8, అక్టోబర్ 2013, మంగళవారం

కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి

Sakshi | Updated: October 08, 2013 12:22 (IST)
కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి
హైదరాబాద్ :
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ తమ్ముడి భూకబ్జాలను ఆపినందుకే తనపై కక్ష్య కట్టారని ఆయన సంచలన ఆరోఫణలు చేశారు. అధికారంలో ఉన్న సీఎంపై ఆరోపణలు చేస్తున్న మీపై చర్యలు తీసుకుంటే ఎలా అనే ప్రశ్నకు .. అధికారం బాప్ కా జాగీర్ కాదు.. తనకు ఉండే మద్దతు తనకు ఉందని.. తన ప్రణాళిక తనకు ఉంది అని ఘాటుగా సమాధానమిచ్చారు. 
 
అంతేకాక కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం అని దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.   రిటైర్మెంట్ కు రెండు  రోజుల ముందే తన పదవి కాలాన్ని పొడిగిస్తూ జీవో జారీ చేసిన తనపై ఎందుకు కుట్ర పన్నారో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు.  పదవికాలాన్ని పొడిగిస్తానని చెప్పి.. సీఎం నాకు నమ్మక ద్రోహం చేశారు అని దినేష్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కిరణ్ తనకు వ్యతిరేకంగా... ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడారో అర్ధం కావడం లేదు అని అన్నారు. 
 
సీఎం వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నారన్నారు. అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేయమని బలవంతపెట్టారని సీఎంపై దినేష్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు బలపడుతారనేది ఊహాజనితమేనని ఆయన అన్నారు. తన వెనుక రాజకీయ నేతల ఒత్తిడి లేదని అన్నారు. సీఎం ఒత్తిడితోనే సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇచ్చానన్నారు. సీఎంపై చర్యలు తీసుకునే వారు తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. 
 
సీమాంధ్రలో ఉద్యమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. తను రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి లేదని దినేష్ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం మీ వెనక ఉండి నడిపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు .. తనక జరిగిన అన్యాయానికి, వెన్నుపోటుకు మాత్రమే స్పందిస్తున్నాను అని అన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి