15, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆంధ్రోళ్ల ట్యాంక్‌బండ్


9/15/2013 2:29:49 AM
తెలుగుజాతి, తెలుగువూపజలు, తెలుగుతల్లి... రాష్ట్రవిభజను అడ్డుకునేందుకు సీమాంవూధులు జపిస్తున్న ఈ పదాలకు వారి సొంత అర్థాలు ఎలా ఉన్నాయో తెలిస్తే ఔరా అనకమానరు. తెలుగుజాతి అంటే సీమాంధ్ర జాతి అని, తెలుగు ప్రజలంటే సీమాంధ్ర ప్రజలని, తెలుగుతల్లి అంటే సీమాంవూధుల తల్లి అని వారి ప్రగాఢ, దృఢా విశ్వాసం కాబోలు. ఈ విషయాన్ని ఎవరో చెప్పాల్సిన పనిలేదు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటేందుకంటూ సీమాంధ్ర నేతలు, సర్కారు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాలే చెపుతాయి.andhrolu పెరియార్ రామస్వామినాయకర్ వంటి ప్రాంతేతర, భాషేతర వ్యక్తి నిలు విగ్రహాన్ని కూడా పెట్టిన సీమాంవూధులకు తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, చారివూతక పురుషుపూవరూ గొప్పవారిగా కనిపించలేదు. తెలుగువూపాంతంలో చక్రవర్తి అంటే కర్ణాటకకు చెందిన శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే గుర్తుకొచ్చే సీమాంవూధులకు, తెలుగునాట కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణీ రుద్రమ కనిపించనేలేదు. అంతెత్తు ఆరుద్ర విగ్రహం పెట్టినవారికి, తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఎలుగెత్తిచాటిన దాశరథి గుర్తుకురాలేదు. ఒకటే జాతి, ఒకటే ప్రజ అంటూ అంతులేని ప్రేమ ఒలకబోస్తున్న ఆక్రమణదారుల దృష్టిలో తెలంగాణ ఘనకీర్తికి విలువేలేదు. నెహ్రూ, భగత్‌సింగ్, జగ్జీవన్‌రాం వంటి కొంతమంది జాతీయ నేతల విగ్రహాలు మినహా మిగతావన్నీ సీమాంవూధవూపాంతానికి చెందినవారివే. సీమాంవూధుల దృష్టిలో తెలంగాణ అనేదానికి అస్థిత్వమే లేదు. ఉన్నా అది ఒక చీకటి ప్రాంతం. సీమాంవూధుల అసలుసిసలు తెలుగుజాతికి ఈ ‘ఆంధ్రా ట్యాంక్‌బండ్’ అద్దంపడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి