9/15/2013 3:07:27 AM
(టీమీడియా ప్రతినిధి, సంగాడ్డి): తెలంగాణ గడ్డమీద
పుట్టిపెరిగి సమైక్యవాదిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే
ప్రభుత్వ విప్, మెదక్ జిల్లా సంగాడ్డి ఎమ్మెల్యే తూర్పు
జయవూపకాశ్‌డ్డి(జగ్గాడ్డి) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. టికెట్‌ను తెలంగాణా కోసం
ఆత్మబలిదానాలకు పాల్పడిన అమరవీరుల కుటుంబసభ్యులకు ఇప్పించాలని
నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి
ఒప్పిస్తానని అంటున్నారు. పోటీకి దూరంగా ఉండాలనే అంశంపై 15 రోజులుగా
నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా
మెజారిటీ నాయకులు వద్దని వారించినా.. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే
ప్రసక్తే లేదని జగ్గాడ్డి తేల్చిచెప్పారు. సమైక్యవాదిగా టీఆర్‌ఎస్‌తోపాటు ఆ
పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్న జగ్గాడ్డి తెలంగాణ ఏర్పాటు అవసరం లేదని
సోనియాగాంధీకి గతంలో లేఖ రాశారు.
ఇప్పటికీ సమైక్యవాదిని అంటూనే తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్నారని, ఇక వెనక్కి తగ్గబోరని తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆయన ఒక్కసారిగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఇతర వ్యూహం ఏదైనా ఉన్నదా? అనే కోణంలో స్థానికంగా చర్చ జరుగుతున్నది.
నా నిర్ణయంలో మార్పు ఉండదు: జగ్గాడ్డి
వచ్చే ఎన్నికల్లో జగ్గాడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మీడియాలో ఉహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం ‘టీ మీడియా’ జగ్గాడ్డిని కలిసింది. మీడియాలో కథనాలు వస్తున్న మాట వాస్తవమేనని.. మొదటిసారిగా ‘నమస్తే తెలంగాణ’కు వాస్తవాలు వివరిస్తున్నానని మనసులో మాట బయటపెట్టారు. ‘వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండకూడదని నెల రోజుల క్రితమే నిర్ణయించుకున్నాను. అయితే నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నా. కొందరు గొప్ప నిర్ణయం అన్నారు. చాలామంది వద్దు మీరే ఉండాలి... లేదంటే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన చెందారు. అందరికీ నచ్చజెప్పా. నా కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించాను. అమరుల త్యాగాలతో తెలంగాణ సిద్ధిస్తున్నది. నా వంతుగా గతంలో అమరులస్థూపాలు కట్టించా.
లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాను. ఇప్పుడు అదే కుటుంబాల్లో ఒకరికి కాంగ్రెస్ నుంచి సంగారెడ్డి టికెట్ ఇప్పించాలని నిర్ణయించుకున్నా’ అని జగ్గాడ్డి చెప్పారు. ‘ఒక్కటి మాత్రం నిజం. నా నిర్ణయంలో ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు. నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. అయితే ఇతర పార్టీలు కూడా సహకరిస్తే బాగుంటుంది’ అని అన్నారు. పోటీ చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓ కార్యకర్తగా పనిచేస్తానని.. సామాజిక సేవా కార్యక్షికమాలు విస్తృతం చేస్తానని చెప్పారు. మా అమ్మ జమయమ్మ పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలందిస్తూ కాలం గడుపుతానని జగ్గాడ్డి వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి