-అధిష్ఠానం మనసు.. సగం మార్చాం
-పూర్తిగా మార్చి.. సమైక్యంగా ఉంచుతాం
-ఢిల్లీలో విజయవాడ ఎంపీ లగడపాటి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 (టీ మీడియా): తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం మనసును సగం వరకు మార్చగలిగామని, మరికొంత సమయం తీసుకుని పూర్తిగా మార్చేసి.. సమైక్యాంధ్రకు కట్టుబడేలా చేస్తామనే భరోసా తమకున్నదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనేవారు సమైక్యవాదులు కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించినా.. సమైక్యంగా ఉంచినా.. అది కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. తెలంగాణకు అనుకూలమని లేఖలిచ్చిన పార్టీలు మారినా మారకున్నా.. సీమాంధ్ర ప్రజలు పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం మనసు మార్చుకోవాలని వారు చూస్తున్నారని అన్నారు. సీమాంధ్రలో ప్రజల ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మనసు మార్చుకుంటున్నాయని లగడపాటి చెప్పారు. కేబినెట్ నోట్ రాకుండా చేయడంలో విజయం సాధించామన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్ర ఉద్యమం చల్లబడుతుందని చిరంజీవి తదితర కేంద్రమంత్రులు సోనియాకు తెలిపామని అంటున్నారని ప్రస్తావించగా.. ‘హైదరాబాద్‌ను కేంద్రపాలితం చేయాలనేవారు సమైక్యవాదులు కారు. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిది. దాన్ని కేంద్రానికిగానీ, తెలంగాణ వారికిగానీ వదిలే ప్రసక్తే లేదు. ఒక్క అంగుళం నేల పోకుండా ఇప్పుడున్న రాష్ట్రం మొత్తం సమైక్యంగానే ఉంటుంది’ అన్నారు. టీడీపీ సమైక్యవాదం అనలేదని రాజగోపాల్ చెప్పారు. కానీ.. టీడీపీ, వైఎస్సార్సీపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి