-విద్యుత్ రంగంలో అడుగడుగునా వివక్షే..
-నేడు కేంద్ర జీఓఎంకు విద్యుత్ విభజన నివేదిక
హైదరాబాద్, అక్టోబర్ 17 (టీ మీడియా): తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో ప్రభుత్వ నివేదికలే కళ్లకు కడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో అన్ని ముడివనరులు ఉన్నా.. విద్యుత్ దక్కింది నామమాత్రమే. బోరుబావుల మీద పంటలు పండిచాల్సిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నా.. కనీస ప్రాధాన్యం దక్కలేదు.
దీంతో విద్యుత్ రంగంలో నెలకొన్న వివక్షతో సీమాంధ్ర ప్రాంతం షోకులు చేసుకుంటే.. తెలంగాణకు మాత్రం పెను షాకులు తగిలాయి. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్‌రంగ పరిస్థితులు, తీరుతెన్నులను వివరిస్తూ అధికార యంత్రాంగం ప్రత్యేక నివేదికను రూపొందించింది. దీనిని శుక్రవారం మెయిల్ ద్వారానే ఢిల్లీకి పంపించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విద్యుత్‌పరంగా తీవ్ర వివక్షకు గురైందనే వాస్తవాలు ఈ రిపోర్టులో పొందుపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న పలుస్థాయిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి సీమాంధ్రకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారనే నగ్నసత్యం నివేదిక ద్వారా బట్టబయలుకానుంది.
తెలంగాణలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితం కాగా, సీమాంధ్రలో మాత్రం 2,766 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు అయ్యాయి. థర్మల్, హైడల్ రంగాలతోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 1,426 మెగావాట్లు కాగా, వాటిల్లో తెలంగాణలో 237మెగావాట్లు ఉండగా, అంతకు మూడింతలుగా సీమాంధ్రలో 1,189 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్ర విభజనకు వీలుగా విద్యుత్‌రంగానికి సంబంధించి సమగ్ర నివేదికను ఇంధనశాఖ సిద్ధం చేసింది. దీని పరిధిలోకి వచ్చే తొమ్మిది కార్పొరేషన్లతోపాటు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ వంటి ప్రభుత్వ విభాగాల విభజన ప్రక్రియపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇంధన శాఖకు నవరత్నాలుగా ఉన్న తొమ్మిది విద్యుత్ కార్పొరేషన్ల అంతర్గత నివేదికలను సమీక్షించిన ఉన్నతాధికారులు వాటన్నింటిని క్రోడీకరించి ఒకే నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌రంగ సమగ్ర నివేదికను కేంద్ర విద్యుత్‌శాఖకు అందించే విధంగా సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి