న్యూయార్క్, సెప్టెంబర్ 23: అమ్మకాలు పడిపోయి
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ
మైక్రోసాఫ్ట్.. అత్యం త వేగవంతమైన, శక్తివంతమైన రెండు కొత్త
ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా సంస్థ ఈ
గ్యాడ్జెట్లను రూపొందించినట్లు తెలుస్తున్నది. 32 జీబీ మెమొరీతో విడుదల
చేసిన ‘సర్ఫేస్ 2’ ధరను 429 డాలర్లుగా నిర్ణయించిన సంస్థ.. 64 జీబీ మెమొరీ
గల ‘సర్ఫేస్ ప్రొ 2’ ట్యాబ్లెట్ రేటు 899 డాలర్లని తెలిపింది.
ఇంచుమించు ఏడాది తర్వాత కంపెనీ నుంచి వచ్చిన నూతన ఉత్పత్తులివే. అత్యాధునిక ఫీచర్స్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్లను 10.6 అంగుళాల టచ్‌వూస్కీన్, విండోస్ ఆర్ 8.1, ముందుభాగంలో 3.5 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో డిజైన్ చేశారు. ఇందులో నిరవధికంగా 10 గంటల పాటు వీడియోను తిలకించవచ్చును. అక్టోబర్ 22 నుంచి అమెరికాతోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, బ్రిటన్ దేశాల్లో ఈ ట్యాబ్లెట్ లభ్యమవనున్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి