అన్నింట్లో ఆదాసూత్రం
ఎంత
రాబడి వచ్చిందన్నది కాదు, ఎంత ఆదా చేసాం, ఎంత పొందికగా ఇంటి ఖర్చులు
ప్రణాళిక వేసుకుని, డబ్బు ఆదా చేయగలిగాం, అవసరానికి తడుముకోకుండా ఉన్నంతలో
ఎంత జాగ్రత్తగా మసలుకున్నాం అన్నది ముఖ్యం. పొదుపు మంత్రాలను అనుసరిస్తే,
తప్పకుండా నెలసరి ఖర్చుల్లో మిగుల్చుకోవచ్చు.
న్నిసార్లు పనికిరాని వస్తువులను కూడా వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. చలికాలంలో కొనే క్రీములు, లోషన్‌లు మళ్ళీ చలికాలం వచ్చేవరకు ఉంచడం ఇష్టంలేకపోయినా, లేక ఎక్స్‌పైరీ తేదీ దాటిపోయినవి ఉన్నా అలాటివాటిని పారేయక్కర లేకుండా షూస్, బ్యాగులు, సోఫాల వంటి వస్తువులు శుభ్రం చేసుకొవడానికి ఉపయోగించుకోవచ్చు. కూరగాయల నుండి మనం పనికి రావని పారేసే చాలా వాటిని ఉపయోగకరంగా వాడుకోవచ్చు. బీరపోట్టు, ఆనపకాయ పొట్టుతో పచ్చడి చేసుకుంటే రుచికి రుచి, అందులో ఉండే పీచుపదార్ధం ఎంతో మంచిది కూడా. గుమ్మడి గింజలు పారేయకుండా కడిగి ఎండ పెట్టి తినచ్చు. దీనికి ప్రొస్టేటైసిస్ వ్యాధిని తగ్గిస్తుంది.కమలా పండు తొక్కలను ఎండపెట్టి పొడి చేసి ఫేస్ ప్యాక్‌లా వాడుకోవచ్చు.ఇలా వంటింటి నుండి మనం పదార్ధాల వ్యర్ధాలను వివిధ రకాలుగా ఉవయోగించుకోవచ్చు. చిన్న రిపేర్లు చేసుకోవడం అలవాటు చేసుకోవడం వలన చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. ఉదాహరణకు బట్టలకు చిన్న గుండీ ఊడిందనో, కొంచం కుట్లు ఊడాయనో పడేయకుండా వారానికి ఒకట్రెండు గంటలు సమయం సరిచేసుకుని వాడుకోవచ్చు. బ్యాగుల వంటి వాటికి జిప్ పోయిందని పడేయకుండా బాగు చేసుకోవచ్చు.కొన్న వస్తువును పూర్తిగా వినియోగించడం కూడా ఆదానే.
షాపింగ్ సూత్రాలు
రోజుకో వస్తువు కోసం సూపర్ మార్కెట్‌కి వెళ్ళే అలవాటు మానాలి. పొద్దున్నే పాలు, బ్రెడ్ కోసం బయటకు వెళ్ళి అదే చేత్తో పేస్ట్, పౌడర్, రవ్వ లాటివి కొనుక్కొచ్చే అలవాటు ఉంటే స్వస్తి చెప్పేయాలి. ప్రతీదానికి చీటికి మాటికి బయటకు వెళ్ళడం వలన శారీరక శ్రమ, సమయం వృధానే కాక ఎంత ఖర్చు పెట్టామన్న దానికి ఒక లెక్క ఉండదు.వీలును, ఖర్చు పెట్టగలిగినంత సామర్ధ్యాన్ని బట్టి వారానికి లేదా నెలకొకసారి లిస్ట్ రాసి నెలకు అవసరమైనంత మాత్రమే తెచ్చుకోవాలి. ఊరికే తోచక షాపింగ్‌కు వెళ్ళే అలవాటు వల్ల అనవసరమైన వస్తువులు వచ్చి చేరడమే కాదు డబ్బు వృధా అవుతుంది. బజారుకు వెళ్ళినపుడు మనం ఏం కొనాలి, వాటి ధర ఎంతలో ఉంటే మన బడ్జెట్ దాటకుండా ఉండచ్చో తప్పకుండా ఒక అంచనాతో ఉండాలి. పర్స్‌లో 1000 రూపాయలు ఉంటే 1500 రూపాయల వస్తువు మీదకు మనస్సు పోతే మిగిలిన 500 మనతో వచ్చిన స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవలసిందే మరి.ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే , 'ఒక్క నిముషం' నిబంధన పాటించండి. మీరు ఆ వస్తువు కొనడానికి తీయబోయే ముందు ఒక్క నిముషం ఆగండి. 'నేను తీసుకోబోయే ఈ వస్తువు నిజంగా నాకు అవసరమైనదేనా'అని, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సంతుష్టికరమైన సమాధానం లభించకపోతే ఆగిపోండి. కొనద్దు. షాపింగ్‌కి వెళ్ళేపుడు తప్పకుండా కాలిక్యులేటర్ బ్యాగ్‌లో ఉంచుకుని తీసుకెళ్ళాలి. మీరు కొన్న వస్తువులకు ఇచ్చిన బిల్‌ను ఇంకోసారి సరిచూసుకోవడం మంచిది. దుకాణదారుడి లెక్కలో పొరపాటు వస్తే నష్టపోకుండా ఉండచ్చు.
ఫోన్ బిల్లు, కరంట్ బిల్లు ఇలా తగ్గించేద్దాం
ఒకవేళ ఇంట్లో ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ సర్వీస్‌లు ఉన్నట్టైతే, ఈ సేవలన్నీ కలిపి అందించే బల్క్ ప్రొవైడర్స్ నుండి సేవలు తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. ఇవాళ, రేపు సెల్‌ఫోన్ ఒక అవసరం. అంతకుముందు ఇరుగు, పొరుగు వాళ్ళ తో కష్టసుఖాలు పంచుకునేవారు, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళుతూ కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు.ఇప్పటి వేగవంతమైన జీవన శైలిలో ఇరుగు పొరుగు కోసం, బంధువుల కోసం సమయం లేదు. కాబట్టి ఫోన్ వాడకం తప్పనిసరి. అయితే దానికి మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కొత్త ఫీచర్‌లు ఉన్న ఫోన్‌లు కొనడానికి డబ్బు వెచ్చించే అలవాటు ఉంటే మానుకోవడం వలన డబ్బు ఆదాతో పాటు అటువంటి ఫోన్‌లకు అడిక్ట్ అయిపోయి సమయం వృధా చేయడం తగ్గుతుంది. పోస్ట్ పెయిడ్ తీసేసి, ప్రీపెయిడ్ కనెక్షన్ పెట్టుకుంటే ఫోన్ బిల్లును చాలావరకు అరికట్టచ్చు. మనం ఏ సెల్ ఫోన్ కనెక్షన్‌లో ఉన్నా, ఆ నెట్‌వర్క్‌లో, గ్రూప్ నెట్‌వర్క్ కింద మన ఫ్యామిలీ, స్న్రేహితులతో ఎటువంటి రుసుము లేకుండా కానీ, తక్కువ రుసుముతో కానీ మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. గంటలు గంటలు ఫోన్‌కి అతుక్కుపోయి మాట్లాడేయడం వలన బిల్లే కాదు ఎప్పుడోమన చెవి దెబ్బతినే ప్రమాదం దగ్గరలోనే ఉంటుంది.ప్రతి నిముషానికి ఒకసారి బీప్ సౌండ్ వచ్చేట్టు ఏర్పాటు చేసుకుంటే మనం ఎంతసేపు మాట్లాడుతున్నామన్నదాని మీద ఒక అవగాహన ఉంటుంది. ముందుగానే ఇన్ని నిముషాలు మాట్లాడతానని నిర్ణయించుకుని మాట్లాడటం మొదలు పెట్టాలి.అవతలి వాళ్ళు సంభాషణ కొనసాగిస్తుంటే సున్నితంగా ''మళ్ళీ మాట్లాడదాం''అని ఆపేయడం నేర్చుకోవాలి.
చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే
అది ఏ బిల్లయినా, పిల్లల ఫీజులు, బీమా ప్రీమియం, వాయిదాలు అయినా, సమయానికి చెల్లించేస్తే పెనాల్టీ బారిన పడాల్సిన అవసరం రాదు. ఇది కూడా ఒకరకంగా ఆదానే. ప్రతిరోజూ ఖర్చులు రాసి పెట్టుకునే అలవాటు చేసుకుంటే నెల పూర్తయే సరికల్లా ఎందుకింత ఖర్చయింది, ఎక్కడ ఏ విధంగా డబ్బు ఖర్చు అయిందని తల బద్దలు కొట్టుకోవక్కర లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొదట్లో విసుగ్గానే అనిపించవచ్చు కానీ అలవాటైపోతే మాత్రం వదల్లేరు. ఇంట్లో ఈ అలమారలో, ఆ గూట్లో చిల్లర పడేస్తాం. అలా పడేసే బదులు ఒక ముంత లేదా కిడ్డీ బ్యాంక్‌లో వేయాలి. ముందు మనం పాటిస్తూ, పాకెట్ మనీ నుండి కొంత మిగిల్చి అది ముంతలో వేయాలని పిల్లలకు కూడా నేర్పాలి. అది నిండిన తర్వాత వచ్చిన కొంత మొత్తం దేనికైనా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇళ్ళ వెనుక పెద్ద పెరళ్ళు ఉండేవి. అందులో పూల మొక్కలతో పాటు కూరగాయలు కూడా పండించేవాళ్ళు. కానీ, ఇప్పటి రోజుల్లో ఆ వెసులుబాటు లేకపోయినా, ఉన్నంత స్థలంలోనే వంటింటి తోటలపై శిక్షణలు ఇచ్చేవారున్నారు. అలాటి వారిని సంప్రదించి శిక్షణ లేక అవగాహన పొందితే, మన ఇంట్లోనే ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా కూరగాయలు పండించుకోవచ్చు. మండిపోతున్న కూరగాయల ధరల నుండి ఉపశమనమే కాదు, వంటింటి తోటల పెంపకం మనస్సుకు సంతోషాన్ని కూడా ఇస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. రకరకాల ఖరీదైన సీడీలు, డీవీడీలు కొనేకంటే, వారానికి ఒకసారి సండే మార్కెట్‌కు వెళ్ళి చవకలో పుస్తకాలు కొని చదివే అలవాటు చేసుకుంటే డబ్బు ఆదా అవడమే కాక విజ్ఞానం, ఉల్లాసం రెండూ సొంతమే.
ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం
మామూలు బల్బుల కన్నా సీఎఫ్‌ఎల్ లేదా లెడ్ బల్బులు ఎక్కువ రోజులు మన్నుతాయి. కరెంట్ తక్కువ కాలుతుంది. సీ ఎఫ్ ఎల్ కు 25 శాతం కరెంట్ ఖర్చు అయితే, లెడ్‌కు 2 శాతం ఖర్చు అవుతుంది. లెడ్‌ను బాత్‌రూమ్స్‌లో, వరండాలో పెట్టుకుని, సీ ఎఫ్ ఎల్‌ను వెలుతురు ఎక్కువ అవసరం అయిన చోట పెట్టుకోవచ్చు.ఏదైనా ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ కొనేటప్పుడు ఒక గంట రెండు గంటలు వెచ్చించి ధర, మన్నిక, దానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది వంటివి శోధించండి. లేదా ఇతరుల నుండి దాని గురించిన సమీక్షలు తీసుకోవడం కూడా లాభిస్తుంది.ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ విద్యుత్ ఉపయోగించే అలవాటు ఇంట్లో అందరికీ నేర్పితే కుటుంబానికే కాదు దేశానికీ మేలు చేసినవాళ్ళం అవుతాం.
క్రెడిట్ కార్డు అలవాటైపోయిందా!
ఈమధ్య క్రెడిట్ కార్డు వాడకం అతి మామూలు అయిపోయింది. దాని వల్ల వడ్డీ నష్ట పోతున్నామని తెలిసినా వదల్లేక అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు పెడుతున్నారు. పర్స్‌లో క్రెడిట్ కార్డు పెట్టుకునే అలవాటు మానేసి, కొంత డబ్బు కూడా ఉంచుకోవడం వలన ఉన్న డబ్బులోనే కొనడానికి అలవాటు పడతారు. అత్యవసరమైన వాటికి క్రెడిట్‌కార్డు వాడాల్సిందే అనుకుంటే, కార్డు వెనకాల ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి కార్డు మీద వడ్డీ తగ్గింపు గురించి మాట్లాడండి. కనీసం 3 శాతం వరకు తగ్గింపు దొరికే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యపు అలవాట్లతో...
పిల్లల కైనా, పెద్దలకైనా సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.నాణ్యమైన ఆహారం తినడం వల్ల, మంచి అలవాట్లు చేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెంపొందింపబడుతుంది. సీజన్‌లో దొరికే జామ, ఉసిరి, నేరేడు వంటి పండ్లతో పాటు ఆకుకూరల వంటి ఆహారం ఎక్కువ ఖర్చు లేకుండా పోషకాలను అందిస్తాయి. ఈ ఆహారపుటలవాట్ల వలన చీటికి మాటికి చిన్న, పెద్ద రోగాలు బాధించవు. దానితో వైద్య ఖర్చులు అదుపు చేయచ్చు. పిజ్జాలు, బర్గర్‌లు తినే అలవాటు వలన పిల్లల్లో ఊబకాబం సమస్య రావచ్చు. పిల్లలకు నచ్చే విధంగా పోషకాలను అందించే వంటల సైట్లు ఇంటర్‌నెట్‌లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటి మీద అవగాహన పెంచుకుని పిల్లలకు నచ్చిన విధంగా ఇంట్లోనే రుచికరమైన చిరుతిండ్లు చేసిపెట్టడం వలన ఆరోగ్యం పాడవకుండా ఉండటంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పిల్లల అభిరుచికి తగినట్టుగా మసులుకోవడం వలన వారితో మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది.
-శ్రీదేవి కవికొండల
Posted on: Sun 03 Oct 00:17:25.739084 201300

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి