15, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రపంచ పోరాటాలకు ఆదర్శం తెలంగాణ సాయుధ పోరాటం


9/15/2013 12:59:41 AM
1947 ఆగస్టు 15న వలస దోపిడీదారుల పాలనకు చరమగీతం పాడిన దినం, స్వేచ్ఛ ఆలపించిన దినం. స్వాతంత్య్రం వచ్చిందని ప్రజలంతా మురిసి పోతున్నారు. ఎక్కడ చూసినా జాతీయ పతాకాలు రెపపలాడుతున్నాయి. వందేమాతరం గీతాలు ఆలపిస్తున్నారు. కానీ, మరోవంక నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజానీకం నలిగిపోతున్నారు. నిజాం నవాబు, ఖాసిం రజ్వీ, మతోన్మాద రజాకార్లు, దొర భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, గుండాలు, లాంపెన్ గ్యాంగులు ఏకమై తెలంగాణలో మారణహోమం సృష్టించారు. ‘అయ్యా, నీ బాంచన్ దొర’ అంటూ ‘కాల్మొక్తా బాంచన్’ అంటూ అణగిమనిగి వుండే ప్రజలను నిజాం నవాబుల పాలనలో అణిచివేశారు. గ్రామాలపై విచక్షణా రహితంగా దాడులు జరిపారు. స్త్రీల మానాలు దోచారు. కనిపించిన వారి నల్లా హింసించి దారుణంగా కాల్చి చంపారు. గ్రామాలకు గ్రామాలకే నిప్పంటించి తగుల బెట్టారు. నిజాం ప్రభుత్వ దాడులకు, రజాకార్ల దుర్మార్గాలకు తట్టుకోలేక హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నేతలు మౌనం పాటించడంతో ప్రజలు సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. నిజాం మిలటరీ, పోలీసు రజాకార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌లు, రౌడీలంతా కలిసి రెండు లక్షలకు పైగా ఉన్నారు. వారికి అత్యాధునికమైన ఆయుధాలు, ఫిరంగులు, అశ్వికదళాలు, వాహనాలు ఉన్నాయి. దొరలు, జమీందార్ల దోపిడీ, వెట్టిచాకిరిల విముక్తి కోసం, ‘దున్నేవాడికి భూమి’ అన్న నినాదంతో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల చైతన్యంతో అశేష ప్రజానీకం చీమలదండులా కదిలారు. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, యువతీ యువకులు వడిసెలు, రోకలి బండలు, కారంపొడి, కత్తులు, చాకులు, బందూక్‌లు చేతబట్టి దొరలు, భూస్వామ్య అల్లరి మూకలను తరిమి తరిమి కొట్టారు. వేసిన అడుగు వెనక్కి వేయకుండా గుండె ధైర్యంతో నీటి ప్రవాహంలా ముందుకు నడుస్తూ అడుగడుగునా రక్తాన్ని ధారపోశారు. ప్రజాయుద్ధంలో నేలరాలిన వేలాదిమంది రత్నాలు, ఒక్కొక్క వీరుడు చరిత్ర సృష్టించారు. పల్లెలన్నీ విప్లవ కేంద్రాలుగా మారాయి. గ్రామాలను విముక్తి పథంలో నడిపిస్తూ గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. వెట్టిచాకిరి నిర్మూలనతో దొర, భూస్వాముల, పెత్తందార్ల దోపిడీ అంతమైంది. తెలంగాణంతటా గెరిల్లా దళాలు ప్రజల నుంచి పుట్టుకొచ్చి 90 లక్షల ప్రజానీకానికి అండగా నిలిచి సాయుధ పోరులో సమరభేరి మోగించారు.

mavo

మూడు సంవత్సరాల పాటు నిజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా హోరాహోరీగ సాయుధ సంగ్రామం జరిగింది. ‘బాంచన్ దొర’ అన్నవారే బందూకులు చేతబట్టి పోరాట స్ఫూర్తిని రగిలించారు. అమరవీరుల రక్త తర్పణంతో నేల ఎరుపెక్కింది. తెలంగాణ ఎర్రబారింది. ఆ విధంగా దేశ విదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని చాటారు. నాలుగున్నర వేలమంది అమరులైనారు. విప్లవవీరుల రక్తంతో ఎరుపెక్కిన తెలంగాణ విప్లవ పోరాటానికి మొదటి ఆంధ్ర మహాసభ ప్రేరణ కలిగించింది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి వెట్టిచాకిరి రద్దు, వితంతువులకు పెళ్ళిళ్లు, వంతుల పద్ధతుల్లో వెట్టిచాకిరి రద్దు ఆంధ్ర మహాసభ సందేశాన్ని వినిపించారు. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చి పోరాటం వైపు మరలారు. రాత్రిపూట ఊరేగింపుల్లో కదం తొక్కుతూ, పదం పాడుతూ ప్రజల్ని ప్రభావితం చేశారు. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంవూదాడ్డి తల్లి జానకమ్మ దొరసాని కడవెండిలో ఉంటుంది. మహిళ ఐనప్పటికీ ఆమెను దొరసాని అనకూడదు. ‘నేను సానినా’ అంటుంది. ‘అమ్మా’ అంటే ‘నీ అయ్యకు భార్యనా?’ అంటుంది. ప్రజల పట్ల కూృరత్వంతో ఉండేది. వెట్టిచాకిరి చేయించడంలో దిట్ట, వడ్డీ నాగులు వసూలు చేయడంలో, రకరకాల శిక్షలు వేసి జరిమానాలు విధించడంలో పరమ శాడిస్టు. ఆమెను చూసి జనమంత వణికేవారు. ఆరుట్ల రామచంవూదాడ్డి కడవెండి కెళ్ళి ఆంధ్రమహాసభ సందేశాన్ని వినిపించాడు. దీంతో గ్రామ రాజ్యకమిటీ ఏర్పడింది. యువకులంతా సంఘంలో చేరిపోయారు. విసునూర్ దేశ్‌ముఖ్‌లు, రౌడీలు కడ గ్రామంపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలోనే దొడ్డి కొమురయ్య తీవ్రంగా గాయపడి, మరుసటి రోజు వీర మరణం పొందాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య ‘తొలి విప్లవకారుడు’గా అమరుడైనాడు.

దొడ్డి కొమురయ్య మరణవార్త జనగామ మహాసభ కార్యకర్తలందరికీ విషాద వార్తయింది. దేశ్‌ముఖ్‌ల దాడి, దుర్మార్గాలను ఎదుర్కోవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి 56 వేలమంది వివిధ గ్రామాల ప్రజలు కర్రలు, బరిసెలు, ఆయుధాలతో కదిలివచ్చారు. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో మైలురాయి వంటిది. విసునూర్ దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాడింది. పాలకుర్తి గ్రామం పేదరాలు. ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు సోమయ్య, లచ్చుమయ్యలు. కుటుంబానికి పెద్దదిక్కు ఐలమ్మ. మల్లంపల్లి మఖ్తెదారు రెండెకరాల భూమిని తీసుకుని కౌలుకు సాగుచేస్తున్నాడు. ఐలమ్మ ఇల్లు ఆంధ్రమహాసభ కార్యకలాపాలకు కేంద్రమైంది. పాలకుర్తి కుట్ర కేసులో ఆరుట్ల రామచంవూదాడ్డితోపాటు భర్త, ఇద్దరు కొడుకులు జైలు పాలయ్యారు. చాకలి ఐలమ్మ సంఘంలో చేరి విసునూర్ దొరకు వ్యతిరేకంగా పనిచేసింది. మల్లంపల్లి మఖ్తెదారు ఐలమ్మను భూమినుంచి గెంటేసినా భూమిని వదలనని ఐలమ్మ పట్టుబట్టింది. వరిధాన్యం మూటలు గట్టుకొని అందరూ భుజాన వేసుకుని ఐలమ్మ ఇంటికి చేరుస్తుండగా దారిలో దొర గూండాలు ఎదురైనా, వందలాది మంది కార్యకర్తలను చూసి పారిపోయారు. పోలీసులతో రాత్రి ధాన్యాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన కమ్యూనిస్టులు ధాన్యాన్ని పోలీసులు, విసునూర్ దొరల పాలు కాకుండా కాపాడారు. అలాగే, మరో వంక దేవరుప్పులలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మందడి సోమిడ్డి అమరుడయ్యాడు. ఇంతలో మిలటరీ పోలీసులు ఆగకుండా రెండు వేల మందిపై కాల్పులు జరపడంతో కామాడ్డి గూడెం దళ నాయకుడు గోలి పాపిడ్డి వీర మరణం పొందాడు. దీంతో జనం ఎక్కడికక్కడ చెదిరిపోయారు. దేవరుప్పులలోని 350 మందితో పాటు కడ కామాడ్డి గూడెంకు చెందిన మరో 40 మంది కమ్యూనిస్టులను పట్టుకొని పోయారు.

ప్రజలు మిలటరీ దాడులకు వ్యతిరేకంగా పదివేల మందితో పెద్ద బహిరంగసభను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వాసాలమర్రి తమ్మడపల్లి-పల్లే పహాడ్, దందుకూరు, మీనవోలు, మేడిపల్లి, సిరిపురం, ఆల్లీపురం, సీతారాంపురం, తరిగొప్పుల, నెల్లికుదురు తదితర గ్రామాలపై విచక్షణారహితంగా దాడులు జరిపి ప్రజల మాన ప్రాణాలను దోచుకున్నారు. లెక్కకు మించి గ్రామాలకు నిప్పటించారు. 45 మందిని చంపారు. దీనికి ప్రతీకారంగా 75 మంది పోలీసులు, రజాకార్లు ప్రజా గెరిల్లాల చేతిలో హతమయ్యారు. తెలంగాణ విప్లవోద్యమాన్ని అణచి వేయడానికి విధ్వంసానికి పూనుకున్నారు. 1948 మార్చి 2న రేణిగుంటపై 400 మంది మిలటరీ రజాకార్లు అత్యాధునిక ఆయుధాలతో దాడి చేశారు. విప్లవాలకు రేణిగుంట కంచుకోట లాంటిది. దళ నాయకుడు రేణిగుంట రామిడ్డితో పాటు 30 మంది దళ సభ్యులున్నారు. వారి వద్ద 15 సాధారణ తుపాకులున్నాయి. అయినప్పటికీ వేలాది మంది మిలటరీ శత్రువులను నిలదీశారు. ఉదయం 5 గంటలకు మొదలైతే సాయంత్రం ఆరు గంటల వరకు భీకరమైన యుద్ధం జరిగింది. 42 మంది శత్రువులు చనిపోయారు. తుదిశ్వాస విడిచేంత వరకు పోరాడుతూ రేణిగుంట రామిడ్డితో పాటు 30 మంది నేలరాలి అరుణ తారలయ్యారు. ఒక వ్యక్తి మాత్రం గాయాలతో బతికి బయటపడ్డాడు. బైరాన్‌పల్లిపై దాడి జరిగింది. మొదటిరోజు గ్రామ రక్షక దళం వాళ్లు తరిమికొట్టారు. రెండో రోజు అదనపు బలగాలతో వచ్చారు. రెండోసారి పరాజయం తప్పలేదు. మూడోరోజు 200 మంది రజాకార్లు ఆధునిక ఆయుధాలతో వచ్చారు. గెరిల్లా దళం, గ్రామ రక్షక దళం, గ్రామ ప్రజలంతా కలిసి శత్రువులను తరిమికొట్టారు. ఐదుగురు రజాకార్లు చనిపోయారు. బైరాన్‌పల్లి యుద్ధభూమిగా మారింది. మళ్ళీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మహిళలను బట్టలిప్పించి బతుకమ్మ ఆడించారు. 86 మందిని పట్టుకొని వరుసగా నిలబెట్టి అతి దారుణంగా కాల్చి చంపారు. ఆకునూర్‌లో ముష్కరుల దాడి మానవత్వం లేని చర్యగా చరిత్ర కెక్కింది. చివరిదాడిలో 31 మంది గ్రామస్థులను పట్టుకొని తల్వార్లతో కూృరంగా తలలు నరికి చంపారు.

1948 ఆగస్టు 21న రాత్రి 10 గంటల సమయంలో షోయబుల్లాఖాన్‌ను కాచిగూడలోని తన పత్రికా కార్యాలయం నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్నప్పుడు రజాకార్లు అతన్ని చుట్టుముట్టి తల్వార్లతో నరికి చంపారు. రజాకార్ల చర్యలను ఎండగడుతూ తన కలాన్ని ఎక్కుపె ఖాసిం రజ్వీకి హిట్లర్ పోలికలున్నాయి. కాగా, హిట్లర్ జాతి అహంకారంతో జర్మనీ ప్రజలను రెచ్చగొడితే ఖాసిం రజ్వీ మతోన్మాదంతో ముస్లింలను రెచ్చగొట్టాడు. హైదరాబాద్ రాష్ట్ర పాలనను శాసించే స్థాయికి ఎదిగాడు. అతను చేసిన నేరాలు, ఘోరాలు అతనికి విధించిన శిక్ష మామూలే. కానీ, జైలులో సకల రాచమర్యాదలు పొందాడు. 1957లో విడుదలై పాకిస్థాన్‌కు పారిపోయాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టులను వేలాదిమందిని జైళ్ళలో నిర్బంధించినప్పటికీ పోరాటం ఆగకుండా కొనసాగింది. ఉరిశిక్షలు మొదలుకొని రకరకాల శిక్షలు విధించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి, ప్రజా పోరాటాల కారణంగా పాలకులకు తలవంచక తప్పలేదు. ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు రద్దయి 1957లో అందరూ జైళ్ళ నుంచి విడుదలయ్యారు. 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు నిజాం గద్దెను కూల్చడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని చారివూతాత్మక ప్రకటన చేశారు. ‘ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దు. వాడవాడ జాతీయ పతకాలు ఎగురవేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు బహిష్కరించాలి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు బహిష్కరించాలి. దొర భూస్వాముల చేతిలో బందీగా ఉన్న భూములను స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకు పంచాలి’ అని పిలుపునిచ్చారు. విద్యార్థులు యువతీ యువకులు దళాలుగా ఏర్పడి గ్రామక్షిగామాల్లో తిరుగుతూ జాతీయజెండా, చేత బట్టుకొని ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. యువతే తెలంగాణ ప్రజానీకానికి విప్లవ సందేశం అందించింది. నిజాం ప్రభుత్వం కూలేదాకా, ప్రజల ప్రభుత్వం ఏర్పడే వరకు వారంతా వీర సైనికులుగా పనిచేశారు. హిందూ మహాసభ మతోన్మాద సంస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాసైన్యాన్ని నిర్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, కట్కూరి సుశీల, దూడల సాలమ్మ, నామాల లక్ష్మమ్మ, తునికి ముత్తమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీరవనితలు ఎందరో ప్రజల కోసం ప్రాణాలర్పించారు. ప్రజాందోళనల మేరకు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను వదిలేసి నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట లొంగిపోయాడుపజా ఉద్యమాల ముందు నిజాం నవాబుకు పతనం తప్పలేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా తెలంగాణంతటా జరుపుతారు. కానీ, వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించ లేదు. ప్రభుత్వం ఇన్నేళ్లు గడిచినా అమరవీరులకు స్థూపాలు గాని, విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో వీటన్నిటినీ సవరించుకుని ముందుకు వెళదాం. జై తెలంగాణ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి