17, సెప్టెంబర్ 2013, మంగళవారం

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినమా?


సెప్టెంబర్17, 1948 తెలంగాణ విమోచనా దినమా ? లేక భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన దినమా? ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థ అయిన బీజేపీ లాంటి పార్టీలు సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ విమోచన’ దినం అంటూ ప్రచారం చేస్తున్నాయి . ఈ మధ్యలో కొన్ని సంస్థలు , వ్యక్తులు కొత్తగా ఇటువంటి ప్రచారాన్నే ప్రారంభించారు. తెలంగాణరాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఇటువంటి ప్రచారానికి మరింత ప్రాధాన్యం లభించిందిపధానంగా బీజేపీ సెప్టెంబర్17ను ‘తెలంగాణవిమోచన’ దినంగా అధికారికంగా జరపాలని డిమాండు చేస్తున్నది. 1947 ఆగస్టు 15న మొత్తం భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు మాత్రం స్వాతంత్య్రం రాలేదనీ, 1948 సెప్టెంబర్17న పోలీస్ యాక్షన్ జరిగి తెలంగాణ భారతదేశంలో విలీనం అయిన తరువాతనే తెలంగాణకు స్వాతం త్య్రం వచ్చిందనీ బీజేపీ, మరి కొందరి వాదన. అస్తిత్వ పోరాటాల సందర్భంగా ప్రతి విషయంలో తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవడానికి కొన్ని సంస్థలు, వ్యక్తులు ఇటువంటి డిమాండు చేస్తున్నారు. నిజాం నవాబ్‌లు ముస్లింపాలకులు అయినందున, పోలీస్ యాక్షన్‌లో ముస్లిం రాజులపాలన అంతం అయినందున బీజేపీ ఆ రోజును విమోచన దినంగా పాటించాలని అంటున్నది. విమోచన అనేదానికి ఎవరి నిర్వచనాలు వారికి ఉన్నాయి. బీజేపీ విమోచన నిర్వచనానికి పునాది హిందూత్వం, దాని ముస్లిం వ్యతిరేకత. ముస్లిం పాలకుల నుంచి విమోచన అనేది బీజేపీ అర్ధం. ముస్లిం వ్యతిరేకతకు స్ఫూర్తిని ఇవ్వడానికే బీజేపీ సెప్టెంబర్17ను విమోచన దినంగా పాటించాలని అంటున్నది. అస్తిత్వ ఉద్యమస్ఫూర్తి కోసం మరికొందరు విమోచన దినంగా పాటించాలని అంటున్నారు .

ఇంతకూ సెప్టెంబర్ 17న తెలంగాణ ఎవరి నుంచి విమోచన, లేదా స్వాతంత్య్రం పొందింది? మొత్తం ఘటనా చక్రాన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప అర్ధంకాదు ఈ విషయం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళు భారత దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. హైదరాబాద్ రాజ్యం ఎప్పటిలాగే నిజాం పాలనలోనే ఉండింది. ఎవరైనా ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, హైదరాబాద్ రాజ్యం లేదా దేశం, బ్రిటిష్ వారు భారతదేశం రాకముందూ, వచ్చిన తరువాతా, వెళ్ళిన తరువాత కూడా నిజాం నవాబ్‌ల పాలనలోనే ఉండింది. కాకపోతే ఎన్నో బలవంతపు ఒప్పందాలతో నిజాంపాలకులు బ్రిటిష్ వారికి ఆధీనులుగానే ఉండినారు. కానీ హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వారికి వలస కాదు, స్వతంత్ర రాజ్యం/ దేశం.

అందుకే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తరువాత కూడా హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగానే గుర్తించిన భారత యూనియన్‌వూపభుత్వం నెహ్రూ నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంతో 1947నవంబర్‌లో యథాతథ ఒప్పందం చేసుకున్నది. కానీ ఒప్పందం జరిగి పూర్తిగా ఒక సంవత్సరం కూడా గడవకముందే, ఒప్పందం అలాగే ఉండగానే 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరుతో భారత యూనియన్‌వూపభుత్వం హైదరాబాద్ రాజ్యంపైన సైనికచర్య ప్రారంభించి, 17న ముగించింది . అప్పుడు మాత్రమే హైదరాబాద్ రాజ్యం అంటే, 1724లో మొగల్‌పాలన నుంచి వేరుపడి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన 224సంవత్సరాల తరువాత మాత్రమే మరోదేశంలో విలీనం అయ్యింది. అప్ప టి వరకు అది ఒక స్వతంత్ర దేశం. ఇది హైదరాబాద్ వాస్తవ చరి త్ర. వాస్తవ చరివూతపై ఆధారపడి మాత్రమే సరిఅయిన నిర్ధారణలు చేయ డం సాధ్యం అవుతుంది. కానీ చరివూతకు మసి పూసి, కళ్ళకు గంతలు కట్టి చెబుతున్న చరిత్ర ఏమిటంటే.., బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తరువాత భారత దేశం అంతా స్వాతంత్య్రం వచ్చింది. కానీ తెలంగాణకు స్వాతం త్య్రం రాలేదని, సెప్టెంబర్ 17ను విమోచన దినంగా లేదా స్వాతంత్య్ర దినంగా జరపాలనేవారు ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుం ది .

1947ఆగస్టు 15న బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలివెళ్లి పోయినప్పుడు, అప్పటికే స్వతంవూతంగా వున్న హైదరాబాద్ రాజ్యం ఏ సామ్రాజ్యవాద దేశానికి వలసగా మారింది? అప్పటికే స్వతంవూతంగా ఉన్న హైదరాబాద్ రాజ్యంబిటిష్ వారు వెళ్ళిపోవడంతో వారితో వున్న బలవంతపు ఒప్పందాలు కూడా రద్దయ్యే హైదరాబాద్ ఇంకా నిజమైన అర్థంలో స్వతంత్ర రాజ్యం అవుతుందా? వలస రాజ్యం అవుతుందా? 1947 ఆగస్టు 15తరువాత తెలంగాణ బ్రిటిష్ వలస పాలన నుంచి నిజాం వలస పాలనలోకి వెళ్ళిందా? సెప్టెంబర్ 17న భారతదేశంలో కలిసినందుకు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందా? ఈ చివరి రెండు ప్రశ్నలకు భారతదేశ చరిత్ర తెలియనివారు లేదా వక్రీకరించే వారు మాత్రమే అవునని జవాబిస్తారు. నిజానికి సీమాంధ్ర ప్రాంతం బ్రిటిష్ వలసపాలనలో వుంది. తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ బ్రిటిష్ వలసగా లేదు. తెలంగాణ ప్రజలు స్వతంత్ర ప్రజలుగా వున్నారు. అందుకే భూస్వామ్య విధానానికి, నిజాం రాచరికానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడ గలిగినారు. 1947 ఆగస్టు 15న అప్పటి వరకు బ్రిటిష్ వారితో వున్న బలవంతపు ఒప్పందాలు కూడా రద్దు అయినందున ఆరోజే తెలంగాణ ప్రజలకు కూడా స్వాతంత్య్ర దినం, సంపూర్ణ స్వాతంత్య్ర దినం అవుతుంది. సెప్టెంబర్ 17 భారత యూనియన్‌లో విలీనం అయిన దినం మాత్రమే.

బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కాలంలో ఆ ఉద్యమం కారణంగా భారత సంస్థానాలలోని ప్రజలలో తామంతా ఒకే దేశ ప్రజలమని, తామంతా ఒకటే అనే భావన, చైతన్యం ఒక మేరకు కలిగింది. దానిలో భాగంగానే హైదరాబాద్ రాజ్యానికి చెందిన ప్రజలు ప్రత్యక్షంగా బ్రిటిష్ వారి పాలనలో లేకపోయినా వారిలో కూడా ఈ భావన కలిగింది. అందుకే బ్రిటిష్‌వారు వెళ్ళిపోయిన తరువాత హైదరాబాద్ రాజ్యానికి చెందిన ప్రజలు భారత యూనియన్‌లో భాగం కావాలనే కోరికతో ఉండినారు. భారత భూభాగంలో పెద్ద, బలమైన, ధనిక, ఆధునిక రాజ్యాలలో ఒకటి అయిన హైదరాబాద్ రాజ్యం సమాన ప్రాతిపదికన భారత యూనియన్‌లో కలిసే అర్హతను కలిగి ఉండింది. కాని నిజాం నవాబ్ తప్పులను, రజాకార్ల హత్యాకాండను సాకుగా చేసుకుని యూనియన్ ప్రభుత్వం ఒక పరాయి దేశం పైన దాడిచేసి ఆక్రమించుకున్నట్లుగా ‘సైనిక చర్య’ ద్వారా విలీనం తంతును పూర్తి చేసింది. సైనిక చర్య వలన, సమాన ప్రాతిపదికన జరగాల్సిన విలీనానికి అవకాశం లేకుండా అయ్యింది. హైదరాబాద్ రాజ్యానికి చెందిన ప్రత్యేకతలు, రక్షణల గురించి చర్చే లేకుండా పోయిం ది. 1948 నుంచి 1952లో ఎన్నికలు జరిగే వరకు నాలుగేళ్ల పాటు సైనిక పాలనలో అణచివేతనే అమలయ్యింది. ఈ కాలంలోనే తెలంగాణ ప్రజలు తమ ఉద్యోగాలను, ఉపాధిని పోగొట్టుకోవడం ప్రారంభం అయ్యింది. తెలు గు రాని వారనే అవమానాలు ఆరంభమయ్యాయి.

సెప్టెంబర్ 17 తరువా త నుంచే, ఈ సైనిక పాలనలోనే ముల్కీ నిబంధనలన్నింటిని తుంగలో తొక్కి ‘వెల్లోడి’ ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగుల వలసను కొనసాగించింది. సైనిక పాలన వలన తెలంగాణ ప్రజలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉండినారు. అందుకే 1952లో ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడగానే ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అంటూ ఉద్య మం మొదలైంది. 1948 సెప్టెంబర్ 17ను ‘విమోచన దినం’ అని నాలుగు సంవత్సరాలకే నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆంధ్ర వలసాధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాడాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సి వుంటుంది. సెప్టెంబర్ 17 విమోచనలో ఆంధ్ర వలసాధిపత్యం ఎలా వస్తుందో వివరించాలి . సెప్టెంబర్ 17 కేవలం ‘విలీన దినం’ మాత్ర మే కాదు, ఒక అవమానకరమైన రీతిలో అణిచివేతతో జరిగిన విలీనం. అందుకే తెలంగాణ ప్రజలు తమ వనరులను ఉపయోగించుకుని తమ అభివృద్దిని నిర్ణయించుకునే అధికారాన్ని ఆ రోజే కోల్పోయారు. ఆ రోజు నుంచే తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అధికారం యూనియన్ ప్రభుత్వం చేతిలోకి, దాన్ని ప్రభావితం చేయగలిగే సత్తా వున్న ఆంద్ర పెత్తందార్ల చేతుల్లోకి పోయింది.

తెలంగాణ ప్రజలు భారత యూనియన్‌లో కలవాలనే బలమైన కోరిక కలిగి ఉండినందున సాంకేతికంగా చూస్తే సెప్టెంబర్17 ‘విలీన దినం’ తమ కోరిక నెరవేరిన దినంగా సంతోషించే దినం. అదే సమయంలో విలీ నం జరిగిన తీరు దాని కారణంగా తెలంగాణ ప్రజల ఆశలను, కలలను వమ్ము చేస్తూ ఆంద్ర వలసాధిపత్యానికి పునాది వేసిన దినంగా దుఃఖించే దినం. ఏది ఏమైనా సెప్టెంబర్ 17 విలీన దినం మాత్రమే. ఇక ‘విమోచ న దినం’ అన్నా ‘స్వాతంత్య్ర దినం’ అన్నా, ఏ దృష్టితో చూసినా ఆగస్టు 15నే తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినం.
-లంకా వెంకట పాపిరెడ్డి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి