-ఆయనది వ్యక్తిగత అజెండా
-ఏపీఎన్జీవో సభకు అనుమతి కోసం ఒత్తిడి చేశారు
-లాయర్ల సభకూ అనుమతివ్వాలన్నారు
-తెలంగాణ వస్తే నక్సల్స్ పెరుగుతారని చెప్పాలన్నారు
-పోలీసు అధికారుల విషయంలో ఆయన మాట వినలేదు
-అందుకే నా పదవీకాలం పొడిగించలేదు
-చివరి నిమిషం వరకు రిట్మైంట్ గురించి చెప్పలేదు
-న్యాయపోరాటం చేసే వీలు లేకుండా చేశారు
-మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్, అక్టోబర్ 8 (టీ మీడియా) :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పచ్చి సమైక్యవాది అని రిటైర్డ్ డీజీపీ దినేష్‌డ్డి కుండబద్దలు కొట్టారు. జూలై 30న తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారని దినేష్‌రెడ్డి విమర్శించారు. ఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తూ వచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆడమన్నట్టు ఆడలేదు కాబట్టే తనను పదవి నుంచి తొలగించారని వాపోయారు. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని మాజీ డీజీపీ అన్నారు. పోస్టులో ఉండి ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే పదవీ విరమణ తర్వాత మాట్లాడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో రిటైర్డ్ డీజీపీ దినేష్‌రెడ్డి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన పదవీకాలాన్ని పొడిగిస్తామని చివరి నిమిషం వరకు ఆశ పెట్టారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెప్పారు. బంధుమిత్రులు, రాజకీయ స్నేహితులు కూడా పదవీకాలం పొడిగిస్తారనే చెబుతూ వచ్చారన్నారు. పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్టు ముందుగానే చెబితే ఇతర ఐపీఎస్ అధికారులుపోటీలోకి రావచ్చంటూ తనను మభ్యపెట్టారని తెలిపారు. ‘ఆ సమయంలోనే ఎనిమిదిమంది ఐపీఎస్‌ల రిట్మైంట్‌కు జీవో వచ్చింది. దాంట్లో నా పేరు లేకపోవటంతో పదవీకాలాన్ని పొడిగిస్తారనే నమ్మాను.
ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును నా ఉదంతంలో అమలు చేస్తారనుకున్నా. అయితే, నా పదవీ విరమణకు రెండు రోజుల ముందు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తరువాత జీవో ఇచ్చింది’ కనీసం నెల ముందు అసలు విషయాన్ని చెప్పి ఉంటే న్యాయపోరాటం చేసేవాడిని. ఆ వీలు లేకుండా చేశారు’ అని చెప్పారు. ఇదంతా కుట్రలో భాగమని వ్యాఖ్యానిస్తూ దీనికి కారణాలు లేకపోలేదన్నారు.
సీమాంధ్రకు బలగాలు.. సీఎంకు నచ్చలేదు:
తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ జూలై 30న స్పష్టమైన ప్రకటన చేయటంతో సీమాంధ్రలో పరిస్థితులు దిగజారుతాయని భావించి 40 కంపెనీల పారా మిలిటరీ బలగాలను రప్పించినట్టు దినేష్‌డ్డి చెప్పారు. తోటి ఐపీఎస్‌లతో మాట్లాడి శాంతిభద్రతల పరిరక్షణకే ఈ పని చేశానన్నారు. అయితే, ఇది సీఎంకు నచ్చలేదని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవాడానికి నువ్వెవరంటూ తనపై కారాలు మిరియాలు నూరారని వెల్లడించారు. రాజకీయ నాయకులకు తెలుస్తుందా? బ్యూరోక్రట్లకు తెలుస్తుందా? శాంతిభవూదతల సమస్యలు తలెత్తగలవని నువ్వెలా ఊహిస్తావు?.. అంటూ మాట్లాడారని దినేష్‌రెడ్డి వివరించారు.
నక్సల్స్ పెరుగుతారని చెప్పమన్నారు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పెరుగుతారా? అంటూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించినపుడు అదంతా ఊహాజనితమేనని తాను స్పష్టం చేసిన విషయాన్ని దినేష్‌గుర్తు చేశారు. అప్పటికే సీఎం తెలంగాణ ఇస్తే మావోయిస్టుల సమస్య తీవ్రతరమవుతుందని చెప్పారన్నారు. ‘నేను వాస్తవాలు మాట్లాడటంతో నన్ను పిలిపించుకుని.. తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు పెరిగిపోతారని చెప్పాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి నేను అంగీకరించలేదు’ అని వివరించారు. ‘సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత అనంతపురంలో కొంతమంది ఆందోళనకారులు జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఇలా విధ్వంసానికి పాల్పడినవారిపై అనంతపురం ఎస్‌పీ శ్యాంసుందర్ కఠినంగా వ్యవహరించారు. దానితో ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా సీఎం నాపై ఒత్తిడి తెచ్చారు. దీనికి నేను ఒప్పుకోలేదు. నిజామాబాద్ డీఐజీని బదిలీ చేయాలని కూడా చెప్పారు. ఈ ఇద్దరే కాదు ఐపీఎస్‌లు, డీఎస్పీల బదిలీల కోసం ఇలాగే ఒత్తిడి తీసుకువచ్చారు’ అని మాజీ డీజీపీ చెప్పారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టు కాదా? అని ప్రశ్నించారు. తనపై సీబీఐ కేసు నమోదైందన్న ఒకే ఒక్క కారణంతో రిటైర్‌మెంట్ ఇచ్చారని, అదే సమయంలో కొన్ని కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో మంత్రుల పేర్లు ఉన్నాయని, ఓ హత్య కేసులో రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి (సొవూహాబుద్దీన్ ఎన్‌కౌంటర్) పేరును కూడా సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొందని చెబుతూ.. వీరిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తనపై నమోదైన కేసులో ఆధారాలు లేవని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేశారు:
సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వాలంటూ కిరణ్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర లాయర్ల సభకు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం తనతో చెప్పారన్నారు. ఆ ప్రాంతం ఐటీ జోన్ కావటంతో అనుమతి నిరాకరించినట్టు తెలిపారు. భూకబ్జాలకు ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్‌రెడ్డి బ్యాక్ ఆఫీస్‌లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆయన భూ కబ్జాలకు తాను సహకరించలేదని వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా కేసులతో ఆయనకు సంబంధం ఉందని చెప్పారు. అవసరమైన పక్షంలో తాను సీఎంపై న్యాయపోరాటం చేస్తానని, కోర్టులకు వెళ్లటానికి వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకునే తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు.
బాప్‌కా జాగీర్ కాదు:
సీఎంపై మీరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మీపై కేసులు పెడితే? అని మీడియా అడిగిన ప్రశ్నకు దినేష్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అధికారం బాప్‌కా జాగీర్ కాదు’ అన్నారు. ‘నాకుండాల్సింది నాకుంది. నేను చేయాల్సింది చేస్తా’ అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలనే చెబుతున్నానన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన వ్యక్తిగత ఎజెండాతో పని చేస్తున్నారని అంటూ ఇటువంటి పరిస్థితుల్లో తామెంత భద్రంగా ఉన్నామో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని వ్యాఖ్యానించారు. రిటైరైన తరువాత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు పోస్టులో ఉన్నపుడు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పదవీకాలాన్ని పొడిగించి ఉంటే ఈ ఆరోపణలు చేసి ఉండేవారు కాదుకదా? అని ప్రశ్నించగా.. పదవీకాలాన్ని పొడిగించినా ఇలాగే మాట్లాడేవాడినని బదులిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం వెనక ఉండి మీతో ఇలా చెప్పిస్తోందా? అన్న ప్రశ్నకు తనకు జరిగిన అన్యాయం, వెన్నుపోటుపై మాత్రమే స్పందిస్తున్నానన్నారు.
తాను డీజీపీగా ఉన్నన్నాళ్లు మీడియాతో సత్సంబంధాలు కొనసాగించినట్టు చెప్పారు. తన రిట్మైంట్ నోటిఫికేషన్‌కు నెల ముందు ఓ చానల్, ఓ ఆంగ్ల దినపత్రిక రెసిడెన్షియల్ ఎడిటర్ తనపై అవాస్తవాలతో కథనాలు ప్రసారం చేసినందుకే కేసులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత కొంతమంది మీడియా మిత్రులు తనను కలిసిస్తే.. తాను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టనని చెప్పానని, అందుకే ఆ కేసుల్లో నిందితులకు బెయిల్ వచ్చేలా చేశానని వివరించారు. ఆ తరువాత మరిన్ని అరెస్టులు జగరకుండా చూశానని, కేసులు ముందుకెళ్లకుండా చర్యలు తీసుకున్నానని తెలిపారు. ఆ కేసులు దాదాపు విత్‌డ్రా అయినట్టే అని చెబుతూ ఇద్రూస్ బాబా పెట్టిన కేసు మాత్రం నడుస్తుందన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి