రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారవుతుందని
కొంతకాలంగా సీమాంధ్ర నేతలు పాటపాడుతున్నా రు. ఇటీవలే ముఖ్యమంత్రి కూడా అదే
పల్లవి అందుకున్నా డు. రెండురోజుల కిందట జగన్‌బాబు కూడా జత కలిశాడు.
కాకపోతే జగన్, కిరణ్‌బాబులు నీటి యుద్ధాలు వస్తాయని హెచ్చరికలు చేయడమే కాక,
అదనంగా తమ మనసులోని మరికొన్ని మాటలను కూడా ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో
బహిర్గతం చేశారు. తెలంగాణను విడదీస్తే ప్రకృతి కోపిస్తుందని, సముద్రం
ఉప్పొంగుతుందని, సునామీలు వస్తాయని, భూమి బద్దలవుతుందని చెబుతూ రాష్ట్ర
ప్రజలను ఎంతగా బెదిరింపులకు గురిచేయాలో అంతా చేశారు.వీరు చెప్పిన దాంట్లో
ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు. నిజమని సీమాంధ్ర ప్రాంతానికి చెందని, లేక
రాష్ట్రేతర జలరంగ నిపుణులతో చెప్పించమనండి! అంతెందుకు సీమాంవూధకు చెందిన
నిపుణులే వీరి ప్రకటనలతో విస్మయం చెందుతున్నారు.
వాస్తవాలకు భిన్నంగా, అశాస్త్రీయంగా,హేతుబద్ధత లేకుండా వాదిస్తే ఏ నిపుణుడు మాత్రం వీరికి వత్తాసు పలుకుతాడు? ఈ రాజకీయ నాయకులకు వాస్తవాలతో పనిలేదు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ఎండిపోతుందని, రాజస్థాన్‌లా మారుతుందని ప్రజలను భయవూభాంతులకు గురిచేసి తమ పబ్బం గడుపుకుంటే చాలు. విషయమేమంటే వీళ్లెవరికీ తెలంగాణ రావడం ఇష్టంలేదు. కృష్ణా గోదావరి నదులపైన ఆధిపత్యం కోల్పోవడం ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పడి తే తమ ఇష్టం వచ్చినట్టు నీళ్లు దోచుకుని, తమ కిష్టమైన ప్రాంతాలకు తరలించుకోవడం మున్ముందు కుదరదు. జలాశయాల్లో తగినన్ని నీళ్లున్నా లేకపోయినా ప్రభుత్వాన్ని లొంగదీసుకుని, జీవోలను పక్కనపెట్టి తమ బీళ్లకు నారుమళ్ల పేరుచెప్పి, మరో కారణం చెప్పి, నీటిని మళ్లించుకోవడం సాధ్యంకాదు. అందుకే నానాయాగీ చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేసి వారిని కూడా రోడ్డునపడేసి విద్యార్థులు, ఉద్యోగులతో సమ్మెలు ధర్నాలు చేయించగలిగితే కేంద్రంపై ఒత్తిడితెచ్చి తెలంగాణ ప్రక్రియను ఆపించవచ్చు అన్నది వీళ్ల కుట్ర.
17-9-2013 నాడు క్యాంపు కార్యాలయంలో సీఎం విలేకర్ల సమావేశంలో రాష్ట్ర విడిపోతే ఎన్ని నష్టాలు, కష్టాలకు గురికావలసి వస్తుందో పటంపైన పాయింట్ కర్రతో చూపుతూ స్కూల్ మాస్టారులా అర్థం చేయంచడానికి ప్రయత్నించారు. వారు ప్రస్తావించిన ముఖ్యమైన నీటి అంశాలు ఇవి.
1) కృష్ణా గోదావరి ఒకే రాష్ట్రంలో ఉండాలట
సీఎం ఉవాచ: రాష్ట్రం కలిసి ఉండాలని ఫజల్ అలీ చెప్పడానికి కారణం కృష్ణా, గోదావరి నదుల్లో నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఆ రెండు ఒకే రాష్ట్రంలో ఉండాలని చెప్పారు.
కామెంట్: ఎస్సార్సీ రిపోర్టు (పేజీ 377)లో ఏం రాసుందో గమనించండి. ‘భవిష్యత్తు ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలోని డిమాండ్లు విశాలాంవూధలో సముచిత పరిశీలనకు నోచుకోవని వారి భయం.
అత్యంత ప్రతిష్టాత్మకమైన నందికొండ, కుష్ణాపురం (గోదావరిపైన పోచంపాడు కంటే ముందు ప్రతిపాదించింది) భారీ ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి పైన తలపెట్టడం జరిగింది. కనుక తెలంగాణ, కృష్ణా, గోదావరి నదుల నీటి వినియోగంలో తమకు లభించిన స్వతంత్ర హక్కులను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. ఇంత స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్‌లో రాసి ఉంటే ముఖ్యమంత్రి వక్ర భాష్యం చెప్తే ఎట్లా? కృష్ణా, గోదావరి ఒకే రాష్ట్రంలో ఉండాలంటే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను కూడా మన రాష్ట్రంలో కలపాలనా సీఎం ఉద్దేశ్యం!
2. రాష్ట్రం విడిపోతే సాగర్‌ను కట్టేవాళ్లం కాదట?
సీఎం ఉవాచ: 1955లో జవహర్‌లాల్ నెహ్రూ సాగర్‌కు పునాది వేస్తే 1967లో ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రం విడిపోతే ఈ ప్రాజెక్టు కట్టేవాళ్లమా?
కామెంట్: బహుశా సీఎం గారికి చరిత్ర తెలియకపోవచ్చు. 1933లోనే నిజాం ప్రభుత్వం ‘సాగర్’ డ్యాంకు నందికొండ దగ్గర క్షేత్రస్థాయి అధ్యయనాలు కొనసాగించింది. మద్రాసు ప్రభుత్వాన్ని తనతోపాటుగా కార్యక్షికమంలో పాలుపంచుకోమని ఆహ్వానించింది. మద్రాసు ఒప్పుకోకపోవడంతో ఒంటరిగానే ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. అంతకు ఏడాది క్రితం అంటే 1951లో మద్రాసు కృష్ణా-పెన్నార్ రిపోర్టు పంపింది. సిద్దేశ్వరం దగ్గర పెద్ద డ్యాం నిర్మించి భారీ కాలువ సహాయంతో కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలించే ప్రాజెక్టు ఇది. కేంద్రం ఖోస్లా కమిటీ సిఫార్సుల మేరకు మార్పు లు చేసి అంతిమంగా నాగార్జునసాగర్‌ని ఉమ్మడి ప్రాజెక్టుగా రూపొందించమని ఉభయ రాష్ట్రాలకు సూచించింది.
1954లో నాగార్జునసాగర్ రిపోర్ట్‌ను మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాలు ఉమ్మడిగా రూపొందించాయి. కనుక రెండు కాని ఎక్కువ రాష్ట్రాలు గానీ నదీ జలాలను పంచుకుంటే కావలసింది ఆయా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు. రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రాజెక్టులు కట్టుకుంటాయా, విడివిడిగా కట్టుకుంటాయా వారిష్టం. గతంలో మద్రాసు, హైదరాబాద్ ఉమ్మడిగా తుంగభవూదపైన తుంగభద్ర ప్రాజెక్టు కట్టుకోలేదా? అదే తుంగభవూదపైన విడివిడిగా కేసీ కాలువ, రాజోలిబండలు పూర్తికాలేదా? ఇప్పుడు పెన్‌గంగపైన లోయర్ పెన్‌గంగ, లెండిపైన లెండి ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాజెక్టులుగా నిర్మాణం కావడం లేదా?
3. ఒకే రాష్ట్రంలో ముంపు ఉంటే ఒప్పించగలిగాం. పోలవరం విషయంలో ఒప్పించలేక ఇబ్బంది పడుతున్నాం.
సీఎం ఉవాచ: శ్రీశైలం ముంపు మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లో ఉంది. పులిచింతల ముంపు గుంటూరు నల్గొండ జిల్లాల్లో ఉంది. కనుక ఒప్పించగలిగాం. పోలవరం విషయంలో ఒడిషా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఒప్పించడానికి ఇబ్బందిపడుతున్నాం.
కామెంట్: ముంపు మన రాష్ట్రంలో ఉన్నప్పుడుమాత్రం బాధితులను సంప్రదించి ఒప్పించిందెక్కడ? ఒప్పుకున్నవాడు ఒప్పుకున్నాడు. లేకపోతే ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా నిర్వాసితులను చేసిన ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ సింగూరు ఇతర ప్రాజెక్టుల బాధితులు కోర్టుల చుట్టూ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల విషయం అలా కుదరదే! వాళ్లని సంప్రదించకుండానే ఎలాంటి అనుమతులు పొందకుండానే పోలవరం చేపట్టడం, తత్ఫలితంగా ఈవేళ ఇన్ని ఇబ్బందు లు.అయినా‘పోలవరం’లో పడుతున్న ఇబ్బందులు సమైక్య రాష్ట్రంలోనేగా.
4. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ఇబ్బందులు
సీఎం ఉవాచ: శ్రీశైలం జలాశయం ద్వారా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో 13.65 లక్షల ఎకరాలు, నాలుగు రాయలసీమ జిల్లాలకు 22.56 లక్షల ఎకరాలు కోస్తాంధ్ర జిల్లాలకు (నెల్లూరు, ప్రకాశం) 4.,22లక్షల ఎకరాల వెరసీ 40.33 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించిన నీళ్లు 99.7 టీఎంసీలే. అయినా 326 టీఎంసీలను వాడుకుంటున్నాం. కేటాయించిన నీరు, వరదనీరు ఉండడం దీనికి కారణం. రాష్ట్రాన్ని విభజిస్తే ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరువరకు ఇస్తామని, వరదనీరు ఇవ్వబోమని అంటారు. రైతులు రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేసుకుంటున్నాం. రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఈ సర్దుబాటుకు ఆస్కారం ఉండదు.
కామెంట్: శ్రీశైలం ద్వారా 40.33 లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్న మాట అవాస్తవం. మనకు లభించిన నికర జలాలు 19 టీఎంసీలు అని శ్రీశైలం కుడిగట్టు కాలువకు కేటాయించబడినాయి. తెలంగాణలోని నెట్టంపాడు, కల్వకుర్తి (మహబూబ్‌నగర్‌జిల్లా), ఎస్‌ఎల్‌బీసీ సొరంగం (నల్గొండ), వెలిగొండ పకాశం), హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి (రాయలసీమ) ఇవన్నీ 227.50 టీఎంసీల మిగులు జలాలు ఉపయోగించుకుంటాయి. తెలుగుగంగ పూర్తిగా ఎస్‌ఎల్‌బీసీకి ప్రత్యామ్నాయం, ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు పాక్షికంగా పూర్తయి వరదనీటిని కొంతమేరకు ఉపయోగించుకుంటున్నాయి. అయితే వరద నీటిపైన మనకు ఎలాంటి హక్కులేదు. కనుక ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. పైగా ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఎన్ని మిగులు జలాలను, ఎన్ని ప్రాజెక్టులకు కేటాయిస్తారో ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అక్రమంగా తెలంగాణకు చెందిన కృష్ణా నికర జలాలను ప్రభుత్వం సర్దుబాటు పేరుతో 326 టీఎంసీల వరద జలాల ముసుగులో సీమకు తరలించారన్న సంగతి స్వయాన ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు. నిజమే. తెలంగాణ విడిపోతే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ సర్దుబాటు సాధ్యం కాదు. కనుక కలిసుంటే తెలంగాణను ముంచి నికర జలాలను కావలసిన ప్రాంతాలకు తేలిగ్గా తరలించవచ్చు.
మనం రెండు రాష్ట్రాలుగా విడిపోతే మనకు నికర జలాలు మాత్రమే ఇస్తామని, మిగులు జలాలు ఇవ్వమని ఎవరూ చెప్పలేదు. ముఖ్యమంవూతికి ఈ విషయం ఎవరు చెప్పారో మరి!
5. ఆలమట్టి వల్ల వచ్చే కష్టాలు
సీఎం ఉవాచ: ఆలమట్టి ఎత్తు పెంచారు. మనకు నీరు రావాలంటే ముందు వారి ప్రాజెక్టు నిండాలి. మనం 1150 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టుకున్నాం. 811 టీఎంసీల కేటాయింపే ఉంది. 300 టీఎంసీల నీరు తక్కువ వస్తోంది. ప్రస్తుతం ఆగస్టు చివరి వారంలో సాగర్‌లోకి నీళ్లు వదులుతున్నాం. జూలై ఒకటి రెండు రెండు వారల్లో నీటిని వదలగలిగితే 170 టీఎంసీలు కలిసివస్తుంది.
కామెంట్: రాష్ట్ర విభజనకు, ఆలమట్టిలో నీళ్లు నిండడానికి ఏం సంబంధమో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆలమట్టి నిండాకే మనకు నీళ్లు వస్తాయి. కరెక్టే. మనం అంగీకరించిన ప్లాన్ ‘A’ ప్రకారం అంటే-వాళ్లు కర్ణాటక నింపుకున్నాకే మనకు వస్తాయి. 811 టీఎంసీల కేటాయింపులే ఉంటే 1150 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టుకుంటే లోటు ఉండదా మరి? పై రాష్ట్రాలు తమ కనుకూలంగా, వీలుగా కిందికి నీళ్లు వదులుతాయి. గానీ మనకనుకూలంగా విడిచిపెట్టవు గదా!
6. పోలవరం, సాగర్ టెయిల్‌పాండ్ సిద్ధమయితే గోదావరి నీళ్లు కృష్ణాకు.
సీఎం ఉవాచ: పోలవరం సిద్ధమయితే 80 టీఎంసీలు మళ్లించవచ్చు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు 35 టీఎంసీలు పోను, మనకు 45 టీఎంసీలు లభిస్తే వాటిని రాయలసీమకు, తెలంగాణకు ఉపయోగించుకోవచ్చు. దుమ్ముగూడెం సాగర్ టెయిల్‌పాండ్ ద్వారా 165 టీఎంసీల నీటిని సాగర్‌కు తేవచ్చు. శ్రీశైలంలో 872 అడుగులు దాటితేనే హంద్రీనీవాకు నీరు వదలవచ్చు. సీమ జిల్లాలు నాలుగు దీనికిందే ఉన్నాయి. రోజుకు 6.5 టీఎంసీల నీరు విద్యుత్తుకు అవసరం. ప్రాజెక్టులోకి నీరు రాకపోతే పరిస్థితి ఏమిటి? విద్యుత్తు కోసం నీటిని వాడితే 20 రోజుల్లో నీరు అయిపోతుంది.
పోలవరం సాంక్షన్ అయితే, మనకు 45 టీఎంసీలు వస్తాయన్నది నిజం. అయితే వాటిని ఎవరికెన్ని ఇస్తారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ఇవి నికర జలాలు. ఇక దమ్ముగూడెం నుంచి తరలించాలనుకుంటున్నవి మిగులు జలా లు. దుమ్ముగూడెం ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు బతికిబట్టకట్టడం కష్టం. ‘హంవూదీనీవా’ అనధికార జలాల బిజేష్ ప్రాథమిక తీర్పు అనుసరించి) కేటాయింపులు లేవు. శ్రీశైలం విద్యుత్ కోసం కట్టబడిన ప్రాజెక్టు. విద్యుత్తు కోసం జలాశయం ఖాళీ అయితే ఆ నీరు చేరుకునేది సాగర్‌కేగా.
7. విడిగా ఉంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టగలిగే వాళ్లమా?
సీఎం ఉవాచ: 1956లోనే విడిపోయి ఉంటే ఇన్ని ప్రాజెక్టులు, ఇంత ఆయకట్టు వచ్చి ఉండేదా? ఒక్క ప్రాజెక్టు అయినా కట్టగలిగే వాళ్లమా?
ఇంత అమాయకమైన వ్యాఖ్య సీఎం నోటి నుంచి రావడం దురదృష్టకరం. విడిగా ఉంటే, ప్రాజెక్టులు కట్టుకోరా? పంజాబ్ నుంచి హర్యానా, హిమాచల్ విడిపోతే ప్రాజెక్టులు కట్టుకోలేదా? ‘తుంగభద్ర’ ఉమ్మడి ప్రాజెక్టు కట్టుకోలేదా? ప్రాజెక్టు కట్టుకోవడానికి కావలసింది నీటి కేటాయింపులు, డబ్బు. మిగిలిన హంగులన్నీ తేలిగ్గా సమకూర్చుకోవచ్చు.
8. నీటి ఎద్దడి వల్ల యుద్ధాలు వస్తాయి.
సీఎం, జగన్ ఉవాచ: రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయి.
కామెంట్: ప్రపంచంలో ఎక్కడైనా సరే నీటి ఎద్దడి ఏర్పడితే నీటి యుద్ధా లు భవిష్యత్తులో సంభవిస్తాయని నిపుణులే చెబుతున్నారు. అది తెలంగాణ ఏర్పడడం వల్ల కాదు. తెలంగాణ విడిగా ఉన్నా సమైక్యంగా ఉన్నా దాని నీటి వాటా దానికుంది. అట్లాగే సీమాంధ్ర వాటా సీమాంవూధకుంది. కనుక నీటి వాటాల్లో ఎలాంటి తేడా రాదు. ఈ నీటిని సక్రమంగా బట్వాడా చేయడానికి ‘కేంద్రం’ కంట్రోల్ బోర్డులు ఏర్పాటు చేస్తుంది. అవి ఏ రాష్ట్రానికి ఎంత నీరు విడుదల చేయాలో అంత కచ్చితంగా చేస్తుంది. కనుక న్యాయంగా, సక్రమంగా ఏ రాష్ట్రానికి ఎంత నీరు రావాలో అంతే నీటిని కంట్రోల్ బోర్డులు బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులననుసరించి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా సక్రమంగా నీటిని విడుదల చేస్తామంటే కుదరదంటున్నారు మన సీమాంధ్ర నాయకులు.
‘కలిసి ఉంటే’ ఆంధ్రవూపదేశ్‌లో కంట్రోల్ బోర్డుల ఏర్పాటు అవసరముండదు. తమకు అవసరమైన చోటుకు, ఎలాంటి అడ్డంకులు లేకుండా కావలసినంత నీటిని తరలించుకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది.
జగన్ బాబు మరో కొత్త మాట కూడా అన్నాడు. ‘కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా’ తాగడానికి కూడా ప్రజలు ఇబ్బందిపడతారట. దీన్ని కాస్త విశదీకరిస్తే బావుంటుంది జగన్ బాబూ.. నీకు ఈ సంగతి ఎవరు చెప్పారు నాయనా? మీ ఇంజనీర్లా? నాయకులా? దీనంత పచ్చి అబద్ధం మరోటి లేదు. తెలంగాణకు తాగునీటికి ఏమిటి సంబంధం? తెలంగాణ వస్తే పోలవరానికి నీళ్లెట్లా వస్తాయని జగన్‌ది మరో ప్రశ్న. పోలవరానికి నీళ్లు రాకుండా తెలంగాణ వాళ్లేమన్నా ప్రాజెక్టులు కట్టుకున్నారా? జగన్‌బాబూ. గోదావరి నికర జలాలలో 580 టీఎంసీలను కోస్తాకు, 900 టీఎంసీలను తెలంగాణకు ప్రభుత్వం కేటాయించింది. పోలవరం కేటాయింపు ఉంది. తెలంగాణ అభ్యంతరం చెబుతున్నది పోలవరం ఎత్తుకు-తద్వారా ఖమ్మం జిల్లాలో ఏర్పడే భారీ ముంపుకు మాత్రమే. అంతేగానీ నీటి కేటాయింపులకు కాదు. కామెంట్ చేసేటప్పుడు విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి