1, అక్టోబర్ 2013, మంగళవారం

ఆంధ్ర ప్రదేశ్ నదులు

గోదావరి


గోదావరి నది భారత దేశములో గంగసింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదుకరీంనగర్వరంగల్ఖమ్మంతూర్పు గోదావరిమరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవు. భద్రాచలమురాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని.ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి(గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమివశిష్ఠవైనతేయఆత్రేయ,భరద్వాజతుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమివశిష్ఠవైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినిలు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.


గోదావరి నది ఇతిహాసం

పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడగుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడం తో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.


గౌతముడు- గోష్పాదక్షేత్రం

ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం

కృష్ణా నదీ


భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశం మరియు ఆంధ్ర ప్రదేశ్ లో రెండో పెద్ద నది అయిన కృష్ణా నది (Krishna river)ని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కుఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.


ప్రయాణం

ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణపంచగంగదూధ్‌గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభమాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. తరువాతకర్నూలు కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమలకొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలంనాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండిమూసిపాలేరుమున్నేరు వంటివి కలుస్తాయి.విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
  • మహారాష్ట్ర: 26.8%
  • కర్ణాటక: 43.8%
  • ఆంధ్ర ప్రదేశ్: 29.4%


కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు

కృష్ణా నదికి భారత దేశంలోన్ని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉన్నది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:
  • శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శ్రీశైలం.
  • ఆలంపూర్ : అష్టాధశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న ఆలంపూర్ చాళుక్య రాజుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి.
  • శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం (కనకదుర్గ) - విజయవాడ
  • అమరావతిఅమరారామం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి.
  • మోపిదేవి: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు


తుంగభద్ర

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నదికర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగభద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపిమంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.
  • కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
  • భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః


నదీ ప్రయాణం 

కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ శిమోగా జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి శృంగేరి పీఠం, హంపీ ల మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడినది.


తుంగభద్ర పుష్కరాలు

పుష్కరాలు హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు 2008 డిసెంబర్మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్ మరియు కర్నూలు రెండు జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. కర్నూలుమంత్రాలయంఆలంపూర్ తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి 



ఉప నదులు

గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:
  • వైన్‌గంగా
  • పెన్ గంగ:--పెన్ గంగ గోదావరి నది యొక్క ఉపనది. ఇది అదిలాబాదు గుండా ప్రవహిస్తున్నది.
  • వార్ధా నది
  • మంజీరా నది:--మంజీరా, గోదావరి యొక్క ఉపనది.
    ఈ నది కర్ణాటక రాష్ట్రములోని బీదరు జిల్లా పటోడా తాలూకాలో పుట్టి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామము వద్దగోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామము వద్ద నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణము జరిగినది. ఈ ప్రాజెక్టులో భాగముగా .ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా కలదు.

  • ఇంద్రావతి నది:--ఇంద్రావతి నది  గోదావరి ఉపనది. ఇది తూర్పు కనుమలలో పుట్టి, గోదావరి కలసిపోతుంది. ఈ నది మహారాష్ట్ర మరియు చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నది.
    ప్రఖ్యాతిచెందిన చిత్రకూట జలపాతం ఇంద్రావతి నది మీద జగదల్ పూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
    ఈ నది చాలావరకు దట్టమైన అడవుల మధ్యగా ప్రవహిస్తుంది. ఇంద్రావతి నదిని బస్తర్ జిల్లా ప్రాణదాత అని పిలుస్తారు. ఇంద్రావతి జాతీయ వనం ఈ నదీ తీరంలో ఉన్నది
  • బిందుసార
  • శబరి:-శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.
  • ప్రవర
  • ఫూర్ణా
  • ప్రాణహిత
  • సీలేరు నది
  • కిన్నెరసాని:--

    కిన్నెరసాని ప్రాజెక్టు

    కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలములోని యానంబైలు గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ రిజర్వాయరును నిర్మించారు. 1972లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. 1998 ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుఛ్ఛక్తి శాఖకు బదిలీ చేసినది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
  • మానేరు

]

మూసీ నది


మూసీ నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో కృష్ణా నది యొక్క ఉపనది. హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు.[1]హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది.
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లావికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా,వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%[2] సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.
మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి.విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.

]వరదలు

20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.
నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.

]

కుందేరు

కుందేరు (కుందూ లేక కుముదవతి అని కూడా వ్యవహరించబడుతోంది) నది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిన దిశలో ప్రవహించి కడపజిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైనది, అతి పెద్దది. నది నీటి పరివాహక పరిధిలో ఉన్న మండలాలు కర్నూలు జిల్లలోని ఓర్వకల్లుమిడుతూరుగడివేములనంద్యాలగోస్పాడుకోయిలకుంట్లదొర్నిపాడు మరియు చాగలమర్రి, కడప జిల్లాలోని మైదుకూరు.
కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి మరియు వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు మరియు మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతము నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది.
కుందేరు నదీ అడుగులో రాతిమయము. ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు. నది అడుగున శిలల పొరల వలన నీరు భూమిలోకి ఇంకక పోవడము విశేషము. దీనివళ్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యముగా లేదు.
నంద్యాల వద్ద కుందేరు కర్నూలు - కంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన నిర్మించారు.

గుండ్లకమ్మ
గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలుప్రకాశంగుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది మరియు పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది.
ఇది కర్నూలు జిల్లా నంద్యాలఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండలలోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల ఎత్తులో పుడుతుంది. కొండలనుండి కిందకు దిగి పల్లపు ప్రాంతానికి రాగానే ఇది కంభం చెరువునుమార్కాపురం చెరువును యేర్పరచుతుంది. ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలము, ఉలిచి గ్రామము వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు మరియు చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు. ఈనది మొత్తం పొడవు 220 కిలోమీటర్లు.
2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా చిన్న మల్లవరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టును 165.22 కోట్ల ఖర్చుతో నిర్మాణము చేపట్టడానికి ఆమోదము తెలియజేసినది. ఈ ప్రాజెక్టు 6 మండలాల పరిధిలోని 43 గ్రామాలలో 80,060 ఎకరాల భూమికి సాగునీటిని అందివ్వగలదని ఆశిస్తున్నారు. అంతేకాక జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో సహా 23.56 లక్షల మంది ప్రజలకు మంచినీటిని సమకూర్చుతుందని ఆశిస్తున్నారు 
గోస్తని నది
ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్థని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం మరియు విశాఖపట్నంజిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకుఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలొ ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.

]గోస్తని నదిపై నిర్మించిన ప్రాజెక్టులు

తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద మధ్యకాలంలో నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉన్నది. విజయనగరంజిల్లాలో15,378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం మరియు విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.

చంపావతి నది

చంపావతి నది ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చిన్న నది. ఇది తూర్పు కనుమల నుండి ఆండ్ర గ్రామం దగ్గర 1,200 మీటర్ల ఎత్తులో జన్మించి తూర్పు దిక్కుగా ప్రవహించి, కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నది విజయనగరం జిల్లాలో గజపతినగరంనెల్లిమర్లసరిపల్లిడెంకాడపాలెం మరియు నాతవలస గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. దీనికి ఏడువంపుల గెడ్డ, చిట్టి గెడ్డ, పోతుల గెడ్డ మరియు గాడి గెడ్డలు ఉపనదులున్నాయి.
చంపావతి నది పరీవాహక ప్రాంతం 1,410 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో కొంత మాడుగుల కొండ ప్రాంతం, కొంత బల్లపరుపుగా మరికొంత తీర ప్రాంతంగా విభజించవచ్చును.]
డెంకాడ ఆనకట్ట చంపావతి నదిపై 1965-1968 మధ్యకాలంలో నిర్మించబడినది. ఇది నెల్లిమర్ల మండలంలోని సరిపల్లి గ్రామం దగ్గరగా ఉన్నది. దీని మూలంగా 5,153 ఎకరాల ఆయకట్టు భూమికి నీరు అందుతుంది
చిత్రావతి 
చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
సత్యసాయి బాబా గారి ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డున ఉన్నది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవారు మరియు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.
 చెయ్యేరు 
చెయ్యేరు పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది. చెయ్యేరు నది కడపచిత్తూరు జిల్లాల గుండా ప్రవహించుచున్నది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడినది.

]పేరు వృత్తాంతము

ఈ నదికి చెయ్యేరు లేక బాహుద అనే పేర్లు రావడానికి వెనుకనున్న కథ ఇది: శంఖ-లిఖితులనే అన్నదమ్ములుద్దరు ఏటికి ఈ ఒడ్డున ఒకరు, ఆ ఒడ్డున ఒకరు కాపురముండేవారు.తమ్ముడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేదము, శాస్త్రము నేర్చుకుని వెళ్ళేవాడు. ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉంది. ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేసింది. తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. తర్వాత ఈ విషయం అన్నకు చెప్పాడు. చేసింది నేరమని, రాజు రవివర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోరుకొమ్మనాడు అన్న శంఖుడు. పొత్తపి రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. లిఖితుడు తెగిన చేతులతో అన్న దగ్గరకు వచ్చాడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఏట్లో ముంచమన్నాడు. లిఖితుడు అలాగే చేయగా అతనికి చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి 'చెయ్యేరు' అని పేరు వచ్చింది. సంస్కృతంలో 'బాహు' అంటే చెయ్యి. 'ద' అంటే ఇచ్చునది. అందుకే చేతిని ఇచ్చిన ఈ నది పేరు బాహుద అయింది.

]ఉపనదులు

చెయ్యేరు యొక్క ఉపనదులు
  • బహుద
  • ఫించా
  • మండలి
  • పుల్లంగి
  • గుంజన

]అన్నమయ్య ప్రాజెక్టు

చెయ్యేరు నది మీద కడప జిల్లా రాజంపేట మండలములోని బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడినది. ఈ ప్రాజెక్టు వలన కడప జిల్లాలోని 22,500 ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది. ఈ ప్రాజెక్టు 2.17469 టి.ఎం.సిల నీటిని ఉపయోగించుకొంటుంది. జలాశయము యొక్క నీటి నిల్వసామర్ధ్యం 2.33948 టి.ఎం.సి (గ్రోస్) మరియు 2.23948 టి.ఎం.సి (నెట్).
తొలి అంచనా ప్రకారము ఈ ప్రాజెక్టు యొక్క వ్యయము 60.44 కోట్ల రూపాయలుగా 1996-97 లో నిర్ణయించడమైనది కానీ 2001-02 లో తిరిగివేసిన అంచనాలో ఇంప్రూవ్‌మెంట్లు మరియు ఆధునీకరణ ఖర్చులతో మొత్తము వ్యయము 68.92 కోట్ల రూపాయలుగా వెలకట్టబడినది. 2004 జనవరి వరకు 57.347 కోట్ల రూపాయల మొత్తము ప్రాజెక్టు యొక్క ఆధునీకరణ, పునరావాసము మరియు కడప జిల్లా లోని రాజంపేటపుల్లంపేట మండలాలలో 22,500 ఎకరాల ఆయకట్టు స్థిరపరచడానికి ఖర్చు చేయబడినది 
 తాండవ నది
తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న పెంటకోట దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుని దగ్గర ఈ నది తూర్పు గోదావరివిశాఖ జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట.
ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి. ఇప్పుడు తునికి కొన్ని కిలోమీటర్ల ఎగువన ఆనకట్ట కట్టి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.
 తాలిపేరు నది
తాలిపేరు నది గోదావరి నదికి ఉపనది. ఇది ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించి గ్రామం వద్ద గోదావరి నదిలో విలీనం అవుతుంది.
తాలిపేరు ప్రాజెక్టు ఈ నదిమీద నిర్మించబడి, సుమారు 27,000 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది.

తుల్యభాగ

భగీరధి (గంగా నది)లో స్నానము చేస్తే ఎంత పుణ్యము వస్తుందో ఆ పుణ్యానికి తుల్య మైన (సమానమైన) పుణ్యము ఇచ్చునది కాబట్టి తుల్యభాగ అని పిలుస్తారు. గోదావరి నదిసముద్రంలో కలిసే ముందు పాయలుగా విడపోగా అందులో ఒక పాయ (distributory) ఇది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, నది నీటిని వ్యవసాయపు కాలువల్లోకి మళ్ళించగా, స్వతస్సిద్ధమయిన పాయలలో ప్రవాహం తగ్గిపోయింది. పైగా సేద్యం అయిన తరువాత మిగిలిన, దరిదాపు మురికిగా తయారయిన, నీరు మాత్రం ఇప్పుడు ఈ పాయలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ తుల్యభాగ నది స్నానానికి కూడా అనుకూలంగా లేదు
నాగావళి
నాగావళి నది దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తరతీరాంధ్రలోని ముఖ్యనది. ఒరిస్సా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది.శ్రీకాకుళం పట్టణము ఈ నదీ తీరమునే ఉన్నది.
నాగావళి నది ఒరిస్సా రాష్ట్రము, కలహంది జిల్లాలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తున్న తూర్పు కనుమలలో ప్రారంభమవుతుంది. ఈ నది మొత్తము 256 కిలోమీటర్లు సముద్రానికి ప్రవహిస్తుంది. అందులో 161 కిలోమీటర్లు ఒరిస్సా రాష్ట్రములో, 2 కిలోమీటర్లు ఒరిస్సా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుపై మరియు దాదాపు 93 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రవహిస్తుంది.
బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ మరియు వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు. నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ అందులో 4,462 చ.కి.మీలు ఒరిస్సా రాష్ట్రములో (1006 చ.కి.మీలు కలహంది జిల్లాలో మరియు 3,456 చ.కి.మీలు కోరాపుట్ జిల్లాలో) మరియు 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో (1,789 చ.కి.మీలు శ్రీకాకుళం, 3,096 చ.కి.మీలు విజయనగరం జిల్లా మరియు 63 చ.కి.మీలు విశాఖపట్నం జిల్లాలో) ఉన్నది.
నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు మరియు నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు 

పాపాఘ్ని

 పాపాఘ్ని పెన్నా నదికి ఉపనది. కడప జిల్లాలో ప్రవహించే పాపాఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

కడప జిల్లాలో ఈ నదీతీరంలోనే 
రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో పవిత్ర గండి క్షేత్రం వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి "గండి" అని పేరు వచ్చింది.

పాలేరు నది

పాలేరు ఖమ్మం జిల్లాలో ప్రవహించే ఒక నది. ఇది కృష్ణానదికి ఉపనది.
ఈ గ్రామం లో పాలేరు నదిపై నిజాం ప్రభుత్వ కాలం లో ఒక చిన్న/మధ్య తరహా ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి మరియు నేలకొండపల్లిమండల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతున్నది. ఇటీవలి కాలంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఈ రిజర్వాయరు గుండా త్రవ్వటంవలన కరవు కాలం లో కూడా నీటికి ఎద్దడి కలుగటములేదు. నాగార్జునసాగరు ఎడమ కాల్వపై ఒక మైక్రో విద్యుత్కేంద్రము ఏర్పాటు చేశారు కానీ అది విజయవంతం కాలేదు. హైదరాబాదు నుండిభద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ రిజర్వాయరు కట్టపై చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఎవరైనా కాసేపు ఆగినట్లయితే నీటి స్కూటర్లు బోట్లు విహరించటానికి దొరుకుతాయి. ప్రభుత్వం ఈ గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయం నెలకొల్పింది.
 పెన్నా నది
పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టినంది శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరు కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతం లో కలుస్తుంది.
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళచిత్రావతికుందేరుపాపాఘ్నిసగిలేరుచెయ్యేరుబొగ్గేరు మరియుబిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది 
 భీమా నది
భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటకఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురముజ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నవి. 
 మంజీరా నది
మంజీరా, గోదావరి యొక్క ఉపనది.
ఈ నది కర్ణాటక రాష్ట్రములోని బీదరు జిల్లా పటోడా తాలూకాలో పుట్టి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామము వద్దగోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామము వద్ద నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణము జరిగినది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా కలదు
 సగిలేరు
సగిలేరు పెన్నా నది యొక్క ఉపనది. ఇది ప్రకాశం జిల్లా నల్లమల్ల కొండలలో కంబం వద్ద పుట్టి, దక్షిణమున గిద్దలూరు మరియు బద్వేలు తాలూకాల గుండా ప్రవహించి కడప జిల్లాలో పెన్నానదిలో కలుస్తుంది. పూర్వము ఈ నదిని స్వర్ణబాహు నది అని పిలిచేవారు. సగిలేరు నదిపై కడప జిల్లాలో రెండు మధ్యతరహా నీటి పారుదల పథకాలు ఉన్నాయి - ఎగువ సగిలేరు ప్రాజెక్టు మరియు దిగువ సగిలేరు ప్రాజెక్టు.
దిగువ సగిలేరు ప్రాజెక్టు కడప జిల్లాలో బి.కోడూరు మండలంలోని వడ్డెమాను గ్రామం వద్ద నిర్మించబడింది. దీని మొత్తం ఆయకట్టు 11804 ఎకరాలు. ఈ ప్రాజెక్టు 0.6 టి.ఎం.సిల లభ్యమయ్యే జలాల్ని వినియోగించుకుంటుంది. జలాశయం యొక్క పూర్తి సామర్ధ్యం 0.169 టి.ఎం.సి.లు మరియు నికర సామర్ధ్యం 0.166 టి.ఎం.సి.లు. దీన్ని మొత్తం 51 లక్షల వ్యయంతో నిర్మించారు. 1996లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సంభవించిన వరదల వళ్ల ఆనకట్ట, గేట్లు, కాలువలు మరియు పంపీణీ వ్యవస్థ దెబ్బతినడంతో 6.95 కోట్ల ఖర్చుతో మరమత్తులు చేపట్టి 2003 మార్చిలో పూర్తిచేశారు 2009లో ఈ ప్రాజెక్టుకు మాజీ రాష్ట్రమంత్రి పేరుమీద వడ్డెమాను చిదానందం జలాశయం అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్టు బద్వేలు చెరువుతో పాటు కాలువ వెంట ఉన్న పదమూడు చెరువులకు నీరందిస్తున్నది.
ఎగువ సగిలేరు ప్రాజెక్టు కలసపాడు మండలం దిగువ తంబళ్లపల్లె వద్ద సగిలేరు నదిపై నిర్మించబడింది. దీనిని వంకమర్రి డ్యామ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఆయకట్టు 5448 ఎకరాలు. దీన్ని 1896లో 4.6 లక్షల వ్యయంతో నిర్మించారు. 1898-99లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో ఆనకట్టతో పాటు 10 మైళ్ల పొడవున్న కాలువ దారివెంట ఉన్న అనేక చెరువులకు నీరందిస్తున్నది.[4] 1996లో వరదల వళ్ళ దెబ్బతిన్న ఆనకట్ట, కాలువలు మరియు పంపీణీ వ్యవస్థను 2.32 కోట్ల ఖర్చుతో మరమ్మత్తులు చేశారు. ఈ పని మార్చి 2001లో పూర్తయ్యింది.

సువర్ణముఖి

స్వర్ణముఖి లేదా సువర్ణముఖి చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ఇది తిరుపతి-చంద్రగిరి మద్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం.
పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.

స్వర్ణముఖి నది దక్షిణ కైలాసం అనే పర్వతం నుండి ప్రవహిస్తుంది. ఇది ఉత్తర వాహిని. అగస్త్యముని ఈనది ని భూమి మీదకు తీసుకువచ్చాడు. ఈ నది ప్రసిద్ద శైవ క్షేత్రమైన 
శ్రీ కాళహస్తిదేవాలయము ప్రక్కగా ప్రవహించుచున్నది.
ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.

సువర్ణముఖి, నాగావళి

శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది యొక్క ఉపనది. సాలూరు (విజయనగరం జిల్లా) కొండలలో(ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాకి చెందినది) పుట్టి తూర్పుదిక్కుగా ప్రయాణించి సంగం దగ్గర నాగావళి నదిలో కలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి