19, సెప్టెంబర్ 2013, గురువారం

మీరు మింగిన మాభూమి అక్షరాలా పది లక్షల ఎకరాలు


9/19/2013 7:06:12 AM
-భూమి కొన్నారు.. బతుకు కూల్చారు
-సర్కారీ అండతో దోచుకుని.. ప్రైవేటు సంపద పోగేసి..
-హైదరాబాద్‌లో సీమాంధ్రుల భూదందా


lands- భూ కబ్జా కేసులు హైదరాబాద్ జిల్లాలో 1354
- ఒక్క షేక్‌పేట మండలంలోనే 450
- నగరంలో 400 చెరువులు పూడ్చేశారు
- రామోజీరావు ఆధీనంలో 2 వేల ఎకరాలు
- జీవీకే సంస్థకు నగరం చుట్టూ 20 వేల ఎకరాలు
- బీబీ నగర్‌లో నార్నె ఎస్టేట్‌కు దాదాపు 3 వేల ఎకరాలు
- జయభేరి రియల్ ఎస్టేట్‌కు నగరంలో దాదాపు 2 వేల ఎకరాల భూమి
- నగరంలో భూదందాల్లో 50కి పైగా సంస్థలు
- గురుకుల్ ట్రస్ట్ భూమిలో 637 ఎకరాలు కబ్జా
- కాంగ్రెస్ హయాంలో 70 వేల ఎకరాలు ధారాదత్తం
-ఆగాఖాన్ ఫౌండేషన్‌కు ఉచితంగా 100 ఎకరాలు
-రహేజాకు రూ.55 కోట్లకు 109 ఎకరాలు
- ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 535 ఎకరాలు

- చెరువులు, గుట్టలు, దేవాదాయ భూములూ.. సీమాంధ్ర కబ్జాలో హైదరాబాద్ శివార్లు
- ఆనవాళ్లు మిగలని లక్ష ఎకరాల కాందిశీకుల భూమి
- సంస్థలకు, వ్యక్తులకు సర్కారీ అడ్డగోలు కేటాయింపు
- ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట భారీ దోపిడీ
- గోదావరికి ఇరువైపులా సాగుభూములన్నీ వారివే
- హైదరాబాద్‌కు సీమాంధ్ర పెట్టుబడిదారుల సేవ ఇదీ!
-పెట్టిన పెట్టుబడులకు పదింతలు సంపాదన
- దోపిడీకి చరమగీతం తప్పదనే హైదరాబాద్‌పై రభస


inbabuబహుశా దునియాలో ఇంత భారీ భూ దోపిడీ ఉండదేమో! ఏ దేశంలోనూ ఇదసలు సాధ్యం కాదేమో! కానీ.. సీమాంధ్ర పెట్టుబడిదారులు దీనిని తెలంగాణలో సాధ్యం చేసి చూపించారు! భూదందా అంటే ఇదీ.. అని జబ్బ చరిచి నిరూపించారు! ఒక మురళీమోహన్.. ఒక రామోజీ.. ఒక ఎమ్మార్.. ఒక రహేజా.. ఒక ఆగాఖాన్ ఫౌండేషన్! ఆధ్యాత్మిక ముసుగులో ఇప్పుడు సత్యవాణి!! జాబితా చేంతాడంత! వెరసి.. హైదరాబాద్ చుట్టుపక్కల అక్షరాలా పది లక్షల ఎకరాలు.. ఖుద్ తెలంగాణ జమీన్ తెలంగాణకు కాకుండాపోయింది! ఒప్పందాలను కాలదన్ని.. తెలంగాణ రక్షణలను బొందబెట్టి.. చట్టాలను చుట్టాలుగా చేసుకుని.. సీమాంధ్ర పాలకులు సాగించిన దోపిడీకి.. తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయింది! బతుకు బండలైంది! సెజ్‌లపేరుతోనో.. ఐటీ పార్కుల కోసమో.. ఫార్మా ఇండస్ట్రీలకో.. సినీమాయా ప్రపంచాలకో.. అనుయాయులకో.. రాష్ట్రాన్నేలిన పార్టీల ప్రముఖుల వ్యాపార అవసరాలకో సక్రమమో.. అక్రమమో! ఏదైతేనేం? హైదరాబాద్, దాని శివారు ప్రాంత భూములన్నీ ఇప్పుడు సీమాంధ్ర పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉన్నాయి!! ప్రభుత్వాలు కేటాయించినవి కొన్నైతే.. వాటిని ఆనుకుని కబ్జాలు పెట్టినవి మరికొన్ని! కబ్జా చేసినవాటిని క్రమబద్ధీకరించుకున్నవి ఇంకొన్ని! ఇదీ నిజానికి హైదరాబాద్‌కు సీమాంధ్ర పెట్టుబడిదారులు చేసిన ‘సేవ’!! రూపాయి పెట్టుబడికి వెయ్యి రూపాయలు సంపాదించుకుని.. ఆస్తులు పోగేసుకున్న వైనం! పుట్ట తవ్వితే.. విభ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తాయి! తెలంగాణకు.. హైదరాబాద్‌కు సీమాంధ్ర నేతలు చేసిన ద్రోహాలు కళ్లు చెదిరిస్తాయి!!


hydland(టీ కోటిరెడ్డి) :విస్తారమైన జల వనరులతో మూడు పంటలూ పండగా పోగుపడిన మిగులు సంపదతో.. బ్రిటిష్ కాలంలో అవకాశం కలిగిన ఇంగ్లిష్ చదువులతో తెలంగాణలో పాగా వేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. వారి కొమ్ము కాసే పాలకవర్గాలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల పది లక్షల ఎకరాలకుపైగా భూమిని అక్రమంగా కాజేశారు. తెలంగాణ ప్రజల బతుకులను ఛిద్రం చేశారు. తెలుగుజాతికి ఒకే రాష్ట్రం ముసుగులో తెలంగాణ భూములు మింగారు. అన్నదమ్ముల్లా కలిసుందామని వచ్చి.. తమ్ముడి శక్తి మొత్తాన్నీ పీల్చేశారు! ఆంధ్రలో సరేసరి.. తెలంగాణలోనూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు భూముల్లో మెజార్టీ భూములు వీరివే.

కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పెత్తనం కూడా!హైదరాబాద్‌లో కూడా కోట్లు విలువ చేసే భూములను మింగేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావునగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఎర్రగడ్డ.. ఏ ఏరియాలో చూసినా సీమాంధ్రుల ఆస్తులే! అప్పటికే పారిశ్రామికంగా వెలుగు వెలిగిన హైదరాబాద్‌లో నాటి పరిశ్రమలన్నీ కూల్చేసి, వాటి స్థానంలో భారీ అపార్టుమెంట్లు, షాపింగ్‌మాల్స్ మొలిపించారు! నగరంలోని ఈ కొన్ని ప్రాంతాల్లోనే 20-30 వేల ఎకరాల భూమి పరాధీనమైందని అంచనా. విలీనానికి ముందే వెల్లోడి పాలనలో మొదలైన తెలంగాణ భూముల పరాయీకరణ.. ఆంధ్ర, తెలంగాణ విలీనంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పట్టపగ్గాల్లేకుండా పోయింది. వెల్లోడి పాలనలోనే రెవెన్యూ రికార్డులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు తెలంగాణలోని విలువైన భూములను స్వాధీనం చేసుకునే కుట్రలకు తెరలేపి.. విజయవంతమయ్యారని తెలంగాణవాదులు దశాబ్దాలుగా ఘోషిస్తున్నారు.

ఆ క్రమంలో పది లక్షల ఎకరాలను సీమాంధ్ర పెత్తందారులు మింగేశారని ఆరోపిస్తున్నారు. రాజధాని నడిబొడ్డున ట్యాంక్‌బండ్ కింద ఉన్న దాదాపు రూ.200 కోట్ల విలువైన డీబీఆర్ మిల్స్ భూములపై కన్నేశారు.ఈ భూములను రక్షించుకోవడానికి కార్మికులే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ ధరకు భూములు కొనడం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ భూములకు దొంగ రికార్డులు సృష్టించి భారీ ఎత్తున కబ్జా చేయడం మరో ఎత్తు. హైదరాబాద్ జిల్లాలో 1354 భూకబ్జా కేసులు ఉండగా, ఒక్క షేక్‌పేట మండలంలోనే భూ ఆక్రమణ కేసులు 450వరకు ఉన్నాయంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు చేసిన సేవ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని తెలంగాణవాదులు అంటున్నారు. నగరం చుట్టూ దాదాపు లక్ష ఎకరాల వరకు ఉన్న కాందీశీకుల భూమి నేడు వందల ఎకరాలకే పరిమితమవడం వెనుక సీమాంధ్ర పాలకుల కుట్రలే కనిపిస్తాయి. సిటీ ఆఫ్ లేక్స్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో దాదాపు 400 చెరువులు పూడ్చి ప్రైవేటు ప్లాట్లు చేసి విక్రయించారు.

సమైక్య రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈ భూముల రక్షణ కోసం చేసుకున్న ఒప్పందాలు దారుణంగా ఉల్లంఘించారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సహా తెలంగాణలో ప్రాంతేతరులు భూములు కొనే వీలులేదు. కొన్నా.. చెల్లవు. ఎవరైనా భూములు కొనాలనుకుంటే తెలంగాణ ప్రాంతీయ బోర్డు అనుమతి తీసుకోవాలి. ఆంధ్రతో విలీనానికి తెలంగాణ నాయకత్వం భయపడినప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చేలా జరిగిన ఒప్పందం అది. కానీ.. హైదరాబాద్‌కు అప్పటికే ఉన్న ప్రశస్తి, దాని భవిష్యత్ అభివృద్ధిపై కన్నేసిన సీమాంధ్ర పాలక పెద్దలు.. పెద్దమనుషుల ఒప్పందంలో కీలక అంశమైన తెలంగాణ ప్రాంతీయ బోర్డునే రద్దు చేసిపారేశారు. అక్కడి నుంచి సీమాంధ్రుల భూ కొనుగోళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ క్రమంలోనే అసైన్డ్ భూములనూ వదల్లేదు.

ఒక్కొక్క సీమాంధ్ర బడాబాబు ఖాతాలో వేల ఎకరాల భూమి కనిపిస్తుంటుంది. ఒక్క రామోజీరావే హయత్‌నగర్ మండలంలో దాదాపు రెండు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. దీన్ని కారుచౌకగా సంపాదించారన్న ఆరోపణలున్నాయి. జీవీకే సంస్థకు నగరం చుట్టూ 20 వేల ఎకరాల భూమి ఉన్నట్లు అంచనా. నార్నె రంగారావు నార్నె ఎస్టేట్ పేరుతో బీబీనగర్ ఏరియాలోనే దాదాపు 3 వేల ఎకరాలు సొంతం చేసుకున్నారు.

నగరం చుట్టూ ఈ సంస్థకు మరో 3 వేల ఎకరాల భూమి ఉంటుందని అంటారు. సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్‌కు నగరంలో కీలక ప్రాంతాల్లోనే దాదాపు 2 వేల ఎకరాల భూమి ఉంది. ఇలా దాదాపు 50 సంస్థలు నగరంలో భూ దందా చేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌ చుట్టూ ఎక్కడ చూసినా సీమాంధ్రుల ఎస్టేట్‌లు, ఫాం హౌస్‌లే! ఒక్క జూబ్లీహిల్స్, బంజరాహిల్స్‌లోనే సీమాంధ్రకు చెందిన ఇద్దరు నేతలు 1700 ఎకరాలు భూమిని మింగారని మాజీ మంత్రి శంకర్‌రావు ఆరోపిస్తున్నారు. దేవుడి భూములకు సైతం సీమాంధ్ర బడాబాబులు శఠగోపం పెట్టారు. బంజారాహిల్స్‌లో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి భూమిని స్వాహా చేశారు. హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూమిలో 637 ఎకరాలు కబ్జా చేశారు. లెక్కలేనన్ని కాలనీలు వెలిశాయి. కళ్లు మూసుకున్న ప్రభుత్వ సంస్థలు కబ్జా భూముల్లో సైతం నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశాయి. సదరు భూమి తమ తాతముత్తాతలదైనట్లు..సీమాంధ్ర బాబులు భూమిపై వ్యాపారం మొదలుపెట్టారని ఆరోపణలున్నాయి.

భూముల కేటాయింపులో ఘరానా మోసం
ఇది చాలదని సీమాంధ్ర సర్కారే నేరుగా భూకబ్జాదారుడి అవతారం ఎత్తిందన్న విమర్శలు ఉన్నాయి. లక్షల కోట్ల విలువైన ప్రజల భూములను సేకరించి బడా సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టింది. విలీనం తర్వాతి నుంచి తెలంగాణ భూములపై సీమాంధ్రుల కన్ను ఉన్నా.. కేటాయింపులు జరిగినా.. చంద్రబాబు హయాంలో అది భారీ స్థాయికి చేరింది. వైఎస్ పాలనా కాలానికి అది తన విశ్వరూపం చూపింది. గత ఆరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ కేంద్రంగా 150 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 70 వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు, వ్యక్తులకు, సెజ్‌లకు కేటాయించారంటే ఎంత వేగంగా దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చని తెలంగాణవాదులు అంటున్నారు.

ఇంతే కాదు అసలు ఉనికిలోనే లేని పత్రికలకు గజం లక్ష రూపాయల వరకు ధర పలికే జూబ్లీహిల్స్‌లో రెండెకరాల చొప్పున భూమిని కేటాయించింది. ఢిల్లీకి చెందిన ఆగాఖాన్ ఫౌండేషన్‌కు శంషాబాద్‌కు దగ్గరలో రూ.450 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని ఉచితంగా కట్టబెట్టింది. సీమాంధ్రకు చెందిన ఇందూ టెక్నోజోన్‌కు రూ.750 కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమిని కేవలం రూ.50 కోట్లకే అప్పగించారు. బ్రాహ్మణి ఇన్‌ఫ్రాకు రూ.750కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమి రూ.50కోట్లకు, స్టార్‌గేజ్ ప్రాపర్టీస్‌కు రూ.750 కోట్ల విలువ కలిగిన 250 ఎకరాల భూమిని రూ.50 కోట్లకు అప్పగించారు. ఫ్యాబ్‌సిటీకి రూ.400 కోట్ల విలువ చేసే 100ఎకరాల భూమిని ఎకరాకు ఒక్క పైస లీజుకింద కట్టబెట్టారు. ఇలా ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏల ద్వారా దాదాపు 70 వేల ఎకరాల భూమి కేటాయింపులు చేశారు. ఇందులో రహేజాది మరో ఘరానా మో సం. హెటెక్‌సిటీకి సమీపంలో ఉన్న రూ.520 కోట్ల విలువ చేసే 109 ఎకరాల భూమిని కేవలం రూ.55 కోట్లకు రాసిచ్చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని భూమిని కాజేసిన రహేజా కంపెనీ ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఐటీ పార్కులు కట్టి అద్దెకు ఇచ్చుకుంది.

తద్వారా రహేజా సంస్థకు నెలకు రూ.30కోట్ల లాభం వస్తున్నదని తెలుస్తోంది. ఇందులో సర్కారుకు నయాపైస ఆదాయం రాకపోగా రూ.500 కోట్లు నష్టపోయింది. ఈ వ్యవహారంలో సీమాంధ్ర నేతలు కోట్ల రూపాయలు మెక్కారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహేజా అక్రమాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలంటూ తెలంగాణ లాయర్ల జేఏసీ కన్వీనర్ రంగారావు సీఎంను కూడా కలిశారు. రహేజా భూ కేటాయింపుల్లో బాబు అక్రమాలు చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.

ఔటర్.. అదో భూమాయ
హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు.. సీమాంధ్ర అక్రమాలకు పరాకాష్ట. ఓఆర్ పేరుతో శివారు భూములన్నీ పరాధీనం అయ్యాయి. అలైన్‌మెంట్ల పేరుతో భూసేకరణ నోటీసులు ఇవ్వటం.. కారుచౌకగా ఆ భూములు లాక్కోవటం.. ఆ తర్వాత అలైన్‌మెంట్లు ఇష్టారాజ్యంగా మార్చి.. ఇతర రైతుల భూమిని గుంజుకోవడం! రింగ్‌రోడ్డు అంటే వలయాకారంలో ఉండాలి! కానీ.. చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ.. అష్టవంకరలు తిరుగుతూ బ్రేక్‌డ్యాన్సులు చేసేలా సాగిన రింగురోడ్డు వ్యవహారం.. పెద్దల భూములను కాపాడి.. పేదల భూములను సమాధి చేసే కోణంలో సాగిందన్న విమర్శలు అనేక వచ్చాయి. ఈ క్రమంలో అసైన్డ్ భూములు సైతం ఆగమయ్యాయి. భూదాన భూములూ మిగల్లేదు. గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేయడం కోసం ఏర్పడిన రింగ్‌రోడ్డు భూ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రింగ్‌రోడ్డు కోసం సర్కారు 86 గ్రామాల్లో 6,500 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 5,500 ఎకరాల భూమి రైతుల వద్దనుంచే సేకరించింది. శంషాబాద్ జంక్షన్ కోసం మొదట జాతీయ రహదారిపై 18.9 కి.మీ వద్ద ప్రతిపాదించారు. దీని ప్రకారమైతే సామాన్యుల హుడా కాలనీలో కేవలం 4 ఇళ్లు మాత్రమే పోయేవి. కానీ..వాటితోపాటు ఒక మాజీ మంత్రి, పలువురు బడా వ్యాపారులకు చెందిన 12 ఎకరాల భూములు కూడా పోయే పరిస్థితి రావడంతో అలైన్‌మెంట్ మారిపోయింది. ఫలితంగా హుడా కాలనీ మొత్తంగా మాయమైంది. శ్మశాన వాటిక పోయింది.

కీసరలో మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు. వట్టినాగుల పల్లిలో మొదటి భూసేకరణ ప్రకారం సర్వే నంబరు 410 నుంచి 425 వరకు నోటీస్‌లు ఇచ్చారు. ఆ తరువాత దళారీలు రంగంలోకి దిగారు. హుడా కంటే ఎక్కువ ధర ఇప్పిస్తామని సత్యం కంప్యూటర్స్ తరఫున ఎకరాకు రూ.16 లక్షల నుంచి 35 లక్షలు ఇచ్చి తీసేసుకున్నారు. ఆ తరువాత అలైన్‌మెంట్ మార్చారు. భూములు పోతాయని భయపడి రైతులు అమ్ముకున్న అదే భూముల ధర.. ఇప్పుడు ఎకరా రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ధర పలుకుతున్నది. ఈ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకొని సీమాంధ్ర నేతలు రియల్ వ్యాపారం మొదలుపెట్టారు. రైతులను భయపెట్టి.. చౌకగా కొట్టేసిన భూమిని ప్లాట్లు చేసి.. కోట్లకు కోట్లు గడించారు. వెరసి.. గ్రోత్‌కారిడార్ కాస్తా.. సామాన్య రైతులకు డెత్ కారిడార్‌గా మారింది. అలైన్‌మెంట్ల మార్పులపై సీబీఐ విచారణ చేసినా నివేదికను వెలుగు చూడకుండా నొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

సర్ఫెఖాస్ భూములూ గుంజేశారు
భారతదేశంలో సంస్థానాల విలీనం సందర్భంగా సంస్థానాధీశుల ఆస్తులను పరిరక్షిస్తామని ఇండియన్ యూనియన్ హామీ ఇచ్చింది. ఈ మేరకు నిజాంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సర్ఫెఖాస్ భూములన్నీ నిజాం నవాబు కుటుంబానికి, నిజాం వారసులకు చెందుతాయి. సర్ఫెఖాస్ భూములు హైదరాబాద్ పడమర (నేటి రంగారెడ్డి జిల్లా)లో మూడు లక్షల ఎకరాల వరకూ ఉన్నాయి. ఆనాటి రెడ్‌బుక్ అగ్రిమెంట్ ప్రకారం నాటి నిజాం బొక్కల దవాఖానా (నేటి నిమ్స్), కేబీఆర్ పార్కు, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ భూములు నిజాం నవాబు ఆస్తులే. భారత దేశంలో ఏ సంస్థానాధీశుడికీ ఇంత పెద్ద ఎత్తున భూములు లేవు. నిజాం బొక్కల దవాఖానాను నిజాం ట్రస్ట్ నుంచి 99 ఏళ్ల లీజుకు ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ.12 మాత్రమే లీజు మొత్తం ఇప్పటికీ ఇస్తోంది. ఇదే కాకుండా నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కును 1982లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బొటానికల్ గార్డెన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు భారీ హోటల్ నిర్మాణానికి అప్పగించింది. సర్ఫెఖాస్ భూములను ఈ విధంగా సీమాంధ్ర సర్కారు కాజేసింది.

చెరువులు మింగిన ఘనులు
రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెరువులు పూడ్చి.. వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టింది సీమాంధ్ర పెత్తందారులేనన్న విమర్శలు ఉన్నాయి. వీరి హస్త లాఘవానికి నగరంలో దాదాపు 400 చెరువులు మాయమయ్యాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న దుర్గం చెరువు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ చెరువు ఫుల్‌ట్యాంక్ లెవల్‌లో అనేక భారీ భవంతులు ఆకాశ హర్మ్యాలు వెలిశాయి. ఒకప్పుడు నగరానికి మంచినీరు అందించిన ఈ చెరువును మురికి గుంటగా మార్చేసిన ఘనత సీమాంధ్ర కబ్జాకోరులదేనని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కూకట్‌పల్లిలోని కాజా కుంటదీ అదే పరిస్థితి. నగరం నడిమధ్యలో ఉన్న యూసుఫ్‌గూడ పెద్ద, చిన్న చెరువులు ఇప్పుడు కాలనీలయ్యాయి.


మైండ్ బ్లాక్ అయ్యే ఎమ్మార్ బాగోతం
ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలతో మైండ్ బ్లాక్ అవుతుంది. దొందూ దొందేనన్నట్లు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌డ్డి.. తమ తమ పాలనా కాలాల్లో ఈ ప్రాజెక్టులో అక్రమాలకు తెర తీశారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో 2002లో ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు మణికొండలో 535 ఎకరాలు అప్పగించారు. ఈ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ కన్వెన్షెన్ సెంటర్‌తోపాటు ఇతర బహుళ ప్రయోజక ప్రాజెక్టులు చేపట్టాలి. విపక్షంలో ఉండగా ఎమ్మార్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్.. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఏపీఐఐసీకి సంబంధం లేకుండానే ఎమ్మార్‌కు మూడో పార్టీగా ఎంజీఎఫ్‌ను చేర్చుకొని, మొత్తం ప్రాజెక్టు డెవలపర్‌కు అప్పగించారు. ఈ తతంగం వెనుక బినామీ వ్యక్తులకు, సంస్థలకు అతి తక్కువకు ప్లాట్లు విక్రయించారని ఆరోపణలున్నాయి. ఇందులో రూపాయి కూడా ఏపీఐఐసీకి దక్కలేదు. దీనిపై సీబీఐ విచారణ నడుస్తోంది. అమీర్‌పేటలో రూ.200 కోట్ల విలువ చేసే హెచ్‌ఎండీఏ భూమిని రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కడపజిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడికి అప్పగించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టాలని టీ అడ్వొకేట్స్ డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూములు మాయం
నగరంలో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వభూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్‌లోని సర్వే నంబర్ 789/1లో రూ.250 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమి పరులపాలైంది. హైదరాబాద్‌లోని కోఠీ ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన రూ.3381 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేశారు. సీమాంధ్ర సర్కారు ఈ భూమిని కబ్జాదారులకే అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో ఆదేశాల అమలు పెండింగ్‌లో పడింది. శివారు ప్రాంతమైన జవహర్‌నగర్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలనీలు వెలిశాయి. నగరంలో ఇలా దాదాపు 2 వేల ఎకరాల భూమి కబ్జా అయినట్లుగా అధికారులు గుర్తించినా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకునే పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం లేద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి