29, సెప్టెంబర్ 2013, ఆదివారం

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం-వాస్తవాలు


అరవైఏళ్ల కిందట,1953 అక్టోబర్1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర నిర్మా ణం, 57 ఏళ్ల కిందట 1956 నవంబర్1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రవూపదేశ్ అవతరణ ఇటీవలి చరివూతలోని రెండు ముఖ్య సంఘటనలు. ఈ సంఘటనలకు, నాటి పరిణామాలకు స్వయంగా సాక్షులైనవారు కొందరు నేటికీ మన మధ్య ఉన్నారు. అంతేకాదు ఈ ఘటనలకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించే పత్రాలు, రికార్డులు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.

ఈ విషయంలో శాసనాలను, తాళపత్ర గ్రంథాలను పరిశీలించవలసిన అగత్యంలేదు.చారివూతక వాస్తవాలు మన కళ్లముందు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయినప్పటికీ చారివూతక వాస్తవాలను పరిశీలించకుండా వాటిని గుర్తించకుండా వాటికి విలువ ఇవ్వకుండా కొందరు అబద్ధాలను పనికట్టుకుని ఉద్దేశపూర్వకంగా కుటిలబుద్ధితో ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పితే అది నిజమవుతుందని భ్రమపడుతున్నారు. కావాలని చరివూతకు వక్రభాష్యాలు చెబుతున్నారు. వాస్తవాలకు మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు.అసత్యాలను ప్రచారం చేయడం ఆత్మవంచన చేసుకోవడం. అయినా అధికార ముద్రతో సర్కారీ స్థాయిలో సైతం అసత్యాలను అదే పనిగా చలామణి అవుతున్నాయి.


పొటి ్టశ్రీరాములు గాంధేయవాది. సర్వోదయ ఉద్యమ ప్రముఖుడు, మహనీయుడు సందేహం లేదు. గాంధేయ కార్యక్షికమాల్లో శ్రీరాములు అంకిత భావంతో పాల్గొన్నారు. అనుమానం లేదు. ఒక లక్ష్యాన్ని సాధించడానికోసం ఆయన మద్రాసు నగరంలో (పొట్టి శ్రీరాములు1901 మార్చి 16న మద్రా సు నగరంలో జన్మించారు) 1952 అక్టోబర్ 19నుంచి డిసెంబర్15 వరకు 57 రోజులు ఆమరణ నిరాహారదీక్ష జరిపి చివరి రోజు అసువులు బాసా రు. ప్రాణత్యాగం చేశారు. ఇది ఇటీవలి చరివూత లో ఉజ్వలంగా కన్పిస్తున్న చారివూతక సత్యం. ఇది వివాదాస్పద, భిన్నాభివూపాయ అంశం కానేకాదు.అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు ఏలక్ష్య సాధన కోసం అమూల్య్ర పాణాన్ని అర్పించారన్నది అన్నిటికంటే ముఖ్య విషయం. కొందరు అమిత భావోద్వేగం తో హద్దులు దాటిన ఆవేశంతో అభిమానంతో గొంతు చించుకుని ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసమో, అప్పటి వరకు కనీసం ఊహలోనైనా లేని ఆంధ్రవూపదేశ్ కోసమో ప్రాణత్యాగం చేశారన్నది వాస్తవం కాదు. అది పచ్చిఅబద్ధం. ఆమరణ నిరాహారదీక్షకు ఎందుకు సంకల్పించారో ఏలక్ష్యసాధన నిమిత్తం ఆమరణ నిరాహారదీక్షకు నడుం బిగించారో పొట్టి శ్రీరాములుగారే స్వయంగా సూటిగా వివరించారు.

ఆయన మాటలను కాదనడానికి వీలులేదు. ఈ సందర్భాన కొన్ని నేపథ్య ఘటనలను, పరిణామాలను గమనించవలసి ఉంటుంది. 20వ శతాబ్ది తొలినాళ్లలో భారత స్వాతంత్య్ర ఉద్యమం రోజుల్లోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు డిమాండుకు అంకురార్పణ జరిగింది. మొదటి ఆంధ్రమహాసభ 1913మే నెలలో బాపట్లలో నిర్వహించబడింది. మద్రాసు ప్రావిన్స్ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి భాషా ప్రాతిపదిక మీద ఆంధ్రరాష్ట్రం ఏర్పా టు చేయాలని బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ తీర్మానించింది. ఆంధ్రరాష్ట్రం కోసం ఆంధ్ర మహాసభ నిర్వహించిన ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. తరువాత ఏటా జరిగిన ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశాలలో ఈ తీర్మానాన్ని పునరుద్ఘాటించారు. అంధ్రులు విడిపోయి వేరు రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి తమిళులు ఎన్నడూ అడ్డు నిలువలేదు. కానీ రాయలసీమ నాయకులు అడ్డు నిలిచారు. ఆంధ్రరాష్ట్రం డిమాండుకు రాయలసీమ నాయకుల మద్దతు లభించలే దు. శాసనసభలో, మంత్రిమండలిలో, పాలనావ్యవస్థలో సామాజిక రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కోస్తాంవూధులు ఆధిపత్యం వహించి పెత్తనం చేస్తారని తమ గొం తులు కోస్తారని రాయలసీమ వాసులు భయపడ్డారు.(ఈ భయాలను, అనుమానాలను తొలగించడానికి శ్రీబాగ్ ఒప్పందం వచ్చింది.
)స్వాతంత్య్రం అనంతరం భాషా రాష్ట్రాల నిర్మాణం సమస్యను పరిశీలించడానికి భారత రాజ్యాంగ సభ 1948జూన్‌లో ధార్ కమిషన్‌ను నియమించింది. ఆరునెలల తర్వాత 1948డిసెంబర్‌లో ధార్ కమిషన్ భారతప్రభుత్వానికి తన నివేదిక ను సమర్పించింది. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని , ఆంధ్రరాష్ట్ర నిర్మాణా న్ని ధార్ కమిషన్ తన నివేదికలో వ్యతిరేకించింది. ధార్ కమిషన్ నివేదికపై విమర్శలు చెలరేగాయి. అందువల్ల భారత జాతీయ కాంగ్రెస్ జైపూర్ మహాసభ (1948లో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన) భాషా రాష్ట్రాల నిర్మాణం అంశాన్ని పరిశీలించడానికి ముగ్గురు ముఖ్యనాయకులతో ఒక కమిటీని నియమించింది. ఈ ముగ్గురు జవహర్‌లాల్‌నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య. ఇది జేవీపీ కమిటీగా ప్రచారంలోకి వచ్చింది.


మద్రాసు ప్రావిన్స్‌లోని వివాదరహిత తెలుగు ప్రాంతాలతో ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరపాలని సిఫారసు చేస్తూ జేవీపీ కమిటీ తన నివేదికను భారత ప్రభుత్వానికి 1949లో నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసంచర్యలు తీసుకోవాలని మద్రాసు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. మద్రాసు నగరంపై తమకు హక్కు ఉందని అనరాదని జేవీపీ కమిటీ ఆంధ్ర నాయకులకు సూచించింది. మద్రాస్ ప్రావిన్స్ విభజన జరిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయడానికి మద్రాసు ప్రభు త్వం1949 డిసెంబర్7న ఒక విభజన కమిటీని నియమించింది.

ఈ కమిటీలో సభ్యులు పీఎస్ కుమారస్వామిరాజ (ముఖ్యమంత్రి, కమిటీ చైర్మన్), ఎం.భక్తవత్సలం, కె.మాధవమీనన్, టి. కృష్ణమాచారి,బి.గోపాలడ్డి, నీలంసంజీవడ్డి,టంగుటూరు ప్రకాశం. మిగిలి ఉండే మద్రాసు రాష్ట్రం కొత్తగా ఏర్పడే ఆంధ్రరాష్ట్రం మధ్య ఆస్తులు, అప్పుల విభజనను పరిశీలించాలని మద్రాసు ప్రభుత్వం విభజన కమిటీని కోరింది. పదకొండు జిల్లాల ఆంధ్ర ప్రాంతాన్ని బళ్లారి జిల్లా మూడు తాలూకాలను కలిపి 1950 జనవరి 26లోపున ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని విభజన కమిటీ సిఫారసు చేసింది. విభజన కమిటీ మరో మూడు ముఖ్యమైన సిఫారసులు చేసింది. తాత్కాలికంగానైనా మద్రాసు నగరం ఆంధ్రరాష్ట్రం రాజధానిగా ఉండరాదన్నది ఒక సిఫారసు.1950 జనవరి 26 లోపున ఆంధ్రులు తమ రాజధానికి వెళ్లాలన్నది రెండవ సిఫారసు. మద్రాసు నగరంలోని కార్యాలయాలను వదిలి వెళ్లుతున్నందుకు మద్రాసు ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు ఇవ్వాలన్నది మూడవ సిఫారసు.

విభజన కమిటీ నివేదికను, సిఫారసులను అవిభక్త మద్రాసు ప్రభుత్వం ఆమోదించింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు 1950 ఏప్రిల్ 1 నాటికి పొడిగించడానికి మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది. విభజన కమిటీ ఏడుగురు సభ్యులలో ఒక సభ్యుడు టంగుటూరి ప్రకాశం పంతులు మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు నగరం తాత్కాలిక రాజధానిగా ఉండాలని భిన్నాభివూపాయాన్ని వ్యక్తపరిచాడు. ఏమైనప్పటికీ 1949 నాటికే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం నిర్ణయం జరిగిందన్నది గమనార్హం. విభజన కమిటీలోని ముగ్గురు సభ్యులు ప్రముఖ ఆంధ్ర నాయకులు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్‌డ్డి, నీలంసంజీవడ్డి. ఆంధ్ర రాష్ట్రం 1950 ఏప్రిల్ 1న ఏర్పడాలని, కొత్త రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండబోదని విభజన కమిటీ ఏకక్షిగీవంగా నిర్ణయించింది.


విభజన కమిటీ ఆంధ్ర రాష్ట్రం అవతరణ తేదీని నిర్ణయించింది. మద్రాసు నగరం లేకుండానే 1950 ఏప్రిల్1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి కమిటీలో ముగ్గురు ఆంధ్ర నాయకులు అంగీకరించారు. ఆంధ్రరాష్ట్రం కోసం ఇక ఎవరూ ఉద్యమించవలసిన అవసరంలేదని, నిరాహారదీక్షలవంటి చర్యలు అవసరం ఇక లేదేలేదని ప్రపంచానికి స్పష్టమైంది. అయినప్పటికి, ఈ నిర్ణయాలు జరిగిన తర్వాత మూడు సంవత్సరాలకు (1952 అక్టోబర్ 19నుంచి) పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షకు ఎందుకు నిర్ణయించారన్నది కీలక ప్రశ్న. ఇక ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్రం కోసం ఆయన నిరాహారదీక్ష చేయవలసిన అవసరం లేదు. ఆ సంగతి ఆయనకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం కోసమో, ఆంధ్రవూపదేశ్ కోసమో ఆయన నిరాహారదీక్ష చేయలేదని చారివూతక వాస్తవాలు ఉద్ఘోషిస్తున్నాయి. నిరాహారదీక్ష ఎందుకు జరపదలచారో పొట్టి శ్రీరాములు స్వయంగా తమ మాటలలో స్పష్టం చేశారు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర మద్రాసుప్రభుత్వాలు నిర్ణయం పొట్టి శ్రీరాములుకు సంతృప్తి కలిగించింది.‘మన ప్రజల ప్రత్యేకరాష్ట్ర వాంఛ న్యాయమైనదని, సక్రమైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి అని ఆయన ప్రకటించారు.

స్వామి సీతారామ్ 1952 అక్టోబర్ 2 న రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో పొట్టి శ్రీరాము లు ‘మవూదాసు నగరం భవిష్యత్తును నిర్ణయించడానికి మాత్రమేనా నిరాహారదీక్ష ప్రారంభమవుతుంద’ని స్పష్టం చేశారు. నిరాహారదీక్షను ప్రారంభించడానికి ముందు పొట్టి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 30న మొదటి ప్రకటనను, 1952 అక్టోబర్ 19న రెండవ ప్రకటనను విడుదల చేసి తన ఆమరణ నిరాహారదీక్ష ఏ లక్ష్య సాధనకో స్పష్టం చేశారు. ‘మవూదాసు నగరం భవిష్యత్తు మీద ఒక అంగీకృత ఒప్పందం కుదరడానికి తీవ్ర ప్రయత్నం జరగవలసి ఉంటుంది. ఆంధ్రులకు, తమిళులకు మద్రాసు నగరం ఉమ్మడిగా ఉండే విషయంలో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సహేతుక దృక్పథంగల ఆంధ్రులు, తమిళులు ఒక వేదిక మీదికి రావలసి ఉంటుంది.’అని 1952 అక్టోబర్19 ప్రకటనలో పొట్టిశ్రీరాములు వివరించారు. మద్రాసు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయడంలో మద్రాసు నగరంలోని ఆంధ్రులు, తమిళులు ఒక ఒప్పందానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మద్రాసు నగరంలో జన్మించిన పొట్టి శ్రీరాములు మద్రాసు నగరం ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని కావాలన్న అభీష్టంతో మాత్రమే ఆమరణ నిరాహారదీక్ష జరిపి అమరులయ్యారు. ఆయన అభీష్టం నెరవేరలేదు. మద్రాస్ నగరం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం లేక ఆంధ్రవూపదేశ్ కోసం అమరులయ్యారనడం చరివూతకు, చారివూతక వాస్తవాలకు వక్రభాష్యం చెప్పడం. అది ఆ అమరజీవి ఆత్మకు ఆశాంతిని కలిగించడమే అవుతుంది.
-ఎం. నారాయణడ్డి
నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి