23, సెప్టెంబర్ 2013, సోమవారం

జల దోపిడీ కోసమే సమైక్య రాగం



వరంగల్‌లీగల్, సెప్టెంబర్ 23 (టీమీడియా): ఐదు దశాబ్దాల జల దోపిడీ బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న తలంపుతో సీమంవూధులు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని జల వనరుల నిపుణులు దొంతుల లక్ష్మీనారాయణ ఆరోపించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ ప్రథమ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.అంబరీషరావు అధ్యక్షతన సోమవారం జరిగిన స్మారకోపన్యాసానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బలవంతపు విలీనం తర్వా త నిజాం కూడబెట్టిన వనరులన్నింటినీ సీమాం ధ్ర ప్రాంత ఆనకట్టలకోసం, సాగునీటి సౌకర్యం కోసం వినియోగించుకుంటూ దోపిడీని దశాబ్దాలుగా కొనసాగించారన్నారు. సీమాంవూధుల వక్రబుద్ధిని గమనించిన జస్టిస్ ఫజల్ ఆనాడే హెచ్చరించారన్నారు. వివిధ ట్రిబ్యునల్స్ కేటాయించిన నీటి వనరులను తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోలేక పోతుండగా సీమాంవూధులు నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు నీటి వనరులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రం విడిపోతే నీటి వినియోగంలో కంట్రోల్ బోర్డులు ఏర్పాటు చేసి తమ జల దోపిడీని అరికడతారని గ్రహించిన సీమాంవూధులు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారన్నారు. విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్ట్‌ను సీమాంవూధుల భూముల్లో సిరులు పండించే డైవర్షన్ ప్రాజెక్ట్‌గా మార్చారన్నారు. తెలంగాణ నీటి వనరులను సీమాంవూధులు కొల్లగొట్టారని అన్నారు. స్వయం పాలన లేకపోవడంతో తెలంగాణ కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు ఐదు దశాబ్దాలు గడిచినా ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉన్నాయన్నారు.


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరిస్తూ కేవలం తెలంగాణ కోసం తన జలదృశ్యాన్ని సర్కారు ఇచ్చారని గుర్తుచేశారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపించిన మహోన్నతుడన్నారు.

తెలంగాణ గాంధీగా పిలువబడే ఏకైక వ్యక్తి బాపూజీ అని కితాబిచ్చారు. ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ మెంబర్ సహోదర్‌డ్డి, సీనియర్ న్యాయవాదులు దుస్సా జనార్దన్, దాసరి ప్రేంసాగర్, గునిగంటి శ్రీనివాస్, చందర్, గంజి గణేష్, వలస సుధీర్, గుడిమళ్ల రవికుమార్, జయాకర్, రాజేంవూదవూపసాద్, జీవన్‌గౌడ్, బొడ్డు కరుణాకర్, అండాలు, లలిత, వసుధ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి