26, సెప్టెంబర్ 2013, గురువారం

ఔటర్ రింగులోరంగారెడ్డి జిల్లా రైతులు బలిఅష్టావక్ర


-శివార్లను మింగిన కొండచిలువ
-కోట్లు దండుకున్న సీమాంధ్ర పెద్దలు
-దోపిడీ పరిపూర్తికే సమైక్య రాగాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (టీ మీడియా):హైదరాబాద్‌ను తాము అభివృద్ధి చేశామని చెప్పుకునే సీమాంధ్ర నేతలు.. ఆ అభివృద్ధి మాటున ఎంతటి అక్రమాలకు పాల్పడ్డారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ! ఔటర్ భూసేకరణ పేరిట నోటీస్‌లను ఎరగా వేసి సీమాంధ్ర రాబందులు భారీ ఎత్తున భూ దందా నిర్వహించాయి.
roadఈ మేరకు చాలా పకడ్బందీగా ఔటర్ రింగురోడ్డుకు భూసేకరణ అధికారులుగా సీమాంధ్ర వారినే డిప్యూ తీసుకువచ్చారు. అంతే సీమాంధ్ర అధికారులు, సీమాంధ్ర రియల్ రాబందులు రింగ్‌గా ఏర్పడి.. భూసేకరణను దందాగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దందా మొత్తం పథకం ప్రకారం సాగేది. ముందు రైతులకు అధికారుల నుంచి భూసేకరణ నోటీసులు వెళ్లాయి. ఉన్న కాస్తంత భూములూ రింగురోడ్డుకింద పోతాయని రైతులు బెంబేపూత్తి ఉన్న సమయంలో కొందరు వారిని కలిసేవారు. ప్రభుత్వం భూమిని తీసుకుంటే నష్టపరిహారం నామమావూతంగా ఉంటుందని భయపె మీరు సరేనంటే ఓ పెద్దయన ఉన్నాడని, ఆయనకు అమ్మితే అంతా ఆయన చూసుకుంటాడని చెప్పేవారు.

ప్రభుత్వం పరిహారం ఇస్తుందో ఇవ్వదో.. ఇస్తే ఎప్పుడు ఇస్తుందో.. దానికి ఎన్ని కొర్రీలు పెడుతోందనని రైతులను ఆందోళనకు గురి చేసి.. రైతులనుంచి భూములు కారు చౌకగా కొనేశారు. పెద్దల చేతికి ఆ భూములు అగ్గువకు చిక్కిన తర్వాత భూసేకరణ నోటిఫికేషన్‌లు ఉపసంహరణకు గురయ్యేవి.. అలైన్‌మెంట్ మారిపోయి.. అవే భూములు కోట్ల రూపాయల్లో ధర పలికేవి! రావిర్యాల, కోకాపేట, నార్సింగి, వట్టి నాగుల పల్లి, మహేశ్వరం లాంటి అనేక ప్రాంతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోకాపేట లాంటివూపాంతాల్లో ఎకరం భూమిని ప్రభుత్వం రూ.14 కోట్లకు విక్రయించగా, రైతులు కేవలం లక్షల్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు.

ఔటర్ పేరుతో సాగిన ఈ భూదందాలో ఒక్క వైఎస్ కుటుంబమే వివిధ బినామీ పేర్లతో రింగురోడ్డు చుట్టూ దాదాపు మూడు వేల ఎకరాల భూమిని కాజేసిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో హుడాలో గ్రూపు-1 సీనియర్ అధికారిగా పని చేసిన ఒక అధికారి తన పదవిని అడ్డం పెట్టుకొని రింగురోడ్డుకు ఆనుకుని వంద ఎకరాల భూమిని సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ.. పేదలు మాత్రం రింగురోడ్డు భూసేకరణలో సమిధలయ్యారు. సీమాంధ్ర సర్కారు తమవారి కోసం మూడు సార్లు రింగురోడ్డుకు అలైన్‌మెంట్లు మార్చింది. కండ్లకోయలో కొంత మంది పెద్దల భూముల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్లు మార్చారు. అక్కడ సీమాంధ్ర పెద్దల కోసం ఇతరుల భూములతో పాటు చెరువు (జలవనరులు)ల మీదుగా రోడ్డు వేయడానికి భూమిని సేకరించారు. ఆనాడు ఈ 55 ఎకరాల్లో భూమిని సేకరించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తప్పు పట్టింది. ఇదే తీరుగా హయత్‌నగర్, పుప్పాల్‌గూడ, శామీర్‌పేట జంక్షన్ తదితర ప్రాంతాలలో కూడా ఇదే తీరుగా వ్యవహరించారు. ఆనాటి అలైన్‌మెంట్ల మార్పుపై పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇంతే కాకుండా రింగురోడ్డు చుట్టూ అభివృద్ధి చేయడంలో భాగంగా టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నామని చెప్పి, భారీ ఎత్తున భూసేకరణ చేశారు.



తెలంగాణ నేతలకు సున్నం
మలక్‌పేట ఎమ్మెల్యేగా ఉన్న మల్‌డ్డి రంగాడ్డి తనకు చెందిన భూములను రింగ్ రోడ్డు భూసేకరణ నుంచి తప్పించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డిని వేడుకున్నా ఫలితం దక్కలేదు. రంగాడ్డి కళ్ల ముందే స్వంత భూమిలో ఉన్న కోళ్లఫారాన్ని కూల్చివేసి రోడ్డు వేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్న బీసీ నాయకుడు, హైదరాబాద్ భూమి పుత్రుడైన ముఖేష్‌గౌడ్ భూమిని కూడా లాగేసుకున్నారు. తనకున్న ఆస్తి ఇదొక్క దీనిని భూసేకరణ నుంచి తప్పించాలని కోరినా ఇది కాకుండా ఏదైనా చేస్తానంటూ ఆ స్థలాన్ని వదులుకోవాల్సిందేనని వైఎస్ చెప్పారని సమాచారం. దీంతో దాదాపు 10 ఎకరాలకుపైగా విలువైన భూమిని కోల్పోయిన ముఖేష్ కొంతకాలం తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


సీమాంవూధుల భూముల వద్దకు వెళ్లిన ఔటర్
ఆనాడు ముఖ్యమంవూతిగా ఉన్న దివంగత వైఎస్ తన పరివారం కోసం రింగ్‌రోడ్డును ఇష్టం వచ్చినట్లు వంకర్లు తిప్పారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వైఎస్ తోడల్లుడు, ప్రస్తుతం వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడైన వైవీ సుబ్బాడ్డి ఆనాడు ఉస్మాన్‌సాగర్ వద్ద రెండెకరాలు, మెదక్‌జిల్లా కొల్లూరులోని పలు సర్వే నంబర్లలో భూములు కొన్నారు. వైఎస్ సోదరుడి భార్య పేరుతో కూడా కొల్లూరులో భూముల కొనుగోళ్లు జరిగాయి. విశేషం ఏమిటంటే.. దాదాపు 15 ఎకరాల భూమిని వీరిద్దరూ ఔటర్‌రింగ్‌రోడ్డు నోటిఫికేషన్ విడుదలైన తరువాతనే కొన్నారు. ముందు నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఈ భూములు రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్లకు దగ్గరగా లేవు. కానీ ఆ భూములకు దగ్గరగా వెళ్లే విధంగా రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్లనే మార్చేసిన ఘనత వైఎస్ సర్కారుది. దీని ద్వారా వీరు ఈ భూములకు భారీ ఎత్తున విలువ పెంచుకొని లబ్ధిపొందారు. ఇలా అనేకం జరిగాయి.

టీజీ వెంక బంగారు పళ్లెంలో
సీమాంధ్ర మంత్రి టీజీ వెంక విషయంలో నిబంధనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. 2010 జూన్ 30న ప్రత్యేకంగా 269 జీవో ఇస్తూ శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 30, 31, 32, 34, 34, 3ppలలో 3 ఎకరాల 12 గుంటలు మంత్రి టీజీ వెంటేశ్ కంపెనీ బ్రిలియంట్ ఇండవూస్టీస్‌కు చెందిన భూమిని ఔటర్ రింగ్‌రోడ్డు కోసం సేకరించారు. వాస్తవానికి ఈ భూమి కనీసం హైవేకు దగ్గరల్లో కూడా లేదు. శ్మశాన వాటికకు లోపల ఉంటుంది. దీనికి బదులుగా తిరిగి అంతేమొత్తంలో భూమిని సర్వే నంబర్ 775లో జాతీయ రహదారికి ఆనుకొని ఇస్తూ 2010లో ప్రత్యేక జీవోను విడుదల చేసింది.

సీమాంవూధకు చెందిన గోదావరి ఇండవూస్టీస్‌కు ముత్తంగి గ్రామంలో సర్వే నంబర్లు 212, 172, 173లలో ఉన్న 6 ఎకరాల 27 గుంటల భూమిని రింగ్‌రోడ్డు కోసం సేకరించి, దీని ప్రతిగా మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో సర్వే నంబరు114/పీలో అంతే భూమిని ఇస్తూ ప్రభుత్వం 2010 జూన్17న మెమో జారీ చేసింది. కానీ తెలంగాణకు చెందిన పరిక్షిశమల యాజమాన్యాలు, వ్యాపారస్తులు తమ భూములకు ప్రతిగా సరాసరి భూమిని ఇవ్వమంటే మాత్రం సీమాంధ్ర వీల్లేదు పొమ్మంది. ఒక నాయకుడు భార్యాపిల్లలతో కలిసి వెళ్లి తనకున్న భూమి ఇదేనని దీనికి భూసేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నా.. వైఎస్ కరగలేదు సరికదా.. ‘నీ ఒక్కడికి మినహాయింపు ఇస్తే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు’ అంటూ పట్టించుకోలేదని సదరు నేత దగ్గరి వ్యక్తి ఒకరు చెప్పారు.



తెలంగాణ ఉద్యమాన్ని చీల్చడానికి ఎర
తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణ అంశాన్ని బాగా ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను చీల్చారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ వీడేలా చేశారు. ఆనాడు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, టీఆర్‌ఎస్ తరపున రాష్ట్ర మంత్రిగా పని చేసిన సంతోష్‌డ్డికి చెందిన విలువైన ఆరుఎకరాల భూమిని ఔటర్ భూసేకరణ నుంచి మినహాయించారు. వాస్తవానికి వైఎస్ ఆనాడు ఉద్దేశపూర్వకంగా సంతోష్‌డ్డి భూములకు భూసేకరణ నోటిఫికేషన్ ఇప్పించారని, ఆ తరువాత సంతోష్‌డ్డిపై రాజకీయ పాచిక వేసి, టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరితేనే భూసేకరణ నుంచి మినహాయిస్తానని చెప్పి ఆ మేరకు భూమిని ఔటర్ భూసేకరణ నుంచి మినహాయించి పార్టీని వీడేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి.




పరిహారం చెల్లింపులో సిఫారసులు గాలికి
ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో బాధిత రైతులకు కంపెనీలకు, వ్యాపార సంస్థలకు పరిహారం నిర్ణయించడానికి ఆనాడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పడింది. ఔటర్‌రింగ్‌రోడ్డు జంక్షన్ల నిర్మాణంలో వాణిజ్య, పారిక్షిశామిక నిర్మాణాలను కోల్పోయినవారు దరఖాస్తు చేసుకుంటే భూమికి భూమి ఇవ్వాలని నిర్ణయించింది. శంషాబాద్‌లోని కిషన్‌గూడ జంక్షన్‌లో భూమిని కోల్పోయిన వాళ్లు తమ భూమికి ప్రత్యావూమాయంగా భూమి ఇవ్వమని కోరితే మాత్రం వీల్లేదని తేల్చిచెప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఔటర్ రింగురోడ్డు జంక్షన్ (కిషన్‌గూడ)లో కే భీమార్జునడ్డి, కే విజయాడ్డికి చెందిన సర్వే నంబర్లు 11, 12, 14, 23, 24, 62లలో 2 ఎకరాల 36 గుంటల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డాబా, రెస్టాంట్ తదితర వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇదే తీరుగా జయలక్ష్మి ఇండస్ట్రీస్‌కు చెందిన సర్వే నంబర్16ఏలో ఉన్న రెండెకరాల భూమిలో 1 ఎకరా 4గుంటల భూమిని రింగురోడ్డు కోసం తీసేసుకున్నారు.

ఈ ఫ్యాక్టరీలో 300 కుటుంబాలు ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ పరిక్షిశమ ఉన్న కొద్దిపాటి జాగాలోనే షెడ్లు వేసుకొని నిర్వహిస్తున్నారు. వీరి భూమిని రింగురోడ్డు కోసం సేకరించడంతో.. ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే.. అసలు ఆ విధానమే లేదంటూ అధికారికంగా హెచ్‌ఎండీఏకు చెందిన ఔటర్‌రింగ్‌రోడ్డు స్పెషల్ కలెక్టర్ 2102 జూలై7 21వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మరి టీజీ వెంక ఏ ప్రాతిపదికన భూమికి భూమి ఇచ్చారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే సరైన సమాధానం కరువైంది. టీజీ వెంక చెందిన భూమి జంక్షన్‌లో కూడా లేదని, అయినా ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చిన సర్కారు.. తమకు ఎందుకు ఇవ్వదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమార్జునడ్డి కేసును పరిశీలించిన న్యాయస్థానం పరిశీలనకు సూచించినా కనికరించలేదు.

ఇదీ ఔటర్‌వూపాజెక్టు
మొత్తం వ్యయం : రూ.6,600 కోట్లు, పొడవు : 15pp కిలోమీటర్ల మీటర్లు
కేటాయించిన భూమి : 6044 ఎకరాలు, రైతుల నుంచి : 5142 ఎకరాలు,
ప్రభుత్వ భూమి : 590 ఎకరాలు, అటవీ భూమి : 312 ఎకరాలు
ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఒక్కోవైపు ఒక కిలోమీటరు వెడల్పులో గ్రోత్‌కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ టౌన్‌షిప్పులు, పెద్ద పెద్ద పరిక్షిశమలు, ఐటీ కారిడార్ల ఏర్పాటుకు వీలుగా మరో 102 గ్రామాల భూములను కేటాయించారు.
తొలి దశ: గచ్చిబౌలి-శంషాబాద్-24కి.మీ-రూ.700కోట్ల వ్యయం (హెచ్‌ఎండీఏ నిధులు-బ్యాంక్ రుణం)
మలి దశ: పెద్దఅంబర్‌పేట్-పటాన్‌చెరు-64 కి.మీ. రూ.2,400కోట్ల (బీఒటీ విధానం-14.5 ఏళ్లపాటు నిర్వహణ). ఐదు ప్యాకేజీల్లోని 64 కి.మీ మార్గానికి ఏటా రూ.415కోట్ల బీవోటీ నిధులను ప్రభుత్వ ఖజనా నుంచి చెల్లిస్తారు.
తుది దశ: పటాన్‌చెరు-పెద్దఅంబర్‌పేట్-72 కి.మీ, రూ.3,200కోట్ల(జైకా రుణం)
ఈ మార్గాన్ని జైకా ఫేజ్-1, 2గా పిలుస్తారు. పటాన్‌చెరు-శామీర్‌పేట్-35కి.మీ (జైకాఫేజ్-1)పూర్తి కాగా, కండ్లకోయ జంక్షన్(3కి.మీ) భూసేకరణ సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. శామీర్‌పేట్-పెద్దఅంబర్‌పేట్ (33కి.మీ-జైకాఫేజ్-2) 50శాతం పైగా పనులు పూర్తి చేయగా డిసెంబర్2013 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి