20, అక్టోబర్ 2013, ఆదివారం

తెలంగాణ-శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న డిమాండ్ చాలా సంవత్సరాలుగా సజీవంగా ఉంది. స్వాధికారం కోసం అడుగుతున్న ఈ కోరిక అర్థవంతమయినది. ఇది ఏమాత్రం న్యాయ విరుద్ధమయినది కాదు.’ ఇవి ఏ ప్రముఖ తెలంగాణవాది అన్న మాటలు కావు.‘ఆంవూధవూపదేశ్‌లో నెలకొని వున్న పరిస్థితిని అంచనా వేయడానికి, దానికి సంబంధించిన అన్ని వర్గాలతో చర్చించి పరిష్కార మార్గాలను సూచించడానికి’ ఏర్పాటయిన శ్రీకృష్ణ కమిటి తన రిపోర్టులోని ‘భవిష్యత్తుకు మార్గ సూచిక’ అన్న 9వ అధ్యాయంలో రాసిన వాక్యాలు (పేజీ 453) ఇవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వంగానీ, కాంగ్రెస్ పార్టీగానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అసలు పట్టించుకున్న పాపానపోలేదని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన కొంతమంది నాయకులు, మరికొంత మంది సీమాంధ్ర మేధావులు (సంజయ్‌బారు లాంటివాళ్ళు) విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి వ్యక్తపరిచిన అభివూపాయాలు ఏమిటో పరిశీలించడం అవసరం.

శ్రీకృష్ణ కమీటీ తెలంగాణ సమస్యకు ఆరు పరిష్కారమార్గాలు సూచించింది. 1) రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం. ఈ సూచన అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పరిష్కార మార్గంగా కమిటీ భావించింది. 2) హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ తెలంగాణ, సీమాంవూధలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. ఈ సూచన అమలు సాధ్యంకాదని కమీ టీ అభివూపాయపడింది. 3) రాయలతెలంగాణ, కోస్తాంధ్ర రాష్ట్రాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న మూడవ ప్రతిపాదనకు మూడు ప్రాంతాల ప్రజలు అంగీకరించరని కమిటియే తేల్చిచెప్పింది. 4) సీమాంధ్ర, తెలంగాణలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ హైదరాబాద్ మెట్రో నగరాన్ని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే విషయంలో రాజకీయపరంగా ఏకాభివూపాయం వచ్చే అవకాశం లేనందున ఈ ప్రతిపాదన కూడా అమలు చేయడం వీలుకాదని కమీటి స్పష్టీకరించింది.
ఇక మిగిలినవి రెండు పరిష్కార మార్గాలు-రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే, తెలంగాణకు కొన్ని ప్రత్యేక రాజ్యాంగరక్షణలు కల్పించాలన్నది మొదటి సూచన. అయితే, రెండవ ఉత్తమ పరిష్కారంగా రాష్ట్రాన్ని విభజించమని సిఫారసు చేస్తూ వారు చెప్పిన విషయాలు స్థూలంగా ఇవి: రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర అన్న రెండు రాష్ట్రాలుగా పునర్‌నిర్మాణం చెయ్యాలి. హైదరాబాద్ నగరం పది జిల్లా ల తెలంగాణకు శాశ్వత రాజధానిగాను, కొత్త రాజధానిని నిర్మించుకొనేంతవరకు సీమాంవూధకు తాత్కాలిక రాజధానిగాను ఉంటుంది. నూతన రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున పెట్టుబడి కావలసి ఉంటుంది. దానికి సరిపోయిన ఆర్థిక వనరులు, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాలి.

విభజన నిర్ణయం తరువాత వచ్చే పరిణామాలను కూడా కమిటీ అంచనా వేసిం ది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగుతాయని, హైదరాబాద్, నీటి పంపకం ముఖ్యమైన సమస్యలుగా హింసాత్మక ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని శ్రీకృ ష్ణ కమిటీ చెప్పింది. ఊహించిన దానికంటే ముందుగానే ప్రత్యేక రాయలసీమ డిమాండు రూపు దిద్దుకుంటుందని కమి టి జోస్యం చెప్పింది. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించాలని వత్తిడి ఉంటుందని కూడా కమిటి ముందుగానే ఊహించింది. హైదరాబాద్ మార్కెట్ అతి కీలమైనది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది తమ చేయి జారిపోతుందన్న ఆందోళనతో ఈ ఉద్యమాలకు ప్రజలు సిద్ధమవుతారని కూడా కమిటి వ్యాఖ్యానించింది. (పేజీ 452)

ఇప్పుడు జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం గురించి మూడేళ్ళ ముందే ఊహించిన శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పక్షంలో హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాలలో నివసిస్తున్న సీమాంవూధుల పెట్టుబడులు, జీవనోపాధి, ఉపాధి అవకాశాలు వంటి వాటికి తగు రక్షణ కల్పించాలని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారన్న విశ్వాసాన్ని సీమాంవూధుల్లో కల్పించాలని నొక్కిచెప్పింది.(పేజీ 453)
బీజేపీ పరిపాలిస్తున్న కాలంలో ఏర్పాటయిన చిన్న రాష్ట్రాల ప్రగతి గురించి కూడా సదభివూపాయాన్ని వ్యక్తపరించింది కమిటీ. వైశాల్యాన్ని బట్టి కాకుండా నాయకత్వంపై రాష్ట్రాల పురోగ తి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థిక పరిపుష్టి కలిగి వుంటుందని, నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో స్థూల జాతీయోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుందని (పేజీ 453) కూడా చెప్పింది.


ఆర్టికల్ 371(డి) సవరించటం సాధ్యం కాదన్నట్టుగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 371(డి) పై కేంద్ర హోంమంవూతికి అవగాహన లేదని తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు కిరణ్‌కుమార్‌డ్డి.1956లో ఏడవ రాజ్యాంగ సవరణగా ఆర్టికల్ 371భారత రాజ్యాంగంలో చేర్చబడిందన్న విషయం శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టులో ఉటంకించింది. ఇంతవరకు ఎన్నో సవరణలకు, మార్పులకు గురయిన ఆర్టికల్ 371, చివరిసారిగా 1987వ సంవత్సరంలో 56వ సవరణగా మహారాష్ట్ర, గుజరాత్ మున్నగు పది రాష్ట్రాల ప్రత్యేక అవసరాల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఆర్టికల్ 371లో అవసరమైన మార్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కేంద్రానికేమి కష్టమైన పనికాదన్న పద్ధతిలో శ్రీకృష్ణ కమిటీ సూచనవూపాయంగా తన అభివూపాయాన్ని వ్యక్తీకరించింది. రాజ్యాంగంలో ముఖ్యమైన ఈ అధికరణంపై కసరత్తు చేయకుండానే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించిందనుకోవడం సీమాంవూధుల భ్రమ మాత్రమే. లేదా సీమాంధ్ర ఉద్యోగసంఘ నాయకులు, వారి రాజకీయ నాయకత్వం మూర్ఖత్వంతో ఈ విషయంలో ప్రజలను భ్రమలకు గురి చేస్తున్నారనుకోవాలి.


ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను గాని, వైద్య విశ్వవిద్యాలయం గాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ సూచిస్తే, పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక ఉదాహరణ మాత్రమే.శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీమాంధ్ర ప్రభుత్వం ఎన్నోమార్లు అందులోని సూచనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వివక్షతో నిర్ణయాలు తీసుకున్నది.అవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. సర్దార్ వల్లభభాయిపటేల్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యతో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ముగుస్తుంది. ఈ వ్యాఖ్యను ఇక్కడ మళ్ళీ గుర్తుచేసుకోవాలి.‘వాస్తవాలను నిర్లక్ష్యం చేయడం భయంకరమైన అపరాధం.నిజాలను సూటిగా, ఉచిత రీతిలో ఎదుర్కొనకపోతే, అవి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయి’.
-ఎ.రాజేంవూదబాబు
తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటి కోశాధికారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి