11, సెప్టెంబర్ 2013, బుధవారం

తెలంగాణపై విద్యుత్ వివక్ష తేటతెల్లం


9/11/2013 1:21:02 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (టీ మీడియా): విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశామనే విషయాన్ని ‘సేవ్ ఆంధ్రవూపదేశ్’ సభ బహిరంగంగా అగీకరించింది. ఇకపై కూడా విద్యుత్‌రంగంలో తమదే పైచేయిగా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించింది. రాష్ట్ర విభజన వల్ల విద్యుత్‌పరంగా తెలంగాణకు సమస్యలు ఎదురవుతాయన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి మాటలనే సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేత శ్రీనివాసరావు సభలో ప్రస్తావించడం విశేషం. తాము సీమాంవూధలో విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణకే ఇస్తున్నామని, తెలంగాణలో 54శాతం విద్యుత్ వినియోగంతోపాటు వ్యవసాయరంగానికి 80శాతం మేరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటూ శ్రీనివాసరావు ప్రస్తావించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందనే విషయాన్ని సీమాంధ్ర నేతలు పరోక్షంగా అంగీకరించారు.

కానీ, ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కోకు జాతీయస్థాయిలో రికార్డులను సాధించిపెట్టింది తెలంగాణలోని విద్యుత్‌వూపాజెక్టులేనన్న విషయాన్ని విస్మరించడం శోచనీయం. జెన్‌కో పరిధిలోని 25 విద్యుత్ యూనిట్లలో భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రికార్డు స్థాయిలో 91.07శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)ను సాధించి ఏపీ జెన్‌కోను జాతీయస్థాయిలో 9వ స్థానంలో నిలిపి తలమానికమైంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలోను, ప్రైవేటు రంగంలోనే కాకుండా జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు మొత్తం 41 థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉండగా, వాటిల్లో జెన్‌కో పరిధిలో తెలంగాణలోని కేటీపీపీ అగ్రభాగాన ఉండడం విశేషం. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జెన్‌కో 3,988.72 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసి 85.03 పీఎల్‌ఎఫ్‌ను సాధించి జాతీయస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

అందులోనూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాలుగు యూనిట్లు కీలకపాత్ర పోషించాయనే నగ్నసత్యాలను సీమాంవూధనేతలు ఎక్కడా అంగీకరించేందుకు ముందుకు రాకపోవడం శోచనీయం. వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నా ఇక్కడ కట్టాల్సిన విద్యుత్ ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించకుపోయిన ఉదంతాలపై ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సీమాంధ్ర పాలకుల కుట్రల ఫలితంగానే తెలంగాణ వెనుకబాటుకు గురైందనేది నగ్నసత్యం.

ఇటీవల పదేళ్లకాలంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలోనూ పాలకులు సీమాంవూధవైపునకే మొగ్గు చూపారు. గత రెండేళ్ల క్రితం రాష్ట్రంలో 28,440 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు ఆధారిత ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించింది. వాటి ఏర్పాట్ల కోసం కొన్ని వేల ఎకరాల భూములను కేటాయించింది. వీటిల్లో కోస్తా తీరవూపాంతంలో 27,540 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులు ఉండగా, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో రెండు పవర్ ప్రాజెక్టులున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు అదనంగా 12,058 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత పవర్‌వూపాజెక్టులకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి