9/14/2013 4:17:41 PM
- తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో ఐటీ కంపెనీలు క్యూ..
- పుణే నుంచి తిరిగి వచ్చిన డీఎల్‌ఎఫ్ ప్రాజెక్ట్
- త్వరలోనేరానున్న మరికొన్ని సంస్థలు
నిజాంకాలేజ్, సెప్టెంబర్ 12 (టీ మీడియా) : హైదారబాద్ ఐటీ భూం రెక్కలు తొడుగుతోంది. ఇన్నాళ్లు సందిగ్ధ వాతావరణాన్ని ఎదుర్కొన్న సర్వీస్ సెక్టార్ తిరిగి పుంజుకోవడానికి సన్నద్ధమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రత్యేక రాష్ట్ర ఆందోళనతో ఇతర రాష్ట్రాలకు తరలిచింన కంపెనీలు తిరిగి హైదరాబాద్‌కు తరలించడానికి కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోనున్న తరుణంలో ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. యూపీఏ సర్కారు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ప్రకటించడం, తాజాగా హోం మంత్రి షిండే నోట్ వాఖ్యలతో తరలింపులో వేగం పుంజుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంతో వాతావరణం మారిపోవడంతో ప్రాజెక్ట్‌లను హైదరాబాద్‌కు తరలించడానికి ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో ఇక్కడున్న డీఎల్‌ఎఫ్ ప్రాజెక్ట్‌ను ఎత్తివేసి పూణేకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రాజెక్ట్‌ను తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఐటీ సెక్టార్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గతంతో పలు కంపెనీలకు చెందిన ప్రాజెక్ట్‌లను బెంగుళూరు, చ్నై, పూణేలకు తరలించారు. ఇక్కడ నడుస్తున్న కొన్ని ప్రాజెక్ట్‌లను ఇతర రాష్ట్రాల్లో యూనిట్లకు తరలించి ఉద్యోగులను తొలగించారు.
మినీ సిలికాన్ వ్యాలీ..
హైదరాబాద్ నగరం ఐటీకి రాజధాని. మినీ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి గాంచిన ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీ కంపెనీల హవా నడుస్తోంది. సర్వీస్ సెక్టార్‌లో దేశం మొత్తం మీద 40 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోంది. ప్రధాన కంపెనీలన్నీ కొత్త ప్రాజెక్ట్‌లన్నింటికీ ఇక్కడి నుంచే అంకురార్పణ చేస్తున్నాయి. ఈ రంగం మీద ఆధారపడే ఉప రంగాల సంఖ్య కుడా పెరిగింది. డీఎల్‌ఎఫ్, సీటీఎస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలకు సేవలందిస్తున్న కంపెనీల్లో 60 శాతం కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవే కావడం గమనార్హం. కేవలం సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాలకే పరిమితం కాకుండా, హెల్త్, ఇన్సూరెన్స్, రంగాల్లో కుడా చాలా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. జాబ్ వర్క్ చేసే చిన్న చిన్న కంపెనీలు కుడా ఏర్పడ్డాయి.
క్లయింట్స్ ఒత్తిడితోనే...
అయితే అప్పట్లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న దశలో బంద్‌లు, సమ్మెలు తీవ్రంగా జరిగాయి. దీంతో ఇతర దేశాల్లోని ఆయా కంపెనీల క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్‌ల భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కంపెనీలు క్లయింట్స్ వద్ద విశ్వసనీయతను నిరూపించుకోవడం కోసం కంపెనీలను తరలించాల్సి వచ్చిందని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. ప్రాజెక్ట్‌లను తరలించిన తర్వాత కుడా హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలు యథావిధిగా సకాలంలోనే ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాయి. దీంతో భారీ కంపెనీల తరలింపు ఉంటుందని భావించినా, సకాలంలో పూర్తి చేయడంతో తరలింపునకు బ్రేక్ పడింది. పైగా కేంద్రం రాష్ట్ర ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం, ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు ఆలోచనలతో కంపెనీల తరలింపునకు అవకాశం ఏర్పడింది.
తీరనున్న కష్టాలు...
కంపెనీలు తిరిగ హైదరాబాద్‌కు తరలిస్తుండటంతో నిరుద్యోగుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ నుంచి గతంలో పూణె డీఎల్‌ఎఫ్‌కు పంపించిన ఉద్యోగస్తులందరిని తిరిగి హైదరాబాద్‌కు పంపించడంతో ఉద్యోగస్తులలో సంతోషం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని సీమాంధ్ర నాయకులు చేసే ప్రకటనల్లో ఎలాంటి నిజం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తికాగానే మరికొన్ని ఐటీ కంపెనీలు వారి కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించడానికి సిద్దంగా ఉన్నాయి. మరికొన్ని కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే సీటీఎస్, టీసీఎస్, ఇన్ఫోసెస్ కంపెనీలు కొత్త ప్రాజెక్ట్‌ల కోసం మానవ వనరులను సిద్ధ్దం చేసుకుంటున్నాయి. గతంలో పూణెకు పంపించిన ఉద్యోగస్తులను కూడా తిరిగి హైదరాబాద్‌కు రప్పించుకుంటున్నారు. మున్ముందు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఐటీ కంపెనీలతో కళకళలాడనుందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
ఇక్కడి వాతావరణాన్నే ఇష్టపడుతున్నారు..
హైదరాబాద్‌లో ఉన్న వాతావరణం మరెక్కడా దొరకదు. ఇక్కడి వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో ఉద్యోగులు ఇక్కడే ఉండటానికి ఆసక్తి కలుగుతోంది. ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరవూపదేశ్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఐటీ రంగం కుదేలవుతుందనేది అవాస్తవం.

తిరుపతి, యూహెచ్ ప్రాజెక్ట్ ఆఫీసర్
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌తోనే..
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక్కడి వారు కష్టపడి పనిచేస్తారు. నాణ్యతతో కూడిన పనిచేస్తారనే ఇమేజ్ ఉంది. కొన్ని కంపెనీలు హైదరాబాద్‌లో అయితేనే ప్రాజెక్ట్‌లిస్తామని అంటున్నారు.తరలించిన ప్రాజెక్ట్‌లకు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. జీతాలు, అల ఇవ్వాల్సి వస్తోంది. దీంతో కుడా కంపెనీలు తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాయి.
- పూసాల మెహన్‌చారి (టెక్నికల్ ఆఫీసర్ )
సిటీ నుంచి ఐటీని వేరు చేయలేరు..
హైదరాబాద్‌ను, ఐటీని వేరు చేసి చూడలేం. కంపెనీల తరలింపు తాత్కాలికమే కాని శాశ్వతం కాదు. అవసరాల దృష్టా, ప్రాజెక్ట్ డిమాండ్ మేరకు కంపెనీల తరలింపు ఉంటుంది. కంపెనీలను తరలిస్తున్నారన్నది అవాస్తవం. తరలించినా తిరిగి రావల్సిందే. గతంలో కొన్ని కంపెనీలు తరలిపోయిన మాట వాస్తసం కానీ అవి తిరిగి వస్తున్నాయి. తిరిగి రావడం సంతోషం.
- నవీన్‌కుమార్ పాజెక్ట్ మేనేజర్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి