9/21/2013 3:57:52 AM
-సోనీ ఇండియా లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (టీ మీడియా బిజినెస్ ప్రతినిధి): ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ సోనీ ఇండియా.. దేశీయ మార్కెట్‌పై మరింత దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా హై-ఎండ్ మొబైల్ మార్కెట్లో అగ్రస్థానంపై గురిపెట్టింది. రూ.30 వేల కంటే అధిక ధర కలిగిన మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం 10 శాతం వాటాతో మూడో స్థానంలో ఉన్న సంస్థ ఈ ఏడాది చివరి నాటికి 20 శాతం వాటాతో నంబర్ 1 స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ టడాటో కిమురా తెలిపారు. ప్రీమియం మార్కెట్‌పై మరింత దృష్టి సారించడంతో పాటు రూ.20 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లను కూడా త్వరలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించినప్పటికీ ఇప్పట్లో ధరలు పెంచే ఉద్దేశం కంపెనీకి లేదన్నారు.ఆండ్రాయిడ్ ఆధారంగా నడిచే క్యూఎక్స్ సీరిస్‌లో రెండు రకాల కెమెరాలను శుక్రవారం కిమురా విడుదల చేశారు. ఈ ఉత్పత్తులు వచ్చే నెలలో రిటైల్ మార్కెట్లో లభ్యంకానున్నాయి. దీంట్లో క్యూఎక్స్ 100 ధర రూ.24,990గా నిర్ణయించిన సంస్థ.. రూ.12,990కి క్యూఎక్స్ 10 లభ్యమవనున్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి