9/6/2013 12:51:20 AM
దీర్ఘకాలికంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, వ్యవసాయ దారులకు ప్రయోజనాలు చేకూర్చే భూ సేకరణ, పునరావాసం, పరిహారం 2012 బిల్లును లోక్‌సభలో ఆగస్టు 29న ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రెండు బిల్లులు ఒకదానికొకటి అంతర్గతంగా ముడిపడి ఉన్న అంశాలు. దేశంలో ఆహారోత్పత్తుల దిగుబడి తగ్గకుండ ఉండటానికి వ్యవసాయ, వ్యవసాయేతర భూములుగా మారకుండ ఉండటానికి ఈ నూతన భూసేకరణ చట్టం దోహదం చేస్తుందని చెబుతున్నది. ఈ చట్టం (బిల్లు) ప్రకారం ఏ భూములనైనా బలవంతంగా సేకరించేందుకు వీలుకాదు. పరిక్షిశమలు, ప్రాజెక్టుల కోసం భూములను వదులుకున్న రైతులకు న్యాయమైన పరిహారం దొరుకుతుందని అంటున్నది. భూ సేకరణతో ప్రైవేట్ ప్రాజెక్టులకు 80శాతం, ప్రభుత్వవూపాజెక్టులకు 70 శాతం మేర భూ యాజమానుల సమ్మతి తప్పని సరి చేసింది. బలవంతపు భూ సేకరణను అరికట్టి, భూమి కోల్పోయే వారికి న్యాయపరమైన పరిహా రం లభించేలా చూడటం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. బ్రిటీష్ హయాంలో 120 ఏళ్ల క్రిందటి (1894) చట్టం స్థానంలో ఈ నూతన చట్టం అమలుల్లోకి రానున్న ది. వాస్తవమైన పరిహారం పొందే హక్కుతో పాటు పారదర్శకంగా భూ సేకరణ జరగడం బిల్లులో ప్రధాన అంశం.
పారిక్షిశామిక అవసరాల కోసం భూ సేకరణ జరపడానికి ఈ బిల్లులో విధివిధానాలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఈ చట్టం ద్వారా భూ యాజమానులకు లభిస్తుంది. నిర్వాసితులైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి భూమికి బదులు భూమి గరిష్టంగా రెండున్నర ఎకరాలు ఈ చట్టం ద్వారా పొందే హక్కు ఉంది. గతంలో ఆంధ్రవూపదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ఏపీఐఐసీ (ఆంవూధవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ) ద్వారా రైతుల వద్ద బలవంతంగా భూమిని సేకరించి ఒక మధ్యవర్తిగా ఇతర సంస్థలకు భూమిని విక్రయించే అధికారాలు ఉండేవి. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికారాలు కోల్పోతాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)ను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపక్షాల సూచనలను ప్రభు త్వం సవరణ ద్వారా అమలు చేస్తారని చెప్పడం, విపక్షనేత సుష్మాస్వరాజ్ ప్రతిపాదించిన రెండు సవరణలు కూడా సభ ఆమోదించడం ఓ సానుకూల నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, బాధితులకు పరిహారంతో పాటు భూమికి బదులు భూమి,ఇల్లు, ఉపాధి, వార్షికాభివృద్ధివంటివి లబ్ధిపొందే అవకాశం ఉం టుంది. గతంలో ప్రభుత్వాలు రైతులకు ఇష్టం లేకున్నా వారి భూములను బలవంతంగా సేకరించిన ఉదంతాపూన్నో ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్ కోసం నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, కడప జిల్లాలో బ్రహ్మిణి స్టీల్స్ కోసం, మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లిలో (ఎస్‌ఈజడ్) అరబిందో ఫార్మా కోసం భూములు సేకరించి కంపెనీలకు కట్టబెట్టడం మనం ప్రత్యక్షంగా చూశాం. ఇక నుంచి ఈ చట్టం ఇలాంటి వాటికి అవకాశం కల్పించదు. భూ సేకరణ అనంతరం ప్రతిపాదించిన స్థలాల్లో పరిక్షిశమలు నెలకోల్పనట్లయితే ఆ భూములు తిరిగి రైతులకు కట్ట బెట్టడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. యాజమాన్య మార్పిడికి ఎలాంటి రిజివూస్టేషన్, స్టాంపు డ్యూటీలను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయడానికి వీలు లేదు. భూమి యాజమానులు పొందే పరిహారానికి ఆదాయపు పన్ను, స్టాంపు రుసుముల నుంచి మినహాయింపు కల్పిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో సింగరేణి కాలరీస్ కంపెనీ, ఏపీ జెన్‌కో తమ బొగ్గు గనుల విస్తరణ కోసం చేపట్టే భూ సేకరణలో నిర్వాసిత ప్రజలకు ఈ చట్టం ద్వారా అదే సంస్థలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుంది.
కరీంనగర్ జిల్లా రామగుండంలోని మల్యాలపల్లి వద్ద బీపీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన భూమి 15 ఏళ్లు నిరుపయోగంగా పడి ఉన్నది. ఈ చట్టం ద్వారా ఈ భూమిని భూ యాజమానులకు బదలాయించే అవకాశం ఏర్పడింది. షెడ్యూల్డు ప్రాంతంలో భూసేకరణ కోసం గ్రామ సభల ఆమోదం తప్పని సరి చేసింది ఈ చట్టం. వక్ఫ్ భూముల సేకరణ ఉండదు. దీని కారణంగా దేశంలోని ముస్లిం మైనార్టీలకు వారి ఆస్తుల పరిరక్షణ కోసం యూపీఏ ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లయింది. గ్రామీణ భారతంలో భూమి సామాజిక హోదాకు చిహ్నంగా కొనసాగుతున్నందున భూములు కోల్పోయిన వారు ఎట్టి పరిస్థితిలో ఆర్థికంగా కుప్పకూలి పోకుండ చూడటం ప్రభుత్వాల బాధ్యత. 2014 సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యం యూపీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులతో పాటు, తెలంగాణ ఏర్పాటుకు బిల్లు తేవడానికి సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశంలో అనేక పోరాటాల అనంతరం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వారికి అటవీ భూముల యాజమాన్య హక్కును కల్పించినట్లే, భూ సేకరణకు వ్యతిరేకంగా దేశంలో జరిగిన అనేక ప్రజాఉద్యమాల నేపథ్యంలో నూతన భూ సేకరణ చట్టం వచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.
-శశిభూషణ్ కాచే
సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, పెద్దచెరువు, బిట్టుపల్లి
సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, పెద్దచెరువు, బిట్టుపల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి