1, అక్టోబర్ 2013, మంగళవారం

తెలంగాణా సాయుధ పోరాటం



1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమనిరాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశ్ ముఖ్ లు,జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.
                           మొదట నల్లగొండ జిల్లాలో పుట్టిన సాయుధ విప్లవం త్వర త్వరగా వరంగల్, బీదర్ జిల్లాలకు వ్యాపించింది. రైతులు, రైతు కూలీలు నిజాం నవాబుకు, ప్రాంతీయ ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేసారు. వారి పోరాటం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా మొదలైంది. అయితే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి ఆనాటి రాజులు, జమీందారులు సిద్ధంగా లేరు.
మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె,
కాలంబు రాగానే కాటేసి తీరాలె” -- కాళోజీ
అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు హసన్ నాసిర్ లు ముఖ్యులు.
రజాకారు సేన ను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1948 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావునేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

తెలంగాణా సాయుధ పోరాటయోధులు:
మగ్దూం మొహియుద్దీన్: ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ. వీరి పూర్వీకులది ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌. ఆయన తండ్రి నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటు గా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషనుసంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. మఖ్దూం విద్యాభ్యాసం ఆందోల్ నుండి హైదరాబాద్ చేరి 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తయింది. ఇంటా బయటా విరివిగా పుస్తకాలు చదవటం, సాహిత్య అధ్యయనాలు, తాత్విక విషయాల పరిశోధన మఖ్దూం నిత్యకృత్యాలైనాయి.

ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు మరియు నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.
1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
1966లో బిసాతె రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించినాడు.
1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
మెట్రిక్యులేషన్ తరువాత మఖ్దూం ట్యూషన్లు చెప్పినాడు. చిత్రపటాలు విక్రయించాడు. పత్రికలకు వ్యాసాలు రాశాడు. కొన్నాళ్లు హైదరాబాద్ రాష్ట్ర దఫ్తర్‌లో గుమాస్తాగా ఆ తరువాత హైదరాబాదులోని సిటి కాలేజీలో ఉపాధ్యాయవృత్తిలో చేరాడు.1941లో హైదరాబాద్ ఉర్దూ అభ్యుదయ రచయితల సంఘ స్థాపనకు పూనుకున్నాడు మఖ్దూం. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినాడు.
మఖ్దూం కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు కార్యకర్త, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు మఖ్దూం. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. 25.08.1969 తేదీన ఆయన చనిపోయాడు.
నిజాము కు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటం లో కీలకపాత్ర పోషించాడు. 
                                       (రావి నారాయణ రెడ్డి)                                                                       రావి నారాయణ రెడ్డి: హైదరాబాద్ సమస్తాన విమోచనకు పోరాడిన కమ్యునిస్ట్ యోధుడు..
1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినాడు. నిజం వ్యతిరేక పోరాటంలో విజయం సాధించి౦ది.

కొమురం భీం : గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.
కొమరంభీమ్ (సినిమా) - కొమురం భీమ్ జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.

http://naatelangaana.blogspot.in/2011/11/blog-post_16.html 



బద్ధం ఎల్లారెడ్డి : 1906  వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా గాలి పల్లి లో జన్మించారు. 1930 లో శాసనోల్లంగన ఉద్యమ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసారు.
      ఉప్పు సత్యాగ్రహం లో బాగంగా కాకినాడ తీరానికి వెళ్లి ఉద్యమం సాగిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి మద్రాస్ లో వదిలి వేసారు, ఆయన భీమవరం చేరుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించారు, ఆతర్వాత 7 నెలల జైలు శిక్ష అనుభవించారు. విడుదలయ్యాక కరీంనగర్ చేరుకొని ఖాది వస్త్రాలు ధరించి గాంధీ ఉద్యమాన్ని కొనసాగించారు, తన సొంత ఊరిలో హరిజనులకోసం పాతశాలను నెలకొల్పారు.
       1934 లో తొలిసారి ఆంద్ర మహా సభలలో పాల్గొన్నారు, ఆ తర్వాత మిత వాదులు, అతి వాదులుగా ఆంద్ర మహా సభ విడిపోయింది, అసిఫాబాద్లో కొమురం భీంనాయకత్వంలో జరుగుతున్న గోండుల తిరుగుబాటును గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి అందులో పాల్గొన్నారు, తర్వాత కరీం నగర్ జిల్లా మొత్తం తిరిగి 2500 గ్రామాలను మేల్కొల్పారు. నిజాం ప్రభువుకు వ్యతిరేక ప్రచారం చెయ్యడంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి సంవత్సరం జైలు, 200 రూపాయల జరిమానా విధించారు, అయితే ఆయన దగ్గర జరిమనకు డబ్బు లేకపోవడంతో మరో మూడు నెలలు జైలులోనే ఉన్నారు. 1947 లో సాయుధ సమరం ఒక్కటే మార్గమని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు పిలుపునిచ్చారు, 1948 లో నిజాం గద్దె దిగారు, ఆ తర్వాత ఒకసారి లోక్సభకు, 2 సార్లు శాసన సభకు, మరో సారి రాజ్య సభకు ఎన్నికయ్యారు, ఆయన రాష్ట్ర కమూనిస్ట్ పార్టీ కార్య దర్శి గా పనిచేసారు.
సాయుధ పోరాటయోధుడు బద్దం ఎల్లారెడ్డి 1978 లో మరణించారు...


తెలంగాణా చరిత్రకు సంబంధించిన పూర్తి వీడియో :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి