20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పులస @ రూ. 4 వేలు!


Sakshi | Updated: September 20, 2013 13:48 (IST)
పులస @ రూ. 4 వేలు!
భీమవరం : పుస్తెలమ్మై పులస తినాల్సిందే అన్నది నానుడి. వీటికున్న విశిష్టత అటువంటిది. ఎంతైనా వెచ్చించి పులస చేపల్ని కొనేందుకు మాంస ప్రియులు ఎగబడుతుంటారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదల సమయంలో గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. ఈసారి కొద్దిగా ఆలస్యంగా చించినాడ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులసలు కనిపిస్తున్నాయి. కిలో చేప రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర పలుకుతోంది.

పులస పేరు వింటేనే జనం పుల కరించిపోతారు. రాష్ట్రంలో కోస్తా తీరంలో మాత్రమే దొరికే పులస చేప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒక్క కోస్తా నదీ తీరప్రాంతాల్లోనే లభించడంతో దీని కోసం ఈ సీజన్‌లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల నుంచి పులసప్రియులు వచ్చి ఎంత ధరయినా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒకసారి పులస రుచి చూసిన వారు వేల రూపాయలైనా పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు. దీంతో పులస చేప ధరలు ఏటేటా ఎగబాకుతున్నాయి. దీని ధరలను చుక్కలను తాకుతుండడంతో సామాన్యులకు అందకుండా పోతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి