9/20/2013 3:36:21 AM
-క్రమబద్ధీకరణ పేరుతో భూములు స్వాహా
-లొసుగుల చట్టాలతో చెలరేగిన బడాబాబులు
-గ్రేటర్ హైదరాబాద్‌లో 27వేల ఎకరాలు హాంఫట్
క్రమబద్ధీకరణ! అన్యాయాన్ని అధికారికంగా న్యాయం చేసుకునే ఓ అవకాశం! దీన్ని ఆధారంగా చేసుకున్న సీమాంధ్ర బడాబాబులు, పెట్టుబడిదారులుగా రూపం మార్చిన భూకామందులు చెలరేగిపోయారు. హైదరాబాద్‌లో కనిపించిన ఖాళీ స్థలాన్నల్లా దర్జాగా కబ్జా చేసుకుంటూ పోయారు! ఆపై నిబంధనలను అనుసరించి.. క్రమబద్ధీకరణ పిటిషన్ల పేరుతో చట్ట ప్రకారం వాటిని తమవిగా మార్చుకుంటున్నారు! పేదలు గుడిసె వేసుకోవడానికంటే అనుమతించరుగానీ.. బడాబాబులకు ప్రభుత్వం నుంచి ఇబ్బందేంటి? పైగా పాలక వర్గాలు సొంత మనుషులేనాయె! ఇక అక్కడితో వలసవాదుల రియల్ దందా షురూ! ఒక అంచనా ప్రకారం హైదరాబాద్, దాని శివారు ప్రాంతమైన రంగాడ్డి జిల్లాలో దాదాపు 27వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఇలా కబ్జాలకు గురై.. ఆనక క్రమబద్ధీకరణ చెందింది. ఒక్క షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లాంటి ఖరీదైన ప్రాంతంలోనే దాదాపు 2800 ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. దాదాపు 2250 ఎకరాల యూఎల్‌సీ భూమి ఎక్కడ ఉందో అధికారులకు కూడా తెలియదు! అందుకే సీమాంధ్ర కబ్జా వ్యవహారం మూడు ప్లాట్లు.. అరవై ఫ్లాట్లుగా వర్థిల్లుతోంది! రండి బాబూ.. రండి.. అన్నింటికీ అనువైన ఆంధ్రా అపార్ట్‌మెంట్స్!!
(టీ కోటిరెడ్డి):భూముల క్రమబద్ధీకరణ లొసుగులను ఆధారం చేసుకున్న సీమాంధ్ర పెత్తందారులు హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను కబళించేశారు. కబ్జా చేసిన విలువైన భూములకు క్రమబద్దీకరణ పేరుతో చట్టబద్ధత తెచ్చుకున్నారు. క్రమబద్ధీకరణల కోసమే ప్రత్యేకంగా 166, 257, 258 నంబర్లతో జీవోలు జారీ అయ్యాయి. పోనీ ఇదేమైనా పేదవాడికి ఉపయోపడిందా? అంటే దుర్భిణి వేసి వెతకాల్సిందే! కానీ.. పెద్ద పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, రియల్టర్లకు మాత్రం ఆగమేఘాల మీద క్రమబద్ధీకరణలు పూర్తయిన ఉదంతాలు కోకొల్లలని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
ఒక్క హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోనే 19 వేల మంది పేదలు తమ ఇంటి స్థలాలలను క్రమబద్ధీకరించుకోవాలని కోరితే 95 శాతం దరఖాస్తులను తిరస్కరించారు. పోనీ మిగిలిన ఐదు శాతం దరఖాస్తులనైనా పరిష్కరించారా అంటే వాటినీ పెండింగ్‌లో పడేశారు. కానీ.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉన్నత వర్గాల వారు 12,233 మంది దరఖాస్తు చేసుకుంటే.. వాటన్నింటినీ క్రమబద్ధీకరించేసిన సర్కారు.. తాను ఎవరి పక్షపాతినో చెప్పకనే చెప్పింది. మనోడైనా లంచం కామనే అనే పద్ధతుల్లో వారి క్రమబద్ధీకరణలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
జీవో కాలపరిమితి ముగిసినా....
జీవో 116.. రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా పని చేసి.. ఓ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ తన పాలనా కాలంలో తన సొంత మనుషులు కబ్జా చేసిన భూముల క్రమబద్ధీకరణకు తెచ్చిందిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వు! 2008 ఫిబ్రవరి 16న వచ్చిన ఈ జీవో కాలపరిమితి గత ఏడాది ముగిసింది. నామమావూతపు ధరతో కబ్జా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ జీవోద్వారా అవకాశం కల్పించారు. అయితే భూదాహం తీరని సీమాంధ్ర కబ్జాదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో మిగిలిన కబ్జా భూములను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జీవో 166ను గత నెల రోజుల నుంచి కొనసాగిస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి.
ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందిస్తూ.. క్రమబద్ధీకరణలు పూర్తి చేస్తున్నదన్న విమర్శలు వెలువడుతున్నాయి. సీమాంధ్ర కబ్జాలైతేనేమి.. వారికి అధికారికంగా జరిగిన కేటాయింపులైతేనేమి? మొత్తంగా ఈ భూపందేరంలో తెలంగాణ భారీగా నష్టపోయిందని గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీకూడా వ్యక్తం చేయడం గమనార్హం. ప్రధానంగా హైదరాబాద్, శివారు ప్రాంతమైన రంగాడ్డి జిల్లాల్లో కనీసం ప్రభుత్వ, ప్రజోపయోగ అవసరాలకు అవసరమైన ప్రభుత్వ భూములు లేకుండా పోయాయని సదరు కమిటీ వాస్తవాలను విశదీకరించింది.
ఈ పరిస్థితికి జీవో 116 కూడా ప్రధాన కారణం. ఈ జీవోను అడ్డుపెట్టుకున్న ప్రాంతేతరులు.. హైదరాబాద్ భూముల్లో పాగా వేసి.. పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ ఉత్తర్వుల్లో 2003 డిసెంబర్ 31 కంటే ముందు నగరాలు, పట్టణాల్లో ఆక్రమణలకు గురైన 80 చదరపు గజాలకు లోబడిన ప్రభుత్వ భూములకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. అనంతరం ఈ ఉత్తర్వులు మార్చిన పెద్దలు దీనిని క్రమబద్ధీకరణలో విస్తీర్ణాన్ని 500 గజాలకు పెంచారు. ఇక సవరణతో అక్రమార్కులకు, పెద్దలకు ఆడిందే ఆటగా మారింది. అందినకాడికి దోచుకునేలా కబ్జాలకు అవకాశం చిక్కింది. భూబకాసురుల చేతిలో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల భూమి చిక్కిపోయింది.
వైఎస్ పేదవాడేనట!
పేదలు, నిలువ నీడలేనివారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగించేవారికి ఆ భూమిపై ఎంతో కొంతకు వారికే హక్కు కల్పించడం క్రమబద్ధీకరణ అసలు ఉద్దేశం. విశేషం ఏమిటంటే.. ఈ పేదల కోటాలోకి రాష్ట్రాన్ని ఆరేళ్లు సీఎంగా పాలించిన దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి కూడా ఉన్నారు! ఆయన సీఎంగా ఉన్నప్పుడే బంజారాహిల్స్‌లో 2075 చదరపు గజాలు, ఆయన కొడుకు జగన్మోహన్‌డ్డి పేరుతో 398 చదరపు గజాల భూమిని క్రమబద్ధీకరించుకున్నారు. నిజానికి ఒక కుటుంబం ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా ఉంటున్నప్పుడే జీవో వర్తిస్తుంది. కానీ వీరి విషయంలో ఖాళీ స్థలాలను సైతం క్రమబద్ధీకరించేయడం విశేషం. వై జితిన్ అనే ఆసామి.. తన పేరుతో రెండు ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. బంజారాహిల్స్‌లో ఆనంద్‌వూపభాత్ సొసైటీ పేరుతో సీహెచ్ మల్లేష్ పేరున దాదాపు ఎకరం స్థలం క్రమబద్ధీకరణ జరిగింది. ఆయన ఇతర కుటుంబసభ్యుల పేరుతో మరో రెండు వేల గజాలు క్రమబద్ధీకరణ చేయించుకున్నారు.
సర్కారు పెద్దల జోక్యంతో సీమాంవూధుల కబ్జా
బంజారాహిల్స్‌లోని దుర్గాభవానినగర్ సర్వే నంబర్403లో 250 మంది పేద గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న స్థలాన్ని దివంగత ముఖ్యమంత్రి బావమరిది కడప మాజీ మేయర్ రవీంవూధనాథ్‌డ్డికి కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ ఈ భూమి అతని ఆధీనంలోనే ఉందని చెబుతారు. తిరుమలగిరి మండలంలోని తోకట్టలో దాదాపు రూ.550 కోట్ల విలువైన 18 ఎకరాల భూమిని సీమాంధ్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు తమ బినామీ పేరుతో మ్యుటేషన్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తిరస్కరించినా బలవంతంగా ఉస్మాన్ అనే బినామీకి భూమి యాజమాన్యహక్కులు కట్టబెట్టారు. ఈ భూమిలో ఎంతో కాలంగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలు క్రమబద్ధీకరణకు ధరఖాస్తు చేసుకున్నా అధికారులు అందుకు తిరస్కరించడం గమనార్హం. బంజారాహిల్స్‌లోని 15 ఎకరాల భూమిని గోదావరి సొసైటీకి క్రమబద్ధీకరించేందుకు సీమాంధ్ర పాలకులు వేగంగా పావులు కదుపుతున్నారన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి.
రంగాడ్డి జిల్లాలో 20 వేల ఎకరాల భూమి కబ్జా..
సర్కారు లెక్కల ప్రకారమే రంగాడ్డి జిల్లాలో 20 వేలఎకరాల భూమికబ్జా అయినట్లు నిర్ధారణ అయిందని అధికారవర్గాలే ధృవీకరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జిల్లా రెవెన్యూ అధికారులు 50 వేలఎకరాల భూమిని సర్వేచేయగా ఇందులో 20 వేలఎకరాలు కబ్జాకు గురైనట్లు తేలిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలంగాణవాదులు అంటున్నారు. మొత్తం జిల్లాలోని భూములన్నీంటినీ సర్వే చేస్తే లక్షల ఎకరాల భూములు కబ్జా అయిన విషయం వెలుగులోకి వస్తుందని ఈ జిల్లాల్లో పని చేస్తున్న ఒక రెవెన్యూ అధికారి అన్నారు.
రంగాడ్డి జిల్లాలో భూములలో ఎక్కువ శాతం భూములను సీమ ముఠాలు, ఆంధ్రకు చెందిన రియల్ వ్యాపారులు దొడ్డి దారుల్లో పత్రాలు సృష్టించి కబ్జాలు చేశారన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో సత్యం కంప్యూటర్స్ కోసం స్థానికంగా ఉండే ఒక నేత దాదాపు వేయిఎకరాల భూమిని కబ్జా చేసి 800 ఎకరాలు సత్యం సంస్థ అధిపతి రామలింగరాజుకు అప్పగించారు. దీనికి డాక్యుమెంట్లను కూడా సృష్టించడం గమనార్హం. కొంపల్లిలో కాటన్ మిల్లు పెడతానని రైతుల వద్దనుంచి ప్రభుత్వం ద్వారా125 ఎకరాల భూమిని కాజేసిన లచ్చిరాజు అనే వ్యక్తి అక్కడ ఎలాంటి పరిక్షిశమను స్థాపించలేదు. మల్లమ్మబండ అనే ప్రాంతాన్ని ఏకమొత్తంగా దేశ్‌పాండే అనే స్థానికేతరుడితో సీమాంవూధులు తెర ఉండి కబ్జా చేయించారు.
దీంతో ఇక్కడ ఉన్న మల్లమ్మబండ భూమి అంతా రియల్‌ఎస్టేట్ ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆక్రమణ భూములు క్రమబద్ధీకరణ చేస్తున్న అధికారులు ఈ జిల్లాలో దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు మాత్రం కనీస హక్కులు కల్పించడం లేదు. పైగా వీరికి అసైన్ చేసిన భూములనే ప్రజా అవసరాల పేరుతో లాక్కోవడం గమనార్హం. నగరం, రంగాడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో సీమ గుండాలు అనేక భూములను కబ్జా చేశారు. తుపాకులతో సాయుధంగా ఉన్న ముఠాలు కూడా కబ్జాభూములకు కాపలా కాసిన విషయాలు గతంలో వెలుగు చూశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జాచేసిన సీమాంధ్ర బడాబాబులు తమకు అనుకూలమైన అధికారులను ఆయా పోస్టుల్లోకి తీసుకువచ్చి క్రమబద్ధీకరణచేసుకోవమో లేదా మరో పద్ధతుల్లోనో స్వంతం చేసుకునే పని చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్‌వోసీ.. ఓ దందా..
సర్కారు భూములను కబ్జా చేయడం ఒక ఎత్తయితే.. వాటికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అదే రెవెన్యూ శాఖ నుంచి ఈ భూమి తమదని నిరభ్యంతర ధృవీకరణ (ఎన్‌వోసీ) పత్రాలకు ధరఖాస్తు చేయడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇలాంటి ధరఖాస్తులను దాదాపు 170 వరకు గుర్తించారు. షేక్‌పేట మండలం నుంచే అత్యధికంగా 11382 గజాలకు ఎన్‌వోసీలు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. అమీర్‌పేటలో ఆరువేల గజాలకు ఎన్‌వోసీలకు అర్జీలు వచ్చాయి. ఇలా జిల్లావ్యాప్తంగా దాదాపు 50 వేల గజాల భూమికి దరఖాస్తులు రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఇవన్నీ పెద్దల అండదండలతో జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే అసలు రికార్డులే లేకుండా దాదాపు 2250 ఎకరాల యూఎల్‌సీ భూమి మాయం కావడంతో.. అసలు ఆ భూములకు కూడా ఇదే పద్ధతుల్లో ఎన్‌వోసీలు తీసుకొని తమ ఆస్తుల్లో కలుపుకునే ప్రమాదం కూడా ఉండవచ్చునని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షేక్‌పేట మండలంలో మూడు చోట్ల ఉన్న దక్కన్‌ఇన్‌వూఫాస్ట్రక్చర్‌కు చెందిన 7.48 ఎకరాలు, ఇదే సంస్థకు చెందిన భూమి రంగాడ్డి జిల్లాలో 570 ఎకరాల భూమి కబ్జాకు గురైంది.
భూ కబ్జాలో పొలిటికల్ ల్యాండ్ మాఫియా
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో సీమాంధ్ర పొలిటికల్ ల్యాండ్ మాఫియా ఏర్పడింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు అక్రమంగా కబ్జాలకు పాల్పడ్డారు. చంద్రబాబు అండతో మురళీమోహన్ జయభేరి పేరుతో అగ్గువకు భూములు కొని రియల్ వ్యాపారం చేశారు. సీమాంధ్ర కమ్మ దొరలు అడ్డగోలుగా భూములు ఆక్రమించారు. వైఎస్ హయాంలో సీమ సాయుధ ముఠాలు రంగ ప్రవేశం చేశాయి. రంగాడ్డి జిల్లాలో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేస్తేనే 20 వేల ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. మొత్తం భూములను సర్వే చేస్తే లక్షల ఎకరాల భూములు కబ్జాఅయిన విషయం వెలుగులోకి వస్తుంది. తెలంగాణ భూములను ఆక్రమించుకున్న సీమాంధ్ర కబ్జాదారుల వద్దనుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ కబ్జా కూడా అవినీతికి మూలమే. వీరందరిపై అవినీతి కేసులు నమోదు చేసి విచారించి శిక్షించాలి. కబ్జాదారుల ఆధీనంలో ఉన్న భూములు స్వాధీనం చేసుకొని దళిత, గిరిజన, పేద ప్రజలకు పంచాలి.

- బెల్లయ్యనాయక్, తెలంగాణ-ఆంధ్రా ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్
పేదలపై కేసులు, పెద్దలకు క్రమబద్ధీకరణ - ఇది సర్కారు తీరు
నగరంలో పేదలు తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే కేసులు పెట్టారు. దాదాపు వందల మంది పేదలపై భూఆవూకమణ కేసులు పెట్టారు. మరో వైపు బడా బాబులకు క్రమబద్ధీకరణ పేరుతో భారీ భూసంతర్పణకు దిగారు. వీరంతా కోట్ల కొద్దీ ఆస్తులున్న బడా బాబులే. ఈవ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పేదలకు నివాసిత స్థలాలను ఏర్పాటు చేయాలి.
- శ్రీనివాస్, సీపీఎం నగర కమిటీ కార్యవర్గ సభ్యుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి