేటీపీఎస్ యూనిట్ మూసివేత
హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ మీడియా):రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టిన కారణంగా జెన్‌కో యూనిట్లలో విద్యుదుత్పత్తిని తగ్గించాలని విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 6-స్టేజ్‌లోని 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యూనిట్‌ను నిలిపివేయాలని ఎస్‌ఎల్‌డీసీ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. జెన్‌కో ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తే తప్ప తాము యూనిట్‌ను నిలిపివేసేది లేదని కేటీపీఎస్ అధికారులు స్పష్టం చేశారు. జెన్‌కో సీఎండీ విజయానంద్, డైరెక్టర్(ప్రాజెక్ట్స్, థర్మల్) రాధాకృష్ణ ఇతర రాష్ట్రాల్లో, చీఫ్ ఇంజనీర్(జనరేషన్) సుందర్‌సింగ్ విదేశీ పర్యటనల్లో ఉన్న సమయంలో విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) యూనిట్ మూసివేతకు కేవలం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం కుట్ర అనుమానాలకు బలం చేకూరుస్తోంది. power

దీనివల్ల ప్రాజెక్టు స్థిరవ్యయంపైన, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)పైనా గణనీయమైన ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి వ్యయం చాలా తక్కువ(యూనిట్‌కు రూ.2.60లు). అవసరమైతే విజయవాడలోని వీటీపీఎస్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కనుక(యూనిట్‌కు రూ.3.40) అక్కడి(వీటీపీఎస్) యూనిట్లను మూసివేతకు ఆదేశించాలని కేటీపీఎస్ అధికారులు సూచించారు. వాస్తవానికి ఆగస్టులోనే కేటీపీఎస్ 11వ యూనిట్ 35 రోజుల పాటు వార్షిక మరమ్మతులను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 6 నుంచి నిరవధికంగా యాభై రోజుల పాటు 74 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)తో విద్యుదుత్పత్తిని సాధిస్తోంది. గత ఏడాదిలో 94 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయస్థాయిలో రికార్డును నమోదు చేసుకున్న కేటీపీఎస్‌ను దెబ్బ తీసేందుకే యూనిట్ నిలిపివేతకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయన్న విషయాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గుర్తించారు.

యూనిట్ స్థిరవ్యయం(ఫిక్స్‌డ్ కాస్ట్) పూర్తి కావాలంటే కనీసం 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చే మార్చి వరకు వరుసగా ఐదు నెలలపాటు యూనిట్‌ను నడపగలిగితేనే 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించగలమని వారు గుర్తుచేశారు. అవేమీ పట్టించుకోని సీమాంధ్ర అధికారులు మొండిగా వ్యవహరించి కేటీపీఎస్ 6వ దశ మూసివేతకు ఆదేశాలిచ్చారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేటీపీఎస్ స్టేజ్-6 లోని 11వ యూనిట్‌ను హ్యాండ్‌ట్రిప్ చేసి 24 గంటలపాటు మూతపడేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో సుమారు 15 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయి దాదాపు రూ.3కోట్లు నష్టపోయినట్టయింది. నిజంగా విద్యుత్‌సౌధలోని ఎస్‌ఎల్‌డీసీ నుంచి గానీ, ట్రాన్స్‌కో నుంచి గానీ అధికారికంగా ఉత్తర్వులు(పూటర్) ఇచ్చి ఉంటే దానిని ‘డీమ్డ్ పీఎల్‌ఎఫ్’గా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది. పవర్ యూనిట్ల నెలవారీ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)ను బట్టి ఉద్యోగులకు అల యాజమాన్యం చెల్లిస్తుంది.

ఇదిలా ఉండగా, కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలోని ఏ-స్టేషన్‌కు చెందిన 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు బొగ్గు కొరత కారణంగా మూతపడ్డాయి. దగ్గర్లోని మణుగూరు, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుంచి బొగ్గు అనుమతులు పొందినా ఈ యూనిట్లను కాదని విజయవాడలోని వీటీపీఎస్‌కు సింగరేణి బొగ్గును పూర్తిస్థాయిలో తరలించి అక్కడి నిల్వలు పెంచడం మరో వివక్షగా పేర్కొంటున్నారు. విజయవాడలోని వీటీపీఎస్, కడపలోని ఆర్టీపీసీ యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ పవర్‌వూపాజెక్టులను మాత్రమే పనిచేయకుండా చేయడం పాలకుల కుట్రలకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

20, అక్టోబర్ 2013, ఆదివారం

Tupperware తప్పనివేర్


టప్పర్‌వేర్ సంస్థ 1946లో తన తొలి ఉత్పత్తిని ప్రారంభించింది. పారిక్షిశామికంగా లభించే ప్లాస్టిక్ ద్వారా వంటింటి పాత్రలను పోలినట్టు భ్రమింపజేసే ఆకర్శణీయమైన ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయాలనే ఆలోచనే ఈ బ్రాండ్ కంపనీ స్థాపనకు కారణం. ఆధునికతను కోరుకునే ఇళ్లల్లో వినియోగానికి అవసరమైన పాత్రలను అంతే ఆధునికంగాను, ఆకర్షణీయంగానూ ప్లాస్టిక్‌తో తయారు చేయడం ఈ సంస్థ ఉద్దేశం. అంతేకాక లోనికి గాలి చొరబడకుండా ఉండి, వాటిల్లో ఉంచిన ఆహారం తాజాగా, ఎక్కువకాలం నిలువ ఉండాలనే ఉద్దేశం వీటి తయారీలో ముడిపడి ఉన్న ప్రధానాంశం.
tupperware1
ఇండియాలో టప్పర్‌వేర్
1946లోనే టప్పర్‌వేర్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ మన దేశంలోకి ప్రవేశించడానికి మాత్రం చాలాకాలమే పట్టింది. దీనికి ప్రధాన కారణం అప్పటికీ దేశీయ కిచెన్‌లో ప్లాస్టిక్‌వాడకం అంతగా లేకపోవడమే. అయితే 1996లో భారతదేశంలోకి అడుగుపెట్టిన టప్పర్‌వేర్ తన వినియోగాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఈ బ్రాండ్‌తో భారతదేశ వంటిల్లు ప్రపంచస్థాయికి చేరింది. అంతేకాక ఆధునిక భారతీయ వంటింటికి సరిపోయే అన్ని రకాల వస్తువులనూ అందించి ముఖ్యంగా మహిళల మనసు దోచుకుంది. కాగా, మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్నచిన్న కిచెన్‌లకు తగినట్లు పదార్థాలను ఎక్కువకాలం నిలువ చేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్లాస్టిక్‌పావూతలు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి అయ్యాయి. టప్పర్‌వేర్ మార్కెట్లు, పంపిణీ సంస్థలు కిచెన్‌లకు అవసరమైన అన్ని రకాల అవసరాలను తీర్చడంలో విజయం సాధించాయనే చెప్పొచ్చు. భారతీయ మహిళలు స్వతంవూతంగా టప్పర్‌వేర్ మార్కెట్‌ను తమ సొంత వ్యాపారంగా ప్రారంభించేంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే టప్పర్‌వేర్ వ్యాపారం మహిళల సాధికారతను పెంచింది. మహిళలు ఆర్థిక స్వాతంవూత్యాన్ని సాధించడానికి టప్పర్‌వేర్ మార్కెట్ ద్వారాలు తెరిసింది. అంతేకాక టప్పర్‌వేర్ మార్కెట్ దేశాలు, ప్రాంతాలు, మతాలు, ఆర్థిక హెచ్చుతగ్గులు అనే గీతను శాశ్వతంగా చెరిపివేసింది. ప్రపంచంలోనే బహుళవూపజాదరణ పొందిన బ్రాండ్‌గా ‘టప్పర్‌వేర్’ అవతరించింది. అందుకే టప్పర్‌వేర్ ‘ది మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్’ గా ఐదుసార్లు ‘ఫార్చ్యూన్’ (fortune) మ్యాగజైన్ గుర్తింపును పొందింది.


ఆధునిక వంటశాలలకు ఉపయుక్తమైన పాత్రలను అందించడం కోసం టప్పర్‌వేర్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. పట్టణ ప్రాంత కుటుంబాలకు అవసరమైన పాత్రలను 100 శాతం ప్లాస్టిక్‌తో అందించడంలో విజయం సాధించింది. మార్కెట్‌లో లభించే స్టీల్, గాజు పాత్రల్లోని అవశేషాలు వాటిలో నిలువ చేసిన ఆహార పదార్థాల్లో కలిసే అవకాశం ఉండొచ్చు. కానీ ప్లాస్టిక్‌వల్ల ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇంట్లోనే కాకుండా ఫంక్షన్‌లకు, పార్టీలకు అవసరమైన ఆహార పదార్థాలను కూడా వీటిల్లో నిలువ చేసుకునే అవకాశం ఉంది. టప్పర్‌వేర్‌లో అన్ని రకాలు అధిక వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగిఉండవు. వేడిగా లేని కూరలు, భోజనం, గింజలు ఇలా ఎవైనా వీటిల్లో నిలువ చేసుకోవచ్చు. టప్పర్‌వేర్‌లో నీటిని నిలువ చేసుకునే పాత్రలు (వాటర్ బాటిల్స్) కూడా ఉన్నాయి. ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు, సర్వింగ్ మైక్రోవేవ్‌లలో నిలువ చేసుకునేందుకు వీలుగా వీటిని రూపొందించారు.

వినియోగదారుల ఆవసరాలు, వినియోగ అవకాశాలు, ఆసక్తులను గుర్తిస్తూ టప్పర్‌వేర్‌లో ఎప్పటికప్పుడు ఆధునిక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మారుతున్న జీవన శైలులను అనుసరించి నూతన ఉత్పత్తుల రూపకల్పనలో టప్పర్‌వేర్ ఒక్కో పాత్రలో అడుగు ముందుకు వేస్తూ తన ఉత్పత్తి స్టైల్‌ను మార్చుకుంటూనే ఉంది. ‘ఇవి ఉన్నాయి. ఇవి లేవు’ అనే సందేహం తలెత్తకుండా 360 రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో టప్పర్‌వేర్ పనిచేస్తోంది. నగరవూపాంత వినియోగదారులు వీటిని కిచెన్‌లో వినియోగించడానికి అవసరమైన సూచలను సోషల్‌మీడియా ద్వారా టప్పర్‌వేర్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ప్రస్తుతం టప్పర్‌వేర్‌ను వినియోగించని పట్టణాలు దేశంలో చాలా అరుదు. టప్పర్‌వేర్ తన ఉత్పత్తులను సూపర్ ప్రీమియమ్ రేంజ్‌ను ultimo పేరుతో ప్రవేశపెట్టింది.ఈ ప్రత్యేకమైన శ్రేణి ఉత్పత్తులు వంట చేయడానికి అవసరమైన శక్తి వినియోగాన్ని తగ్గిస్తాయి. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో వీటికి అత్యధిక ప్రాధాన్యం పెరుగుతోంది.

2012లో టప్పర్‌వేర్ మరో ఆధునిక ఉత్పత్తిని ‘ఆమె చేయగలదు, నీవు చేయగలవు (she can, you can) టైటిల్‌తో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. సామాజిక వ్యాపారాల్లో రాణించే మహిళలను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. దీనివల్ల మహిళలు తమను తాము తీర్చిదిద్దుకోవడంతో పాటు నూతన సంస్థలు స్థాపించడానికి వారికి విశ్వసాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని సంస్థ నమ్మకం. ఇది నేటికి ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.అవసరానికి తగినట్లు తయారు చేయడమేకాదు.
EarlTupper
మహిళలు తమ వంటింటికి అవసరమైన ఆధునిక డిజైన్లు మార్కెట్లో లభించకపోతే ఆన్‌లైన్ ద్వారా ఆయా డిజైన్‌లను తెలిపి వాటిని తయారు చేయించుకునే అవకాశం కూడా టప్పర్‌వేర్ కల్పిస్తోంది. తమకు కావలసిన ఉత్పత్తులను వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. టప్పర్‌వేర్ చాలా సంవత్సరాల వరకు మన దేశంలో మాస్టర్‌వూబాండ్, సూపర్‌వూబాండ్, పవర్‌వూబాండ్ పేర్లతో చెలామణిలో ఉంది. అమెరికా చరివూతలో 1946-1958 మధ్యకాలంలో 100 రకాల టప్పర్‌వేర్ వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. కానీ, అవి వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్ ఇనిస్టిట్యూషన్స్, నేషనల్ మ్యూజియం లోనే ఉండిపోయాయి. టప్పర్‌వేర్ ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించే అవకాశం ఉన్న వ్యాపారం.

Earl Silas Tupper
టప్పర్‌వేర్ బ్రాండ్ సృష్టికర్త ఇతడే. అమెరికాకు చెందిన ఈ వ్యాపారి కెమిస్ట్. తేలికైన, మన్నికైన ఆహారాన్ని ఎక్కువ కాలం నిలువ ఉంచే టప్పర్‌వేర్ పాత్రలతో తప్పనిసరిగా ఎల్లకాలం గుర్తుంటాడు.
1907లో జన్మించిన ఇతగాడు మరణించడానికి ముందు సంవత్సరం, అంటే 1983లో తన కంపెనీని 16 మిలియన్ డాలర్లకు రెక్సాల్ కంపెనీకి అమ్మెసి, మెక్సికోలోని ఒక దీవిని ఖరీదు చేశాడు. అక్కడే చివరి ఘడియలు హాయిగా గడిపాడు. అలా అతని పాత్ర ముగిసింది.
~ మధు

స్వయం పాలన ఆకాంక్షకు స్ఫూర్తి కొమురం భీం


ప్రపంచ చరివూతలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. ఆది నుంచి భూమికోసం, భుక్తికోసం, స్వయంపాలన హక్కుల కోసం భారతదేశంలో జరిగిన పోరాటాల్లోనూ ఆదిమ జనుల పాత్ర అమోఘమైంది.

beemభారతదేశానికి ఆంగ్లేయులు రాక పూర్వమే ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల పరిధిలోని ఆదివాసీ ప్రాంతాలు క్రీ.శ. 1240 నుండి 1749 మధ్య ‘గోండ్వానా’ రాజ్యంగా ఏర్పడ్డాయి. 1750 తర్వాత మరాఠీలు, గోండుల రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 1803 వరకు పరిపాలించారు. తదనంతరం ఆంగ్లేయుల ప్రవేశంతో గోండుల తిరుగుబాటు అనివార్యమైంది. గోండు గిరజనుల్లో తొలి వీరుడైన రాంజీ గోండ్ తెల్లదొరలు, నైజాం నవాబుల దమననీతిని ఖండిస్తూ 1836 నుండి 1860 వరకు వీరోచితంగా పోరాడాడు. అప్పటి ‘గోండ్వానా’ రాజ్యంలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణ (ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్) ఆదివాసీ ప్రజలు 1860 నుండి 1948 సెప్టెంబర్ 17 దాకా నిజాం నిరంకుశ పాలనను చవిచూశారు. ‘పుడమి పుత్రులుగా’ అడవిపై వారసత్వ హక్కులను, జీవన సంస్కృతిని, స్వేచ్ఛా స్వపరిపాలనను ఆదివాసీలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు.

రాంజీగోండ్ పోరాట వారసత్వం పుణికి పుచ్చుకున్న యువ గోండు వీరుడు కొమురం భీం. తెలంగాణ సాయుధ పోరులో ‘రగల్ జెండా’ నిజాం నవాబుల నిరంకుశత్వం, రజాకార్ల వ్యవస్థను వ్యతిరేకించి 1931-1940 వరకు వీరోచితంగా పోరాడిన ఘనత భీం సొంతం. ‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో ఆదిమ గిరిజన జాతుల వారికి స్వయంపాలన హక్కు దక్కాలని నిజాం నవాబుపై రణభేరి మోగించి, నవాబుల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు భీం. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం సంకేపల్లి గూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాయి దంపతులకు 1900 సంవత్సరంలో భీం జన్మించాడు. 15వ యేటనే తండ్రి దురదృష్టవశాత్తు అటవీశాఖ సిబ్బంది దాడిలో మరణించడంతో వారి కుటుంబం మకాం సుర్ధాపూర్‌కు మారింది.

భీం అడవిలో స్వేచ్ఛగా తన పోడుభూమిని దున్నుకుంటున్న తరుణంలో ఆ సాగుభూమిని నిజాం అనుచరుడు ‘సిద్ధిఖ్’ అనే జాగీర్‌దార్ దురాక్షికమిస్తాడు. ఇది భీంకు ఆగ్రహం తెప్పించింది. గోండుతో వెట్టిచాకిరి, స్త్రీలపై అత్యాచారాలు, బెదిరింపులు, వంటి చర్యలకూ సిద్దిఖీ పూనుకున్నాడు. వస్తు మార్పిడి తప్ప డబ్బు కళ్ళ జూడని అమాయక ఆదివాసులు అడవుల్లో పశువులు మేపినా, పొయిల కట్టెలు తెచ్చకున్నా, ‘బంబ్‌రాం’, ‘దూపపెట్టి’ పేర్లతో శిస్తులు వసూలు చేశారు. రజాకార్ల దోపిడీ, దుశ్చర్యలను గోండులు ఖండించినందుకు జంగ్లాతు వాళ్ళు, స్థానిక భూస్వాములు కలిసి జోడేఘాట్ పరిసరాల్లోని ఇండ్లను, పంటలను ధ్వంసం చేశారు. దీంతో తెల్లదొరలపై అల్లూరి ‘మన్యసీమ’ (విశాఖ ప్రాంతం)లో (1922-24) సాగించిన మన్యం పోరాటమే స్ఫూర్తిగ భీం నిజాం పాలకులపై ‘తుడుం’ మోగించాడు. నిజాం అల్లరి మూకల దుందుడుకు వైఖరి వల్లే ‘సిద్ధిఖ్’ను హత్య చేసి అసోం రాష్ట్రంలో తలదాచుకున్నాడు. అక్కడే ఐదేళ్ళపాటు పత్తి, కాఫీ, తేయాకు తోటలలో కూలీ పని చేస్తూ కార్మిక ఉద్యమాలకు సారధ్యం వహించాడు. ఈ సమయంలో భీం ఆయుధాలకు కాస్త విరామమిచ్చి, అక్షరాలపై దృష్టి నిలిపాడు. రాత్రి వేళ చదవడం, రాయడం నేర్చుకుంటూ మిత్రుడు కొమురం సూరు ద్వారా రాజకీయాలను ఆకళింపు చేసుకుని తమ ప్రాతం చేరుకున్నాడు.

నిజాం సర్కార్ అరాచకాలకు వ్యతిరేకంగా, తమ జాతి హక్కుల పోరాటానికి భీం ప్రణాళిక రచించాడు. ఆసిఫాబాద్ పరిసరాలలోని జోడేఘాట్, పట్నాపూర్, బాబేఝరీ, టెకెన్నవాడ, చల్ బరిడి, శివగూడ, భీమన్ గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కోశగూడ, లైన్ పటల్ అనే గోండు గూడేలలో భూ పోరాటానికి గోండు, కోయ యువకులతో భీం ‘గెరిల్లా సైన్యం’ స్థాపించాడు. ఆ పన్నెండు గ్రామాలను స్వంతంత్ర ‘గోండు రాజ్యం’గా ప్రకటించడానికీ ప్రణాళిక సిద్ధం చేశాడు. అందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. పెద్ద మనుషులు, విద్యావంతుల సలహా మేరకు డిమాండ్లతో అర్జీ రాసుకుని నవాబుకు తెలపడానికి హైదరాబాద్ వెళ్తే అధికారులు భీంకు అనుమతి నిరాకరించారు. అయినా నిరుత్సాహ పడకుండా సాయుధ పోరాటమే శరణ్యంగా ఆదివాసీ గెరిల్లా సైన్యంతో జోడేఘాట్ గుట్టలను కేంద్రంగా యుద్ధం ప్రకటించాడు.

నిజాం సైన్యంపై అటవీ సిబ్బందిపై భీం కొదమ సింహంలా విజృంభించాడు.
భీం తిరుగుబాటుకు నివ్వెరపోయిన నిజాం సర్కార్ గెరిల్లా సైన్యంపై ప్రతిదాడులు చేసి భీం వద్ద హవల్దార్‌గా వున్న కొమురం సూరును, లచ్చు పటేల్‌ను బంధించింది. చాలామందిని జైల్లో నిర్బంధించింది. రాజీ పడని భీం పోరాట ఉధృతికి నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చి మన్యం గిరిజనుల భూములకు పట్టాలిస్తామని వర్తమానం పంపింది. పట్టాలే కాదు అడవిపై సర్వహక్కులను, గూడేలకు పూర్తి స్వేచ్ఛాపాలనను ఇవ్వాలని భీం మరోమారు డిమాండ్ చేశాడు. భీం షరతులను తిరస్కరించిన నిజాం అతని స్థావరాలపై పోలీసు, సైనిక బలగాలతో నిఘా పెంచింది. భీం రహస్య స్థావరాలను కుర్ధు పటేల్ (కొరియర్) ద్వారా తెలుసుకున్న సైనికులు అర్ధరాత్రి జోడేఘాట్ గుట్టలను చుట్టుముట్టారు. హోరాహోరీగా జరిగిన ఎదురు కాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీర మరణం చెందాడు. ఆ రోజు తిథి ప్రకారం ఆశ్వీయుజ, శుద్ధ పౌర్ణమి (ఆదివారం).

భీమంటే గోండు నాయకుడే కాదు. నిజాం గిరిని ధిక్కరించిన తొలి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. నేటి స్వయంపాలన (తెలంగాణ) ఆకాంక్షకు ఉద్యమ స్ఫూర్తి. అనేక సామాజిక, న్యాయ పోరాటాలకు మార్గదర్శకుడు. భీం ఒక తుడుం మోత. ఆదివాసీ హక్కుల పోరాటానికి ఆయన త్యాగం ఓ దిక్సూచి. ఆదివాసీల ఆశాజ్యోతిలా వెలిగిన భీం నేడు తెలంగాణ పోరుబిడ్డలందరికీ స్వేచ్ఛా గీతం. భీం మరణానంతరం నిజాం సర్కార్ హయాంలో ఇంగ్లాండ్ ఆంత్రోపాలజిస్ట్ హైమండ్ డార్ఫ్‌తో ఆదివాసీ తెగల జీవితాలపై అధ్యయనం జరిగింది.


‘‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం
వచ్చే తరాలు బతుకుతాయి
ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది
వెన్ను చూపడం తగదు’’
-కొమురం భీం


‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో ఆదిమ గిరిజన జాతుల వారికి స్వయంపాలన హక్కు దక్కాలని నిజాం నవాబుపై రణభేరి మోగించి నవాబుల గుండెల్లోనే సింహ స్వప్నంగా మారాడు భీం.
-గుమ్మడి లక్ష్మీనారాయణ



వ్యాసకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ రచయితల సంఘం
సెల్:9491318409

అమెరికా నౌక ఆగడం


అమెరికా ప్రైవేటు కంపెనీకి చెందిన ఒక నౌక కొద్ది రోజుల పాటు మారణాయుధాలతో మన దేశ తీర ప్రాంతంలో తచ్చాడడం, ప్రాదేశిక జలాల్లో ప్రవేశించడం ఆందోళనకరం. తగిన అనుమతులు, ఆధారాలు కూడా ఆ నౌకకు లేవని తెలుస్తున్నది. ఉగ్రవాద దాడులు, మారణాయుధాల సరఫరా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నౌక సంచారానికి గల కారణాలపై ఆరా తీయవలసి ఉన్నది. మన దేశ అధికారులు నౌకను అదుపులోకి తీసకుని, సిబ్బందిని నిర్బంధించారు. కానీ దర్యాప్తు ఎటువంటి ఒత్తిళ్ళకు గురికాకుండా జరుపవలసి ఉన్నది. నౌక అమెరికా కంపెనీకి చెందినది కనుక ఒత్తిళ్ళు రావచ్చనే అనుమానలు కలుగడంలో ఆశ్చర్యం లేదు. నౌక యాజమాన్యం ఇస్తున్న వివరణలు అతుకుబొతుకు లేకుండా ఉన్నందు వల్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అడ్వాన్‌ఫోర్ట్ అనే అమెరికా కంపెనీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నది. సముద్ర దొంగల దాడుల నుంచి నౌకలను కాపాడడం తమ వ్యాపారమని ఈ కంపెనీ చెబుతున్నది. సముద్రం మధ్య నౌకలకు అవసరమయ్యే ఆయుధాలను కూడా ఈ కంపెనీ సరఫరా చేస్తుందట. రేవులలోకి ప్రవేశించినప్పుడు నౌకలలో ఆయుధాలు ఉండకూడదు కనుక, తాత్కాలికంగా వాటి ఆయుధాలను భద్ర పరచడం కూడాఈ కంపెనీ సేవలలో భాగమనే మాట వినబడుతున్నది. కానీ నౌక సంచరించిన తీరు, వ్యవహార సరళి అనుమానాలకు తావిస్తున్నది.


భారత అధికారులు నౌకను నిర్బంధించి అందులోని సిబ్బందిని కొద్దిగా ఆలస్యంగానైనా అరెస్టు చేశారు. కానీ ఈ నౌక కదలికల పట్ల భారత అధికారులు మొదట చెప్పిన మాటలు కొంచెం మెతకగా ఉన్నాయి. కంపెనీ సిబ్బంది చెబుతున్న కారణాలను నమ్ముతున్నట్టే కనిపించారు. భారత అధికారులు ఇటువంటి సానుకూల ధోరణి ప్రదర్శించకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలె. ఉగ్రవాదులకు తోడ్పాటు అందించే విదేశీ కంపెనీలు కూడా ఏదో ఒక ముసుగులో ఇటువంటి కార్యకలాపాలు సాగిస్తాయి. నౌకలో మారణాయుధాలతో పాటు, మందుగుండు సామాగ్రి కూడా ఉన్నది. నౌక భారత జలాల్లో ప్రవేశించడానికి కావలసిన పత్రాలు కంపెనీ తరఫున ఏమీ లేవని తెలుస్తున్నది. తమ నౌక భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నదని తెలిసినప్పటికీ, కెప్టెన్ పోర్టు అధికారులకు ఈ సమాచారం అందించ లేదు. నౌక పొరపాటున కాకుండా ఉద్దేశపూర్వకంగానే భారత జల్లాల్లో ప్రవేశించింది. నౌక భారత జలాల్లో ఎందుకు ప్రవేశించవలసి వచ్చిందనడానికి నౌక సిబ్బంది చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంధనానికి కొరత ఏర్పడడం వల్ల రావలసి వచ్చిందని వారు అంటున్నారు. ఇటువంటి ఆపతి ఎదురైనప్పుడు కాపాడడానికి సముద్ర ప్రాంత సహాయ కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రానికి సమాచారం అందించనే లేదు. మన దేశంలో ఇంధనం కొనుగోలు చేసింది కూడా అక్రమ మార్గంలోనే. ఇంధనం కోసం రేవులోకి ప్రవేశించినప్పుడు తమ వద్ద మారణాయుధాలు ఉన్నాయనే విషయం అధికారులకు వెల్లడించక పోవడం కూడాక్షమార్హం కాదు. తూర్పు తీరంలో ఫైలిన్ తుఫాన్ తాకిడి నుంచి తప్పించుకోవడానికి ప్రాదేశిక జలాల్లో ప్రవేశించవలసి వచ్చిందనే తొంపు కూడా నమ్మదగినదిగా లేదు. ఫై లిన్ తుఫాన్ తాకిడి ఒడిషా మొదలుకొని ఉత్తరాంధ్ర వరకే ఉన్నది. నౌక అడ్డావేసింది పాక్ జలసంధికి ఆవలి వైపున గల ట్యూటికోరిన్ రేవు వద్ద. ఈ నౌకను వినియోగిస్తున్న అమెరికా కంపెనీ అడ్వాన్‌ఫోర్ట్‌పై గతంలో ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న కేసు అమెరికాలో నమోదయిందని తెలుస్తున్నది.


అమెరికా తన భద్రత విషయంలో అతి జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ క్రమంలో ఇతర దేశాలను ఇబ్బందులకు, అవమానాలకు గురి చేసిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. తమ దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే అనుమానితుడు ఏ దేశంలో ఉన్నా బంధించే హక్కు తమకు ఉందంటూ చట్టాలు చేసుకున్నది. ఏ దేశ రేవులో ఉన్న కంటైనర్లను అయినా సోదా చేసే హక్కును తనకు తానే దత్తం చేసుకున్నది. తమ రేవులకు వచ్చే కంటైనర్లను ఎలక్షిక్టానిక్ స్కానింగ్ చేయాలని, అటువంటి పరికరాలను (ఆ పరికరాలు అమెరికా కంపెనీయే తయారు చేస్తుంది!) అన్ని రేవులలో ఏర్పాటు చేసుకోవాలని శాసించిన ఘనత అమెరికాది. చివరకు మన దేశ ప్రముఖులు అమెరికా వెళితే, వారి హోదాను చూసయినా వదలిపెట్టకుండాబట్టలు ఊడదీసి తనిఖీ చేయడం అమెరికాకు అలవాటు. అటువంటిది అమెరికా కంపెనీకి చెందిన నౌక ఆయుధాలతో అనుమతి లేకుండావచ్చి అబద్ధాలు చెబుతున్నప్పుడు తేలిగ్గా వదలిపెట్టడం మనకే అవమానకరం. తాము ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నందు వల్ల కఠినంగా ఉండవలసి వస్తున్నదని అమెరికా చెబుతున్నది. ఉగ్రవాదం పేరుతో ఉచితానుచితాలు మరిచి వ్యవహరిస్తున్నది. అనేక సందర్భాలలో ఇతర దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరులో ఉగ్రవాద భయం కన్నా, అగ్రరాజ్యాన్ననే దర్పమే ఎక్కువగా ద్యోతకమవుతూ ఉంటుంది. అందువల్ల ఇతర దేశాలు కూడా కఠినంగా వ్యవహరించినప్పుడే అమెరికాకు మితిమీరిన భద్రత వల్ల ఉత్పన్నమయ్యే సమస్య ఏమిటో తెలుస్తుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపవలసింది సామాజిక సమస్యల పరిష్కారం ద్వారానే తప్ప భద్రతా చర్యల ద్వారా, ఇతర దేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించడం ద్వారా కాదని అమెరికా గ్రహించేలా చేయాలె.

తెలంగాణ-శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న డిమాండ్ చాలా సంవత్సరాలుగా సజీవంగా ఉంది. స్వాధికారం కోసం అడుగుతున్న ఈ కోరిక అర్థవంతమయినది. ఇది ఏమాత్రం న్యాయ విరుద్ధమయినది కాదు.’ ఇవి ఏ ప్రముఖ తెలంగాణవాది అన్న మాటలు కావు.‘ఆంవూధవూపదేశ్‌లో నెలకొని వున్న పరిస్థితిని అంచనా వేయడానికి, దానికి సంబంధించిన అన్ని వర్గాలతో చర్చించి పరిష్కార మార్గాలను సూచించడానికి’ ఏర్పాటయిన శ్రీకృష్ణ కమిటి తన రిపోర్టులోని ‘భవిష్యత్తుకు మార్గ సూచిక’ అన్న 9వ అధ్యాయంలో రాసిన వాక్యాలు (పేజీ 453) ఇవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వంగానీ, కాంగ్రెస్ పార్టీగానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అసలు పట్టించుకున్న పాపానపోలేదని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన కొంతమంది నాయకులు, మరికొంత మంది సీమాంధ్ర మేధావులు (సంజయ్‌బారు లాంటివాళ్ళు) విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి వ్యక్తపరిచిన అభివూపాయాలు ఏమిటో పరిశీలించడం అవసరం.

శ్రీకృష్ణ కమీటీ తెలంగాణ సమస్యకు ఆరు పరిష్కారమార్గాలు సూచించింది. 1) రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం. ఈ సూచన అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పరిష్కార మార్గంగా కమిటీ భావించింది. 2) హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ తెలంగాణ, సీమాంవూధలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. ఈ సూచన అమలు సాధ్యంకాదని కమీ టీ అభివూపాయపడింది. 3) రాయలతెలంగాణ, కోస్తాంధ్ర రాష్ట్రాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న మూడవ ప్రతిపాదనకు మూడు ప్రాంతాల ప్రజలు అంగీకరించరని కమిటియే తేల్చిచెప్పింది. 4) సీమాంధ్ర, తెలంగాణలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ హైదరాబాద్ మెట్రో నగరాన్ని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే విషయంలో రాజకీయపరంగా ఏకాభివూపాయం వచ్చే అవకాశం లేనందున ఈ ప్రతిపాదన కూడా అమలు చేయడం వీలుకాదని కమీటి స్పష్టీకరించింది.
ఇక మిగిలినవి రెండు పరిష్కార మార్గాలు-రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే, తెలంగాణకు కొన్ని ప్రత్యేక రాజ్యాంగరక్షణలు కల్పించాలన్నది మొదటి సూచన. అయితే, రెండవ ఉత్తమ పరిష్కారంగా రాష్ట్రాన్ని విభజించమని సిఫారసు చేస్తూ వారు చెప్పిన విషయాలు స్థూలంగా ఇవి: రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర అన్న రెండు రాష్ట్రాలుగా పునర్‌నిర్మాణం చెయ్యాలి. హైదరాబాద్ నగరం పది జిల్లా ల తెలంగాణకు శాశ్వత రాజధానిగాను, కొత్త రాజధానిని నిర్మించుకొనేంతవరకు సీమాంవూధకు తాత్కాలిక రాజధానిగాను ఉంటుంది. నూతన రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున పెట్టుబడి కావలసి ఉంటుంది. దానికి సరిపోయిన ఆర్థిక వనరులు, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాలి.

విభజన నిర్ణయం తరువాత వచ్చే పరిణామాలను కూడా కమిటీ అంచనా వేసిం ది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగుతాయని, హైదరాబాద్, నీటి పంపకం ముఖ్యమైన సమస్యలుగా హింసాత్మక ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని శ్రీకృ ష్ణ కమిటీ చెప్పింది. ఊహించిన దానికంటే ముందుగానే ప్రత్యేక రాయలసీమ డిమాండు రూపు దిద్దుకుంటుందని కమి టి జోస్యం చెప్పింది. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించాలని వత్తిడి ఉంటుందని కూడా కమిటి ముందుగానే ఊహించింది. హైదరాబాద్ మార్కెట్ అతి కీలమైనది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది తమ చేయి జారిపోతుందన్న ఆందోళనతో ఈ ఉద్యమాలకు ప్రజలు సిద్ధమవుతారని కూడా కమిటి వ్యాఖ్యానించింది. (పేజీ 452)

ఇప్పుడు జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం గురించి మూడేళ్ళ ముందే ఊహించిన శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పక్షంలో హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాలలో నివసిస్తున్న సీమాంవూధుల పెట్టుబడులు, జీవనోపాధి, ఉపాధి అవకాశాలు వంటి వాటికి తగు రక్షణ కల్పించాలని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారన్న విశ్వాసాన్ని సీమాంవూధుల్లో కల్పించాలని నొక్కిచెప్పింది.(పేజీ 453)
బీజేపీ పరిపాలిస్తున్న కాలంలో ఏర్పాటయిన చిన్న రాష్ట్రాల ప్రగతి గురించి కూడా సదభివూపాయాన్ని వ్యక్తపరించింది కమిటీ. వైశాల్యాన్ని బట్టి కాకుండా నాయకత్వంపై రాష్ట్రాల పురోగ తి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థిక పరిపుష్టి కలిగి వుంటుందని, నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో స్థూల జాతీయోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుందని (పేజీ 453) కూడా చెప్పింది.


ఆర్టికల్ 371(డి) సవరించటం సాధ్యం కాదన్నట్టుగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 371(డి) పై కేంద్ర హోంమంవూతికి అవగాహన లేదని తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు కిరణ్‌కుమార్‌డ్డి.1956లో ఏడవ రాజ్యాంగ సవరణగా ఆర్టికల్ 371భారత రాజ్యాంగంలో చేర్చబడిందన్న విషయం శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టులో ఉటంకించింది. ఇంతవరకు ఎన్నో సవరణలకు, మార్పులకు గురయిన ఆర్టికల్ 371, చివరిసారిగా 1987వ సంవత్సరంలో 56వ సవరణగా మహారాష్ట్ర, గుజరాత్ మున్నగు పది రాష్ట్రాల ప్రత్యేక అవసరాల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఆర్టికల్ 371లో అవసరమైన మార్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కేంద్రానికేమి కష్టమైన పనికాదన్న పద్ధతిలో శ్రీకృష్ణ కమిటీ సూచనవూపాయంగా తన అభివూపాయాన్ని వ్యక్తీకరించింది. రాజ్యాంగంలో ముఖ్యమైన ఈ అధికరణంపై కసరత్తు చేయకుండానే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించిందనుకోవడం సీమాంవూధుల భ్రమ మాత్రమే. లేదా సీమాంధ్ర ఉద్యోగసంఘ నాయకులు, వారి రాజకీయ నాయకత్వం మూర్ఖత్వంతో ఈ విషయంలో ప్రజలను భ్రమలకు గురి చేస్తున్నారనుకోవాలి.


ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను గాని, వైద్య విశ్వవిద్యాలయం గాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ సూచిస్తే, పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక ఉదాహరణ మాత్రమే.శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీమాంధ్ర ప్రభుత్వం ఎన్నోమార్లు అందులోని సూచనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వివక్షతో నిర్ణయాలు తీసుకున్నది.అవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. సర్దార్ వల్లభభాయిపటేల్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యతో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ముగుస్తుంది. ఈ వ్యాఖ్యను ఇక్కడ మళ్ళీ గుర్తుచేసుకోవాలి.‘వాస్తవాలను నిర్లక్ష్యం చేయడం భయంకరమైన అపరాధం.నిజాలను సూటిగా, ఉచిత రీతిలో ఎదుర్కొనకపోతే, అవి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయి’.
-ఎ.రాజేంవూదబాబు
తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటి కోశాధికారి

శాస్త్రీయ పద్ధతుల్లోనే రాష్ట్ర విభజన


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాష్ట్రాల విభజనకు సంబంధించి అనేక వాద, వివాదాలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచీ, బాధ్యాతాయుత మీడియా నుంచి రావడమే విచిత్రం. దీంతో అనుమానాలు, అపోహలు, అనవసర భయాలు ప్రజల్లో నెలకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఏర్పడిన మంత్రుల కమిటీ విషయంలో కూడా కొంత సందిగ్దత ఏర్పడింది. యువకుడు, నిపుణుడు అయిన ఆదిత్య కృష్ణ చింతపంటి అనే అడ్వకేట్ రాష్ట్రాల విభజనకు సంబంధించి అనేక రీ-ఆర్గనైజేషన్ యాక్ట్స్ అధ్యయనం చేశాడు. బొంబాయి (1960), పంజాబ్ (1966), మధ్యవూపదేశ్ (2000), బీహార్ (2000) రాష్ట్రాల విభజన సందర్భంగా వచ్చిన చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేశాడు. ఈ విధి విధానాలన్నీ గత 40 ఏళ్లలో అనేక చారివూతక సందర్భాల్లో ఉనికిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాల్లోంచి తెలంగాణ, ఆంధ్ర విభజన జరుగు తున్న సమయంలో ఉన్న సమస్యలను, పరిష్కారాలను ఓసారి చూద్దాం.
ddr5

మొదటిది: ఆర్టికల్ మూడు అంశం. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన కానీ, కలపడం కానీ పార్లమెంటుకు పూర్తి హక్కును రాజ్యాంగం కట్టబెట్టింది. అలాగే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆర్టికల్-3కు సవరణలు కూడా చేయడానికి సర్వహక్కులు కలిగి ఉన్నది. ఇవన్నీ సుప్రీంకోర్టు ఆమోదంతో రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కులు. ఆర్టికల్-3 ప్రకారం విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి అభివూపాయం కోసం మాత్రమే పంపుతుంది. ఒక జమ్మూ-కశ్మీర్ విషయంలో మాత్రమే మినహాయింపుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి అవసరం. కానీ ఒకవేళ రాష్ట్రపతి పాలన సందర్భంలో స్థానిక అసెంబ్లీ సస్పెండ్ చేయబడినప్పుడు ఈ మినహాయింపులేవీ వర్తించవు. పార్లమెంటుకే సర్వాధికారాలు ఉంటాయి. అలాగే.. రాష్ట్ర విభజనకు సంబంధించి ముందస్తు అసెంబ్లీ తీర్మానాలు కూడా అవసరం లేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ విషయంలో స్థానిక ప్రభుత్వాలను ఒప్పించి ముందస్తు తీర్మానాలు వచ్చేట్లు చేసింది. మధ్యవూపదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ ప్రభుత్వం, బీహార్‌లో రబ్రీదేవీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజనకు ముందస్తు తీర్మానాలు చేయించింది ఎన్డీఏ ప్రభుత్వం. బీజేపీ పాలిత ఉత్తరవూపదేశ్‌లో ఉత్తరాఖండ్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇలాంటి తీర్మానాన్ని చేయించడం బీజేపీకి సమస్య కాలేదు.


రెండో అంశం: పార్లమెంటులో రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు పాస్ అయిన వెంటనే రెండు వేర్వేరు అసెంబ్లీలుగా ఏర్పడవలసి ఉంటుంది. విభజన జరిగిన అసెంబ్లీల్లో ఉమ్మడి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పదవీకాలం యధావిధిగా ఉంటుంది. అలాగే శాసనమండలి సభ్యుల కాలం కూడా అలాగే ఉంటుంది. కానీ పదవీ కాలం ముగిసిన వారు మాత్రం కొత్తగా ఏర్పడిన (విభజన కారణంగా ఏర్పడిన) అసెంబ్లీల నుంచే ఎన్నిక కాలవలసి ఉంటుంది.
మూడో అంశం: రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర హైకోర్టుల ఏర్పాటును పార్లమెంటు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాయర్లు కూడా ప్రాంతాల వారిగా విడిపోయి ఉద్యమిస్తున్న సందర్భంలో ఉమ్మడి హైకోర్టు ఉండటం అసమజసం. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉన్న హైదరాబాద్‌లోనే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసి, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తారు.
నాలుగవ అంశం: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉన్న అనేక కమిషన్‌లు, కమిటీలు అన్నీ యధాతథంగా ఉంటాయి. అలాగే విభజన జరిగిన తర్వాత అంతవరకు అస్తిత్వంలో ఉన్న కమిటీలు, కమిషన్‌లు, రాజ్యాంగ బాడీలు రెండు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల దాకా అమలులో ఉంటాయి. అదే సమయంలో.. ఇరు రాష్ట్రాలు తమ ప్రాంతానికి, రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్, తదితర పాలనాపరమైన విభాగాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

అయిదో అంశం: ఆదాయ, వనరుల పంపకం అనేది ఉమ్మడి రాష్ట్ర మొత్తం రాబడి,వ్యయం, అప్పుల ఆధారంగా రెవెన్యూ పంపకాలు జరుగుతాయి. అలాగే ఆదాయ, రెవెన్యూ రాబడులకు సంబంధించి ప్రాంతీయ సరిహద్దులు పునాదిగా శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా పంపకాలు జరుగుతాయి.
ఆరో అంశం: ఆస్తులు, వనరుల పంపకాలకు సంబంధించి ఉభయ రాష్ట్రాలు చర్చలతో, సామరస్య పూర్వకమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలి. ఉదాహరణకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులాంటి విషయంలో ఉభయ రాష్ట్రాలు చర్చించుకుని ఒక ఒప్పందానికి రావాలి. లేనట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఒక ఇండిపెండెటు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి వనరులు, నీటి పంకాల లాంటి అంశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తుంది. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే బచావత్ ట్రిబ్యూనల్ చేసిన పంపకాలు అస్తిత్వంలో, అమలులో ఉన్నాయి. 1976 నుంచి ఈ ట్రిబ్యూనల్ తీర్పుననుసరించే నీటి పంపకాలు జరుగుతున్నాయి. ఇందులో ఏ సమస్యా, వివాదాలులేవు.

ఏడో అంశం: ఆర్టికల్ 371(డి) అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు వచ్చిన ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసేందుకు వచ్చింది. బాంబా యి, పంజాబ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాలు ఆర్టికల్ 371ను సవరించాయి. తెలంగాణ ప్రాంతం ప్రయోజనాల పరిరక్షణ కోసం వచ్చిన 371(డీ), రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాని అవసరం తీరిపోతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాల నేపథ్యంలో 371(డీ) అవసరమవుతుంది. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల రిజర్వేషన్ కోసం వచ్చిన ఈ చట్టం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దానిలో మార్పులు చేర్పులు ఉండవచ్చు, లేదా తొలగించబడవచ్చు.

ఎనిమిదో అంశం: అతిముఖ్యమైనది ఉమ్మడి రాజధాని గురించి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్ఠంగా పది సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రరాష్ట్ర రాజధాని ఉండి.. దాని పాలన 200ల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పాలించాలి. ప్రజల బాగోగులను చూడాలి. ప్రయాణ దూరం రీత్యా ప్రజలకు ఇది పెను భారం, అసౌకర్యం. 1953లో ఆంధ్రా యాక్ట్ ప్రకారం ఇరు ప్రాంతాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం 14 ప్రత్యేక పాలనా విభాగాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే.. ఆంధ్ర రాష్ట్ర పాలక ప్రభుత్వానికి అవసరమైన వసతుల ఏర్పాటుకు సంబంధించి ఇరు ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం జరగాలి. అలాగే ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి తగిన పూర్తి రక్షణ బాధ్యతలు స్థానిక ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటికీ పూర్తి రక్షణ కల్పించాలి. కొత్తగా ఉనికిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రాంతాల్లోని శాంతి భద్రతలకు పూర్తి బాధ్యత వహించాలి.


రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి సుదీర్ఘ కాలవ్యవధిలో ఎన్నో కాలపరీక్షల్లో నిలిచిన చట్టాలూ, సుప్రీంకోర్టు విధి విధానాలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ విభజన విషయంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా స్పష్టమైన రాజ్యాంగ సూత్రాలు, విధివిధానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అప నమ్మకాలకు తావులేదు. చిక్కుముడులు కూడా లేవు. ప్రజల మధ్యన అపనమ్మకాలు, అపోహలు తలెత్తడానికి అవకాశాలు, ఆస్కారాలు అసలే లేవు. ఆంధ్రావూపాంత నేతలు 1953 నాటి ఆంధ్రాస్టేట్, 1956 నాటి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు నాటి పరిస్థితులను, ఆనాడు ఆలంబనగా చేసుకున్న చట్టాలను ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలియజేయాలి. తెలంగాణ ఏర్పాటు అనేది ఆనాడు జరిగిన దానికి వ్యతిరేక దిశలో జరుగుతున్న విధానంగానే, దానిలో కొనసాగింపుగానే వివరించాలి.
-గౌతమ్ పింగ్లే
(‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)

నీళ్లు మింగేశారు!


-జీవోఎంకు సీమాంధ్ర తప్పుడు నీటి లెక్కలు.. పెన్నాకు కృష్ణాజలాలు, కృష్ణాకు గోదావరి జలాలు
-బేసిన్‌లు మార్చేశారు.. నదులను మళ్లించారు.. ఆవిరి గుప్పిట పట్టారు.. మిగులు జలాలు మింగేశారు
-6శాతం వాటాకు 30శాతం చూపించారు.. సుప్రీంను ఆశ్రయించనున్న రిటైర్డ్ ఇంజినీర్లు
-నీటి మంత్రి జైత్రయాత్రల్లో బిజీబిజీ
హైదరాబాద్, అక్టోబర్ 19 (టీ మీడియా):రాష్ట్ర విభజన వేళ ఆఖరి దోఖా జరుగుతోంది. రెండు జీవనదులున్న తెలంగాణకు నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. సర్కారు వ్యవస్థపై నమ్మకంతో ఉన్న తెలంగాణ ప్రజలను కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర పెద్దలు ముంచుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వారి అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చూపించుకుంటూ లెక్కలు తయారు చేశారు. తెలంగాణ నాయకుడే మంత్రిగా ఉన్న నీటి పారుదలశాఖలో అధికారులు తప్పుడు లెక్కలు తయారుచేస్తుంటే సదరు నాయకుడు జైత్రయాత్రల్లో బిజీబిజీగా ఉన్నారు. సీమాంధ్ర సర్కారు పంపిన లెక్కల ప్రకారమే నీటి పంపకాలు జరిగితే తెలంగాణ మరో 37 ఏళ్లు నీటిపై హక్కుల కోసం కనీసం పోరాడే న్యాయమైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
water-copy
కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర జలనవనరుల శాఖ తప్పుడు లెక్కలు పంపింది. సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు అధికారికం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి దోపిడీని అధికారికంగా కొనసాగించే విధంగా కాకి లెక్కలు రూపొందించారు. ఏకంగా కృష్ణా నదిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దర్జాగా మళ్లించుకునే విధంగా పకడ్బందీ లెక్కలు వేశారు. నదీ పరివాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) ప్రకారం నీటి కేటాయింపులు జరిపితే తెలంగాణకు 548 టీ ఎంసీల నీటికి కేటాయించాలి. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన జలాలు కేవలం 298.96 టీఎంసీలే. ఇపుడు ఈ నీటిని కూడా తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారు. మిగులు జలాలను సీమాంవూధలోని పెన్నా బేసిన్‌కు తరలించారు. మిగులు జలాలు నికరంగా వస్తాయన్న ధీమా లేకపోవడంతో ఆస్థానంలో నికర జలాలనే తరలించాలని సీమాంధ్ర సర్కారు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు జీవోఎంకు ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్నది.

గోదావరి జలాలు కృష్ణాకట..:
గోదావరిలోని నీటిని అక్రమ పద్దతుల్లో మళ్లించడానికి రూ.19,521 కోట్లతో దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ నిర్మించి దీని ద్వారా 165 టీఎంసీల వరద నీటిని కృష్ణాకు మళ్లించేందుకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుట్ర జరిగింది. ఇందులో 130 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు వినియోగిస్తారని, దీంతో కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకున్నట్లు కాదని సీమాంధ్ర సర్కారు కేంద్ర మంత్రి బృందానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. వాస్తవానికి తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టుపై సర్వేలకు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసి తరువాత మూలకు పడేశారు. ఇది అస్తిత్వంలో లేదు.

అయినా దీనిని విభజన సందర్భంగా తెరపైకి తీసుకువచ్చి నీటి వాటా కొట్టేసేందుకు లెక్కలు వేసి పంపించారు. పైగా ఈ ప్రాజెక్టును తెలంగాణ కోటా కింద చూపించే యత్నం చేశారు. ఈ నీటిని కోస్తాంధ్రకు చూపించి శ్రీశైలం వద్ద కృష్ణా నదిని సీమ ప్రాజెక్టులకు మళ్లించుకునేందుకు వైఎస్ సర్కారు ఎత్తుగడలో ఈ ప్రాజెక్టు పుట్టుకొచ్చింది. దీనికి రాష్ట్ర విభజన సమయంలో ఆమోద ముద్ర వేయించుకునేందుకు సీమాంధ్ర సర్కారు కుట్ర చేసింది. తెలంగాణ సమాజం అభ్యంతరాలతో మూలకు పడిన ఈ ప్రాజెక్టు తెరపైకి తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీ ఎంసీలు మళ్లించ వచ్చు, దీనిపై ట్రిబ్యునల్‌లో వచ్చిన వాదనల సందర్భంగా 54 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మరో 35 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ట్ర వాడు కోవడానికి ట్రిబ్యునలే హక్కు కల్పించింది. కానీ జీవోఎంకు ఇచ్చిన నివేదికలో దీని ప్రస్తావనే లేదు. కృష్ణా జల్లాలో ట్రిబ్యునల్స్ కేటాయించిన 298.98 టీఎంసీల నీటిలో 245 టీఎంసీల నీటిని కాజేయాలని పన్నాగం పన్నారు.

వాదనల సమయంలోనే తెలంగాణకు అన్యాయం
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలోనే తెలంగాణకు సీమాంధ్ర సర్కారు అన్యాయం చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ను 519 అడుగుల నుంచి 526 అడుగుల ఎత్తుకు పెంచుకొని 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటామని, దీనికి ఆంధ్ర ప్రదేశ్ అనుమతిస్తే 50 టీఎంసీల నీటిని ఆల్మట్టిలో నిల్వ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ఇచ్చింది. దీనికి సర్కారు అనుమతి ఇస్తే 50 టీ ఎంసీల నీటిలో దాదాపు 40 టీఎంసీల నీటిని వెనుకబడిన జిల్లా మహబూబ్‌నగర్‌కు గ్రావిటి ద్వారా వచ్చేవి. కానీ దీనికి అంగీ కరించని సర్కారు కృష్ణా మిగులు జలాలపైనే ఆధారపడి పెన్నా బేసిన్‌లో పాజెక్టులు నిర్మి ంచామని, వాదనలు చేసింది. ఈ వాదనల్లో పసలేక పోవడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 526 అడుగుల ఎత్తుకు ఆల్మట్టిని నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. దీంతో కర్ణాటక ఇస్తానన్న 50 టీఎంసీల నీటి ఆఫర్ కూడా చేజారింది. ఫలితంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు పూర్తిగా, వరంగల్, ఖమ్మం జిల్లాలు పాక్షికంగా నష్టపోయాయి.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను నదీ పరివాహక ప్రాంతాలకే కేటాయించాలని చెప్పింది. కృష్ణా నదీపరివాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతానికి పైగా ఉంది. ఈ లెక్కన మిగులు జలాల్లో 68 శాతం తెలంగాణకే రావాల్సి ఉంది. అయితే కేవలం 30 శాతం మాత్రమే కేటాయించినట్లు జీవోఎంకు ఇప్పుడు నివేదిక పంపారు. మిగులు జలాల పంపిణీలో కూడా కేవలం 77 టీఎంసీలే తెలంగాణ కోటాకు చూపించారు. రాయలసీమకు 107 టీఎంసీలు, కోస్తాకు 43.50 టీఎంసీలు కేటాయించినట్లుగా చూపించారు. ఈ పద్దతుల్లో 100 టీఎంసీలను పోతిరెడ్డి పాడు హెడ్‌గ్యులేటర్ ద్వారా సీమకు మళ్లించుకున్నారు ఇక నాగార్జున సాగర్ డ్యామ్‌కు నాలుగు వేల కోట్ల రుణం ద్వారా ఆధునీకరణ చేపట్టినా ఒక్క టీఎంసీ నీరు కూడా ఆదా అయినట్లు లెక్కల్లో చూపించకపోవడం గమనార్హం. కనీసం 15 శాతం నీటిని ఆదా కింద వేసినా కనీసం 40 టీఎంసీల నీరు లెక్కల్లోకి వస్తుందంటున్నారు.

ఇదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు మరి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఇదే తీరుగా శ్రీశైలం డ్యామ్‌లో 33 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, గోదావరి నదిపై అసలు ప్రాజక్టే లేని ఇచ్చంపల్లికి 35 టీఎంసీలు కేటాయించారు. ఇది కాకుండా 44 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, దీనిని జలవిద్యుత్ ప్రాజెక్టు కింద వేరుగా చూపారు. ఇదెక్కడి లెక్కనో అర్థం కావడం లేదని ఇదేశాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఇంజనీర్లే విస్తు పోతున్నారు.

సుప్రీంను ఆశ్రయిస్తాం:
రాష్ట్ర ప్రభుత్వం నీటి పంపకాలపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం)కు ఇచ్చిన నివేదిక తెలంగాణకు భవిష్యత్‌లో కూడా న్యాయం జరిగే అవకాశం లేని విధంగా ఉందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి అన్నారు. నీటి పంపకాలు నదీపరివాహక ప్రాంతాలకే పంపిణీ చేయాలన్నారు. ఒక బేసిన్ జలాలను మరో బేసిన్‌కు తరలిస్తున్నట్లు చూపించడం అక్రమమన్నారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం తరపున వాదనలు విని, తెలంగాణకు న్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరారు. కేంద్రం అధికారికంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన నేపధ్యంలో తాము బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఇచ్చంపల్లికి సమాధి...
ఇచ్చంపల్లి ప్రాజెక్టును సీమాంధ్ర సర్కారు సమాధి చేసింది. 1978లోనే ఈ ప్రాజెక్టుపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం దీని నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆనాడు వెంటనే నిర్మాణం చేపట్టి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అయితే సీమాంధ్ర ముఖ్యమంత్రులు మూలకు పడేశారు. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరువాత కాటన్ బ్యారేజి వరకు 650 కిలో మీటర్లు ఒక్క ప్రాజెక్టు కూడా లేక తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.

19, అక్టోబర్ 2013, శనివారం

జేబు దొంగ


-Ÿî-Í䮾ÕhÊo ‚£¾Éª½ “Ÿ¿„îu-©sº¢ 
²Ä«ÖÊÕuœË ¦ÅŒÕÂ¹× ¦µÇª½¢ 
X¾¢{© «ÖJpœËÂË “¤òÅÃq£¾ÇÂé ©äNÕ
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
-²Ä-«Ö-ÊÕuœË ¦ÅŒÕÂ¹× ¦µÇª½¢’à «ÖJ¢C. EÅÃu«®¾ª½ Ÿµ¿ª½© E§ŒÕ¢“ÅŒ-º©ð “X¾¦µ¼ÕÅŒy „çj-X¶¾-©Çu-EÂË “X¾•©Õ «â©u¢ ÍçLx-®¾Õh-¯Ão-ª½Õ. …X¾ÛpÐX¾X¾Ûp „ç៿©Õ G§ŒÕu¢Ð …Lx¤Ä§ŒÕ© «ª½Â¹× Ÿµ¿ª½©Õ ͌չˆ-©¢{Õ-ÅŒÕ-¯Ãoªá. ’¹œ¿*Ê ÂíCl ¯ç©©Õ’à ‚£¾Éª½ …ÅŒpÅŒÕh© “Ÿ¿„îu-©s-º¢ ’¹ºF§ŒÕ¢’à åXª½Õ-’¹Õ-Åî¢C. \œÄC “ÂËÅŒ¢Åî ¤òLæ®h å®åXd¢¦ª½Õ ¯ç© ¯ÃšËÂË …Lx Ÿµ¿ª½ 323 ¬ÇÅŒ¢ åXJT¢C. ¹ت½-’Ã-§ŒÕ© Ÿµ¿ª½©ðx 89 ¬ÇÅŒ¢ åXª½Õ-’¹Õ-Ÿ¿© Ê„çÖŸçj¢C. 2009 ‡Eo¹© ®¾«Õ-§ŒÕ¢©ð §ŒâXÔ\ «¢Ÿ¿ ªîV©ðx EÅÃu«®¾ª½ ®¾ª½Õ¹ש Ÿµ¿ª½©ÊÕ E§ŒÕ¢“A-²Äh-«ÕE “X¾Â¹-šË¢*¢C. ‚ £¾ÉOÕ “X¾Â¹{Ê©ê X¾JNÕÅŒ¢ ƪá¢C. ‚£¾É-ª½-ŸµÄ-¯Ãu© œË«Ö¢œ¿ÕÐ-®¾-ª½-X¶¾-ªÃ-©-ÊÕ X¾J’¹-º-Ê-©ðÂË B®¾Õ¹×E ¦µ¼N-†¾u-ÅŒÕh “X¾ºÇ-R-¹-©-ÊÕ ª½Ö¤ñ¢C¢*Ê ŸÄÈ©Ç©Õ ©ä¹-¤ò-«-{-„äÕ Ÿµ¿ª½© åXª½Õ-’¹Õ-Ÿ¿-©-Â¹× “X¾ŸµÄÊ Â꽺«ÕE EX¾Ûº©Õ ®¾p†¾d¢ Í䮾Õh-¯Ão-ª½Õ. ƢŌ-ªÃb-B§ŒÕ «Ö骈šü©ð «áœË-ÍŒ«á-ª½Õ Ÿµ¿ª½©ðx «®¾ÕhÊo «Öª½Õp©Â¹× ÆÊÕ’¹Õº¢’à åX“šð©Õ, œÎ>©ü Ÿµ¿ª½©Õ ¦µ¼’¹Õ_-«Õ¢{Õ-¯Ãoªá. ÍŒ«áª½Õ Ÿµ¿ª½© “X¾¦µÇ«¢ ª½„ÃºÇ ª½¢’¹¢ ÊÕ¢* ‚£¾Éª½ …ÅŒpÅŒÕh© «ª½Â¹Ø ÆEo ª½¢’éåXj X¾œ¿ÕÅî¢C. ͵ÃKb©Õ, NŸÄuª½Õn© X¶ÔV©Õ ÅŒCÅŒªÃ©Fo ¦µÇª½-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. Ê’¹Ÿ¿Õ ¦CM æXª½ÕÅî ÍŒ«áª½Õ ¹¢åXF©Õ ’Ãu®ý ¦¢œ¿ÊÕ ª½Ö.452 ÊÕ¢* ª½Ö. 1,096Â¹× åX¢-Íêá. Ê’¹Ÿ¿Õ ¦CM ©Â¹~© -«Õ¢-C NE§çÖ-’¹-ŸÄ-ª½Õ-©-Â¹× Æ¢Ÿ¿E “ŸÄ¹~’Ã¯ä …¢C. ªÃ†¾Z¢©ðE ²Ä«ÖÊÕuœË °«Ê’¹«ÕÊ¢ Ÿ¿§ŒÕ-F-§ŒÕ¢’à «Öª½ÕÅî¢C. åXª½Õ-’¹Õ-ÅŒÕ-Êo Ÿµ¿ª½©Åî «ÕŸµ¿u ÅŒª½’¹A °N ¯ç©„ÃK ¦œçbšü Æ®¾h-«u®¾h¢’à «Öª½ÕÅî¢C. °ÅŒ¦µ¼-ÅÃu©-Åî ¤òLæ®h Ÿµ¿ª½© åXª½Õ-’¹Õ-Ÿ¿© ÆÊÖ£¾Çu¢’à …¢C. ’¹œË*Ê éª¢œä@Áx «u«Cµ©ð ²Ä«ÖÊÕuœË ¦œçbšü «¢Ÿ¿ ¬ÇÅŒ¢ åXJT¢Ÿ¿E ‚Jn¹, ²Ä«Ö>¹ ¬Ç®¾Y„ä-ÅŒh-©Õ ÆGµ“¤Ä-§ŒÕ-X¾-œ¿Õ-Ōբœ¿-{¢ N¬ì-†¾¢. Æ-Ÿµ¿u-§ŒÕ-Ê¢ ‡Â¹ˆœ¿...?
-“X¾-®¾Õh-ÅŒ¢ «Ö骈šüåXj “X¾¦µ¼Õ-ÅÃy-EÂË E§ŒÕ¢“ÅŒº ©ä¹-¤ò-«-{-„äÕ Ÿµ¿ª½© åXª½Õ-’¹Õ-Ÿ¿-©-Â¹× Â꽺«ÕÊo EX¾ÛºÕ© ‚¢Ÿî@ÁÊ©ð „î¾h«¢ ©ä¹-¤ò©ä-Ÿ¿Õ. E-ÅÃu«®¾ª½ «®¾Õh«Û© Ÿµ¿ª½©Õ ‡¢Ÿ¿ÕÂ¹× åXª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ®¾ª½-X¶¾-ªÃ-Â¹× NE§çÖ’ÃEÂË «ÕŸµ¿u «uÅÃu®¾¢ …¢œ¿„äÕ Â꽺«Ö? ©ä¹ «Õꪟçj¯Ã Â꽺«Ö ÆÊoC ÍŒª½a-F-§ŒÖ¢¬Á¢’à …¢C. œË«Ö¢œ¿Õ-Â¹× ÅŒTÊ ®¾ª½X¶¾ªÃ ©äE X¾Â¹~¢©ð Ÿµ¿ª½© åXª½Õ-’¹Õ-Ÿ¿© Ƣ͌¯Ã©Â¹× Æ¢Ÿ¿Ê¢ÅŒ’à …¢{Õ¢Ÿ¿E å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE 客{ªý X¶¾ªý ‡Â¹¯ÃNÕÂúq Æ¢œþ ²ò†¾©ü ®¾dœÎ-®ý-©ðE “¤ñåX¶®¾ªý ®Ï.ª½N N«J¢Íê½Õ. éªjŌթÕ, NE§çÖ-’¹-ŸÄ-ª½Õ© «ÕŸµ¿u ®¾«ÕÊy§ŒÕ¢ ¹Lp¢Íä «u«®¾n©Õ ©ä¹-¤ò-«-{¢... ŠÂ¹šÌ ƪà ªÃ³ZÄ©ðx …¯Ão „ÚËE “X¾¦µ¼Õ-ÅÃy-©Õ X¾šË†¾d¢ Í䧌Õ-¹-¤ò-«-{¢Åî Ÿµ¿ª½©Â¹× ¹@ëx¢ „䧌Õ{¢ “X¾¦µ¼Õ-ÅÃy-©-Â¹× ²ÄŸµ¿u¢ Âë{¢ ©äŸ¿Õ. EÅŒu«®¾ª½ «®¾Õh«Û© Ÿµ¿ª½© ÆŸµ¿u-§ŒÕ-Ê¢, X¾ª½u„ä-¹~º (K宪ýa Æ¢œþ «ÖE{J¢’û N¢’û X¶¾ªý ‡å®E¥-§ŒÕ©ü ¹„çá-œË-šÌ-®ý) N¦µÇ’éÊÕ \ªÃp{Õ Í䧌ÖL. ’¹ÅŒ¢©ð ªÃ†¾Z¢©ð ¨ ÅŒª½£¾É N¦µÇ’¹¢ …¢œäC. ªîV„ÃK’à NNŸµ¿ E-ÅÃu«®¾ª½ «®¾Õh«©ÊÕ Ÿµ¿ª½©ÊÕ X¾ª½u„ä-ÂË~¢ÍŒ-{¢Åî-¤Ä-{Õ åXª½Õ-’¹Õ-Ÿ¿© Â꽺ǩÊÕ N¬ìx-†Ï¢ÍŒ-{¢ ŸÄyªÃ “X¾¦µ¼Õ-ÅŒy¢ ª½¢’¹ “X¾„ä¬Á¢ Íäæ®C. DE «©x éªjÅŒÕ©Â¹× T{Õd¦Ç{Õ Ÿµ¿ª½©Õ ©Gµ¢ÍäN. NE§çÖ-’¹-ŸÄ-ª½Õ-©Õ ŸîXÏœÎÂË ’¹ÕJ ÂùעœÄ …¢œä¢Ÿ¿Õ-Â¹× Æ«ÂìÁ¢ …¢œäŸ¿E EX¾ÛºÕ©Õ ÆGµ“¤Ä-§ŒÕ-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½Õ. 
Âí¢X¾ «á¢ÍŒÕ-ÅŒÕ-Êo C’¹Õ-«Õ-ŌթÕ...
-“X¾-•© ‚ŸÄ§ŒÕ¢ åXJê’ ÂíDl G§ŒÕu¢ „Ãœ¿Â¹¢ ÅŒ’¹Õ_-ŌբŸ¿E, X¾X¾Ûp ŸµÄ¯Ãu©Õ, ¹ت½-’Ã-§ŒÕ-©Õ, «Ö¢®¾¢, ’¹Õœ¿Õx «¢šË „ÃšË NE§çÖ’¹¢ åXª½Õ-’¹Õ-ŌբŸ¿E ‚Jn¹„ä-ÅŒh© ÆGµ“¤Ä-§ŒÕ¢. Æ«®¾ªÃ©Â¹× ÅŒ’¹_{Õd’à X¾X¾Ûp ŸµÄ¯Ãu©Õ …ÅŒpAh Âë{¢ ©äŸ¿ÊoC “X¾¦µ¼Õ-ÅŒy¢ å®jÅŒ¢ Æ¢U¹-J-®¾Õh-Êo Æ¢¬Á„äÕ. ÊÖ¯ç© N†¾§ŒÕ¢©ð-ÊÖ ÆŸä X¾J®ÏnA. ²ò§ŒÖH¯þ, ¤Ä«Öªá©ü ÅŒCÅŒªÃ© …ÅŒpAhÅî ¤òLæ®h NE§çÖ’¹¢ ÆCµÂ¹¢’à …¢C. NE§çÖ’¹¢ åXJTÊ ¯äX¾-Ÿ±¿u¢©ð C’¹Õ-«Õ-ÅŒÕ-©-åXj ‚ŸµÄ-ª½-X¾œä X¾J®ÏnA. ƢŌ-ªÃb-B§ŒÕ «Ö骈šü©ð œÄ©ªý Šœ¿Õ--Ÿíœ¿Õ-¹×-©Åî ®¾£¾Ç-•¢’Ã¯ä Ÿµ¿ª½©Â¹× éªÂ¹ˆ©Õ «²Ähªá. \œÄCÂË ®¾Õ«Öª½Õ ‡ENÕC ©Â¹~© {ÊÕo© «ª½Â¹× NNŸµ¿ ª½Âé «¢{ ÊÖ¯ç©Õ ªÃ†¾Z¢©ð C’¹Õ«ÕA Æ«ÛÅŒÕ-¯Ãoªá. ÆÅŒu-Cµ-¹¢’à ¤Ä«Öªá©ü ÆªáŸ¿Õ ©Â¹~© {ÊÕo© «ª½Â¹× …¢{Õ¢C. ®¾¯þ-X¶¾x-«ªý ‚ªá©ü ®¾Õ«Öª½Õ 骢œ¿ÕÊoª½ ©Â¹~© {ÊÕo©Õ, ²ò§ŒÖÊÖ¯ç ®¾Õ«Öª½Õ 30 „ä© {ÊÕo© «ª½Â¹× C’¹Õ«ÕA Æ«ÛÅŒÕÊo{Õx Ƣ͌¯Ã. X¾X¾Ûp ŸµÄ¯Ãu©Õ ©Â¹~© {ÊÕo©ðx C’¹Õ«ÕA Æ«ÛÅŒÕ-¯Ãoªá. ƒ¢ÅŒ åXŸ¿l „çáÅŒh¢©ð C’¹Õ-«Õ-ÅŒÕ-©Õ …¢œ¿œ¿¢ Â¹ØœÄ Ÿµ¿ª½© åXª½Õ-’¹Õ-Ÿ¿-©-Â¹× Â꽺„äÕ. ƒÂ¹ œÎ>©ü, åX“šð©Õ Ÿµ¿ª½©Õ ª½Ö¤Ä-ªáÐ-œÄ-©ªý «Öª½Â¹ êª{Õ, ƢŌ-ªÃb-B§ŒÕ «Ö骈šü©ð ÍŒ«áª½Õ Ÿµ¿ª½©Â¹× ÆÊÕ’¹Õº¢’à «Öª½ÕÅŒÕÊo N†¾§ŒÕ¢ ÅçL®Ï¢Ÿä.

-“X¾-¦µ¼Õ-ÅÃy-©-Â¹× Dª½`ÂÃ-L¹ «Üu£¾É©Õ -Æ-«®¾ª½¢
-Ÿµ¿-ª½© E§ŒÕ¢“ÅŒº N†¾§ŒÕ¢©ð ꢓŸ¿, ªÃ†¾Z “X¾¦µ¼Õ-ÅÃy-©-Â¹× Dª½`ÂÃL¹ “X¾ºÇR¹©Õ ©ä¹-¤ò-«-{-„äÕ E-ÅÃu«®¾ª½ «®¾Õh-«Û© Ÿµ¿ª½©Õ ƒ³Äd-ªÃ-•u¢’à åXª½-’¹-šÇ-EÂË Â꽺¢ Íç¤Äpª½Õ. ÆÅŒuCµÂ¹ œË«Ö¢œ¿ÕÊo E-ÅÃu«®¾ª½ «®¾Õh«Û© …ÅŒpAhE åX¢Í䢟¿Õ-Â¹× “X¾ºÇ-R-¹-©-ÊÕ ª½Ö¤ñ¢C¢ÍÃL. éªjŌթÊÕ ‚ C¬Á’à ÍçjÅŒ-Êu-«¢ÅŒÕ-©-ÊÕ Í䧌ÖL. œË«Ö¢œ¿ÕÊo ®¾ª½Õ¹ש …ÅŒpAh åXJT-Ê-X¾Ûp-œ¿Õ Ÿµ¿ª½© E§ŒÕ¢“ÅŒº ²ÄŸµ¿u¢ Æ«ÛŌբC. ªÃ†¾Z¢©ð -“X¾-ŸµÄ-Ê¢’à «J¯ä X¾¢œË-®¾Õh-¯Ão-ª½Õ. ƒÅŒª½ X¾¢{©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢ÍŒ{¢ ©äŸ¿Õ. “X¾¦µ¼ÕÅŒy “¤òÅÃq-£¾Ç-ÂÃ-©Õ ©ä«Û. ¹F®¾ «Õ-Ÿ¿lÅŒÕ Ÿµ¿ª½ NŸµÄÊ¢ ŠÂ¹ˆ˜ä ®¾J¤òŸ¿Õ. «Ö骈šü©ð Ÿµ¿ª½©Õ åXª½Õ-’¹Õ-ÅŒÕ-Êo ®¾¢Ÿ¿-ªÃs´-©ðx «Ö骈šü©ð èð¹u¢ Í䮾Õ¹ׯä NŸµÄ¯ÃEo Æ«Õ©Õ Íäæ®h Âí¢ÅŒ „äÕª½Â¹× Ÿµ¿ª½©Õ ÅŒ’¹Õ_-Åêá. éªjÅŒÕ©Â¹× T{Õd¦Ç{Õ Ÿµ¿ª½ ©Gµ¢ÍŒE X¾Â¹~¢©ð „ÃJE ‚Ÿ¿Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× Ÿµ¿ª½© ®ÏnK¹ª½º ECµ (wåXj®ý å®dG©ãjèä-†¾¯þ X¶¾¢œþ) NŸµÄ¯ÃEo ÆÊÕ®¾-J¢ÍÃL. “X¾¦µ¼Õ-ÅŒy¢ éªjŌթ ÊÕ¢* ‚§ŒÖ …ÅŒp-ÅŒÕh-©-ÊÕ ÂíÊÕ’î©Õ Íäæ®h „ê½Õ ʆ¾d-¤ò-¹עœÄ …¢šÇª½Õ. “X¾¦µ¼Õ-ÅÃy-©Õ «Üu£¾É-ÅŒt¹ X¾ª½u„ä-¹~º Íäæ®h¯ä Ÿµ¿ª½©ÊÕ E§ŒÕ¢“A¢ÍŒ-{¢ ²ÄŸµ¿u¢ Æ«ÛŌբC.
Ð “¤ñåX¶®¾ªý ‡®ý.N.-®¾-ÅŒu-¯Ã-ªÃ-§ŒÕº, 
…²ÄtE§ŒÖ N¬ÁyN-ŸÄu-©-§ŒÕ „ú˕u ¬Ç®¾Y N¦µÇ’¹¢ 

తెలంగాణా ఐ క స నివేదిక


…«ÕtœË’à «âœä-@ÁÙx ÍéÕ
å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ‡«JÂÌ “X¾Åäu¹ ª½Â¹~º©Õ ƹˆ-êªx-Ÿ¿Õ
FšË „Ãœ¿ÂÃEÂË «ÖE{J¢’û ÆŸµÄJšÌ
Åç©¢’ú ªÃ†¾Z¢©ð-ÊÖ 371 (œË) …¢ÍŒ¢œË
…X¾ ®¾¢X¶¾ÖEÂË E„äC¹ X¾¢XÏ¢*Ê Åç©¢’ú ‰Âî¾
¨-¯Ã-œ¿Õ, å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ: ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅŒy¢ “X¾Åäu¹ Åç©¢’ú ªÃ†¾Z¢ \ªÃp{Õ Í䮾ÕhÊo ÅŒª½Õº¢©ð ÊÖÅŒÊ ªÃ†¾Z¢©ð-ÊÖ ‚Jd¹©ü 371 (œË) …¢œÄ©E Åç©¢’ú ‰Âî¾ “X¾A-¤ÄC¢*¢C. N¦µ¼•Ê “X¾“Â˧ŒÕ Â¢ ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅŒy¢ \ªÃp{Õ Íä®ÏÊ «Õ¢“Ōթ ¦%¢ŸÄEÂË ¨ „äÕª½Â¹× ‰Âî¾ ¬Áٓ¹-„Ã-ª½¢ ªÃ“A 125 æX°© E„äC¹ X¾¢XÏ¢*¢C. E„äC¹©ð “X¾ŸµÄÊ¢’à å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, ¬Ç¢A-¦µ¼-“Ÿ¿-ÅŒ-©Õ, NŸ¿ÕuÅý, FšË¤Ä-ª½Õ-Ÿ¿©, ‚®¾Õh©Õ, ÆX¾Ûp©Õ, å£jÇ-Âî-ª½Õd, NŸÄu-ª½¢’¹¢, ‚ªî’¹u¢, ¤ò©«ª½¢ “¤Äèã-¹×d, ‚Jd¹©ü 371 (œË), ®Ï¢’¹êªºË, ¦ï’¹Õ_ ’¹ÊÕ©Õ, ’Ãu®ý êšÇ-ªá¢X¾Û-©-Â¹× ®¾¢¦¢Cµ¢*Ê Æ¢¬Ç©ÊÕ “X¾ŸµÄÊ¢’à “X¾²Äh-N-®¾Öh «Õ¢“Ōթ ¦%¢ŸÄEÂË E„äC¹ÊÕ ¨ „çÕªá©ü ŸÄyªÃ X¾¢XÏ¢ÍÃ-ª½Õ. ’¹œË*Ê éª¢œ¿Õ ªîV©Õ’à ‰Âî¾ ͵çjª½t¯þ “¤ñåX¶®¾ªý Â¢œ¿ªÃ¢ ¯äÅŒ%ÅŒy¢©ð ²Ä’¹ÕÅŒÕÊo E„äC¹ ¹®¾-ª½-ÅŒÕhÂ¹× ‰ÂðE ¦µÇ’¹-²Äy-«Õu-X¾-Â~é ¯Ã§ŒÕÂ¹×©Õ ¬Áٓ¹-„Ã-ª½¢ ÅŒÕC ª½ÖX¾-NÕ-ÍÃaª½Õ. ‰Âî¾ ¯Ã§ŒÕÂ¹×©Õ Â¢œ¿-ªÃ¢, «Õ©äxX¾Lx ©Â¹~t§ŒÕu, œÎXÔ éªœËf, ª½«Ö-„äÕ-©ðˆ˜ä, ®Ï.N-ª¸½©ü, ¹Ah „ç¢Â¹-{-²Äy-NÕ, N„äÂú, ¡E„Ã-®ý-’õœþ, „ç¢Â¹-šü-éª-œËf, ®ÔXÔ‰(-‡¢‡©ü) ÊÖuœç-„çÕ-“¹®Ô ¯äÅŒ ’½l¯þ ÅŒCÅŒª½Õ©Õ ¨ ¹®¾-ª½-ÅŒÕh©ð ¤Ä©ï_-¯Ão-ª½Õ. …Ÿîu-’¹Õ-©-Â¹× ®¾¢¦¢Cµ¢* ‚Jd¹©ü 371(œË)E §ŒÕŸµÄ-ÅŒ-Ÿ±¿¢’à …¢ÍéE E„äC¹©ð “X¾A-¤Ä-C¢ÍÃ-ª½Õ. DE«©x ¦£ÏǪ½_ÅŒ «©®¾©ÊÕ ÆJ¹-{d-œÄ-EÂË O©«Û-ŌբŸ¿E, >©Çx© «ÕŸµ¿u Â¹ØœÄ ®¾«Õ®¾u-©Õ¢œ¿«E æXªíˆ-¯Ão-ª½Õ. N¦µ¼•Ê ®¾¢Ÿ¿-ª½s´¢’à …Ÿîu’¹Õ© X¾¢XϺ̩ð ÆEo èÇ“’¹ÅŒh©Õ B®¾Õ-Âî-„Ã-©E, …Ÿîu’¹Õ©Õ \ “¤Ä¢ÅŒ¢ „Ãªî ’¹ÕJh¢Í䢟¿Õ-Â¹× ‡®ý.‚ªý.-©ðE ‡¢“šÌE X¾JQ-L¢ÍÃ-©E, ƹˆœ¿ ²ÄnE¹ŌÊÕ æXªíˆ¢šÇ-ª½E, ŸÄE ‚ŸµÄª½¢’à ®Ô«Ö¢“Ÿµ¿, Åç©¢’ú ªÃ“³Äd©Â¹× …Ÿîu’¹Õ©ÊÕ X¾¢XÏºÌ Í䧌֩E ®¾Ö*¢ÍÃ-ª½Õ. å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-åXj \©Ç¢šË ‚¢Â¹~©Õ åX{d«Ÿ¿lE ÂÕ-Ō֯ä, ƒÂ¹ˆœ¿ …¢œä „ÃJÂË “X¾Åäu¹ ª½Â¹~º©Õ ƒ„ÃyLqÊ Æ«®¾ª½¢ ©äŸ¿E ÆGµ“¤Ä-§ŒÕ-X¾-œÄf-ª½Õ. Ÿä¬Á¢©ðE ¤ùª½Õ-©¢Ÿ¿-JÂË ªÃèÇu¢’¹ X¾ª½¢’à …Êo ª½Â¹~º©ä å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð Â¹ØœÄ …¢šÇ§ŒÕE ’¹Õª½Õh-Íä-¬Çª½Õ. å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ X¾Ÿä@Áx ÂéÇEÂË …«ÕtœË ªÃ•ŸµÄE’à …¢ÍŒœ¿¢ ®¾«Õ¢•®¾¢ Âß¿F, Åç©¢’ú “X¾•©Õ ƒ¢Ÿ¿ÕÂ¹× Æ¢U¹-J¢ÍŒ-ª½F Íç¤Äpª½Õ. ®Ô«Ö¢“Ÿµ¿ “¤Ä¢ÅŒ¢©ð ÂíÅŒh’à ªÃ•ŸµÄE EJt¢ÍŒÕ-Âî-«-œÄEÂË ê«©¢ «âœä@ÁÙx ®¾J¤ò-ŌբŸ¿E, «âœä@ÁÙx ÅÃÅÈL¹ ªÃ•ŸµÄE’à …¢Íä \ªÃp{Õ Í䧌֩E, ®Ô«Ö¢“Ÿµ¿ “¤Ä¢ÅŒ X¾J¤Ä©Ê ²ÄT¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË Ê’¹ª½ P„ê½Õ©ð \Ÿî ŠÂ¹ “¤Ä¢ÅÃEo êšÇ-ªá¢Íä©Ç ͌֜ĩE ÂîªÃª½Õ. ‚ “¤Ä¢Åïäo ÅÃÅÈL¹ ªÃ•ŸµÄE’à …¢ÍÃ-©-¯Ão-ª½Õ. NŸ¿ÕuÅýÂ¹× ®¾¢¦¢Cµ¢* Åç©¢’ú “¤Ä¢ÅÃEÂË B“« ƯÃu§ŒÕ¢ •JT¢Ÿ¿E, ªÃ†¾Z¢ \ªÃp{Õ Íä®ÏÊ ÅíL ƪáŸä@ÁÙx ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅŒy¢ NŸ¿ÕuÅý êšÇ-ªá¢X¾Û©ð Åç©¢’ÃºÂ¹× “X¾Åäu¹ “¤ÄŸµÄÊu¢ ƒ„Ãy©E ÂîªÃª½Õ.

నదుల్ని పంచిన్డిలా

ÊŸ¿ÕLo X¾¢*¢C©Ç!
-¨-¯Ã--œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
FšË ¤Äª½ÕŸ¿© ¬ÇÈ FšË êšÇ-ªá¢X¾Û-©-Â¹× ®¾¢¦¢Cµ¢*Ê ©ã¹ˆ© «ª½ê X¾JNÕ-ÅŒ-„çÕi¢C. ¹%³Äg, ’îŸÄ«J, åX¯Ão ¦ä®ÏÊx©ð w˜ãj-¦Õu-Ê-@ÁÙx Íä®ÏÊ êšÇ-ªá¢X¾Û-©Õ, ÅŒªÃyÅŒ Â颩ð “X¾¦µ¼Õ-ÅŒy¢ Íä®ÏÊ X¾ÛÊÓ-êÂ-šÇ-ªá¢X¾Û-©Õ, “¤Äèã-¹×d© „ÃK’Ã, “¤Ä¢Åé „ÃK’à Íä®ÏÊ FšË êšÇ-ªá¢X¾Û© N«ªÃ©Åî ¬Áٓ¹-„Ã-ª½¢ ²Ä§ŒÕ¢“ÅÃ-EÂË E„äC¹ ®ÏŸ¿l´¢ Íä¬Çª½Õ. ¬ÁE„ê½¢ ¨ E„äC¹ “X¾¦µ¼ÕÅŒy “X¾ŸµÄÊ Âê½u-Ÿ¿-JzÂË Æ¢Ÿ¿ÊÕ¢C. ƒšÌ«© Â颩ð •JTÊ …ÊoÅŒ ²Änªá ƒ¢>Fª½x ®¾«Ö„ä-¬Á¢©ð ÍŒJa¢*Ê Æ¢¬Ç©Õ ’ÃF, NÕ’¹Õ©Õ FšË NE§çÖ’¹¢ ‚ŸµÄª½¢’à ÍäX¾šËdÊ “¤Äèã-¹×d-©-Â¹× FšË NE§çÖ’¹¢ ’ÃF, ÅŒyª½©ð¯ä Æ«Õ©Õ©ðÂË ªÃÊÕÊo “Gèä†ý ¹׫֪ý w˜ãj-¦Õu-Ê©ü Bª½Õp©ðE Æ¢¬Ç© èðLÂË ’ÃF „ç@Áx©ä-Ÿ¿Õ. E„äC¹©ð ¤ñ¢Ÿ¿Õ X¾JÍä ©ã¹ˆ©ÊÕ “Ÿµ¿Õ-O-¹-J-®¾Öh ƒ¢>Fªý ƒ¯þ Fª½Õx ®¾¢ÅŒÂÃ©Õ Íä®Ï FšË ¤Äª½ÕŸ¿© ¬ÇÈ «áÈu Âê½u-Ÿ¿-JzÂË Æ¢Ÿ¿èä-¬Ç-ª½Õ. “¤Ä¢Åé „ÃK’Ã, “¤Äèã-¹×d© „ÃK’à êšÇ-ªá¢X¾Û© N«ªÃ©åXj ‡©Ç¢šË N„ß¿¢ ©ä¹עœÄ ÍŒÖ殢Ÿ¿Õ-Â¹× E„äC¹ÊÕ ƒ©Ç ®ÏŸ¿l´¢ Íä®ÏÊ{Õx ®¾p†¾d-«Õ-«Û-Åî¢C. E„äC¹ÊÕ '¨¯Ãœ¿ÕÑ ®¾¢¤ÄC¢*¢C. ƒ¢Ÿ¿Õ©ðE «á‘Çu¢¬Ç©Õ ƒ©Ç …¯Ãoªá.











18, అక్టోబర్ 2013, శుక్రవారం

స్వరం మారుతున్నది....


సీమాంధ్ర కేంద్ర మంత్రులు..
రాష్ట్రవిభజన అంశం కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులకు పెనుగండంగా మారింది. నియోజకవర్గాలకు వెళితే రాజీనామాల గురించి నిలదీయడం సర్వసాధారణమైపోయింది. మీడియా కూడా ఎక్కడ కనపడినా రాజీనామా చేశారా అనో ఆమోదించుకున్నారా అని అడగడమూ అంతే సాధారణమైపోయింది. అయితే  కొందరు మంత్రులు స్వరం మారుస్తున్నారు. రాజీనామాల గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. జరగాల్సింది అంతా జరిగిపోయాక రాజీనామాలు ఎందుకంటున్నారు. తాజాగా కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. కేబినెట్ నోట్ ఆమోదంతో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. రాజీనామా చేయలేదని ఆమె వెల్లడించారు. అంతేకాదు నా రాజీనామాతో ఆగుతుందంటే తప్పకుండా ఆ పని చేస్తానని కూడా ఆమె అన్నారు. మరో సీమాంధ్ర కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఒకడుగు ముందుకు వేసి సీమాంధ్రకు ఏమేం ప్యాకేజీ కావాలో అడగడం మంచిదన్నారు. నిజానికి లక్ష్మి ఇదివరకే రాష్ట్ర విభజన విషయంలో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే తప్పేమిటని కూడా తనను అడ్డగించిన కార్యకర్తలతో ఆమె అన్నారు. వ్యక్తిగతంగా రాష్ట్ర సమైక్యతను కోరుకుంటానని అంటూనే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక కేబినెట్ నిర్ణయంతో బాధకు గురయ్యామని మాట్లాడిన మరో మంత్రి పురంధేశ్వరి కూడా ఇప్పుడు విభజన అడ్డుకునేందుకు ప్రయత్నించడం కన్నా మంచి ప్యాకేజీ డిమాండు చేయడం మంచిదని సూచించారు. ఈ ముగ్గురు మహిళామంత్రులు ఒకరకంగా మార్గనిర్దేశనం చేస్తున్నా అనిపిస్తోంది. ప్రధానిని కలిసి రాజీనామాలపై హడావుడి చేసిన ఇతర  మంత్రులు కూడా ప్రస్తుతం ఆ విషయం మీద ఏమీ మాట్లాడకపోవడం గమనించాల్సిన విషయం.

371 డీ..‘కొత్త’ చర్చ!


-సవరించకుండా విభజన జరుగదని కొందరు..
-యథాతథంగా ఉంచాలని మరికొందరు
-విభజనతో ఉనికిలోనే ఉండదని ఇంకొందరు
-ఆర్టికల్‌తో సంబంధం లేకుండానే విభజన!
-సీమాంధ్ర నేతల అనవసర రాద్ధాంతం?

(ప్రత్యేక ప్రతినిధి, టీ మీడియా):ఆర్టికల్ 371 ‘డీ’ సవరించకుండా విభజనపై ముందుకు వెళ్లడం కుదరదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు! ఈ ఆర్టికల్‌ను యథాతథంగా ఉంచేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎంను కోరామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అంటున్నారు! రాష్ట్ర విభజన జరిగితే 371 ‘డీ’ దానంతట అదే రద్దయిపోతుందని న్యాయ నిపుణులు

bookఅభిప్రాయపడుతున్నారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఈ ఆర్టికల్ కొనసాగించాలని పలువురు ఉద్యోగ జేఏసీ నేతలు చెబుతున్నారు! రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఏం జరుగుతుంది? 371 ‘డీ’తో రాష్ట్ర విభజనను ఆపవచ్చా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది అమలులో ఉంటుందా? ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు! ఏపీఎన్జీవో నాయకులు, పలువురు సీమాంధ్ర నేతలు పదే పదే ఈ ఆర్టికల్‌ను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజన వేగవంతమవుతున్న క్రమంలో అత్యంత ప్రధానమైన రాష్ట్రపతి ఉత్తర్వు 371‘డీ’ ఆర్టికల్ మళ్లీ తెరమీదకు వచ్చింది. స్థానికుల విద్య, ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేయాలా లేక సవరించాలా? అనే విషయంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. యూపీఏ ఆమోదించిన కేబినెట్ నోట్‌లో దీనిని పదవ అంశంగా చేర్చింది. ఒక వైపు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించకుండా రాష్ట్ర విభజనపై ముందుకు కదలలేరని సీమాంధ్ర నేతలు కొత్త వివాదాన్ని లేవదీయడానికి యత్నిస్తున్నారు.

కానీ ఆర్టికల్ 3 ప్రకారం సవరణ అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో 371‘డీ’ని మనుగడలో ఉంచాలా వద్దా? అన్న కోణంలో విస్తృత చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ అధికరణాన్ని తెలంగాణకు అన్యాయం జరుగకుండా తీసుకువచ్చారు. కానీ.. తదుపరికాలంలో ఇది ఉల్లంఘనకు గురై.. సీమాంధ్రులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున చేరిపోయారు. సుదీర్ఘపోరాటం ద్వారా సాధించుకున్న ఈ అధికరణాన్ని రద్దుచేసి రాష్ట్రాన్ని మొత్తం ఒకే జోన్‌గా పరిగణిస్తే ఉద్యోగాల సమస్య మళ్లీ మెదటికొస్తుందని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జేఎసి కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ ఆర్టికల్‌ను ఎత్తివేస్తే హైదరాబాద్‌లో స్థిరపడ్డ తెలంగాణేతరులు, ఇతర రాష్ట్రాలవారు ఉద్యోగాలను కొల్లగొట్టవచ్చని, తెలంగాణలో కూడా జిల్లాల వారీగా స్థానికులకు ఉద్యోగావకాశాలు దెబ్బతిని అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని కొందరు తెలంగాణ మేధావులు, విశ్లేషకులు వాదిస్తున్నారు.

అసలు ఆర్టికల్ 371‘డీ’ అంటే ఏమిటి?
వాస్తవానికి 1956లో హైదరాబాద్ స్టేట్ (ప్రస్తుత తెలంగాణ) ఆంధ్రపాంతం విలీనమై రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల సమస్య ప్రధానంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో స్థానికులకు విద్య, ఉద్యోగావకాశాలకు రాజ్యాంగపరంగా హక్కులు కల్పించారు. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముల్కీ నిబంధనలు అమలుకాక పోవడం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 22వేల మంది నకిలీ ముల్కీ (బోగస్ లోకల్) సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు కొట్టేశారు. దీంతో కడుపు మండిన తెలంగాణ ప్రాంత వాసులు ఉద్యమానికి నడుం బిగించారు.

ఆ క్రమంలోనే 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం వచ్చింది. ‘మా ఉద్యోగాలు మాకే’ అన్న నినాదం బలంగా పని చేసింది. ఉద్యమం ఫలితంగా ముల్కీ నిబంధనలను పటిష్టంగా అమలు పరచడానికి వీలుగా అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి 36జీవోను జారీచేశారు. ఈ పరిణామంతో కంగుతిన్న సీమాంధ్ర ప్రాంత వాసులు కొందరు జీవో 36ను, ముల్కీ నిబంధనలను రద్దుచేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును తెలంగాణవాదులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో భంగపడ్డ సీమాంధ్రకు చెందిన నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రనాయకుల లాబీయింగ్‌కు తలొగ్గి ముల్కీరూల్స్ స్థానంలో మధ్యేమార్గంగా ఆరుసూత్రాల పథకాన్ని అమలులోకి తెచ్చారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డీ ద్వారా స్థానిక రిజర్వేషన్లకు పెద్దపీట వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆరుజోన్‌లుగా విభజించి లోకల్, నాన్‌లోకల్ నిష్పత్తిని నిర్ధారించారు. ఆ ప్రకారంగా తెలంగాణ 5, 6 జోన్ల పరిధిలోకి వచ్చింది. జిల్లా పోస్టుల్లో 80శాతం లోకల్, 20శాతం నాన్‌లోకల్ లేదా ఓపెన్‌కోటా, నాన్‌గెజిటెడ్‌లో 70ః20, గెజిటెడ్ ఉద్యోగాల్లో 60ః40 నిష్పత్తులలో ఉద్యోగాలను కేటాయించారు. ప్రస్తుతం జిల్లా పోస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్ట్‌లను ఏపీపీఎస్సీ ద్వారా నియమకాలు చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రపతి ఉత్తర్వులలో కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడంతో తెలంగాణలో ఉద్యమాలు రగులుతూ వచ్చాయి. ఈ ఆర్టికల్ వల్ల తెలంగాణకు మరింత నష్టం జరిగింది. తెలంగాణ వారి ఉద్యోగాలు 5, 6 జోన్లకే పరిమితం కాగా సీమాంధ్రులకు మాత్రం హైదరాబాద్‌లో అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందే వీలు కలిగింది. 1975నుంచి రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు నిజమేనని గతంలో జైభారత్‌రెడ్డి కమిషన్ నిర్ధారించింది. ఉల్లంఘనల సవరణకు గిర్‌గ్లాని కమిషన్‌వేసి 610 ఉత్తర్వును 1985లో ప్రత్యేకంగా తెచ్చినా అవేవీ ఫలితాలివ్వలేదు. తెలంగాణ ఉద్యమం ఆగలేదు.

కలవరమెందుకు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో 371-డీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని కొంత మంది తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆ అధికరణం అవసరమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఆర్టికల్ రద్దయితే, తెలంగాణ అంతా ఒకే జోన్‌గా మారితే స్థానికులుగా స్థిరపడ్డ తెలంగాణేతరులు హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉద్యోగాలను కూడా ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందనే భయాలున్నాయి. దాంతో పాటు జోనల్ నిబంధనలు లేక పోతే ఆయా జిల్లాల్లో పోస్టులను ఇతర జిల్లాల వారు ఆక్రమించే ఆస్కారం ఉందనే అభిప్రాయం ఉంది.

ఫలితంగా కొత్త రకం సమస్యలు ముందుకు వస్తాయని, ఒక రకమైన అశాంతి నెలకొనే ప్రమాదముందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాల వారీగానే కాకుండా ఆర్టికల్‌ను రద్దు చేస్తే రాజ్యాంగ అధికరణ 15,16 ప్రకారం ఇతర రాష్ట్రాల వారు కూడా గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టుల్లో ఉద్యోగాలు పొందే ప్రమాదముందని అంటున్నారు. ముల్కీ నిబంధనల స్థానంలో వచ్చిన 371-డీ వల్ల కొంత వరకు అన్యాయం జరిగినప్పటికీ అదే ఆర్టికల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వరమవుతుందని టీ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టికల్ దానంతట అదే రద్దవుతుందన్న వాదనతో తెలంగాణ జేఏసీతోపాటు టీ ఉద్యోగసంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్ ఏకీభవించడంలేదు. పంజాబ్, హర్యానా, గుజరాత్, బొంబాయి విభజన తర్వాత కూడ ఆర్టికల్ కొన్ని సవరణలతో మనుగడలో ఉందని చెబుతున్నారు.

ఆర్టికల్ 4 ప్రకారం కొన్ని సవరణలతో 371-డీని అమలులో ఉంచితే తెలంగాణ, స్థానిక ఉద్యోగాలను ఎవరూ కొల్లగొట్టకుండా ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. 371 డీ ఆర్టికల్‌పై ఆశోక్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయాన్ని సృష్టించడానికేనని, అదొక వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనని దేవీప్రసాద్, విఠల్ అంటున్నారు. ఆర్టికల్‌ను సవరించకుండా రాష్ట్ర విభజన జరగదని ఒక సాకును చూపడానికి ఇంకా యత్నించడం, ముఖ్యమంత్రి కూడా ఆయనకు వంతపాడటం విడ్డూరమని వారు చెబుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన తెలంగాణ జేఏసీ.. 371-డీ విషయంలో సుదీర్ఘంగా చర్చిస్తోంది. స్థానిక రిజర్వేషన్లకు న్యాయం చేయడానికి ఆర్టికల్‌ను తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్వయించాలని జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్ అభిప్రాయపడ్డారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత అధికరణం సవరణ అని జేఏసీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ సూచిస్తున్నారు. మొత్తానికి 371-డి ఆర్టికల్ సవరణలతోనైనా కొనసాగించాలని జేఏసీ అభిప్రాయపడుతోంది. ఆర్టికల్‌ను రద్దుచేయవద్దని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను కోరనుంది.

లగడపాటికి బలమైన ప్రత్యామ్నాయంగా పురందేశ్వరి

సిఎం పదవా...ఎంపీ సీటా?

లగడపాటికి బలమైన ప్రత్యామ్నాయంగా పురందేశ్వరి...
కేంద్రమంత్రి పురందేశ్వరి సమైక్యానికి టాటా చెప్పి విభజనకు అనుకూలంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. కేబినెట్ నోట్‌కు నిరసన తెలిపి రాజీనామాలు ఆమోదించాలంటూ ప్రధానిని కలిసినవారిలో ఆమెకూడా ఉన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మొత్తం వ్యవహారంలో మోసానికి గురయ్యామన్న భావన ప్రజల్లో నెలకొందని అన్నారు. ఇప్పుడామె విభజన అనివార్యమన్న రీతిలో మాట్లాడుతున్నారు. విభజన ఆపగలమని అనవసరమైన భ్రమల్లో గడుపుతూ ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే... విజయవాడకు వెళ్లి స్థానిక పారిశ్రామికవేత్తలతో ప్రైవేటుగా సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరపడం మరో ఎత్తు. ఆమె రాజధాని అంశం చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. పుట్టింటి పరంగా ఆమెది కృష్ణా జిల్లా. మెట్టింటి పరంగా చూస్తే ప్రకాశం జిల్లా. సీమాంధ్ర రాజధాని కాగల అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఈ రెండే!విభజన ఆపేందుకు విఫల యత్నం చేయడం కన్నా విభజన అనంతరం సీమాంధ్రకు ఏమేం రాబట్టుకోవాలో అనేదాని మీద ఎక్కువ దృష్టిపెట్టాలనేది ఆమె వాదనగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ధైర్యంతో తీసుకున్న చొరవగానే భావించాలి. నిజానికి ఆమె ఒక్కరే ఈ వైఖరి తీసుకోలేదన్నది వాస్తవం. కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి కూడా దాదాపుగా ఇదే రీతిలో మాట్లాడుతున్నారు. పనబాక లక్ష్మి రాజీనామా చేయనని మొదటి నుంచి కుండబద్దలు కొట్టినట్టు చెపుతున్నారు.ఏదేమైనప్పటికీ పురందేశ్వరి స్థానికులతో సంప్రదింపులు జరిపి ఒకడుగు ముందుకు వేయడం వెనుక గల కారణాలేమిటి? విభజన అనంతరం సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆమె ఆశలు పెట్టుకున్నారా? తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమ చేసిన ఆరోపణ కూడా ఇదే. ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మరీ విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఉమ అంటున్నారు. తన ముఖ్యమంత్రి పదవి కోసమే సమైక్యాంధ్ర ఉద్యమంపై నీళ్లు చల్లుతున్నారంటున్నారు ఉమ. అయితే గియితే ఆమే సీమాంద్రకు తొలి ముఖ్యమంత్రి, అలాగే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్టీఆర్ తనయగా, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, అన్నిటికి మించి మహిళగా ఆమెకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మరో మాట కూడా వినపడుతోంది. ప్రస్తుతం పురందేశ్వరి విశాఖ లోక్‍సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడైన టి. సుబ్బిరామిరెడ్డి ‘విశాఖ నాదే’ అని దండోరా వేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉభయులకూ నడుమ మాటలయుద్ధం కూడా నడుస్తోంది. ఒకవేళ సుబ్బరామిరెడ్డి అధిష్టానాన్ని ఒప్పించి విశాఖ సీటు కొట్టేస్తే పురందేశ్వరి విజయవాడ ఎంచుకుంటారని అనుకుంటున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటికి మరోసారి పార్టీ సీటు దక్కదనీ, దక్కినా ఆయన గెలవలేడనీ వినిపిస్తున్న వాదనలు ఇందుకు ఒక కారణం కావచ్చు. లగడపాటికి పురందేశ్వరి బలమైన ప్రత్యామ్నాయంగా పార్టీకి కనిపించవచ్చు. కనుక ముందు చూపుతోనే విజయవాడలో ఆమె స్వామికార్యం స్వకారం అన్నట్టుగా హల్‍చల్ చేస్తున్నారా?

సీమాంధ్రకు సోకులు.. తెలంగాణకు షాకులు


-విద్యుత్ రంగంలో అడుగడుగునా వివక్షే..
-నేడు కేంద్ర జీఓఎంకు విద్యుత్ విభజన నివేదిక

హైదరాబాద్, అక్టోబర్ 17 (టీ మీడియా): తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో ప్రభుత్వ నివేదికలే కళ్లకు కడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో అన్ని ముడివనరులు ఉన్నా.. విద్యుత్ దక్కింది నామమాత్రమే. బోరుబావుల మీద పంటలు పండిచాల్సిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నా.. కనీస ప్రాధాన్యం దక్కలేదు.
electricityదీంతో విద్యుత్ రంగంలో నెలకొన్న వివక్షతో సీమాంధ్ర ప్రాంతం షోకులు చేసుకుంటే.. తెలంగాణకు మాత్రం పెను షాకులు తగిలాయి. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్‌రంగ పరిస్థితులు, తీరుతెన్నులను వివరిస్తూ అధికార యంత్రాంగం ప్రత్యేక నివేదికను రూపొందించింది. దీనిని శుక్రవారం మెయిల్ ద్వారానే ఢిల్లీకి పంపించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విద్యుత్‌పరంగా తీవ్ర వివక్షకు గురైందనే వాస్తవాలు ఈ రిపోర్టులో పొందుపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న పలుస్థాయిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి సీమాంధ్రకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారనే నగ్నసత్యం నివేదిక ద్వారా బట్టబయలుకానుంది.

తెలంగాణలో గ్యాస్ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితం కాగా, సీమాంధ్రలో మాత్రం 2,766 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు అయ్యాయి. థర్మల్, హైడల్ రంగాలతోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 1,426 మెగావాట్లు కాగా, వాటిల్లో తెలంగాణలో 237మెగావాట్లు ఉండగా, అంతకు మూడింతలుగా సీమాంధ్రలో 1,189 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్ర విభజనకు వీలుగా విద్యుత్‌రంగానికి సంబంధించి సమగ్ర నివేదికను ఇంధనశాఖ సిద్ధం చేసింది. దీని పరిధిలోకి వచ్చే తొమ్మిది కార్పొరేషన్లతోపాటు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ వంటి ప్రభుత్వ విభాగాల విభజన ప్రక్రియపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇంధన శాఖకు నవరత్నాలుగా ఉన్న తొమ్మిది విద్యుత్ కార్పొరేషన్ల అంతర్గత నివేదికలను సమీక్షించిన ఉన్నతాధికారులు వాటన్నింటిని క్రోడీకరించి ఒకే నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌రంగ సమగ్ర నివేదికను కేంద్ర విద్యుత్‌శాఖకు అందించే విధంగా సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది.
01


02


03

చైనాకు చోరీ ఫోన్లు


Sakshi | Updated: October 18, 2013 10:27 (IST)
హైదరాబాద్ :
=హైఎండ్ మోడల్సే అత్యధికంగా తరలింపు
=‘రిటర్న్ మాల్’ ముసుగులో గుట్టుగా రవాణా
=పక్కా వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారం
=రికవరీలు కష్టంగా మారిన వైనం
 

 సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు... చోరీ చేసిన ఫోన్లను
 యథాతథంగా వినియోగించడం/విక్రయించడం..
 ఆ తరవాత... ఐఎంఈఐ
 నెంబర్ల ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం..
 ఇప్పుడు.. అత్యంత ఖరీదైన చోరీ సెల్‌ఫోన్లను

గుట్టుగా పొరుగు దేశానికి తరలించడం..
నగరంలో తస్కరణకు గురవుతున్న సెల్‌ఫోన్లలో అత్యధిక భాగం చైనాకు తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫలితంగానే వీటిని రికవరీ చేయడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా 20 వేల వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. నగరంలో అనేక చోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి.

పర్సుల నుంచి సెల్‌ఫోన్ల వరకు..
పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి.

గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి..
ప్రతి సెల్‌ఫోన్‌కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. ఏ రెండు ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్స్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లను దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో నెంబర్ కేటాయించే వారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ ఫోన్లకు వేసే వారు. దీనివల్ల చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు.

ఇప్పుడు ఏకంగా సరిహద్దులు దాటిస్తూ..
ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్‌ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి పలు వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం సాధారణమై పోయింది. ఇలా వచ్చిన దాంట్లో కొంత వివిధ కారణాల నేపథ్యంలో తిరిగి పంపిస్తారు. వీటితో కలిపి చోరీ ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై-ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపిస్తున్నట్లు నిర్ధారిస్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన హై-ఎండ్ సెల్‌ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు చెబుతున్నారు. దీని వెనుకున్న సూత్రధారులపై పోలీసులు కన్నేశారు.

 జాగ్రత్తలే మేలు..

 సెల్‌ఫోన్లు కోల్పోయిన బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ఫలితంగా ఫోన్ పోతే.. దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
   
 ప్రతి సెల్‌ఫోన్‌కీ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మీ సెల్‌ఫోన్‌లో బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్‌ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకోవాలి. ఫోను పోతే దీన్ని బట్టి ఆచూకీ కనుక్కోవచ్చు.
   
 మీ సెల్‌ఫోన్‌కు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా.. వినియోగించుకోడం వారి, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు.
   
 ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా విలువైన డేటా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు
   
ఫోన్ నెంబర్లను సెల్‌లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తాన్ని కంప్యూటర్‌లో, సీడీల్లో భద్రపరుచు కోవడం/రాసి పెట్టుకోవడం మంచిది

కొమురం భీమ్ 73వ వర్ధంతి


Sakshi | Updated: October 18, 2013 04:26 (IST)
నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గిరిజన ముద్దుబిడ్డ. జల్.. జంగల్.. జమీన్ అంటూ ఆదివాసీలకు అండగా నిలిచిన బాంధవుడు. జాగీరు వ్యవస్థను పారద్రోలిన ధీరుడు. సొంత దళాన్ని ఏర్పాటు చేసి నైజాం సైన్యానికి ఎదురొడ్డిన పోరాట యోధుడు. జోడేఘాట్ గుట్టల్లో గాండ్రించిన సింహం. అక్షరం రాకున్నా.. అన్యాయాలను అడ్డుకోవడమే ధ్యేయంగా పోరాడిన ధీశా లి. స్వయానా ఆయుధాలు సమకూర్చుకుని గెరిల్లా దాడులతో దూసుకెళ్లిన సైన్యాధిపతి. చివరి వరకూ ఆదివాసీలకు భరోసానిచ్చిన ఆపద్బాంధవుడు. ఆయనే కొమురం భీమ్. కెరమెరి మండలం జోడేఘాట్ అడవుల్లో అశ్వయుజ శుద్ధ పౌర్ణమిన నిజాం సర్కార్ తుపాకీ తూటాలకు నేలకొరిగిన భీమ్ పోరాట స్ఫూర్తి అభివర్ణించలేనిది. నేడు ఆయన 73వ వర్ధంతి సందర్భంగా   ఆ వీరుడికి జిల్లా గిరి‘జనం’ సలామ్ కొడుతోంది. 
 - న్యూస్‌లైన్, ఆసిఫాబాద్
 
 ఆసిఫాబాద్/వాంకిడి, న్యూస్‌లైన్ : కొమురం భీమ్ వర్ధంతిని శుక్రవారం జోడేఘాట్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పనులను డీఎల్వీవో శ్రీనివాసరెడ్డి, ఐటీడీఏ డీఈ స్వామి, కెరమెరి ఎంపీడీవో శశికళ పర్యవేక్షించారు. దర్బార్ వద్ద శామియానాలు ఏర్పాటు చేశారు. హాజరయ్యే వారి సౌకర్యార్థం మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను సాయంత్రం పీవో జనార్దన్ నివాస్ పరిశీలించారు.
 
 ముస్తాబైన భీమ్ సమాధి, స్తూపం
 గిరిజనుల హక్కుల కోసం నైజాం సర్కార్‌తో పోరాడి అసువులు బాసిన జోడేఘాట్‌లోని కొమురం భీమ్ సమాధిని ముస్తాబు చేశారు. ఆయనతోపాటు పోరాడి అసువుల బాసిన సహచరులకు ఎట్టకేలకు 73 ఏళ్ల తర్వాత  గుర్తింపు లభించింది. వారి పేర్లతో స్తూపాన్ని నిర్మించారు. దీన్ని నేడు ప్రారంభించనున్నారు. దీంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 
 
 అడుగడుగునా పోలీసుల తనిఖీలు
 కొమురం భీమ్ వర్ధంతి వేడుకులకు జోడేఘాట్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్, ఆసిఫాబాద్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జోడేఘాట్, హట్టి, చాల్బడి అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రత్యేక బలగాలతో జోడేఘాట్ అడవుల్లో పోలీసు బలగాలను మోహరించారు. గురువారం కెరమెరి నుంచి జోడేఘాట్ రహదారి గుండా కల్వర్టుల వద్ద తనిఖీ చేశారు. హట్టి బేస్‌క్యాంపు వద్ద ఉట్నూర్ ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. 
 
 సంప్రదాయ పద్ధతిలో ఆవాల్‌పేన్ పూజలు
 కొమురం భీమ్ వర్ధంతికి ఒక రోజు ముందు గురువారం రాత్రి భీమ్ మనువడు సోనేరావు ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో అవాల్‌పేన్ (పోచమ్మ తల్లి) పూజలు నిర్వహించారు. డప్పుడోలు వాయిద్యాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 
 
 రాష్ర్ట పండుగలా వర్ధంతి
 భీమ్ 73వ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగ ఉత్సవాలుగా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న కలెక్టర్ అహ్మద్ బాబు జిల్లా అధికారులతో జోడేఘాట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సమాధి వద్ద సంప్రదాయబద్దంగా పూజలు, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు గిరిజన దర్బార్, సాంసృతిక కార్యక్రమాలు, అనంతరం భీమ్ జీవిత చరిత్ర చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
 
 నేడు సెలవు
 ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆదివాసీల ఆ రాధ్యదైవం కొమురం భీమ్ 73వ వ ర్ధంతిని పురస్కరించుకుని గిరిజన సం క్షేమ శాఖ అధీనంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినటుల ఐ టీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జైనూర్, సిర్పూర్ (యు), కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యా ణి మండలాల్లోని ఆశ్రమ, గిరిజన, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల లకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 
 
 గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏదీ..!
 జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాలు, 4 గ్రామ పంచాయతీల్లో ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ గ్రామాలన్నింటినీ ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చే స్తామన్న అప్పటి కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ నెరవేరలేదు. గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి విన్నవించాలో అర్థం కావడం లే దని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడి గ్రామ పంచాయతీలో టోకెన్‌మోవాడ్, సుర్దాపూర్ గ్రామ పంచాయతీలో కోపగూడ, కోటా రి గ్రామ పంచాయతీలో జోడేఘాట్, కల్లెగాం, ముర్కిలొంక, కెరమెరి గ్రామ పంచాయతీలో చిన్న పాట్నాపూర్, పెద్ద పాట్నాపూ ర్, బాబేఝరి, శివగూడ, లైన్ పటార్, పాటగూడ, చాల్బడి గ్రామా లు ఉండటంతో ఇవి అభివృద్ధికి నోచుకోవడం లేదు. జోడేఘాట్ గ్రా మస్తులు వారి గ్రామ పంచాయతీ అయిన కోటారికి వెళ్లాలంటే 40 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అలాగే అన్ని గ్రామాల పరిస్థితి ఇ లాగే ఉండటంతో గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 
 
 తరచూ మా ఇంటికొచ్చేవారు..
 గిరిజన వీరుడు కొమరం భీమ్ మాటలు ఉత్తేజపరిచేలా ఉండేవి. అప్పుడు నాకు సుమారు 12 ఏళ్ల వససుండేది. భీమ్ ఉద్యమ బాటలో తరచూ మా ఇంటికి వచ్చేవారు. నా భర్త రాముతో మాట్లాడే వారు. గిరిజనులపై జరిగే అన్యాయాలను ఎదిరించే వారు. మన భూమిపై మనకు హక్కులు కావాలని, 12 గ్రామాల గిరిజన ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్‌పై హక్కుల కోసం పోరాటం చేశారు. 
 - చాకటి రాజుబాయి, చిన్నపాట్నాపూర్, 
 కెరమెరి మండలం

నేను సంతకం చేయ..!

Sakshi | Updated: October 18, 2013 04:56 (IST)
నేను సంతకం చేయ..!
పోలవరం ఫైల్‌పై సంతకం పెట్టేందుకు మంత్రి సుదర్శన్‌రెడ్డి విముఖత... తెలంగాణవాదుల నుంచి విమర్శలు వస్తాయనే !
చేసేది లేక మరో ఫైలు రూపొందించిన అధికారులు దాన్ని నేరుగా సీఎం వద్దకు పంపిన వైనం
 

 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం అప్పుడే విడిపోయిందా? మంత్రుల తీరు చూస్తే.. ఈ అనుమానమే కలుగుతోంది. ఒక ప్రాంతానికి చెందిన మంత్రి మరో ప్రాంతానికి సంబంధించిన ఫైల్‌పై సంతకాలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తీరు ఇలాగే ఉంది. ఆయన వ్యవహార శైలి అధికారులను నివ్వెరపాటుకు గురి చేసింది. పోలవరంపై కీలక నిర్ణయం తీసుకునే ఫైల్‌పై నెలల తరబడి సంతకం చేయకుండా మంత్రి తొక్కి పెట్టారు. ఈ ఫైల్ సంతకం చేస్తే... తెలంగాణవాదుల నుంచి తనపై విమర్శలు వస్తాయని భావిస్తున్న మంత్రి ఆ ఫైల్‌ను తొక్కి పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఫైల్‌కు సమాంతరంగా మరో ఫైల్‌ను తయారు చేశారు. దాన్ని మంత్రికి పంపకుండా నేరుగా ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించారు.

 ఏమిటా ఫైలు..?: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. దీనిపై అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం మూడు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఇందులో పక్క రాష్ట్రాలు కొన్ని డిమాండ్లను మన రాష్ర్టం ముందుంచాయి. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పేర్కొన్నారు.

 ఈ పనులన్నింటిని మన రాష్ట్రమే చేయాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్రానికి ప్రత్యేక నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నివేదిక అందజేస్తేనే.. పోలవరానికి ఇచ్చే జాతీయ హోదాపై కేంద్రం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఇంతటి ముఖ్యమైన విషయం కావడంతో అధికారులు ప్రత్యేక ఫైల్‌ను రూపొందించి అనుమతి కోసం మంత్రి సుదర్శన్‌రెడ్డికి పంపించారు.
అయితే ఆయన ఫైల్‌పై సంతకం చేయకుండా పక్కన పెట్టారు. కేంద్రానికి నివేదిక పంపించే గడువు ముగుస్తున్నా... మంత్రి వద్ద ఫైల్ క్లియర్ కాకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫైల్ పెండింగ్ ఉందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఫైల్‌పై సంతకం పెట్టే ఉద్దేశం మంత్రికి లేదని ఆయన కార్యాలయంలోని సిబ్బంది వెల్లడించారు. దాంతో ఉన్నతాధికారులు మరో ఫైల్‌ను తయారు చేసి నేరుగా  సీఎం ఆమోదానికి పంపారు. సీఎం సంతకం అయిన తర్వాత కేంద్రానికి నివేదికను పంపించారు. పోలవరం నిర్మాణాన్ని తెలంగాణలోని కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... ఫైల్‌పై సంతకం చేస్తే తెలంగాణ  వాదుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మంత్రి సంతకం చేయలేదని తెలుస్తోంది.

తుది నిర్ణయం పార్లమెంటుదే

Published on October 9, 2013   ·   1 Comment
ఈ రాష్ట్రాన్ని విభజించాలా ? వద్దా  ? అనే అంశంపై పూర్తి అధికారం పార్లమెంట్‌, రాష్ట్రపతికే ఉంది. దానిని నిలుపుదల చేసే అధికారం మాకు లేదు. ap high courtఅందుకే ఈ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోలేమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 371 (డీ) రాష్ట్ర విభజనకు ఆటంకం కాదని తేల్చిచెప్పింది. కేంద్ర మంత్రి మండలి తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్త, జస్టిస్‌ కేసీ భానుతో కూడిన ధర్మాసనం విచారించి ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని కొట్టివేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 3 దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు రూపొందించారని, అధికరణ 371 (డీ) విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు, భద్రతకు సంబంధించిన అంశమని, ఈ రెండూ వేరు వేరని, ఆర్టికల్ 371(డి) ఉండగా విభజన వద్దని పిటీషనర్ వాదించడం సబబు కాదని కోర్టు స్పష్టం చేసింది. విభజనకు ఎందుకు వీలులేదు అనేందుకు పిటీషనర్ కూడా ఎలాంటి ఆధారాలు చూపలేదని కోర్టు తెలిపింది.   అధికరణ 3 రాజ్యాంగ మౌలిక సూత్రాలు, సమాఖ్య వాదానికి సంబంధించిన అంశమనీ, 371 (డీ) అధికరణ తదుపరి సవరించిన నిబంధన అనీ, దీన్ని సవాల్‌ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, మూల సూత్రాలను సవాల్‌ చేయలేమని ధర్మాసనం స్పష్టంచేసింది.
రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని సవరించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు లేవని పేర్కొంది. విభజన బిల్లును పార్లమెంట్‌లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే న్యాయస్థానం నిలుపుదల చేయలేదనీ, రాష్ట్ర విభజన, ఏర్పాటు అధికారం పార్లమెంట్‌కే ఉందని పలు కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాజ్యాంగ మూలసూత్రాల్లో ఆర్టికిల్‌ 14 సమానత్వాన్ని, ఆర్టికిల్‌ 16 ఉద్యోగాల్లో సమానత్వాన్ని చెబుతున్నాయని అలాంటి వాటిని కూడా సవాల్‌ చేస్తామనడం అర్థం లేనిదని న్యాయస్థానం  వ్యాఖ్యానించింది.

ఆర్టికల్ 371(డి)ని ఏం చేస్తారో చెప్పాలి


  • - పివివి సత్యనారాయణ ఎపి ఎన్జీవో సంఘం, హైదరాబాద్ అధ్యక్షుడు
  • 17/10/2013
విభజన జరిగితే ఇప్పటివరకూ ఉన్న ఆర్టికల్ 371(డి)ని ఏం చేస్తారో? ఎలా అమలు చేస్తారో మంత్రుల బృందం (జివోఎం) చెప్పాలి. ఉద్యోగుల సర్వీసు విధానాలు, సీనియారిటీ, ఉద్యోగ భద్రత ఇలాంటి అనేక అంశాలను ఏం చేస్తారో జివోఎం ఖచ్చితంగా ఉద్యోగులకు సమాధానం ఇవ్వాలి. ఆర్టికల్ 317 (డి) రద్దు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసాధ్యం. ఎంతో మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టికల్ 371(డి)ని రద్దు చేస్తే మరి వారి పరిస్థితి ఏమిటి? కొందరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులై వారి ఎంతోకాలంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారి పిల్లలు ఇక్కడే పుట్టి పెరగడంతో వారు ఇక్కడ లోకల్ అవుతారు. విభజన జరిగి భార్యాభర్తలు సీమాంధ్రకు వెళ్లాల్సి వస్తే వారి పిల్లల భవిష్యత్ ఏమైపోవాలి? వీటితోపాటుగా మరో ముఖ్యమైన విషయం హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత. విభజన జరగక ముందే కొందరు విభజనవాదులు హైదరాబాద్‌లోని సీమాంధ్రులను భయబ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. అలాగే విభజన జరిగితే సీమాంధ్రకు సాగు నీరు అందక పచ్చని పొలాలు బీళ్లుగా మారి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు లేకపోలేదు. ఇలాంటి ముఖ్యమైన విషయాలపై ఎంతమాత్రం స్పష్టత ఇవ్వకుండా సీమాంధ్ర ప్రజల, ఉద్యోగుల భవిష్యత్‌ను పరిగణలోనికి తీసుకోకుండా విభజించాలని చూడడం దారుణం. ఈ అన్ని అంశాలను కేంద్రం ఏర్పాటు చేసిన జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. విభజన జరిగితే వచ్చే అనేక సమస్యలను జివోఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంత వరకూ పోరాడుతాం. అలాగే విభజనపై సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను కూడా జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. విభజనతో సుమారు 50 వేల మంది ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. విభజనతో జోన్ల విధానం రద్దయ ఉద్యోగుల ప్రమోషన్లపై కొత్త సమస్యలు వస్తాయి. వారి పరిస్థితి ఏమవ్వాలి? ఇంతకు ముందు విభజన జరిగిన మూడు రాష్ట్రాల్లో ఇప్పటికి ఉద్యోగులు సీనియారిటీ, ప్రమోషన్లు, పెన్షన్ల వంటి అంశాలపై కోర్టుకెక్కారు. రాష్ట్ర విభజన జరిగితే రేపు రేపు సీమాంధ్ర ఉద్యోగులు కూడా అలా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన సీమాంధ్ర ఉద్యోగికి పెన్షన్ ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది? పదవీ విరమణ పొందాక ప్రభుత్వ చెల్లించే మొత్తం ఏ రాష్ట్రం చెల్లిస్తుంది? విరమణ ఉద్యోగి ఆదాయం లేని కొత్త రాష్ట్రానికి వెళ్తే అతడికి రావాల్సిన భత్యాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాలని జివోఎంను కలిసి నివేదిక అందిస్తాం. ఉద్యోగుల సమస్యలతోపాటు సాగు నీటి పంపకాలు, విద్యుత్ ఉత్పత్తికి కేటాయించాల్సిన నీటిపై కూడా జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇవేగాక రాష్ట్ర విభజన జరిగితే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్‌కు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భవిష్యత్, హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఉద్యోగ అవకాశాలు, భద్రత ఇలా అనేక సమస్యలను జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి అనేక సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే. విభజన అనివార్యమైతే మాత్రం ఉద్యోగుల, సీమాంధ్రుల ఆందోళనలను, అపోహలపై క్షుణ్ణంగా చర్చించి స్పష్టమైన హామీ ఇచ్చాకే ముందుకు వెళ్లాలని జివోఎంకు స్పష్టం చేస్తాం. సీమాంధ్ర ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వడంతోపాటు, ఈ పదేళ్లలో సీమాంధ్రలో కొత్త రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి 2023 తర్వాతే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని జివోఎం దృష్టికి తీసుకెళ్తాం.

17, అక్టోబర్ 2013, గురువారం

371డి అధికరణ ఏమిటి: విభజనకు మెలికనా?


 
హైదరాబాద్‌ : నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ రాష్ట్ర విభజనకు గుదిబండగా మారుతుందనే చర్చ సాగుతోంది. నిజంగానే అది గుదిబండగా మూరుతుంది. అది విభజన ప్రక్రియలో మెలిక అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ అధికరణపై ఓ న్యాయవాది కోర్టుకు వెళ్లాడు.
రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేకవాదం ఉవ్వెత్తున సాగిన నేపథ్యంలో మధ్యే మార్గంగా కేంద్రం ఆంధ్రా, రాయలసీమ, తెలం గాణ ప్రాంతాల మధ్య సమతుల్యత వుండాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధి, ఇత్యాది రంగాలకు 371డి ఆర్టికల్‌ ద్వారా 1973లో మార్గ దర్శకాలను రూపొందించింది. పబ్లిక్‌ సర్వీసెస్‌లలో మూడు ప్రాంతాలలో సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని ఈ అధికరణ తెలియజేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలో ఉద్యమం ఎగిసినపడిన ఫలితం అది ముందుకు వచ్చింది.
371డి అధికరణ ఏమిటి: విభజనకు మెలికనా?
అప్పటి పరిణామాలలో భాగంగానే ఆర్టికల్‌ 371 డి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ సీట్లను ఓపెన్‌ కేటగరీలో 54 శాతం వుండాలని నిర్దేశించడం జరిగింది. అదే విధంగా ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి.లకు సంబంధించి 46 శాతం వుండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా 1974 నాటి ప్రెసెడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం స్థానిక అభ్యర్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ కేటగరీలో 15 శాతం అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది.
దాని ఫలితంగా రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో ఆరు జోన్లు ఏర్పడ్డాయి. ఈ ఆర్టికల్‌ను ఆయుధంగా చేసుకుని రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఏపిఎన్జీవో నేతలు భావిస్తున్నారు. దాన్ని రద్దు చేస్తే గానీ రాష్ట్ర విభజన సాధ్యం కాదు. దాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని, అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెబుతూ వస్తున్నారు.
అయితే, ఉద్యోగాల్లో సమానావకాశాల కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 371డి అధికరణ చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన చేసే సమయంలో రాష్ట్రపతి ఆ ఉత్తర్వును ఉపసంహరించుకుంటే సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఓ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 371(డి) విభజనకు అడ్డంకా?


Sakshi | Updated: October 18, 2013 01:57 (IST)
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) రాష్ట్ర విభజనకు అడ్డంకని ‘సమైక్య’ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఆర్టికల్ 371(డి)ని సవరిస్తేనేగానీ రాష్ట్ర విభజనకు వీలు కాదన్నది నిపుణుల అభిప్రాయం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు.. తెలంగాణ హక్కుల పరిరక్షణకు ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి వాటికి రాజ్యాంగ రక్షణ లేకపోవడంతో..  విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో 371(డి) అధికరణను చేర్చారు. రాజ్యాంగంలోని 371 (డి) అధికరణను అనుసరించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు జోన్లు ఉన్నాయి. ఈ అధికరణ కింద 85 శాతం ఉద్యోగాలను ఆయా జోన్లలోని స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది.

371(డి)లోని  1, 3, 9 సెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంది. రాష్ట్రాన్ని విభజించడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 3 లేదా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఆర్టికల్ 2, 4 ప్రకారం.. ఆర్టికల్ 371(డి)ని సవరించడం వీలు కాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కొందరు మాత్రం ఇది సాధ్యమేనంటున్నారు. 371(డి)లో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా, రాష్ట్ర విభజన సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

11, అక్టోబర్ 2013, శుక్రవారం

తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదు


-తెలంగాణపై నిర్ణయంలో హడావుడి లేదు
-డిసెంబర్ 9 ప్రకటనతోనే ప్రక్రియ మొదలు
-ఢిల్లీలో హోం మంత్రి షిండే వ్యాఖ్యలు
-రాష్ట్రపతి పాలన విధింపునకు సంకేతాలు!
-పార్లమెంటులో బిల్లుపై కొరవడిన నిర్దిష్ట హామీ
-నేడు మంత్రుల బృందం తొలి భేటీ
-సాధ్యమైనంత త్వరలో జీవోఎం నివేదిక
-నిర్ణయంపై పునరాలోచన లేదు
-జీవోఎంలో రాష్ట్ర మంత్రులు లేకున్నా
-ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తాం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. సీమాంధ్రలో ఆందోళనలు అదుపులోకి రాని పక్షంలో ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదని కూడా సంకేతాలిచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

antoni‘తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు అవకాశాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు’ అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు. గురువారం తన శాఖ విషయాలపై ఏర్పాటు చేసిన నెలవారీ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు తెలంగాణ విషయంలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నా.. తెలంగాణ నిర్ణయాన్ని అమలు చేయడానికే కట్టుబడి ఉన్నామని షిండే సహా వివిధ నేతలు చెప్పడాన్ని చూస్తే రాష్ట్రపతిపాలన విధింపు దిశగా ఆలోచనలు సాగుతున్నాయన్న వాదనలకు బలం చేకూరుతున్నది. రాష్ట్ర విభజన విషయంలో శుక్రవారం తొలి భేటీ జరుపనున్న మంత్రుల బృందం.. అందరు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలూ వింటుందని, వాటిని కేబినెట్‌కు అందజేస్తుందని షిండే చెప్పారు.

దానిని రాష్ట్రపతికి పంపించి, అక్కడి నుంచి తిరిగి కేబినెట్‌కు వచ్చాక పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. నవంబర్ చివరిలో మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అంశంపై ఆయన నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. ‘చూద్దాం’ అని మాత్రం సమాధానమిచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో నెలకొల్పిన మంత్రుల బృందం తన నివేదికను సాధ్యమైనంత త్వరలో అందిస్తుందని, అందుకే దానికి ఎలాంటి కాలపరిమితి విధించలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని తెలిపారు. అయితే.. జీవోఎం సిఫారసులు అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించే ఆలోచన కేంద్రం చేస్తున్నదా? అని ప్రశ్నించగా.. అందుకు అవకాశాలను ఆయన కొట్టిపారేయలేదు. ‘ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేను’ అని బదులిచ్చారు. మంత్రుల బృందంలో రాష్ట్రానికి చెందిన ఒక్క మంత్రిని కూడా సభ్యుడిగా నియమించకపోవడాన్ని ప్రస్తావించగా.. అది పెద్ద విషయం కాదని షిండే వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రుల బృందంలో ప్రాతినిధ్యం లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి కూడా షిండే ఈ సందర్భంగా వివరించారు. మంత్రుల బృందం విధి విధానాలను రూపొందించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తూ వరుస చర్యలు చేపట్టడం జరుగుతుందని షిండే చెప్పారు. తొలుత జీవోఎం తన నివేదికను కేబినెట్‌కు సమర్పించాల్సి ఉంటుందని, అనంతరం దానిని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పారు. అక్కడిన ఉంచి తిరిగి వచ్చాక పార్లమెంటులో ప్రవేశపెడతామని అన్నా రు. రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదించనిపక్షంలో కొత్త రాష్ట్రం పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ‘గతంలో కూడా ఇటువంటి తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ పక్కనపెట్టింది.

రాజ్యాం గ ప్రకారం అది (అసెంబ్లీ తీర్మానం) తప్పని సరి కాదు’ అని అన్నారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని విషయంలో ప్రశ్నించగా.. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేసి, గుంటూరులో హైకోర్టు నెలకొల్పాలని కొందరు సూచిస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఆ ప్రాంతంవారేనని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తొందరపాటు తగదని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న వాదనలను ఆయన తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 2009లో నాటి హోం మంత్రి పీ చిదంబరం చేసిన ప్రకటనతోనే మొదలైందని చెప్పారు. అయితే అనంతరం తలెత్తిన నిరసనల వల్ల ప్రభుత్వం తదుపరి సంప్రదింపుల కోసం శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. తాను కూడా 2012లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా సాగిన ఈ ప్రక్రియకు కొనసాగింపుగానే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని షిండే చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా జీవోఎం పరిశీలిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం, రాజకీయ పార్టీలతో మాట్లాడటం వంటి అంశాలు జీవోఎం తొలి రెండు సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉంటాయని వెల్లడించారు. ఇంతకు మించి ఈ విషయంలో ఇప్పుడే మాట్లాడటం సరికాదని అన్నారు.

సీమాంవూధకు అదనపు బలగాలు
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సహకరించేందుకు 7500 మంది కేంద్ర పారా మిలిటరీ బలగాలను పంపించినట్లు షిండే చెప్పారు. ‘తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి, 45 కంపెనీల అదనపు బలగాలను పంపించాం. వాటితోపాటు మరో 30 కంపెనీలను ఈ వారం రోజుల్లో పంపించాం’ అని చెప్పారు.

ఢిల్లీలో బాబు దీక్ష అసాధారణం
చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్షకు దిగడం అసాధారణ చర్యగా షిండే అభివర్ణించారు. ‘యే అజీబ్ తరహ్ కా ఆందోళన్ హై (ఇది అసాధారణమైన ఆందోళన). ఒక రాష్ట్ర అతిథి గృహం ఆవరణను ఒకరు ఇలా నిరాహారదీక్షకు వేదికగా ఉపయోగించుకోవడాన్ని మొదటిసారిగా చూస్తున్నాను’ అన్నారు. ఏపీభవన్ ఆవరణలో చంద్రబాబు దీక్ష విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నకు నిరాహారదీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు మధ్య వివాదంలో తాము జోక్యం చేసుకునే ఉద్దేశం లేదన్నారు. దురాక్రమణ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని సలహా ఇచ్చారు. ‘ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉంటే అప్పుడు మేం ఏమైనా సహాయం చేయగలం’ అన్నారు. ఆందోళనను విరమించి ఏపీకి తిరిగి వెళ్లాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని టీడీపీ స్పష్టంగా కేంద్రాన్ని కోరిందని, వారి అభిప్రాయానికి విలువ ఇచ్చామని షిండే చెప్పారు.

9, అక్టోబర్ 2013, బుధవారం

కిరణ్ సీమాంధ్ర సీఎం


-ఆయనది వ్యక్తిగత అజెండా
-ఏపీఎన్జీవో సభకు అనుమతి కోసం ఒత్తిడి చేశారు
-లాయర్ల సభకూ అనుమతివ్వాలన్నారు
-తెలంగాణ వస్తే నక్సల్స్ పెరుగుతారని చెప్పాలన్నారు
-పోలీసు అధికారుల విషయంలో ఆయన మాట వినలేదు
-అందుకే నా పదవీకాలం పొడిగించలేదు
-చివరి నిమిషం వరకు రిట్మైంట్ గురించి చెప్పలేదు
-న్యాయపోరాటం చేసే వీలు లేకుండా చేశారు
-మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి సంచలన ఆరోపణలు


హైదరాబాద్, అక్టోబర్ 8 (టీ మీడియా) :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పచ్చి సమైక్యవాది అని రిటైర్డ్ డీజీపీ దినేష్‌డ్డి కుండబద్దలు కొట్టారు. జూలై 30న తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారని దినేష్‌రెడ్డి విమర్శించారు. dineshఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తూ వచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆడమన్నట్టు ఆడలేదు కాబట్టే తనను పదవి నుంచి తొలగించారని వాపోయారు. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని మాజీ డీజీపీ అన్నారు. పోస్టులో ఉండి ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే పదవీ విరమణ తర్వాత మాట్లాడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో రిటైర్డ్ డీజీపీ దినేష్‌రెడ్డి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన పదవీకాలాన్ని పొడిగిస్తామని చివరి నిమిషం వరకు ఆశ పెట్టారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెప్పారు. బంధుమిత్రులు, రాజకీయ స్నేహితులు కూడా పదవీకాలం పొడిగిస్తారనే చెబుతూ వచ్చారన్నారు. పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్టు ముందుగానే చెబితే ఇతర ఐపీఎస్ అధికారులుపోటీలోకి రావచ్చంటూ తనను మభ్యపెట్టారని తెలిపారు. ‘ఆ సమయంలోనే ఎనిమిదిమంది ఐపీఎస్‌ల రిట్మైంట్‌కు జీవో వచ్చింది. దాంట్లో నా పేరు లేకపోవటంతో పదవీకాలాన్ని పొడిగిస్తారనే నమ్మాను.

ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును నా ఉదంతంలో అమలు చేస్తారనుకున్నా. అయితే, నా పదవీ విరమణకు రెండు రోజుల ముందు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తరువాత జీవో ఇచ్చింది’ కనీసం నెల ముందు అసలు విషయాన్ని చెప్పి ఉంటే న్యాయపోరాటం చేసేవాడిని. ఆ వీలు లేకుండా చేశారు’ అని చెప్పారు. ఇదంతా కుట్రలో భాగమని వ్యాఖ్యానిస్తూ దీనికి కారణాలు లేకపోలేదన్నారు.

సీమాంధ్రకు బలగాలు.. సీఎంకు నచ్చలేదు:
తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ జూలై 30న స్పష్టమైన ప్రకటన చేయటంతో సీమాంధ్రలో పరిస్థితులు దిగజారుతాయని భావించి 40 కంపెనీల పారా మిలిటరీ బలగాలను రప్పించినట్టు దినేష్‌డ్డి చెప్పారు. తోటి ఐపీఎస్‌లతో మాట్లాడి శాంతిభద్రతల పరిరక్షణకే ఈ పని చేశానన్నారు. అయితే, ఇది సీఎంకు నచ్చలేదని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవాడానికి నువ్వెవరంటూ తనపై కారాలు మిరియాలు నూరారని వెల్లడించారు. రాజకీయ నాయకులకు తెలుస్తుందా? బ్యూరోక్రట్లకు తెలుస్తుందా? శాంతిభవూదతల సమస్యలు తలెత్తగలవని నువ్వెలా ఊహిస్తావు?.. అంటూ మాట్లాడారని దినేష్‌రెడ్డి వివరించారు.

నక్సల్స్ పెరుగుతారని చెప్పమన్నారు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పెరుగుతారా? అంటూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించినపుడు అదంతా ఊహాజనితమేనని తాను స్పష్టం చేసిన విషయాన్ని దినేష్‌గుర్తు చేశారు. అప్పటికే సీఎం తెలంగాణ ఇస్తే మావోయిస్టుల సమస్య తీవ్రతరమవుతుందని చెప్పారన్నారు. ‘నేను వాస్తవాలు మాట్లాడటంతో నన్ను పిలిపించుకుని.. తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు పెరిగిపోతారని చెప్పాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి నేను అంగీకరించలేదు’ అని వివరించారు. ‘సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత అనంతపురంలో కొంతమంది ఆందోళనకారులు జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు.

ఇలా విధ్వంసానికి పాల్పడినవారిపై అనంతపురం ఎస్‌పీ శ్యాంసుందర్ కఠినంగా వ్యవహరించారు. దానితో ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా సీఎం నాపై ఒత్తిడి తెచ్చారు. దీనికి నేను ఒప్పుకోలేదు. నిజామాబాద్ డీఐజీని బదిలీ చేయాలని కూడా చెప్పారు. ఈ ఇద్దరే కాదు ఐపీఎస్‌లు, డీఎస్పీల బదిలీల కోసం ఇలాగే ఒత్తిడి తీసుకువచ్చారు’ అని మాజీ డీజీపీ చెప్పారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టు కాదా? అని ప్రశ్నించారు. తనపై సీబీఐ కేసు నమోదైందన్న ఒకే ఒక్క కారణంతో రిటైర్‌మెంట్ ఇచ్చారని, అదే సమయంలో కొన్ని కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో మంత్రుల పేర్లు ఉన్నాయని, ఓ హత్య కేసులో రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి (సొవూహాబుద్దీన్ ఎన్‌కౌంటర్) పేరును కూడా సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొందని చెబుతూ.. వీరిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తనపై నమోదైన కేసులో ఆధారాలు లేవని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేశారు:
సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వాలంటూ కిరణ్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర లాయర్ల సభకు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం తనతో చెప్పారన్నారు. ఆ ప్రాంతం ఐటీ జోన్ కావటంతో అనుమతి నిరాకరించినట్టు తెలిపారు. భూకబ్జాలకు ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్‌రెడ్డి బ్యాక్ ఆఫీస్‌లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆయన భూ కబ్జాలకు తాను సహకరించలేదని వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా కేసులతో ఆయనకు సంబంధం ఉందని చెప్పారు. అవసరమైన పక్షంలో తాను సీఎంపై న్యాయపోరాటం చేస్తానని, కోర్టులకు వెళ్లటానికి వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకునే తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు.

బాప్‌కా జాగీర్ కాదు:
సీఎంపై మీరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మీపై కేసులు పెడితే? అని మీడియా అడిగిన ప్రశ్నకు దినేష్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అధికారం బాప్‌కా జాగీర్ కాదు’ అన్నారు. ‘నాకుండాల్సింది నాకుంది. నేను చేయాల్సింది చేస్తా’ అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలనే చెబుతున్నానన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన వ్యక్తిగత ఎజెండాతో పని చేస్తున్నారని అంటూ ఇటువంటి పరిస్థితుల్లో తామెంత భద్రంగా ఉన్నామో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని వ్యాఖ్యానించారు. రిటైరైన తరువాత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు పోస్టులో ఉన్నపుడు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పదవీకాలాన్ని పొడిగించి ఉంటే ఈ ఆరోపణలు చేసి ఉండేవారు కాదుకదా? అని ప్రశ్నించగా.. పదవీకాలాన్ని పొడిగించినా ఇలాగే మాట్లాడేవాడినని బదులిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం వెనక ఉండి మీతో ఇలా చెప్పిస్తోందా? అన్న ప్రశ్నకు తనకు జరిగిన అన్యాయం, వెన్నుపోటుపై మాత్రమే స్పందిస్తున్నానన్నారు.

తాను డీజీపీగా ఉన్నన్నాళ్లు మీడియాతో సత్సంబంధాలు కొనసాగించినట్టు చెప్పారు. తన రిట్మైంట్ నోటిఫికేషన్‌కు నెల ముందు ఓ చానల్, ఓ ఆంగ్ల దినపత్రిక రెసిడెన్షియల్ ఎడిటర్ తనపై అవాస్తవాలతో కథనాలు ప్రసారం చేసినందుకే కేసులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత కొంతమంది మీడియా మిత్రులు తనను కలిసిస్తే.. తాను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టనని చెప్పానని, అందుకే ఆ కేసుల్లో నిందితులకు బెయిల్ వచ్చేలా చేశానని వివరించారు. ఆ తరువాత మరిన్ని అరెస్టులు జగరకుండా చూశానని, కేసులు ముందుకెళ్లకుండా చర్యలు తీసుకున్నానని తెలిపారు. ఆ కేసులు దాదాపు విత్‌డ్రా అయినట్టే అని చెబుతూ ఇద్రూస్ బాబా పెట్టిన కేసు మాత్రం నడుస్తుందన్నారు.