24, సెప్టెంబర్ 2013, మంగళవారం

సత్యవాణి భూకబ్జాపై విచారణ చేయండి


9/24/2013 1:53:43 AM
- శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు లోకాయుక్త ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (టీ మీడియా): ఆధ్యాత్మికం ముసుగులో భూ కబ్జాకు పాల్పడిన సత్యవాణి దందాపై సమగ్ర విచారణ జరిపించాలంటూ రంగాడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మార్వోను లోకాయుక్త ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి నవంబర్ 11లోగా నివేదికను సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సత్యవాణి భూదందాలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నేత, న్యాయవాది బద్దం నర్సింహాడ్డి, జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో సత్యవాణి భూ కబ్జా బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మియాపూర్ సర్వే నెం.

satyaavani 100, 101లో బైనంబర్‌లతో సత్యవాణి భూదందాకు పాల్పడ్డారని, గతంలో ఆమె అధ్యక్షురాలిగా పనిచేసిన దీప్తిశ్రీనగర్ హౌస్ బిల్డింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై విచారణ జరిపించాలని వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సత్యవాణి భూ కబ్జా వ్యవహారం తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ సైబరాబాద్ కమిషనర్, రంగాడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి జాయింట్ కలెక్టర్, మియాపూర్ సీఐ, శేరిలింగంపల్లి ఎమ్మార్వో, మియాపూర్ సబ్ రిజిష్ట్రార్‌లను రెస్పాండెంట్స్‌గా తన ఫిర్యాదులో చేర్చారు. మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ధార్మిక కార్యక్షికమాల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తున్న సత్యవాణిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ (టీఆర్‌సీపీ) డిమాండ్ చేసింది. దేవుడు పేరుతో దేవాలయాలు నిర్మించి శివబాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణి 520 ఎకరాల భూమిని ఆక్రమించి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండగడ్డ విక్రమ్‌కుమార్ ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అట్లూరి సుబ్బారావుతో కలిసి విక్రయించిన సత్యవాణిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి