27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పెట్టుబడి కట్టుకథే సమైక్యాంధ్ర



చిన్న రాష్ట్రాల ఏర్పాటును అడ్డుకోవటమంటే వికేంవూదీకృత వివిదాంధ్ర అభివృద్ధిని, వివిధ వెనుకబడిన ప్రాంతాల, వర్గాల అభివృద్ధిని అడ్డుకోవటమే. ఇలాంటి విచక్షణ తో కూడిన వివేకంతో వాస్తవాలను తెలుసుకొని, విచక్షణారహిత సమైక్యాంధ్ర భావోద్వేగాలను విడనాడి, వలసాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ పెత్తందారీ శక్తుల పన్నాగాలను పటాపంచలు చేద్దాం.



ఆంధ్రవూపదేశ్ అవతరించి అయిదున్నర దశాబ్దాలు గడిచిపోయా యి. అంటే ఇన్నేళ్లులో ఈ విశాలాంధ్ర సమైక్యాంధ్రగానే కొనసాగింది. అయిదున్నర దశాబ్దాలుగా సమైక్యంగానే వున్న విశాలాంధ్ర ఈనాడు అనైక్యాంధ్ర, విషాదాంవూధగా మారటానికి ఇరువూపాంతాల సామాన్య ప్రజలు గాని, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు గానీ కారకులు కారు.అయినా నెపం తెలంగాణ మీద వేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగినాకే ఆంధ్రవూపదేశ్ సమైక్యతకు అకస్మాత్తుగా ముప్పు ముంచికొచ్చిందని కట్టుకథలు చెప్పటం మరోసారి దగా చేయటమే. ఈ నెపంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా రాయల సీమాంధ్ర సామాన్య ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టటం ప్రజల్ని ప్రక్కదారి పట్టించటమే.

నిజానికి ఆనాడు ప్రాంతీయ సమానత్వాన్ని పాటించి ‘సమైక్యాంవూధలో సమక్షిగాభివృద్ధి’ సాధిస్తాం.‘విశాలాంవూధలో ప్రజారాజ్యం’ స్థాపి స్తాం అనే వాగ్దానాలతో, వాటిని ఉల్లంఘించ వీలుగాని షరతులతో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాయలసీమాంధ్ర రాష్ట్రంతో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది. ఇది షరతులతో కూడిన విలీనమే గాని, సమైక్యాంధ్ర సెంటిమెంట్‌తో జరిగిన బేషరతు విలీనం కాదు. కనుక షరతులు పాటిస్తే రాయలసీమాంవూధతో కలిసి వుండటం సాధ్యమని, షరతులు ఉల్లంఘించి దగా చేస్తే ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆంధ్రవూపదేశ్ నుంచి ‘దగాపడ్డ తెలంగాణ’ రాష్ట్రం విడిపోక తప్పదని చెప్పటమే పెద్దమనుషుల ఒప్పందం విధించిన షర తు. కానీ ఆనాడు సమైక్యాంధ్ర వాదులు వాగ్దానం చేసినట్లు విశాలాంవూధలో ప్రజారాజ్యం ఏర్పడలేదు. సామాన్యాంధ్ర ప్రజల పొట్ట లు గొట్టి కూడబెట్టిన పెట్టుబడితో, తెలంగాణను కొల్లగొట్టే అగ్రకుల వలసాంధ్ర పెత్తందార్ల నిరంకుశ రాజ్యం ఏర్పడింది. అలాగే తెలంగా ణ ప్రాంతంతోపాటు రాయలసీమాంవూధలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ తదితర వెనుకబడిన ప్రాం తాల ప్రాంతీయ అసమానతలను తొలగించి సమైక్యాంవూధలో సమక్షిగాభివృద్ధిని సాధించే బాధ్యత గాలికి వదిలి, హైదరాబాద్‌ని లూటీచేసే వలసాం ధ్ర పెత్తందారీ తనానికి పాల్పడ్డారు.


సమానాభివృద్ధి, సమక్షిగాభివృద్ధి వాగ్దానాన్ని వమ్ము చేసి, తెలంగాణ ను దగా చేసి పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన రాయలసీమాంధ్ర వలస పెత్తందార్ల దగాకోరుతనం వల్లనే ప్రత్యేక తెలంగాణ వాదం తలెత్తింది. ఆనాడు 56 ఏళ్ల నాడు వాగ్దానం చేసినట్లు ప్రాంతీయ అసమానతల వెనుకబాటుతనాన్ని రూపుమాపి సమైక్యాంవూధలో సమక్షిగాభివృద్ధి సాధించినట్లయితే తెలంగాణవాదం తలెత్తేదే కాదు. కనుక సమైక్యాంధ్ర అనైక్యాంవూధగా మారటానికి తెలంగాణ వారు కారకులు కాదు. రాయలసీమాంధ్ర వలసపెత్తందారులే మూలకారకులు. ఈ అసలు నిజాన్ని, అందులో దాగివున్న వారి దగాకోరు నైజాన్ని కప్పి పుచ్చి, తెలంగాణ వేర్పాటువాద శక్తులు కాంగ్రెస్ అవకాశవాద రాజకీయ శక్తులు కుమ్మక్కై తెలుగుజాతి సమైక్యతకు చిచ్చుపెడుతున్నారని కట్టుకథలు చెపుతున్నారు. ఇలాంటి కట్టుకథలతో సామాన్యాంధ్ర ప్రజల్లో తెలంగాణ వ్యతిరేక ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు.



నిజానికి ప్రాంతాలు వేరైనా ప్రజలు వేరు కాదు. కుండలు వేరైనా కావడి (కొయ్య) వేరు కాదు. రాష్ట్రాలు వేరైనా తెలుగు భాషవేరు కా దు, తెలుగు జాతి వేరు కాదు. కలహాల కాపురంలో కలిసి వుండలేక అన్నదమ్ములు విడిపోయినట్లే, ఆంధ్రవూపదేశ్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయినా, విడివిడిగా కలివిడిగా తెలుగుజాతి ప్రజలుగా ఆపాయ్యయంగా కలిసిమెలసి వుండొచ్చు.‘ఒక భాషా రాష్ట్రానికి ఒకే భాష తప్పనిసరి కావచ్చు గాని, ఒక భాషకి ఒకే రాష్ట్రం తప్పని సరికానక్కరలేదు. చారివూతక ప్రత్యేక ప్రాంతీయ కారణాల రీత్యా ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు’. అని రాజ్యాంగ నిపుణుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గమే మనకు పరిష్కార మార్గం. కానీ ఇలాంటి సు హృద్భావంతో కూడిన సద్భావంతో వివిధ ప్రాంతాల తెలుగు జాతి ప్రజల మధ్య సామాజిక సమైక్యతాభావం నెలకొనకుండా తమ స్వప్రయోజనాల కోసం ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వలసాంధ్ర వాదుల కుట్రలను తిప్పికొడదాం.



వాస్తవానికి ‘వలసాంధ్ర పెట్టుబడికి పుట్టిన కట్టుకథే సమైక్యాంధ్ర’. అంతే తప్ప అది తెలంగాణ వారితో కలిసి వుండాలనే సదుద్దేశ్యంతో కూడిన నిజమైన సమైక్యాంధ్రవాదం కాదు. వలసాంధ్ర వాదంతో తాము తెలంగాణని ఉద్ధరిస్తే (బానిసత్వం నుంచి విముక్తి చేస్తే) అలాం టి తెలంగాణ ఉద్ధారకులైన వలసాంధ్ర పెత్తందార్ల పెత్తనానికి లోబడి, పడి వుండకుండా ‘జై తెలంగాణ’ అని మమ్మల్నే ధిక్కరిస్తారా? మేల సమైక్యం అంటే మీరు కూడా అదే అనకుండా ఘనత వహించిన మా వలసాంధ్ర పెట్టుబడిదారీ పెత్తందారుల పెత్తనాన్నే సవాల్ చేస్తారా! అనే దురహంకారంతో (హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రవూపదేశ్’ సమైక్యాంధ్ర సభా ప్రాంగణంలో) తెలంగాణవాదులపై నిరంకుశాధికార భౌతిక దాడులకు పాల్పడి వారి నిజ స్వరూపాన్ని నగ్నంగా బైట పెట్టుకొన్నారు.


అంతేకాదు సమైక్యాంధ్ర ముసుగులో దాగిన ఈ వలసాంవూధవాదు ల నిజ స్వరూపం మరోరకంగా కూడా బైటపడింది. హైదరాబాద్ అంతర్భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మునుపటిలా హైదరాబాద్‌ను లూటీ చేయటం కుదరదు గనుక, యూటీ చేయాలని వారు చేసే వాదన ప్రకారం హైదరాబాద్ (యూటీ), తెలంగాణ, రాయలసీమాంధ్ర రాష్ట్రాల పేరిట సోకాల్డ్ సమైక్యాంధ్ర మూడు ముక్కలు కావటం లేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటతో సమైక్యాంవూధకు చిచ్చుపెడుతున్నారని సామాన్యాంవూధుల్ని రెచ్చగొడుతున్న ఈ దగాకోరులు తమ స్వీయ ప్రయోజనాల కోసం సోకాల్డ్ సమైక్యాంధ్ర వాదాన్ని చెత్తబుట్టలో పడవేయటం ఆత్మవంచన పరవంచన ప్రజావంచన కాదా? కనుక తెలంగాణ స్వపరిపాలన వల్ల వలసాంధ్ర పెట్టుబడిదారీ పెత్తందా రీ తనానికి నూకలు చెల్లిపోతాయని భావిస్తున్న తమ అభవూదతా భావా న్నే సామాన్యాంవూధుల అభవూదతా ‘భావ సమైక్యత’ గా మార్చి, దాన్నే సమైక్యాంధ్ర వాదం గా మభ్యపెట్టాలని చూస్తున్నారు.
అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాన్యాంధ్ర ప్రజలకు పోయేదేం లేదు, సమైక్యాంధ్ర ముసుగులో వున్న వలసాంధ్ర పెట్టుబడిదారీ పెత్తందారీ సంకెళ్లు తప్ప.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తో మిగతా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు సైతం ప్రత్యేక రాష్ట్రాలు గా ఏర్పడతాయి. ‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు వికేంవూదీకృత అభివృద్ధికి, వెనుకబడిన ప్రాం తాల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి తోడ్పాటు’ అని చాటిచెప్పినది గ్రేటేస్ట్ ఇండియన్ అంబేద్కర్ మంచిమాట అన్ని ప్రాంతాల ప్రజలకు మంచి చేస్తుంది.
కనుక బూటకపు సమైక్యాంధ్ర ముసుగులో తెలంగాణకు వ్యతిరేకంగా సామాన్యప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న వలసాంధ్ర పెట్టుబడిదారీ పెత్తందారుల ఉచ్చులో ఇరుక్కోకుండా జాగ్రత్తపడి వారి కట్టుకథల కుట్రల్ని తిప్పికొడదాం. సమైక్యవాదం ముసుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటమంటే పరోక్షంగా రాయలసీమ, ఆంధ్ర, చిన్న రాష్ట్రాల ఏర్పాటును అడ్డుకోవట మే. చిన్న రాష్ట్రాల ఏర్పాటును అడ్డుకోవటమంటే వికేంవూదీకృత వివిదాంధ్ర అభివృద్ధిని, వివిధ వెనుకబడిన ప్రాంతాల, వర్గాల అభివృద్ధిని అడ్డుకోవటమే. ఇలాంటి విచక్షణ తో కూడిన వివేకంతో వాస్తవాలను తెలుసుకొని, విచక్షణారహిత సమైక్యాంధ్ర భావోద్వేగాలను విడనాడి, వలసాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ పెత్తందారీ శక్తుల పన్నాగాలను పటాపంచలు చేద్దాం.

‘సమైక్యాంధ్ర కాదురా ! తెలంగాణ మాదిరా !’, ‘సమైక్యాంధ్ర కాదురా ! సామాజికాంధ్ర మాకురా!’ అని గళమెత్తి గర్జిద్దాం. ఈ స్ఫూర్తితో సెప్టెంబర్ 29వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ‘తెలంగాణ సకల జనభేరి’ సభను, అక్టోబర్ 1 వ తేదీన గుంటూరులో జరిగే ‘ప్రత్యేకాంధ్ర సాధన సభ’ లను జయవూపదం చేద్దాం.
-ఉ.సా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి