1, అక్టోబర్ 2013, మంగళవారం

విధ్వంసంవల్లే ఉత్తరాఖండ్ విపత్తు


ఉత్తరాఖండ్ వరదల విధ్వంసం తర్వాత..‘అభివృద్ధి’ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఉత్తరాఖండ్‌లో జరిగిన విషాదం, విధ్వంసాన్ని కేవలం ప్రకృతి వైపరిత్యంగానే చూడాలా? లేదా.. మరే కారణాలు తోడయ్యాయన్న దానిపై తీవ్రంగా చర్చ సాగుతున్నది. ఈనేపథ్యంలోనే ఉత్తరాఖండ్ విధ్వంసానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు, సామాజికశాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే అభివృద్ధి విధానం ఎలా ఉండాలన్న దానిపై కూడా తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే సమాజంలో అడుగడుగునా అవినీతి పెచ్చుమీరుతున్న తరుణంలో అభివృద్ధి కూడా అది దాని సారంలో రూపు మార్చుకున్నదా అన్న అర్థంలోనూ ఆలోచించాలి. ఈ అవినీతి అన్ని రంగాలకు అన్నీ అవినీతి కూపంలో కూరుకుపోయిన సందర్భంలో అభివృద్ధి అన్న దాన్ని ఎలా చూడాలి? ఎలా ఉండాలి? అన్నది ప్రధాన ఎజెండాగా మారింది. అభివృద్ధిలో సామాజిక జీవనం విధ్వంసం అయితే, మానవహక్కులు హరించిపోతే..దాన్ని అభివృద్ధిగా ఎలా చెప్పాలన్న ది కూడా ప్రధాన అంశం అవుతున్నది. ఇక్కడనే మనం ఉత్తరాఖండ్ గురించి కొంత చెప్పుకోవాలి. ఆశ్చర్యకరంగా 2009 నుంచే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సీఏజీ అక్కడ జరుగుతున్న విధానాల గురించి అనేకసార్లు హెచ్చరించింది. అభివృద్ధి పేరిట జరుగుతున్న కార్యక్షికమాల్లో పర్యావరణాన్ని, మానవ జీవనాన్ని పట్టించుకోకపోవడం గురించి అనేకసార్లు హెచ్చరించింది. నియమ రహిత నిర్మాణాలు పర్యావరణానికి చేసే హాని గురించి తెలియజెప్పింది.అలాగే.. దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా, ‘హై సెస్మిక్ జోన్’గా ఉన్న ప్రాంతంలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులు, డ్యాములు, పవర్ ప్రాజెక్టులు పర్యావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్‌లో గతంలో జరిగిన విధ్వంసాలు, భూకంపాల నేపథ్యంలో ఈ ప్రాంతం ప్రాజెక్టుల నిర్మాణానికి, కాంక్రీట్ నిర్మాణాలు, కట్టడాలకు అనువైన ప్రాంతం కాదని తేల్చిచెప్పింది. అయినా.. వీటినెవరూ పట్టించుకు న్న పాపాన పోలేదు. ఫలితంగా.. కనివిని ఎరుగని బీభత్సాన్ని అనుభవించాల్సి వచ్చింది. దీనికి తోడు.. ఉత్తరాఖండ్‌లోయల్లో నిర్మాణమవుతున్న నిర్మాణాలు, ప్రాజెక్టుల కారణంగా అకస్మాత్తుగా తలెత్తే వరదముప్పు గురించి కూడా హెచ్చరించిం ది. అకస్మాత్తుగా వచ్చే వరద విలయాన్నుంచి బయటపడేందుకు విలువైన సూచనలు చేసింది. అయి నా ఇవేవీ ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఊహించనిస్థాయిలో విపత్తు సంభవించిం ది. వందలాదిమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిం ది. ఈ విధ్వంసం మన మందు అనేక ప్రశ్నలను, సవాళ్లను ఉంచింది. పాలనలో, అభివృద్ధిలో నైతికత ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

ఉత్తరాఖండ్ లోయల్లో సహజసిద్ధ ప్రవాహాలను అడ్డుకునే ప్రాజెక్టులను నిర్మించకూడదని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ)కూడా 1994 లోనే హెచ్చరించింది. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లోని నదులపై డ్యా ములను, ప్రాజెక్టులను కట్టి పర్యావరణానికి హాని తలపెట్టవద్దని తెలిపింది. కానీ మన పాలకులు దాన్ని ఇప్పుడు ‘మృత్యులోయ’గా మార్చారు. కేధార్‌నాథ్ ప్రాంతం సివిల్ నిర్మాణాలు చేపట్టడానికి అనువైన ప్రాంతం కాదని జీఎస్‌ఐ తేల్చింది. దేవాలయ అధికారులకు కూడా నిర్మాణాలు చేపట్టడం మంచిదికాదన్నది. 2004 తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన సునామీ, భూ కంపాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రాంతం కూడా అతిసున్నిత ప్రాంతంగా ఉన్నదని భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అంటున్నారు. ఉత్తరాఖండ్‌లో విచ్చలవిడిగా చేపట్టిన నిర్మాణ పనులే విధ్వంసానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఈ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన చిప్కో ఉద్యమం కూడా ఊపిరిపోసుకున్నది. విచక్షణారహిత అడవుల నరికివేతకు నిరసనగా మహిళలు కదిలి అడవిని రక్షించేందుకు నడుం కట్టారు. కాంట్రాక్టర్లు, స్మగ్లర్లు అడవిలోని చెట్లను నరికివేస్తున్న తీరును స్థానిక మహిళలు చెట్లను అల్లుకొని నరికివేయకుండా అడ్డుకున్నారు. అడవి నరికివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాల్లోగొప్ప ఉద్యమంగా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందింది. అడవి రక్షణ ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేతనే నేడు అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే అభివృద్ధి అంటే.. భౌతికాభివృద్ధి అయిపోయింది. అందుకే.. సర్వత్రా ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. డ్యాములు, ప్రాజెక్టులు, న్యూక్లియర్ ప్లాంట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాడుతున్నారు. పర్యావరణాన్ని బలిపెట్టి అభివృద్ధిపేరిట ప్రాజెక్టులు నిర్మించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న అభివృద్ధిలో ప్రజల జీవనం విధ్వంసం అవుతున్నా పట్టించుకోవడంలేదు. దీంతో..ఇవాళ అభివృద్ధికి ఇరువైపులా రెండు సమూహాలుగా పరస్పర విరుద్ధ అభివూపాయాలతో విడిపోయారు.ఇక్కడే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక్కడే చట్టాలు, విధివిధానాలు, నైతిక విలువలు, మానావాభివృద్ధి, సంతులత అభివృద్ధి, అభివృద్ధివిలువలు వంటివి ఎజెండామీదికి వస్తున్నాయి.

అభివృద్ధి విలువలు పశ్చిమదేశాల్లో సక్రమంగా అమలు కావడం మూలం గా అక్కడ అభివృద్ధి వికృతరూపం దాల్చలేదు. పాశ్చాత్య దేశాల్లో పారిక్షిశామిక, సామాజికాభివృద్ధి ఎంత జరిగినా సమాజిక రక్షణ సూత్రాలు పాటించిన విధానం కనిపిస్తున్నది. అభివృద్ధి అన్నది మానవజీవితానికి సంబంధించి సమక్షిగాభివృద్ధిగా ఉండాలి. అభివృద్ధి అంటే.. ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా.., సమాజ నైతికాభివృద్ధిగా ఉండాలి.నైతికత అనేది అభివృద్ధితో విడదీయరానిదిగా ఉండితీరాలి. ఈ అర్థంలో అభివృద్ధి అనేది విలువలు, ప్రవర్త న, లక్ష్యాల సమ్మిళితంగా ఉండాలి. అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది జాతీయోత్పత్తిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. జీడీపీ పైనే లెక్కలేసి చూస్తున్నారు. అభివృద్ధి మానవ జీవిత ఉన్నతీకరణను, జీవన ప్రమాణాన్ని కూడా వ్యక్తీకరించాలి. పెంపొందించాలి. ఆర్థికాభివృద్ధికి తోడు.. సామాజిక నైపుణ్యా లు, ప్రతిఫలాలు, నైతిక విలువలు అభివృద్ధిలో అంతర్భాగం కావాలి. ‘అభివృద్ధి’పై విస్తృతంగా అధ్యయనం చేసిన డెనిస్ గౌలెట్ ‘అసలైన అభివృద్ధి’ అంటే ఏమిటో సిద్ధాంతీకరించాడు. అసలైన అభివృద్ధి అంటే.. ప్రజల భాగస్వామ్యం తో వారి ఆలోచనలతో వారి కోరికతో జరిగేదని తెలిపాడు. కానీ.. ఇవాళ.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అనేది లేకుం డాపోయింది. పాలకులు, పెట్టుబడిదారుల ఆలోచనల్లోంచి పుట్టుకువచ్చిన కార్యకలాపాలు, నిర్మాణాలు అభివృద్ధిగా చెబుతున్నారు. ఉన్నతాధికార వర్గంలోని నిర్ణయాలు, వాటి అమలులో పక్షపాతం, వివక్ష ప్రధాన అంశాలుగా అభివృద్ధిని నిర్దేశిస్తున్నాయి. రాజకీయ నేత లు, అధికారులు, అమలు చేసే కాంట్రాక్టర్లు అభివృద్ధి రూపాన్ని, సారాన్ని రూపొందిస్తున్నా రు. అధికారం నుంచి విధానాలు, బాధ్యతలు నిర్దేశించినప్పటికీ.. అవి వాటి అసలైన లక్ష్యాలకు దూరం గా ఉంటున్నాయి. ప్రజలకు నైతికంగా అండగా నిలవలేకపోతున్నాయి. అధికార గణం బాధ్యతారాహిత్యం అభివృద్ధి కార్యక్షికమాల అసలు లక్ష్యాలను నాశనం చేస్తున్నది. నియంతృత్వ విధానాలు, ఒంటెద్దు పోకడలు శాపాలుగా మారాయి. జవాబుదారీ తనం అనేది అనేక విషయాల్లో నైతికతను నిలబెడుతుంది. ఏది చేయాలో, ఏది చేయొద్దో చెబుతుంది. తెలియక చేసినా, తెలిసి చేసినా వాటి పర్యావసానాలను తెలియజేస్తుంది.ఇది ఉద్దేశ్య పూర్వక నిర్లక్ష్యాన్ని అనుమతించ దు. అలాగే పారదర్శకత కూడా నైతికతను పెంపొందిస్తుంది. ఇది అభివృద్ధికి ఇరువైపులా ఉన్న ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని అంతిమంగా మంచివైపు నిలుస్తుంది. పారదర్శకత అంతిమంగా అవినీతిని, లంచగొండితనాన్ని రూపుమాపుతుంది. అలాగే ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలను నివారిస్తుంది. బంధువూపీతి, వ్యక్తిగత ప్రయోజనాలు ప్రధానమైన ఈనాటి సమాజంలో పారదర్శకత పౌరసమాజ ప్రయోజనాలను కాపాడుతుంది.

దురదృష్టవశాత్తూ.. నైతిక విలువలు పతనమైపోయి మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఎప్పుడైతే.. నైతికతకు తావులేకుండా పోతుందో.. అవినీతి విశ్వరూపమెత్తుతుంది. ప్రజలతో సంబంధాల్లో అవినీతి, బంధువూపీతి చోటు చేసుకుంటుంది. అప్పుడు అభివృద్ధి అనేది అనుకున్న లక్ష్యాలకు ఆమడ దూరంలో ఉంటుంది. దీంతో.. సమాజంలో అన్ని రకాల అవలక్షణాలు పాదుకొల్పబడతాయి. సామాజిక విలువలు పతనమై సంస్కృతికంగా దిగజారుడుతనం రాజ్యమేలుతుంది.ఆర్థికాభివృద్ధిలో మానవ సంబంధాలు, విలువలు అడుగంటుతాయి.నదులు, అడవులు,లోయలు,సహజవనరులు సరకులై పోతాయి. ప్రజలు నేరస్తులవుతారు. మనిషికోసం అభివృద్ధి గాక..అభివృద్ధికోసం మనిషిని బలితీసుకుంటారు. సరిగ్గా ఇదే ఉత్తరాఖండ్‌లో జరిగింది. అభివృద్ధి పేరిట ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేశారు. మనిషిని బలిచేశారు.
-డాక్టర్ ఎస్. సరస్వతి
ఐసీఎస్‌ఎస్‌ఆర్ మాజీ డైరెక్టర్, న్యూఢిల్లీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి