20, అక్టోబర్ 2013, ఆదివారం

Tupperware తప్పనివేర్


టప్పర్‌వేర్ సంస్థ 1946లో తన తొలి ఉత్పత్తిని ప్రారంభించింది. పారిక్షిశామికంగా లభించే ప్లాస్టిక్ ద్వారా వంటింటి పాత్రలను పోలినట్టు భ్రమింపజేసే ఆకర్శణీయమైన ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయాలనే ఆలోచనే ఈ బ్రాండ్ కంపనీ స్థాపనకు కారణం. ఆధునికతను కోరుకునే ఇళ్లల్లో వినియోగానికి అవసరమైన పాత్రలను అంతే ఆధునికంగాను, ఆకర్షణీయంగానూ ప్లాస్టిక్‌తో తయారు చేయడం ఈ సంస్థ ఉద్దేశం. అంతేకాక లోనికి గాలి చొరబడకుండా ఉండి, వాటిల్లో ఉంచిన ఆహారం తాజాగా, ఎక్కువకాలం నిలువ ఉండాలనే ఉద్దేశం వీటి తయారీలో ముడిపడి ఉన్న ప్రధానాంశం.
tupperware1
ఇండియాలో టప్పర్‌వేర్
1946లోనే టప్పర్‌వేర్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ మన దేశంలోకి ప్రవేశించడానికి మాత్రం చాలాకాలమే పట్టింది. దీనికి ప్రధాన కారణం అప్పటికీ దేశీయ కిచెన్‌లో ప్లాస్టిక్‌వాడకం అంతగా లేకపోవడమే. అయితే 1996లో భారతదేశంలోకి అడుగుపెట్టిన టప్పర్‌వేర్ తన వినియోగాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఈ బ్రాండ్‌తో భారతదేశ వంటిల్లు ప్రపంచస్థాయికి చేరింది. అంతేకాక ఆధునిక భారతీయ వంటింటికి సరిపోయే అన్ని రకాల వస్తువులనూ అందించి ముఖ్యంగా మహిళల మనసు దోచుకుంది. కాగా, మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్నచిన్న కిచెన్‌లకు తగినట్లు పదార్థాలను ఎక్కువకాలం నిలువ చేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్లాస్టిక్‌పావూతలు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి అయ్యాయి. టప్పర్‌వేర్ మార్కెట్లు, పంపిణీ సంస్థలు కిచెన్‌లకు అవసరమైన అన్ని రకాల అవసరాలను తీర్చడంలో విజయం సాధించాయనే చెప్పొచ్చు. భారతీయ మహిళలు స్వతంవూతంగా టప్పర్‌వేర్ మార్కెట్‌ను తమ సొంత వ్యాపారంగా ప్రారంభించేంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే టప్పర్‌వేర్ వ్యాపారం మహిళల సాధికారతను పెంచింది. మహిళలు ఆర్థిక స్వాతంవూత్యాన్ని సాధించడానికి టప్పర్‌వేర్ మార్కెట్ ద్వారాలు తెరిసింది. అంతేకాక టప్పర్‌వేర్ మార్కెట్ దేశాలు, ప్రాంతాలు, మతాలు, ఆర్థిక హెచ్చుతగ్గులు అనే గీతను శాశ్వతంగా చెరిపివేసింది. ప్రపంచంలోనే బహుళవూపజాదరణ పొందిన బ్రాండ్‌గా ‘టప్పర్‌వేర్’ అవతరించింది. అందుకే టప్పర్‌వేర్ ‘ది మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్’ గా ఐదుసార్లు ‘ఫార్చ్యూన్’ (fortune) మ్యాగజైన్ గుర్తింపును పొందింది.


ఆధునిక వంటశాలలకు ఉపయుక్తమైన పాత్రలను అందించడం కోసం టప్పర్‌వేర్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. పట్టణ ప్రాంత కుటుంబాలకు అవసరమైన పాత్రలను 100 శాతం ప్లాస్టిక్‌తో అందించడంలో విజయం సాధించింది. మార్కెట్‌లో లభించే స్టీల్, గాజు పాత్రల్లోని అవశేషాలు వాటిలో నిలువ చేసిన ఆహార పదార్థాల్లో కలిసే అవకాశం ఉండొచ్చు. కానీ ప్లాస్టిక్‌వల్ల ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇంట్లోనే కాకుండా ఫంక్షన్‌లకు, పార్టీలకు అవసరమైన ఆహార పదార్థాలను కూడా వీటిల్లో నిలువ చేసుకునే అవకాశం ఉంది. టప్పర్‌వేర్‌లో అన్ని రకాలు అధిక వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగిఉండవు. వేడిగా లేని కూరలు, భోజనం, గింజలు ఇలా ఎవైనా వీటిల్లో నిలువ చేసుకోవచ్చు. టప్పర్‌వేర్‌లో నీటిని నిలువ చేసుకునే పాత్రలు (వాటర్ బాటిల్స్) కూడా ఉన్నాయి. ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు, సర్వింగ్ మైక్రోవేవ్‌లలో నిలువ చేసుకునేందుకు వీలుగా వీటిని రూపొందించారు.

వినియోగదారుల ఆవసరాలు, వినియోగ అవకాశాలు, ఆసక్తులను గుర్తిస్తూ టప్పర్‌వేర్‌లో ఎప్పటికప్పుడు ఆధునిక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మారుతున్న జీవన శైలులను అనుసరించి నూతన ఉత్పత్తుల రూపకల్పనలో టప్పర్‌వేర్ ఒక్కో పాత్రలో అడుగు ముందుకు వేస్తూ తన ఉత్పత్తి స్టైల్‌ను మార్చుకుంటూనే ఉంది. ‘ఇవి ఉన్నాయి. ఇవి లేవు’ అనే సందేహం తలెత్తకుండా 360 రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో టప్పర్‌వేర్ పనిచేస్తోంది. నగరవూపాంత వినియోగదారులు వీటిని కిచెన్‌లో వినియోగించడానికి అవసరమైన సూచలను సోషల్‌మీడియా ద్వారా టప్పర్‌వేర్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ప్రస్తుతం టప్పర్‌వేర్‌ను వినియోగించని పట్టణాలు దేశంలో చాలా అరుదు. టప్పర్‌వేర్ తన ఉత్పత్తులను సూపర్ ప్రీమియమ్ రేంజ్‌ను ultimo పేరుతో ప్రవేశపెట్టింది.ఈ ప్రత్యేకమైన శ్రేణి ఉత్పత్తులు వంట చేయడానికి అవసరమైన శక్తి వినియోగాన్ని తగ్గిస్తాయి. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో వీటికి అత్యధిక ప్రాధాన్యం పెరుగుతోంది.

2012లో టప్పర్‌వేర్ మరో ఆధునిక ఉత్పత్తిని ‘ఆమె చేయగలదు, నీవు చేయగలవు (she can, you can) టైటిల్‌తో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. సామాజిక వ్యాపారాల్లో రాణించే మహిళలను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. దీనివల్ల మహిళలు తమను తాము తీర్చిదిద్దుకోవడంతో పాటు నూతన సంస్థలు స్థాపించడానికి వారికి విశ్వసాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని సంస్థ నమ్మకం. ఇది నేటికి ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.అవసరానికి తగినట్లు తయారు చేయడమేకాదు.
EarlTupper
మహిళలు తమ వంటింటికి అవసరమైన ఆధునిక డిజైన్లు మార్కెట్లో లభించకపోతే ఆన్‌లైన్ ద్వారా ఆయా డిజైన్‌లను తెలిపి వాటిని తయారు చేయించుకునే అవకాశం కూడా టప్పర్‌వేర్ కల్పిస్తోంది. తమకు కావలసిన ఉత్పత్తులను వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. టప్పర్‌వేర్ చాలా సంవత్సరాల వరకు మన దేశంలో మాస్టర్‌వూబాండ్, సూపర్‌వూబాండ్, పవర్‌వూబాండ్ పేర్లతో చెలామణిలో ఉంది. అమెరికా చరివూతలో 1946-1958 మధ్యకాలంలో 100 రకాల టప్పర్‌వేర్ వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. కానీ, అవి వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్ ఇనిస్టిట్యూషన్స్, నేషనల్ మ్యూజియం లోనే ఉండిపోయాయి. టప్పర్‌వేర్ ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించే అవకాశం ఉన్న వ్యాపారం.

Earl Silas Tupper
టప్పర్‌వేర్ బ్రాండ్ సృష్టికర్త ఇతడే. అమెరికాకు చెందిన ఈ వ్యాపారి కెమిస్ట్. తేలికైన, మన్నికైన ఆహారాన్ని ఎక్కువ కాలం నిలువ ఉంచే టప్పర్‌వేర్ పాత్రలతో తప్పనిసరిగా ఎల్లకాలం గుర్తుంటాడు.
1907లో జన్మించిన ఇతగాడు మరణించడానికి ముందు సంవత్సరం, అంటే 1983లో తన కంపెనీని 16 మిలియన్ డాలర్లకు రెక్సాల్ కంపెనీకి అమ్మెసి, మెక్సికోలోని ఒక దీవిని ఖరీదు చేశాడు. అక్కడే చివరి ఘడియలు హాయిగా గడిపాడు. అలా అతని పాత్ర ముగిసింది.
~ మధు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి