23, సెప్టెంబర్ 2013, సోమవారం

‘సమైక్య’ దోపిడీ నీతి


9/22/2013 11:45:46 PM
దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో భారత రాష్ట్రపతి అత్యున్నతుడు 1969లో వచ్చిన తెలంగాణ ఉద్య మం, ఆ తర్వాత వచ్చిన ‘జై ఆంధ్ర’ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని, ‘లోకల్-నాన్ లోకల్’ సమస్య తీర్చేందుకు 1973లో భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జోనల్ వ్యవస్థ ఏర్పా టు చేసి, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు, రాయలసీమ ఒక జోన్‌గా విభజించారు. ఇందు లో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగింది. తొమ్మిది జిల్లాలున్న ఆంధ్రా మూడు జోన్లుగా ఏర్పాటు చేస్తే, పది జిల్లాలు ఉన్న తెలంగాణను రెండు జోన్లు మాత్రమే చేశారు. ఆంధ్రవూపదేశ్‌లో జన్మించిన వ్యక్తి తన ప్రాంతాన్ని బట్టి జన్మించిన చోటనే ఉద్యోగార్హతకు ప్రథమ ప్రాధాన్యం.తరువాత ఇతర ప్రాంతాల్లో కొంత శాతం మాత్రమే ఉద్యోగాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

కానీ హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ముఖ్యకార్యాలయాల్లో 90 శాతం మందిని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారినే అక్రమంగా నియమించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి దాదాపు 55 వేలమంది ఆంధ్రా వారు అక్రమంగా ఉద్యోగాల్లో చేరారు. ఈ సమస్య నుంచి బయట పడేయడానికి 610 జీవోను ఘనత వహించిన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో వింత యేమిటంటే భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం. అదన్నా జరిగిందా అంటే అదీలేదు. ఇదెక్కడి న్యాయమయ్యా అంటే ‘సమస్యలు ప్రతిచోటా ఉంటాయి. అంత మావూతాన విడిపోతామా, కూర్చొని మాట్లాడుకోవాలి గానీ’ అంటారు.రాష్ట్రపతి ఉత్తర్వులనే ఉల్లఘించిన వారు ‘కలిసి ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయ’ని చెబితే ఎలా నమ్మడం?

ఈ మధ్యన ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో పెట్టిన సభలో ఒకా యన మాట్లాడుతూ భారత యుద్ధం చివరలో ధర్మరాజు, దుర్యోధనునితో ‘కావాలంటే రాజ్యాన్ని నీవే ఏలుకో కానీ విచ్ఛిన్నం కాకుం డా చూడు’అన్నాడట! భారత ఇతిహాసానికి ఒక కొత్త భాష్యం చెప్పా రు. అయితే వారు ఇందులో కొన్ని విషయాలు మరచిపోయారు. ఈ ధర్మరాజే సంజయునితో, శ్రీకృష్ణునితోనూ తమ రాజ్య భాగం తమకు ఇవ్వమని, లేదా కనీసం ఐదు ఊళ్లు అయినా ఇవ్వమని దుర్యోధనుని వద్దకు రాయభారం పంపాడు కదా. దుర్యోధనుడు ఒప్పుకోకపోవడంతో మహాభారత యుద్ధమే జరిగింది. అలాంటిది కలిసుందామని ధర్మరాజు చెప్పాడని మన సీమాంధ్ర మేతావులు చెబుతున్నారు!

ఎంత సేపూ.. చిన్న రాష్ట్రాలతో శాంతి భద్రతలు లోపిస్తాయని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లను చూపడం కాదు. మనదేశంలో కేరళ, హర్యా నా, పంజాబ్ లాంటి బాగా అభివృద్ధి చెందిన చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నవి. వాటి గురించి చెప్పందుకు? కలిసి ఉంటే చాలా లాభాలు ఉంటాయని చెప్పేవారంతా భారత రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందిన దాదాపు 55వేల మంది ని గురించి మాట్లాడందుకని? సీమాంధ్ర ముఖ్యమంత్రే స్వయంగా దాదాపు 16 వేల ఆంధ్రావాళ్లు అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఈ మధ్యనే ప్రకటించినాడు కదా! మరి అక్రమంగా ఉద్యోగాలు పొందిన ఎంతమందిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేశారు? అలా ఏర్పడిన ఖాళీలను ఎంతమంది తెలంగాణ వాళ్లతో నింపారు? సమా జం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు.అది నిరంతరం మార్పు చెందుతుంది. సంచార జీవితం నుంచి కుటుంబ వ్యవస్థ నుంచి పట్టణీకరణ వరకూ ఎన్నో మార్పులు జరిగాయి. జనాభా పెరుగుతున్న కొల దీ ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోయినవి. ఒక కుటుంబంలోని తల్లిదండ్రులు, పిల్లలు, మనుమలు, కలిసి ఉండలేనప్పుడు మన రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల కుటుంబాలను కలిసి ఉండాలని ఎలా చెప్పగలరు?

స్వాతంత్య్రం వచ్చేనాటికి మనదేశంలో ఉన్న రాష్ట్రాపూన్ని? ఇప్పు డు ఉన్న వెన్ని? దాదాపు సగం రాష్ట్రాలు ఏదో ఒక రాష్ట్రంనుంచి విడిపోయి ఏర్పడినవే కదా? అయినా ఎప్పుడూ వేరే వాళ్ల ఇళ్లలో పడి ఉండి చివరకు ఆ ఇళ్లే నాది అనడం ఆంధ్రా వాళ్ల నైజం. గతంలో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఇలాగే మద్రాసు మాదే అన్నారు. ఇప్పుడు తెలంగాణ అంతా మాదే అంటున్నారు. వీళ్ల దురాశకు అంతం లేదా?
ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి నేటి వరకు ఈ 57 ఏళ్లలో ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంవూతులుగా పనిచేసిన వారిలో ఆంధ్రా ప్రాంతం వాళ్లు 51 ఏళ్లు పాలిస్తే, తెలంగాణ వారు కేవలం ఆరేళ్లు పాలించారు. ఇదన్న మాట.. కలిసి ఉంటే కలదు సుఖంలోని ఆంధ్రా వాళ్లు చెప్పే నీతి..!
-ఈశ్వరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి