26, సెప్టెంబర్ 2013, గురువారం

అన్ని ప్రాంతాల బాధ్యత ఆయనదే: దిగ్విజయ్

అన్ని ప్రాంతాల బాధ్యత ఆయనదే: దిగ్విజయ్
ప్రైవేటువి నడుస్తుంటే, ప్రభుత్వ
కార్యాలయాలే ఎందుకు బంద్ చేయాలి?
ఏపీఎన్జీవోలకు ప్రశ్న
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యత ఒక ప్రాంతానికే పరిమితం కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ తయారు చేస్తోందని, దీన్ని కేబినెట్ ఆమోదించగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదానికి పంపిస్తామని మీడియాకు వెల్లడించారు. దీనికి ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేనన్నారు. ఏపీఎన్‌జీఓ లు సమ్మెను సమ్మెను విరమించాలని, ఈ సమ్మె వ ల్ల ప్రజలు అనవసరంగా వేధన పడుతున్నారని, ప్రైవేటు వ్యాపారాలు, షాపులు, బస్సులు, స్కూళ్లు, ఆస్పత్రులు నడుస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను ఎందుకు మూసేయాలని దిగ్విజయ్ ప్రశ్నించారు.
సమ్మెను విరమించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామనివారు తిరిగి విధుల్లోకి రావాలని కోరారు. ప్రస్తుతం సమైక్య రాష్ట్రం లో ఉన్న ప్రతి ఉద్యోగికీ విభజన తర్వాత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సీఎం పక్షపాత ధోరణి కారణంగానే ఇలా జరుగుతోందని ఓ విలేకరి ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదని, ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికయ్యారని, కాబట్టి ఆయన కేవలం ఒక ప్రాంతానికి కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, జగన్‌కు బెయిల్ విషయంలో కాంగ్రెస్-వైసీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న చంద్రబాబు విమర్శలను ప్రస్తావించగా.. తమ మధ్య ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/3237#sthash.rmzm43x8.dpuf

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి