23, సెప్టెంబర్ 2013, సోమవారం

తెలంగాణ ఓ ప్రత్యేక దేశం



కిరణ్ దర్శకత్వంలోనే సీమాంధ్ర ఉద్యమం
పెట్టుబడిదారుల ఆస్తుల కోసమే ఆందోళనలు
సచివాలయానికి రాని మంత్రులకు జీతాలు ఎలా ఇస్తారు..? ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి


జిల్లాపరిషత్ , సెప్టెంబర్ 22 (టీ మీడియా) : భారత దేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ప్రత్యేక దేశంగా విరాజిల్లిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పౌరహక్కుల సంఘం జిల్లా మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర దేశంగా, ప్రత్యేకమైన రాజ్యాంగం, చట్టసభ, ప్రత్యేకమైన కరెన్సీ, విదేశీ దౌత్యకార్యాలయాలతో విరాజిల్లిందని పేర్కొన్నారు. 1950కి ముందు తెలంగాణలో ఉర్దూ అధికారిక భాష ఉండేదని, తెలంగాణను బలవంతంగా ఆంధ్రావూపాంతంలో విలీనం చేసుకున్న తరువాత తెలుగుభాషను అధికారి భాషగా గుర్తించారని అన్నారు.

1892లోనే నిజాం ప్రభుత్వం మూడు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే సింగరేణి సంస్థను బ్రిటీష్ ప్రభుత్వానికి వెళ్లకుండా కొనుగోలు చేయించి తెలంగాణ ప్రజలపై సింగరేణికి సర్వహక్కులు ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయించిందన్నారు. నిజాంపాలనలోనే తెలంగాణలో పది జిల్లాలకు నేరుగా వెళ్లే విధంగా రోడ్డ నిర్మాణం చేశారని, ప్రతి జిల్లాకు ఓ నది నీళ్లు తడిచే విధంగా ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రకటన ఇచ్చి ఆంధ్రా ప్రాంతం నుంచి నిజామాబాద్ ప్రాంతానికి ఆహ్వానించి వారికి ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించి, ఆ భూమి అభివృద్ధి కోసం రూ.500లను ఇచ్చిందన్నారు.

ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన పెట్టుబడిదారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేశారని, ఇక్కడ ఉన్న ప్యాక్టరీలను ధ్వంసం చేశారన్నారు. వరంగల్‌లో ఉన్న అజంజాహి మిల్లును మూసివేసి ఇక్కడి భూములను రాంకికి కట్టబెట్టారని, నిజాం షుగర్ ప్యాక్టరీలో ఒక వాటాను సుబ్బరామిడ్డి కొని గాయత్రి షుగర్ ప్యాక్టరీ పేరుతో వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్‌లో ఆల్విన్ లాంటి పెద్దవి ఐదు కంపెనీలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్మా ప్రయోగించాలి...
రాష్ట్రంలో అనిశ్చితికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వెంటనే ఎస్మా ప్రయోగం చేయాలని చక్రపాణి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిపై ఎస్మా ప్రయోగించి తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం రాజకీయ పార్టీలు, ప్రజావూపతినిధులతో కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితోను చర్చలు జరపాలన్నారు. 53 రోజులుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సచివాలయానికి రాకుండా ఢిల్లీలోనే ఉంటూ చక్రం తిప్పుతున్నారని, వారికి జీతాలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ హైకమాండ్ సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనలోనే స్పష్టత లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కాదు, పూర్తిగా విధ్వంసానికి గురైందన్నారు. సీమాంవూధకు చెందిన ఎంపీలు తెలంగాణను అడ్డుకునేందుకు తమ భార్యలను గవర్నర్ వద్దకు, రాష్ట్రపతి వద్దకు పంపించారని ఎద్దేవా చేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం కోరుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుకునే వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని రాజ్యాంగంలోని ఆర్టికల్-3లో స్పష్టంగా ఉందన్నారు. మూడులక్షల మంది ఆదివాసీలను దుఃఖవూభాంతికి గురిచేసే పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తూ, హైదరాబాద్‌ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ వచ్చే ఆదాయంలో సీమాంవూధవూపాంతానికి వాటా ఇస్తామనే ప్రతిపాదనలు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తిప్పికొట్టాలని కోరారు.

ప్రజాస్వామ్య తెలంగాణను పోరాడి సాధించుకుందామని చక్రపాణి పిలుపునిచ్చారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుమలరావు మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు, తమ వ్యాపారాలను రెట్టింపు చేసుకునేందుకే తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. సీమాంవూధలో జరుగుతున్న ఉద్యమం కృత్రిమ ఉద్యమన్నారు. ఈ సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేశ్‌కుమార్, ప్రొఫెసర్ లక్ష్మణ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేశ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మల్లాడ్డి, రాజేశ్వర్‌రావు, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి