9/5/2013 1:14:51 AM
-దృఢంగానే దేశ ఆర్థిక మూలాలు
- రూపాయి పతనానికి మరిన్ని చర్యలు
-ఆర్థిక వ్యవస్థ ఊతానికి ప్రత్యేక రోడ్‌మ్యాప్
-వచ్చే జనవరిలో కొత్త బ్యాంకింగ్ లైసెన్సుల జారీ
- ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్
ముంబై, సెప్టెంబర్ 4: రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రఘురామ్ రాజన్ తన సత్తాను చాటారు. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించడానికి త్వరితగతంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. సంతుళిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని.. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సులభమవుతుందని 23వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విలేకరులతో రాజన్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజ పరచడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ఆర్‌బీఐ కేవలం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి మాత్రమే ఉందని అనడం భావ్యం కాదని.. అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలను సందించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత పదేళ్లుగా సెంట్రల్ బ్యాంక్‌ను ఏలిన తెలుగువారికి బ్రేక్ పడినట్లు అయింది. గవర్నర్‌గా పదవీ బాధ్యతలు పొందిన వారి అతిచిన్న వయస్కుల జాబితాలో రాజన్ ఒకరు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రత్యేక రోడ్‌మ్యాప్‌లు, కమిటీలు వేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత ఆర్థిక మూలాలు చాలా దృడంగా ఉన్నాయని.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
ఈ నెల చివర్లో జరగనున్న ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజన్‌కు ఇంకా పూర్తి వివరాలు తెలియకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక సమీక్ష సమావేశాన్ని ఈ నెల 20కి వాయిదావేసినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలోకి రావాలని తహతహలాడుతున్న ప్రైవేట్ సంస్థలకు 2014 జనవరిలో లైసెన్స్‌ను జారీ చేసే అవకాశం ఉందన్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిలమ్ జలాన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాజన్ చెప్పారు. దేశవ్యాప్తంగా సరైన సరఫరా వ్యవస్థ లేకపోవడంతో ద్రవ్యోల్బణం ఎగబాకడానికి పరోక్షంగా కారణమవుతుందని..దీనిని నియంవూతించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వృద్ధిరేటును లక్ష్యంగా చేసుకోని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అప్పుడే అన్ని రంగాల్లో వృద్ధిని నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. కీలక నిర్ణయాలతో రూపాయి విలువ పెరగడానికి దోహదపడుతుందని ఆయన అంచనావేస్తున్నారు. విదేశీ కరెన్సీని కొనుగోలు చేసేవారికోసం ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయడంతో దేశీయ కరెన్సీపై ఒత్తిడి తగ్గుతుందని.. దీంతో మారకం విలువ స్థిరీకరణ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎగుమతిదారులను ఆకట్టుకోవడానికి కరెన్సీ కాంట్రాక్టుల్లో 50 శాతం రద్దుకు అనుమతినిచ్చిన ఆర్‌బీఐ.. దిగుమతిదారుల కోసం 25 శాతం వరకు పరిమితి విధించింది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసే పెట్టుబడుల కాలపరిమితిని 10 సంవత్సరాల వరకు పెంచింది.
బ్యాంకులకు మరిన్ని అధికారాలు...
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించడానికి త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు రాజన్ పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు ఎక్కడైన శాఖను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చే దానిపై త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడైన బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్న మొత్తం శాఖల్లో 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విడుతల వారిగా సీడీఆర్‌లను తగ్గించాలనుకుంటున్నది. బ్యాంకులను మరింత అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ బ్యాంకుల వ్యాపారాలపై కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఉదయం ముంబైలోని రిజర్వు బ్యాంక్ ముఖ్య కార్యాలయంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తితో పాటు పలువురు ఆయనకు స్వాగతం పలికారు.
ఫేస్‌బుక్‌లో లైక్ చేసినంత ఈజీ కాదు...
కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటే ఫేస్‌బుక్‌లో లైక్ కొట్టినంత సులువు కాదని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్ అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్ అయినప్పటికీ.. ఆర్‌బీఐ గవర్నర్ హోదా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటుందని అభివూపాయబడ్డారు. కొన్ని చర్యలు ప్రముఖంగా ఉండవు.. అలాగని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ హోదాలో నిర్ణయాలు కొందరికి ఇబ్బందిని కల్గిస్తాయన్నారు.
రఘురామ్ రాజన్ నియామకంపై ఎవరేమన్నారంటే....
ఆర్థిక వ్యవస్థ సవాళ్లనెదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో రఘురామ్ రాజన్ ఈ పదవికి సమర్థుడైన వ్యక్తి. ఆయనను మించిని నిపుణుడు ఇంకొకరు లభిస్తారనుకోవడం లేదు. దేశ ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టే సత్తా అయనలో ఉందని భావిస్తాను.-దువ్వూరి సుబ్బారావు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్
సెంట్రల్ బ్యాంకుకు ఆయన మంచి నాయకత్వాన్ని అందించగలరు. విదేశీ ఎక్సేంజ్‌లో నెలకొన్న అస్థిరత్వంపై ఆయన మొదట దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.- సీ రంగరాజన్, పీఎంఈసీ చైర్మన్
రాజన్‌కు నా సానుభూతి. ఇలాంటి సమయంలో ఆ స్థానంలో నేనైతే ఉండటానికి ఇష్టపడను. ప్రస్తుతం ఆయన ద్రవ్యోల్బణం కన్నా వృద్ధిరేటుకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది.- బిమల్ జలాన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్
రాజన్ చాలా అసాధారణమైన వ్యక్తి. ఆయన సమర్థతను చాటడానికి ఇదే సరైన సమయం. దేశ వృద్ధిరేటు పెంచేందుకు ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటాడని భావిస్తాను.- ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు
వడ్డీరేట్లు తగ్గించే అవకాశం
ఇండస్ట్రీ వర్గాలు
కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టడంతో వచ్చే సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. పీకలలోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పారిక్షిశామిక రంగానికి మళ్లీ ఉత్తేజ పరచడానికి ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలోనైనా పావు శాతం వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ రాజన్‌కు ఈ సందర్భంగా సూచించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి