26, సెప్టెంబర్ 2013, గురువారం

జార్జి ఆర్వెల్ 1984 నిజం కానుందా!



ప్రపంచ ప్రజలు సమైక్యంగా మెరికావలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలను, వాటి వెనుక ఉండే అమెరికా కార్పొరేట్ల ప్రయోజనాలను వ్యతిరేకించవలసి ఉంటుంది. బహుశా నిరంతరం చాలా శ్రమపడుతున్న అమెరికా పౌరులు ముఖ్యంగా శ్రామిక ఉద్యమంలో కలిసి వస్తుందని, రావాలని మనం కోరుకోవాలి.ఆ దిశగా మానవాళి కదలకపోతే, జార్జి ఆర్వెల్ చిత్రీకరించిన 1984 నిజం కాబోతున్నది!
జార్జ్ ఆర్వెల్ 1984 రచనలో (ఫిక్షన్) 1984 సంవత్సరం వరకు అధికారం నియంత చేతిలోకి ఎలా వెళుతుందో వివరిస్తూ ఈ నియంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ బిగ్ బ్రదర్‌గా ఎలా అవతారమెత్తుతాడో ఆందోళన పడేలా చిత్రీకరించాడు. బిగ్ బ్రదర్ ప్రతి మనిషి మీద 24 గంటలు నిఘా పెట్టి ప్రైవేట్ జీవితం లేదా వ్యక్తిగత జీవితాన్ని ఆక్రమించుకుంటాడు. ఇంట్లో ఉన్నా, పార్కులో ఉన్నా, బయట తిరుగుతున్నా నిఘా కళ్లు నిరాంతరంగా మనిషిని వేటాడుతుంటాయి. ఈ నియంతృత్వ కలుషిత వాతావరణంలో ప్రేమికులు పడే వేదన పరాకాష్ఠగా ఈ రచన సాగుతుంది. ఈ ప్రేమికులు ఎక్కడ కలిసినా విషపు కళ్లు తమ మీదే కేంద్రీకరింపబడడం వలన , ఏకాంతంగా కలవడం సాధ్యం కాదని ఒక సమూహంలో బిగ్ బ్రదర్ కంటపడకుం డా కలుసుకోవడానికి ప్రయత్నించి పట్టుబడతారు. తర్వాత నియంతృత్వ వ్యవస్థను ఎందుకు, ఎలా ధిక్కరించారో తెలుసుకొనడానికి అలాగే వాళ్ళ ను మళ్లీ వ్యవస్థ నియమాలకు, పరిమితులకు కట్టుబడేలా మార్చడానికి వాళ్ళను చిత్రవధకు గురిచేస్తారు. మొత్తంగా ఈ రచనలో ఇది ప్రధాన అంశం. అంటే నియంతృత్వమూ ఆధునిక టెక్నాలజీ, ఒక దానిని మరొకటి ముడివేసుకొని మానవ నాగరికతను, స్వేచ్ఛను ఎలా హరిస్తాయో చాలా అద్భుతంగా వర్ణించాడు జార్జి ఆర్వెల్.

ఈ పరిణామం 1984 వరకు జరగకున్నా 2014 వరకు ఆ దిశలో ప్రపంచం పోతున్నదనడానికి స్నోడెన్ అమెరికా రహస్యాల గురించి వెల్లడించిన సమాచారం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఇంటలిజెన్స్ సంస్థలు ప్రపంచం మీద ఎలా నిఘా పెట్టాయో చెప్పుతూ అలా నిఘా పెట్టిన దేశాలలో మన దేశం అగ్రభాగాన ఉందన్న ఒక నిర్ఘాంత పోయే సమాచారాన్ని కూడా అందించాడు. మనదేశ రాజకీయాల మీద, తమ కార్యక్షికమాల మీద, స్పేస్ పరిశోధన మీద ప్రత్యేక నిఘానే కాక, కొన్ని కోట్లాది టెలిఫోన్ సంభాషణలను సేకరిస్తున్నారు. దాదాపు మన అందరి మీద నిఘా ఉంది. దీంతో మనిషి కంటూ ఒక ప్రైవే ట్ జీవితముంటుందని, స్వేచ్ఛ అంటే ఉదారవాద సిద్ధాంతంలో వ్యక్తిగత జీవితంలో, లేదా కుటుంబ జీవితంలో మనుషులు తమ ఇష్టానుసారంగా జీవించవచ్చని నమ్మడం. ఈ మౌలికమైన ఉదారవాద విలువను, తాను ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో చాటుతూ, మిగ తా దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామ ని యుద్ధాలే చేస్తున్న అమెరికా పాలకుల కు సార్వజనీన ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలనే సంస్కృతి లేకపోవడం ఒక అనాగరిక పాలన లక్షణం.
ప్రతి దేశానికి సార్వభౌమత్వముంటుందని, దేశమం సార్వభౌమ అధికారం కలిగిన ప్రజల కూడలి అని అర్థం. ప్రతి దేశాన్ని గౌరవించడం ఆధునిక ప్రపంచంలో ఒక అవసరంగా గుర్తింపబడింది. తమ దేశంలో టెర్రరిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారని దేశదేశాలలో వెతికి బిన్ లాడెన్‌ను పాకిస్తాన్‌కు కనీసం తెలుపనన్నా తెలుపకుండా హత్య చేసి శవాన్ని సమువూదంలో పడేశామని ప్రకటించారు. ఒక దేశంలో మరో దేశం, ఆ దేశ ప్రమేయం లేకుండా చొరబడవచ్చా అని అడిగే వారులేరు.

ఇప్పుడు అన్ని దేశాల అణు కార్యక్షికమాల మీద ముఖ్యంగా మనదేశ కార్యక్షికమాల మీద పూర్తి నిఘా పెట్టారని స్నోడెన్ బహిర్గతం చేసిన అంశాలలో ఒకటి. అలాగే మన రాజకీయ నాయకుల చిట్టా అంతా సేకరించి, ఎవ్వరు అమెరికా గురించి విమర్శించినా తమకు అనుగుణమైన సమయంలో దానిని బయటపెట్టడం, లేదా పెడ్తామని భయపెట్టడం ద్వారా మనదేశ పాలకులను నియంవూతించాలనే పెద్ద వ్యూహమే అమెరికా చేసినట్టు కనిపిస్తున్నది. బహుశా ఈ అధికారం వల్లే కావచ్చు, ఏ రాజకీయపార్టీ కూడా సాహసం చేసి అమెరికా పద్ధతులను వాళ్ళ నియంవూతణను, నియంతృత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నది. ఇవ్వాళ ఏ పార్టీ కూడా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం కాని, సమీకరించడం కానీ చేయడానికి సిద్ధంగా లేవు.పార్లమెంటరీ వామపక్షపార్టీలు కొంత విమర్శనాత్మకంగా మాట్లాడినా, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను నిర్మించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి.


సాంకేతిక విజ్ఞానం పెరిగిన కొద్దీ రెండు పరిణామాలుంటాయి; ఒకటి మనిషి నిపుణత, సామర్థ్యం, పెరిగి ఉత్పత్తి పెరగడమేకాక, నాణ్యమైన సేవలు ప్రజలకు అందడం. రెండు ప్రతి సాంకేతిక అభివృద్ధి మనుషుల మధ్య అంతరాలు పెంచి, ఆధిపత్య, అణచివేత శక్తుల పట్టుని బలీయం చేయడం. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యత ఏ ప్రయోజనానికి వాడాలనేది ఆయా దేశాల పాలకుల అవగాహన మీద, సైద్ధాంతిక దృక్పథం మీద ఇంకా ముందుకు వెళ్లి మాట్లాడాలంటే వాళ్ళ ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. మానవ సంబంధాలు ప్రజాస్వామ్యీకరించకుండా, మానవ విలువలు సార్వజనీనం కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే, ఏమవుతుందో అమెరికా విధానాలను, దాని పోకడలను చూస్తే బాగా అర్థమౌతుంది.
నోమ్‌చామ్‌స్కీ 1970 ప్రాంతంలో ప్రచురించిన రెండు ఉద్గ్రంథాలలోచాలా వివరంగా ఈ పోకడలను విశ్లేషించాడు. నిజానికి ఆయన రచన పేరే ‘ Political Economy of Human Rights: washington connection with Third World Facism ’ ఈ రచనలో అమెరికా మూడవ ప్రపంచ దేశాల్లో ఫాసిజం బలపడడానికి, దాని వ్యాప్తికి ఎలాంటి విధానాలు అవలంబిస్తుందో రాశాడు. ఈ పరిణామాలు ఇతర దేశాల్లో ఎలా ఉన్నా ప్రజాస్వామ్య దేశంగా భావిస్తున్న మనదేశంలో దాన్ని ప్రభావాలు ఇప్పుడిప్పుడు మరింత స్పష్టమౌతున్నవి. మత ద్వేష రాజకీయాలకు మద్దతునివ్వడం, వాటి వ్యాప్తి కోసం తమ నియంవూతణలో ఉన్న మీడియాను ఉపయోగించడం ఈ అనుభవంలో నుంచి మనం ప్రయాణిస్తున్నాం. లేకపోతే మతపర రాజకీయాలు తమ మతాన్ని, తమ చరివూత ను జాతీయత భావంలో దాచుకుంటాయి. జాతీయత అంటే తమ దేశ వనరులను కాపాడుకోవడం, ముఖ్యంగా ఖనిజాలను కాపాడుకోవడం. ఒక్క రాజకీయపార్టీ కూడా దేశ వనరుల రక్షణ గురించి మాట్లాడడం లేదు. కరుడుకట్టిన మతతత్వవాది నరేంవూదమోడీ తన ప్రచారంలో ఎక్క డా అమెరికా విధానాల మీద దాడి చేయడంలేదు. ఆయన దాడంతా పాకిస్తాన్, చైనా మీదే! ఈ రెండు దేశాలకంటే ఈ రోజు మనదేశానికి ముప్పు అమెరికా సామ్రాజ్యవాదంనుంచే ఉంది. లేకపోతే మన దేశ రహస్యాలనన్నింటిని అమెరి కా ఎందుకు సేకరించినట్టు! స్నోడెన్ వాటిని బయటపెట్టకపోతే మనందరికి ఈ విషయా లు ఇంత తొందరంగా తెలిసేవి కాదుకదా.

ఇప్పుడు తమ దేశ పౌరుడైన స్నోడెన్‌ని అమెరికా బిన్ లాడెన్‌ని, ఇరాక్ అధ్యక్షుడిని వెంటాడినట్టే వెంటాడుతున్నది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలలో- ఎవరైనా ఒక వ్యక్తి శరణు కోరినప్పుడు అతనికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆ దేశం మీద ఉంటుందని పేర్కొనవచ్చు. మానవ హక్కుల ప్రమాణాలను కాపాడుతామని సంతకాలు చేసిన ఏ దేశం కూడా స్నోడెన్‌కు రక్షణ ఇవ్వడానికి సాహసం చేయలేకపోతున్నది. రష్యా లాంటి దేశం కూడా స్నోడెన్‌ను ప్రత్యామ్నాయం చూసుకోమని సలహా ఇస్తున్నది. ప్రపంచ ప్రజల సంక్షేమం దృష్ట్యా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఆయన ఈ పనిచేస్తున్నాడే కానీ అతని వ్యక్తిగత ప్రయోజనాలు దీంట్లో ఎక్కడా కనపడడంలేదు. ఈ సమాచారం బయటపెట్టడం వలన తన భద్రతకు ముప్పు ఉంటుందని ఆయనకు తెలియక కాదు. సత్యం చెప్పడం, ఆధునిక ప్రపంచంలో ఎంత అపాయకరమో తెలుసుకోవడానికి ఈ ఒక్క అనుభవం చాలు. ఎక్కడో మానవ ప్రవృత్తిలో ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించే విశ్వ మానవులున్నారని అనిపిస్తుంది. ప్రపంచ ప్రజలు సమైక్యంగా అమెరికా అవలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలను , వాటి వెనుక ఉండే అమెరికా కార్పొరేట్ల ప్రయోజనాలను వ్యతిరేకించవలసి ఉంటుంది. బహుశా నిరంతరం చాలా శ్రమపడుతున్న అమెరికా పౌరులు ముఖ్యంగా శ్రామిక జనం ఈ ఉద్యమంలో కలిసి వస్తుందని, రావాలని మనం కోరుకోవాలి. ఆ దిశగా మానవాళి కదలకపోతే, జార్జి ఆర్వెల్ చిత్రీకరించిన 1984 నిజం కాబోతున్నది!
పొఫెసర్ జి. హరగోపాల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి