తెలంగాణ ప్రజలను సవాలు చేస్తూ హైదరాబాద్ నడిబొడ్డున ఈ
నెల ఏడవ తేదీన బహిరంగ సభ జరపాలని ఏపీ ఎన్జీవోలు నిర్ణయించడమే తీవ్ర
అభ్యంతరకరం. విభజన సామరస్యంగా సాగకుండా, హైదరాబాద్‌ను ఉద్రిక్తతలకు
కేంద్రంగా చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలనే పెద్ద కుట్రలో భాగమిది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని నివారించడానికి బదులు సభకు అనుమతి ఇవ్వడం ఈ
కుట్రకు సహకరించడమే. సీమాంధ్ర ప్రజలు తమ ప్రాంతంలో తాము ఎన్ని సభలు
పెట్టుకున్నా అభ్యంతరం లేదు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి
తీసుకుపోయే హక్కు వారికి ఉన్నది. కానీ కొందరు పెట్టుబడిదారులు ప్రజల మధ్య
అగాధం సృష్టించడానికి ఆందోళనలను సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంపై
పెత్తనం కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల పోరాటం ద్వారా తెలంగాణ
ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకుంటున్న వేళ ఇది. ఈ దశలో వారిపై హైదరాబాద్
కేంద్రంగా పెత్తనం కొనసాగించాలని పెట్టుబడిదారులు పన్నుతున్న కుట్రలో
సీమాంధ్ర ఉద్యోగ నాయకులు భాగస్వాములయ్యారు. వీరి కుటిల క్రీడలో అమాయక
ఉద్యోగులు పావులుగా మారిపోతున్నారు. ఈ నెల ఏడవ తేదీన జరిపే సభ ఒక భారీ
కుట్రకు ఆరంభ దృశ్యమని స్పష్టంగా కనబడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం
దీనిని ఎందుకు అనుమతిస్తున్నదనేది తెలియని విషయమేమీ కాదు. సమైక్యాంధ్ర
కోసమంటూ సాగుతున్న ఆందోళనల వెనుక ప్రభుత్వ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలు కూడా పాలకవర్గ కుటిల నీతిలో భాగమే.
ఇంతకాలం తెర ఉండి కథ నడిపించిన సీమాంధ్ర పాలకులు ఇప్పుడు బరితెగించి
బయటపడ్డారు.
ఈ నెల పదవ తేదీ వరకు సభలు, ఊరేగింపులు అనుమతించబోమని ప్రకటించిన పోలీసు యంత్రాంగం ఆ మరుసటి రోజే సీమాంధ్ర బహిరంగ సభకు అనుమతి ఎందుకు ఇచ్చినట్టు? ప్రభుత్వ పెద్దల సూచన మేరకే పోలీసు యంత్రాంగం దిగివచ్చిందని తెలుస్తూనే ఉన్నది. ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి బుల్లెట్లకు బలైన తొలి అమరవీరుల స్మారకార్థం సాగుతున్న ముల్కీ వారోత్సవాల ముగింపు సందర్భంగా శాంతి ఊరేగింపును తీయడానికి తెలంగాణ వాదులు నిర్ణయిస్తే ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం లేదు. కానీ సీమాంధ్ర సభకు మాత్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సీమాంధ్ర పెత్తందారీ స్వభావానికి ఇంత కన్నా నిదర్శనం మరేముంటుంది? సీమాంధ్ర ఆధిపత్యం ముందు తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా వివక్షకు గురవుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడానికి కూడా అనుమతించని సర్కారు మంగళవారం సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ధర్నాకు పూర్తిగా సహకరించింది. హైదరాబాద్‌లో గొడవలు సృష్టించవద్దంటూ తెలంగాణవాదులు కోరుతున్నా పట్టించుకోకుండా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు జిద్దుగా నగరంలోనే ధర్నా చేయడం ఆందోళనకారులకు ఎటువంటి సంకేతాలు పంపిస్తుంది? ప్రభుత్వం మీ పక్షమే ఉన్నదనే కనుసైగ చేసిన తరువాత ఆందోళనకారులు హైదరాబాద్‌లో రెచ్చిపోయి వ్యవహరించరా? ఒకవైపు తెలంగాణవాదులను అణచివేస్తూ మరోవైపు ఆంధ్రా ఆందోళనకారులను ఉసిగొల్పడం విపరీత పరిణామాలకు దారి తీయదా?
తన భౌతిక కాయాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకుపోవాలన్న తెలంగాణ అమరుడి కడసారి కోరికను నెరవేర్చడానికి విద్యార్థులు ప్రయత్నించినప్పుడు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నది. తెలంగాణ వాదులు ఆ కన్నీటి వీడ్కోలుకు కూడా న్యాయస్థానం నుంచి అనుమతి పొందవలసి వచ్చింది. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ వద్దకు వచ్చి ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం ఇస్తామంటే కూడా అడుగడుగున ఆంక్షలు పెట్టి వాహనాలను అడ్డుకున్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. పోలీసు యంత్రాంగం ఒక్కొక్క విద్యార్థిపై వందకు పైగా కేసులు పెట్టిందంటే అణచివేత తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. క్యాంపస్ నుంచి ఊరేగింపుగా తరలి వెళ్ళే విద్యార్థులను ఏనాడైనా సజావుగా వెళ్ళనిచ్చారా? క్యాంపస్ ఉద్రిక్తంగా మారినప్పుడు తాము మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పుతామంటూ వచ్చిన ప్రజా ప్రతినిధులను కూడా లోపలికి వెళ్ళకుండా అడ్డుకోలేదా? బాష్పవాయువుతో గుండెలు ఉక్కిరి బిక్కిరైనా ఉద్యమకారులు వెనుకడుగు వేయలేదు. రబ్బరు బుల్లెట్ల గాయాలు వారిని ఆపలేదు. లాఠీదెబ్బలకు ఒళ్లంతా చితికి పోయినా ఉద్యమానికి తెలంగాణ బిడ్డలు దూరం కాలేదు. తమ అక్కసును తోటి ఆంధ్ర ప్రజలపై ప్రదర్శించలేదు. తెలంగాణ కావాలనే ఆకాంక్ష... హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే తహతహ... సమభావానికి, సామరస్య సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షించుకోవాలనే దృఢదీక్ష వారిని ముందుకు నడిపిస్తున్నది. గుండెనిండా గాయాలైనా నిబ్బరం కోల్పోకుండా వైషమ్యాలు వద్దంటూ తెలంగాణవాదులు చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వక పోవడమేమిటి? హైదరాబాద్‌ను కబళించాలనే దురాక్షికమణ భావంతో తలపెట్టిన బహిరంగ సభను అనుమతించడమేమిటి? హైదరాబాద్‌లో ప్రజల మధ్య కక్షలు, కార్పణ్యాలు సృష్టించాలనే దుష్ట యత్నాలకు ప్రభుత్వం వత్తాసు పలికితే చరివూతలో ఒక సంక్షుభిత అధ్యాయాన్ని రచించిన దోషిగా నిలబడాల్సి వస్తుంది. ‘విష బీజాలు నాటిన వారు వాటి ఫలాలు అనుభవించవలసి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి