25, సెప్టెంబర్ 2013, బుధవారం

సమైక్యతే ప్రగతికి మార్గం

హైదరాబాద్ లాంటి నగరాన్ని ఏర్పాటు చేసకోవడానికి సీమాంధ్రులకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకూ సీమాంధ్రుల పరిస్థితి ఏమిటి? ఉపాధి లేక, నిరుద్యోగులై కడు దారిద్య్రాన్ని అనుభవించాల్సిందేనా? ఏమిటి సీమాం«ద్రులు చేసిన నేరం? అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ వారు ఆంధ్రులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. అప్పట్లో అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్థించాయి. కావున 1953 డిసెంబర్‌లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసన సభలో మూడింట రెండు వంతుల సభ్యులు అంగీకరిస్తే ఆంధ్రలో విలీనం చేయవచ్చని కూడా సూచించింది. సదరు కమిషన్ సూచనలను ఆహ్వానించి హైదరాబాద్ శాసనసభలో చర్చ జరపగా 103 మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు తెలుపగా 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమర్థించిన ప్రముఖులలోనాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు, స్వామి రామానంద తీర్థ మొదలైన వారు ఉన్నారు.
దీనిపై తెలంగాణ, విశాలాంధ్ర వాదులు తమ తమ వాదనలను తీవ్రతరం చేశారు. తదుపరి ఆంధ్ర, తెలంగాణ నాయకులను తమ తమ విభేదాలను పరిష్కరించుకోమని వచ్చిన వత్తిడి మేరకు 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఇరుప్రాంత నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణరావు, కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నర్సింగరావ్‌లు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాల రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 1న వారి మధ్య 'పెద్ద మనుషుల' ఒప్పందం కుదిరింది. ఆ విధంగా 1956 నవంబర్ 1న అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సి.ఎం. త్రివేది ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్‌గా కొనసాగారు.
స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలూ లేవు. నేటి సువిశాలమైన హైదరాబాదు తెలంగాణ జిల్లాల్లో ఒక భాగం మాత్రమే. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినపుడు అప్పటి తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం కావాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్‌ను సాధించుకొని ఎటువంటి విభేదాలూ లేకుండా సమైక్యంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా 1975లోనే ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
1975 నుంచి 2002 వరకూ తెలంగాణ ఉద్యమం లేనేలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం నడిచినట్లు చూపితే ఈనాడు సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చేది కాదు. దీనిని కేవలం కొంతమంది రాజకీయ మనుగడకు, తమ కుటుంబ సభ్యుల వృద్ధి కోసం స్వార్థపూరిత స్వభావంతో మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 1956 నవంబర్ 1న తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రను యావత్తూ ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించిన తదుపరి సదరు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించుకున్నాం. యావత్ ఆం«ద్రులు ప్రాంతాలతో పనిలేకుండా సమష్టి కృషితో రాజధాని హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని ప్రపంచంలోనే కొనియాడదగిన విధంగా తయారు చేసుకున్నాం. కావున హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తూ కాదు, అందరి ఆం«ద్రులది, ఆం«ద్రులందరూ కలిసి నిర్మించుకున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే వాటిల్లే నష్టం ఊహించలేనిది.
(1) తెలుగువారి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అభివృద్ధిలో భాగంగా అధిక ఆదాయాన్ని సమకూర్చే వనరులు, వసతులు ఏర్పరచుకొని, పారిశ్రామికంగా తలమానికంగా తయారుచేసుకొన్న హైదరాబాదును తెలంగాణకు ఇచ్చేస్తే, రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం ఆదాయం అక్కడి నుంచే వస్తున్న పరిస్థితుల్లో ఆ ఆదాయంగానీ రాకపోతే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేయగలుగుతారు? ఉద్యోగులకు జీతభత్యాలు ఎలా ఇవ్వగలుగుతారు? (2) జలవిద్యుత్, థర్మల్ విద్యుత్ పరిశ్రమలు సీమాంధ్రలో ఉన్నా అందుకు కావలసిన వనరులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అందులో సీమాంధ్రలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు ఇంధన కొరతతో మూతపడే ప్రమాదముంది. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి భారం అవుతుంది. (3) రాష్ట్రాన్ని విభజిస్తే కృష్ణా ఆయకట్టులో రోజూ నీటి గొడవలే ఉంటాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణ్ పూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కిందకు నీరు వదలని పరిస్థితి. అలాంటపుడు మధ్యలో మరొక రాష్ట్రం వస్తే, ఇక్కడ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలోనికి నీరు ఎలా వస్తుంది? సీమాం«ద్రులకు సాగునీరు, తాగునీరు ఎవరిస్తారు? ఎలా ఇస్తారు? (4) కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీరు తప్ప తాగునీరు ఎక్కడిది? సాగుకు ఎలా పనిచేస్తుంది? (5) రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల ద్వారా ఏటా 42వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా, అందులో 27వేల కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. మరి రాష్ట్రాన్ని విభజిస్తే అది ఎలా జరుగుతుంది?
(6) రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య తలెత్తుతుంది. ఆల్మట్టి వలన ఇప్పటికే కృష్ణా డెల్టా రైతాంగం సాగునీరు కోసం అనేక బాధలు పడుతుంటే, తెలంగాణ వలన గోదావరి డెల్టా ఎడారిగా మరిపోయే అవకాశం ఉంది. అందువలన సుమారుగా రెండు లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోతారు.
(7) సీమాం«ద్రులచే అభివృద్ధి చేయబడిన జాతీయ విద్యా సంస్థలు, పరిశ్రమలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అన్నీ హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అలాంటప్పుడు విభజన జరిగితే సీమాంధ్ర విద్యార్థులు ఉన్నత చదవులకు గానీ, ఉపాధి, ఉద్యోగం కోసం గానీ ఎక్కడికి వెళ్ళాలి?
(8) కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సుమారుగా 40 వరకూ హైదరాబాద్‌లోనే నెలకొల్పబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాజధాని అనే భావనతో కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే నెలకొల్పబడ్డాయి.
(9) సుమారుగా 2.5 లక్షల మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. నేడు వారందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టే అవకాశముంది. తెలంగాణ నాయకులు కూడా అదే చెబుతున్నారు. వారి కుటుంబాల్లో అభద్రతా భావం నెలకొని ఉంది.
(10) స్కూల్స్ కన్నా పెద్దవి హైస్కూల్స్, వాటి కన్నా పెద్దవి కాలేజీలు, అంతకంటే పెద్దవి యూనివర్సిటీలు, వీటన్నిటికంటే పెద్దవి రీసెర్చి సెంటర్లు. అటువంటి రీసెర్చి సెంటర్లు సుమారుగా 38 వరకూ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విచిత్రమేమిటంటే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన మత్స్య పరిశోధనా కేంద్రం కూడా హైదరాబాదులో ఏర్పాటు చేశారు.
(11) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున, రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర రోగుల ఆరోగ్యశ్రీ కార్డులన్నీ చెత్తబుట్టలో వేయక తప్పదు.
(12) వ్యవసాయం చేసేది ఇక్కడైతే ఎన్.జి. రంగా వ్యవసాయ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉన్నది.
(13) ప్రభుత్వరంగ సంస్థలూ, యూనివర్సిటీలు రాజధానిలోనే ఉన్నాయి. డిగ్రీ పాసైన ప్రతి విద్యార్థి ఉపాధి కోసం, ఉన్నత చదువు కోసం రాజధాని హైదరాబాద్ వైపు లోకల్ అభ్యర్థిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, నిరుద్యోగులు నాన్‌లోకల్‌గా ఉండి తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.
(14) విభజన అనివార్యమైతే సీమాంధ్ర పాతికేళ్ళు వెనక్కు వెళ్లడం ఖాయం. రాజధాని నిర్మించుకొనే వరకూ అనగా పది సంవత్సరాలు సీమాం«ద్రులు పరాయి పంచన బ్రతకాలి.
(15) హైదరాబాద్ లాంటి నగరాన్ని ఏర్పాటు చేసకోవడానికి సీమాం«ద్రులకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకూ సీమాం«ద్రుల పరిస్థితి ఏమిటి? ఉపాధి లేక, నిరుద్యోగులై కడు దారిద్య్రాన్ని అనుభవించాల్సిందేనా? ఏమిటి సీమాం«ద్రులు చేసిన నేరం? అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ వారు ఆం«ద్రులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు.
సుమారుగా 54 కోట్ల రూపాయలు వెచ్చించి నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలపై చర్చలు గానీ, అధ్యయనం గానీ ఎందుకు జరపలేదు. 'విభజన వలన నష్టపోయిన వారికి సమన్యాయం చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది' కానీ దానిని ఈ అవగాహన లేని అనధికార కమిటీ అటకెక్కించింది.
రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రజల మనుగడకు, వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుంది. అభివృద్ధి చెందాలంటే కలిసి ఉండటం ఒక్కటే మార్గం. 'కలిసి ఉంటే కలదు సుఖం'.
ఈనాడు సమైక్యాంధ్ర ఉద్యమం మరొక స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తోంది. 'విభజించు-పాలించు' అనే బ్రిటిష్ పాలక సిద్ధాంతం తరహాలోనే కేంద్రం రాష్ట్ర విభజనకు సిద్ధమవుతోంది. కావున సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నేరవేర్చవలసిన సంబంధిత కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకపోవడం చాలా బాధాకరమైన అంశం.
- కె.వి. నరసింహం
ఉపాధ్యక్షులు, మానవ హక్కుల మండలి

- See more at: http://www.andhrajyothy.com/node/2228#sthash.4rRW2FRD.dpuf

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి