9/4/2013 11:04:31 AM
-కేంద్రపాలితంగా హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధాని కూడా..
-సీమాంధ్ర ఆందోళనలను చల్లార్చేందుకే!
-కేంద్రం పరిశీలించే అవకాశం?
-పీటీఐ వార్తా సంస్థ కథనం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చండీగఢ్ పద్ధతుల్లో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసి, ఇటు తెలంగాణకు, అటు సీమాంవూధకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. హైదరాబాద్‌ను యూటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముందురోజు పలు ఆంగ్ల చానళ్లు కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దఫా పీటీఐ వార్తా సంస్థలో అదే విషయం వచ్చింది. దానికి అదనంగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచుతారన్న అంశాన్ని జోడించడం గమనార్హం. అయితే.. హైదరాబాద్‌ను కేంద్రపాలితం చేస్తే అది తెలంగాణకు మరోసారి దగా చేయడమేనని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. హైదరాబాద్ సహిత పది జిల్లాల తెలంగాణ తప్ప దేనికీ అంగీకరించేది లేదనిస్పష్టం చేస్తున్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న ఆందోళనలు, ఆంధ్రప్రదేశ్ విభజనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు కేంద్రపాలితం, ఉమ్మడి రాజధాని ఆలోచన చేయవచ్చని హోం శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయవర్గాలను పీటీఐ వార్తా సంస్థ ఉటంకించింది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను చల్లార్చేందుకు కూడా ఈ చర్య ఉపయోగపడుతుందన్న భావనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలితంగా చేస్తే తమ ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందన్న భావనలో ఉన్నారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయని పీటీఐ తెలిపింది. అందుకే ఈ ఆలోచన చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి