5, అక్టోబర్ 2013, శనివారం

పార్లమెంటుకే సర్వాధికారం



అరవయి సంవత్సరాల తెలంగాణ రాష్ర్ట ఉద్యమానికి పతాక సన్నివేశం 2013 జూలై 30న ఢిల్లీలో ఆవిష్కృతమయింది. కేంద్రంలోని పాల క కూటమికి (యూపీఏ)నాయకత్వం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ర్ట నిర్మాణం నిమిత్తం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2013 జూలై 30వ తేదీన తీర్మానించింది. ఈ తీర్మానం జరిగిన వెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా సమావేశమై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తెలంగాణ రాష్ర్ట నిర్మాణ నిర్ణయానికి ఆమోదముద్ర వేశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ర్ట (భారత యూనియన్‌లో 29వ రాష్ర్టంగా) అవతరణ కోసం దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక బిల్లుకు రూపకల్పన జరుపుతున్నదని దేశ వ్యవహారాల శాఖామంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానానికి చెందిన ఇతర నాయకులు తరచు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగా ణ విషయంలో జూలై 30న చేసిన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉం డబోదని గూడ కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ చేసే ఎటువంటి నిర్ణయానికయినా కట్టుబడి ఉంటామని గతం లో అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసిన రాష్ర్ట ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ అధ్యక్షుడు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ర్టమంవూతులు, కేంద్ర మంవూతులు, ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ మాట మార్చి జూలై 30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నా రు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన తెలంగాణ నిర్ణయాన్ని రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఎట్టి పరిస్థితులలోను రాష్ర్ట విభజనకు అంగీకరించబోమని ప్రకటిస్తున్నారు.

సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు, అక్కడి ప్రతిపక్షాల నేతలు రాష్ర్ట విభజనను అడ్డుకోవడానికి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహంలో కీలకమయినది(వారి అభివూపాయంలో) రాష్ర్ట శాసనసభలో తెలంగాణ రాష్ర్ట నిర్మా ణం తీర్మానాన్ని ఓడించడం. ఆ తీర్మానం నెగ్గకుండా నిరోధించడం. దీని లో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం జారీ చేసే విప్‌ను ఆదేశాన్ని కాంగ్రెస్ శాసనసభ్యులు ఖాతరు చేయకపోవచ్చు. రాష్ర్ట శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించడం సీమాంధ్ర నాయకులకు ఎంతమాత్రం కష్టం కాదు. ప్రస్తుత రాష్ర్ట శాసన సభలోని వివిధ పక్షాల బలాబలాలను గమనించినట్లయితే, రాష్ర్ట విభజనకు అనుకూలంగా కేవలం 109 మంది శాసనసభ్యులు, వ్యతిరేకంగా 161 మంది శాసనసభ్యులు ఉంటారని అర్థమవుతున్నది. కేంద్రవూపభుత్వం పంపించే తీర్మానాన్ని ఓడించే వరకు సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామా చేయవద్దని నాయకులు సలహా ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ప్రవేశపెట్టే తీర్మానం రాష్ర్ట శాసనసభలో ఓడిపోతుందని రాష్ర్ట ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు.

రాష్ర్ట విభజనకు భారత రాజ్యాంగంలో సవరణ జరుపాలని,సవరణకు అవసరమైన సంఖ్యాబలం పార్లమెంటులో యూపీ ఏ ప్రభుత్వానికి లేదని సీమాంధ్రనేతలు అంటున్నారు. రాష్ర్ట శాసనసభలో తీర్మానం, రాజ్యాంగ సవరణ రాష్ర్ట విభజనకు రెండు ప్రధానమైన అడ్డంకులు కాగలవని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. నిజంగానే ఇవి అడ్డంకులవుతాయా? భారత రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్నవావరూ ఇవి రెండు అడ్డంకులన్న అభివూపాయంతో ఏకీభవించలేరు.రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల నిర్మాణం విషయంలో భారత రాజ్యాం గం అస్పష్టత ఏదీ లేకుండా చాలా స్పష్టంగా ఉందనడంలో సందేహం లేదు. నూత న రాష్ట్రాల నిర్మాణానికి భారత రాజ్యాంగంలోని 3వ అధికరణం (ఆర్టికల్) ప్రకారం పార్లమెంటుకు మాత్రమే, ఒక్క పార్లమెంటుకే పూర్తి అధికారాన్ని దత్తపరచింది. రాష్ర్ట విభజనకు, తద్వారా నూతన రాష్ట్రం నిర్మాణానికి సంబంధిత రాష్ర్ట శాసనసభలో తీర్మానం చేయాలని 3వ అధికరణంలో ఎక్కడా లేదు. 3వ అధికరణం ప్రకారం రాష్ర్ట శాసనసభ తీర్మానం ఏదీ అవసరం లేదు. తీర్మానమే లేనప్పుడు తీర్మానాన్ని గెలిపించే,లేక ఓడించే అవకాశమే ఉండదు.అటువంటి పర్థిసితి ఏదీ ఉత్పన్నం కాదు.

3వ అధికరణంలో ‘తీర్మానం’ అన్న పదమే లేకపోవడం గమనార్హం. 3వ, 4వ అధికరణాలను పరికించినట్లయితే, రాష్ర్ట విభజనకు, నూతన రాష్ర్ట నిర్మాణానికి శాసనసభలో తీర్మానంగానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణగానీ అవసరమే లేదని స్పష్టమవుతుంది. 3వ అధికరణం ప్రకారం నూతన రాష్ర్టం లేక నూతన రాష్ట్రాల నిర్మాణం జరుగుతుంది. ‘ఏదయినా రాష్ర్టం నుంచి ఒక ప్రాంతాన్ని విడదీసి పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు’ అని 3వ అధికరణం నిర్దేశించింది. ఒక నూతన రాష్ర్టం నిర్మాణానికి పార్లమెంటు మాత్రమే ఒక శాసనాన్ని చేయగలుగుతుంది. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభ నిర్వహించవలసిన పాత్ర ఏమీ లేదన్నది సుస్పష్టం. 3 వ అధికర ణం రాష్ర్ట శాసనసభలో తీర్మానానికి అవకాశం ఇవ్వడం లేదు. (1)రాష్ర్టపతి సిఫారసు ప్రకారం మాత్రమే కొత్త రాష్ర్టం నిర్మాణానికి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టవచ్చు. (2) నూతన రాష్ర్టం నిర్మాణం కోసం బిల్లులో చేసిన ప్రతిపాదన ఏదయినా రాష్ర్టం మీద ప్రభావం కల్గించినట్లయితే ఆబిల్లును రాష్ర్టపతి ఆ రాష్ర్టం శాసనసభ అభివూపాయాల నిమిత్తం పం పించాలి. రాష్ర్టపతి నిర్దేశించిన వ్యవధిలో (సాధారణంగా 30 రోజుల్లో) శాసనసభ తన అభివూపాయాలను వ్యక్తపరచాలి. శాసనసభ అభివూపాయాలను నిర్దేశించిన వ్యవధిలో రాష్ర్టపతికి నివేదించనట్లయితే, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేసే స్వేచ్ఛ రాష్ట్రపతికి ఉంటుంది.

శాసనసభ తన అభివూపాయాలను వ్యక్తపరచడం కేవలం ఒక లాంఛనం మాత్రమేనని, ఈ అభివూపాయాలకు రాష్ర్టపతి కట్టుబడి ఉండవలసిన అవసరం లేనేలేదని 3వ అధికరణం వివరించింది.భారత రాజ్యాంగంలోని 3 వ అధికరణం (ఆర్టికల్) ప్రకా రం ప్రభావిత రాష్ర్టం తన అభివూపాయాలను మాత్రమే వ్యక్తపరుస్తుంది. అది (శాసనసభ) ఒక తీర్మా నం చేయడానికి అవకాశమే లేదు. అంతేకాదు అభివూపాయాల ను వ్యక్తపరిచినప్పుడు శాసనసభలో ఓటింగ్ ఏదీ జరగదు. రాజ్యాంగంలోని 4వ అధికరణం రాజ్యాంగంలోని 1వ, 4వ షెడ్యూళ్లను ప్రస్తావిస్తున్నది. ఆయా రాష్ట్రాల పేర్లు,ఆ రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ సభ్యుల సంఖ్య ఈ రెండు షెడ్యూళ్లలో ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటయినప్పు డు ఈ షెడ్యూళ్లలో కొద్దిమార్పులు అవసరమవుతాయి. 4వ అధికరణాని కి అనుగుణంగా, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఈ మార్పులను చూపించవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏశాసనమూ 368వ అధికరణం ఉద్దేశాల కోసం రాజ్యాంగసవరణ కాబోదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుచేత రాజ్యాంగ సవరణ ఏదీ జరగదు. రాజ్యాంగ పరిజ్ఞానం బొత్తిగా లేనివారు రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పడం, సామాన్యులను రెచ్చకొట్టడం శోచనీయం. రాజ్యాంగ ప్రాధమిక అంశాలు సైతం తెలియనివాళ్లు రాజ్యాంగం మీద ప్రమాణాలు చేయడం, ఇంతకాలం ఇక్కడ పాలకులు కావడం మన దురదృష్టం.
-ఎమ్.నారాయణడ్డి
నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి