19, సెప్టెంబర్ 2013, గురువారం

హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడితే..


9/19/2013 3:02:09 AM
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే..’ఈ మాటనే సీమాంవూధుల నెత్తి మీద పిడుగుపడ్డ చందంగా భావిస్తున్నా రు. భయంతో కకావికలం అవుతున్నారు.మిన్ను విరిగి మీద పడ్డట్లు గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడితే.. ఉన్న పళంగా సీమాంధ్ర ప్రజలంతా..దిక్కులేని వారైపోతారట! నిలువ నీడలేని నిరాక్షిశయులవుతారట! ఉన్న ఉద్యోగాలన్నీ హుష్‌కాకి అయిపోయి నిరుద్యోగులై పోతారట! హైదరాబాద్ తమది కాకుండా పోయిన వెంటనే సీమాంవూధుల ఉద్యోగాలన్నీ ఊడిపోతాయట!

ఇలాంటివే ఎన్నో సవాలక్ష భయ సందేహాలతో సీమాంవూధులు తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలను ఎగదోస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయితే..తమ బతుకు తెల్లారిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. సీమాంవూధలోని చిన్నా, పెద్దను ఇలాంటి సందేహాల ఊబిలో దించి ఉద్యమాల బాట పట్టిస్తున్నారు. హైదరాబాద్ తమది కాకుండాపోతే తమకు బతుకు లేన చెప్పుకొస్తున్నారు. ఇంతేనా.. కాదు... తెలంగాణ ఏర్పడిన మరుక్షణమే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలోని సీమాంధ్ర ఉద్యోగాలన్నీ ఊడిపోతాయట! ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నారట! అయితే తెలంగాణ ఏర్పడితే వారి ఉద్యోగాలన్నీ పోతాయట! ఇంతే కాదు, సీమాంధ్ర ప్రాంతంలోని వారి ఉద్యోగాలు కూడా పోతాయట! సీమాంధ్ర ఉపాధ్యాయులంతా వారి ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందట! ఎందుకంటే.. సీమాంవూధలోని విద్యార్థులంతా తెలుగు తల్లి ముక్కలైన సందర్భంగా తమ గుండెలు పగిలి స్కూళ్లను మానివేస్తారట! పిల్లలు పాఠశాలలు మానేస్తే.., స్కూళ్లు మూతపడితే ఉపాధ్యాయుల ఉద్యోగా లు పోవాల్సిందేగా! సీమాంవూధలోని బ్యాంకు ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోతారట! ఎందుకంటే.. ఉద్యమాల కారణంగా బ్యాంకుల లావాదేవీలన్నీ నిలిచిపోయి, తమ బ్యాంకులు మూత పడతాయట! దీంతో బ్యాంకు ఉద్యోగులు కూడా రోడ్డున పడాల్సిందేగా! సీమాంధ్రలోని లాయర్లు కూడా తమ జీవనోపాధి కోల్పోతారట.ఎందుకంటే.. ప్రజలం తా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుంటే.. కోర్టులు నడవవు. కాబట్టి సీమాంధ్ర అడ్వకేట్లు చేతిలో పనిలేక చెట్టుకింద ప్లీడర్లై ఈగలు తోలుకోవాలట!
ఇంతే కాదు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కోల్పోతారట! ఎందుకంటే.. తెలంగాణలోనూ, హైదరాబాద్ పరిసర ప్రాంతంతో పాటు, ఇండియాలో ఎక్కడికి పోయినా సీమాంధ్ర ప్రాంతం వారికి ఉద్యోగాలు ఇవ్వరట! సీమాంధ్ర వారు తప్ప, ప్రపంచంలోని ఏప్రాంతం వారైనా ఐటీ, కంప్యూటర్ రంగాలతో పాటు అన్ని ఉద్యోగాలకు అర్హులట!ఒక్క సీమాంధ్ర ప్రాంతం వారిని మాత్రమే ‘నో- వేకెన్సీ’ బోర్డులు వెక్కిరిస్తాయట! సీమాంధ్ర ప్రాంతం వారికి చెం దిన కార్పొరేట్ ఆస్పవూతులన్నీ మూత పడతాయట! తెలంగాణ ప్రాంతానికే చెందిన రోగులందరూ ప్రాంతీయ దురభిమానంతో సీమాంధ్ర హాస్పిటళ్లలో చేరరట! దీంతో సీమాంధ్ర కార్పొరేట్ ఆస్పవూతులు, డాక్టర్లు జీవనోపాధి కోల్పోతారట!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందట! ఎందుకంటే.. తెలంగాణకు దిగువన ఉన్న సీమాంవూధలో ఏ జీవనదీ ప్రవహించదట! ఎందుకంటే.. తెలంగాణలో నదుల ప్రవాహాన్ని అడ్డగిస్తూ.. భారీ ప్రాజెక్టులు కట్టి చుక్క బొట్టుకూడా కిందికి ప్రవహింపనీయరట! దీంతో సీమాంధ్ర పచ్చని పంటచేలన్నీ ఎండిపోయి ఎడారిగా మారుతాయ ట ! సీమాంవూధలోని పశువులు గడ్డిలేక, మనుషులు ఆహారం లేక ఆకలితో అలమటించి పోతారట!

ఒకవేళ.. కేంద్ర ప్రభుత్వం నదుల నీళ్లను సమంగా పంచజూసినా.. తెలంగాణకు చెందిన సైన్యం కేంద్రంతో పోరాటానికి సిద్ధపడతారట! ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రజలు సర్వాన్ని తమది గా చేసుకుని అంతర్జాతీయ న్యాయసూవూతాలన్నింటినీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారట! ప్రపంచంలో డాన్యూబ్ నదిని దాదాపు తొమ్మిది దేశాలు పంచుకుంటున్నా.., అది తెలంగాణకు వస్తే దాన్ని వారే మింగేస్తారట!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. సీమాంధ్ర చదువుసంధ్యలు లేక అంధకారంలో మునిగిపోతాయట! తెలంగాణ ఏర్పడిన వెంటనే సీమాం ధ్ర విద్యార్థులు అక్షరాలు మర్చిపోయి, ప్రకృతి, వికృతిలు మర్చిపోతార ట! తెలంగాణ ఏర్పాటైతే..సీమాంధ్ర ప్రజలంతా భిక్షగాళ్లై పోతారని సీమాంధ్ర మీడియా, ప్రచార, ప్రసార సాధనాలన్నీ చెప్పుకొస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. హైదరాబాద్‌కు ఎవరినీ రానీయరు! తెలంగాణ మరో ప్రత్యేక దేశంగా మారిపోతుంది! తెలంగాణ సరిహద్దుల దగ్గరే తెలంగాణ ఆర్మీ సోదా చేసిన తర్వాతనే తెలంగాణలోకి అనుమతిస్తారు!తెలంగాణ ఒక ప్రత్యేక దేశంగా మారిపోతుంది! మరో పాలస్తీనా అవుతుంది. పాకిస్థాన్ అవుతుంది.ఎలాంటి రాక,పోకలు జరపాలన్నా వీసా అవసరం ఏర్పడుతుంది! ఈ నిబంధనలు, నియంవూతణలు అందరికీ కాదు! ఒక సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైతేనే ఈ కష్టాలు వస్తాయట! తెలంగాణ ఏర్పడిన మరుక్షణమే.. హైదరాబాద్, తెలంగాణలో ఇళ్లు, స్థిరాస్తులు కలిగి ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు తమ హక్కులను రాత్రికి రాత్రి కోల్పోతారు! సీమాంవూధులు ఎలాంటి న్యాయ, చట్ట రక్షణ కరువై రోడ్లపై పడతారు! కానీ దేశంలోని ఏ ఇతర ప్రాంతాని కి చెందిన వారైనా బేఫికర్‌గా ఉంటారట! తెలంగాణ ఏర్పాటైతే.. సీమాం ధ్ర తనకు రావాల్సిన రాబడి ఆదాయన్నంతా కోల్పోతుంది! సీమాంవూధలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, అనంతపూర్, ఒంగోల్ లాంటి పట్టణాలన్నీ ఎలాంటి లావాదేవీలు లేక స్తంభించిపోతాయి. సీమాంధ్ర ఎలాంటి రెవెన్యూ ఆదాయం లేక కునారిల్లిపోతుంది!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే..తెలంగాణ ప్రాంతంలోని ప్రతి వ్యక్తీ ఒక నక్సలైట్, టెర్రరిస్టుగా మారిపోతాడు. భారతరాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయి ప్రత్యేక దేశంగా వ్యవహరిస్తారు. ప్రజాస్వామిక విలువలపై విశ్వాసాలు కోల్పోయి మతవాదంతో నూ, తీవ్రవాదంతోనూ తెలంగాణ ప్రజలు ప్రభావితులవుతారు. ఫలితంగా దేశ సమక్షిగతకే పెద్ద సవాల్‌గా మారుతారు! ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడమే అసహజం. ప్రకృతి న్యాయసూవూతాలకు విరుద్ధం. తెలంగాణ ఏర్పాటు చేయ డమనేది దేశానికి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇదొక అంటురోగంలా పీడిస్తుంది. ఇది మానవ చరివూతలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది....!

ఇలా.. ఇలాంటివెన్నో.. భయాలు, అనుమానాలు సీమాంధ్ర నాయకులను పీడిస్తున్నాయి. కాబట్టే తమ సహజమైన భయాందోళనల్లో భాగం గా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారట! ఈ భయాలు.. తీర్చేదెవరు..? వారిని ఓదార్చేదెవరు..? ప్రతి తెలంగాణ పౌరుడు సానుభూతితో ఆలోచించాలని సమైక్యవాదుల కోరిక!!
- సుజయ్ కారంపూరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి