9/3/2013 12:28:25 AM
జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరిద్దరిని పిలిపించుకుని మాట్లాడిన రోజు. వారికి ఆ రోజు ఆమె ప్రత్యేకంగా చెప్పిన విషయం- ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని. తెలంగాణ ప్రజా సమితి యువ నాయకులు ఉద్యమం విజయం సాధించిందని సంతోషించారు. కలలు గన్న తెలంగాణ నిజమవుతుందని ఆశపడ్డారు. కానీ 44 ఏళ్లుగా ఆ ప్రకటన రాలేదు, ఆ కల నిజం కాలేదు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఆనాటి విద్యార్థి నాయకుడు డాక్టర్ గోపాల కృష్ణ. ఆనాడే రావలసిన తెలంగాణను రాకుండా చేశారనీ, ఇస్తానన్న ఇందిరాగాంధీ సైతం ఇవ్వకుండా వదిలేసే విధంగా ఆమెను ప్రభావితం చేసిన శక్తులు కోస్తాంవూధులకు ఉన్నాయని, కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గానీ తనకు నమ్మకం కుదరదని డాక్టర్ గోపాలకృష్ణ అంటున్నారు. వాస్తవమేమంటే ఆంధ్రతో కలిసి ఉండాలని హైదరాబాద్ ఏనాడూ అడగలేదు. ఇది ఆంధ్ర నాయకుల ఆకాంక్ష. దానికి అందమైన తొడుగు ఏమంటే తెలుగువాళ్లంతా ఒక రాష్ట్రంలో ఉండాలన్న నినాదం.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంగానే పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం ఉండాలని కోరుకున్నారు.1953లో ఈ విధమైన ప్రబలమైన ఆకాంక్ష ఉందన్న విషయం నెహ్రూ గుర్తించారు. తెలంగాణను కలుపుకోవాలనుకోవడం ఆంధ్రుల విస్తరణ కాంక్షను ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానించారు. కానీ సీమాంధ్ర లాబీ ముందు ఆయన కూడా అభివూపాయం మార్చుకోవలసి వచ్చింది.
మొదటి రాష్ట్ర పునర్విభజన సంఘం అధ్యక్షుడు జస్టిస్ ఫజల్ ఆలీ ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న వైరుధ్యాలు, ఆర్థిక వ్యత్యాసాలు, విద్యావిషయిక, ఆర్థిక, భాషాపరమైన సమస్థాయికి నోచుకోని తెలంగాణను విలీనం చేయడం వల్ల తెలంగాణలోకి వలసలు ఎక్కువైపోయి సీమాంవూధులే రాజకీయాధిపత్యం చేసి ఉద్యోగావకాశాల కైవసం చేసుకోవడం వంటి సమస్యలు వస్తాయని గుర్తించారు.అనేక రాష్ట్రాల పునర్విభజనను నిర్ద్వంద్వంగా నిర్ధారించిన ఫజల్ ఆలీ తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయ డం పట్ల సంపూర్ణమైన అంగీకారాన్ని తెలియజేయలేదు. ఒకవేళ విలీనం చేసినా మూడు నాలుగేళ్ల తరువాత శాసనసభలో తెలంగాణ సభ్యుల అభివూపాయం అనుకూలంగా ఉంటే విలీనం కొనసాగించాలని లేకుంటే విడదీయాలని చాలా స్పష్టంగా వివరించారు. ‘కొంటె అబ్బాయికి అమాయకపు వధువుకు పెళ్లి వంటిదని ఆంధ్రవూపదేశ్ ఏర్పాటును ఆయన అభివర్ణిస్తూ, వారు కాదనుకుంటే విడాకులు ఉండాలని’ నెహ్రూ అన్నారు. అయినా కోస్తాంవూధుల ప్రయత్నాల వల్ల, నీలం సంజీవడ్డి చాకచక్యం వల్ల ఆంధ్రవూపదేశ్ ఏర్పడింది. అమలు కావడానికి వీల్లేని, కోర్టు లో నిలబడడం సాధ్యం కాని, సీమాంవూధుల దయాభిక్షపైననే ఆధారపడిన రక్షణ లు హామీలు కురిపించారు. నీలం సంజీవడ్డి అందమైన వాగ్దానాలతో కూడిన అసెంబ్లీ తీర్మానాలతో తెలంగాణను కలుపుకోవడానికి ఢిల్లీ నాయకులను ఒప్పించారు. తెలంగాణ వారు తమకు సోదరులని వారికి తాము అన్ని విధాలా అండదండలుగా ఉంటామని,వారి ఉద్యోగావకాశాలను కాపాడతామని, వారి భూము లు కొనబోమని, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి ఉంటేనే వ్యవసాయభూములు కొంటారని, తెలంగాణ రాబడిని తెలంగాణలోనే వెచ్చిస్తామని, అభివృద్ధిలో 42శాతం భాగాన్ని తెలంగాణకు లభించేట్టు చేస్తామని హామీలు కురిపించారు. విశాలాంధ్ర ద్వారా సమైక్యానికి ఒక అవకాశం ఇవ్వకుండానే వదిలేయడం మంచిదికాదని వాదించారు. తెలంగాణకు పనికి రాని హామీలిచ్చిన కోస్తాంవూధులు ఇప్పుడు తమకు రాజ్యాంగ రక్షణలు, చట్టపరమైన భద్రతలు కావాలంటున్నారు. తెలంగాణపైన దుర్మార్గం, ఆక్రమణ, అవకాశాల నిరాకరణ, తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటాల మళ్లింపు మరునాటి నుంచే మొదలు పెట్టారు.
తెలంగాణ పేరును కూడా కాపాడడం కోసం ఆంధ్ర తెలంగాణ అని పేరును ఖాయం చేశారు. విలీనం బిల్లులో అదే పేరును ప్రతిపాదించారు. కనీసం రాష్ట్రం పేరులో తెలంగాణ అనైనా చేర్చి గుర్తించారు కదా అని కాస్త ప్రమత్తంగా ఉన్నారు నాటి హైదరాబాద్ రాష్ట్ర నాయకులు.అంతే సాయంత్రం దాకా ఆంధ్ర తెలంగాణ పేరుతో ఉన్న తెలుగు రాష్ట్రం బిల్లు ఆమోదించడానికి కొద్ది నిముషాల ముందు ఆంధ్రవూపదేశ్ గా మారింది. ఫజల్ ఆలీ కమిషన్ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత మూడు నాలుగేళ్లలో తెలంగాణ అభివూపాయాన్ని తెలుసుకోవాలన్నారు, విలీనం అనే మంచి పేరు వెనుక ఉన్న విష దుర్మార్గాన్ని తొలగించాలని ఎవరూ ప్రయత్నించలేదు.తెలంగాణ వద్దనుకుంటే విడిపోవచ్చన్న నెహ్రూ మాటకు, ఫజల్ ఆలీ కమిషన్ సిఫార్సుకు సీమాంవూధులు కుట్రపూరితంగా తిలోదకాలిస్తే, తెలంగాణ నాయకులు, పెద్దమనుషుల ఒప్పందం మీద సంతకాలు చేసిన పెద్దలు మౌన పోరాటం చేసినారో మౌనమే పాటించినారో తెలియదు. వారు నెహ్రూను మోసం చేశారు. ఇందిరాగాంధీ వంటి నాయకురాలికి కూడా ఏం చెప్పారో ఏవిధంగా నచ్చ జెప్పారో తెలియదు. సోనియాగాంధీని కూడా 2009 డిసెంబర్ 9 తరువాత మాట మార్చేట్టు చేశారు. నీలం సంజీవడ్డి, కాసు బ్రహ్మానందడ్డి నుంచి చివరకు చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌డ్డి దాకా ఇవే మొసలి కన్నీళ్లను ఈనాటికీ కురిపిస్తున్నారు. లంచాలద్వారా వేలకోట్ల రూపాయల ధనం సంపాదించిన కాంట్రాక్టర్లు, పార్లమెంటు, అసెంబ్లీల్లో దశాబ్దాలుగా పాగావేసి చేస్తున్న దేశ సేవలో భాగంగా తెలుగు వారి ఆత్మగౌరవ రక్షణకు, తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండడం కోసం తమ సంపాదనలో కొంత ఈ మహోద్యమానికి త్యాగం చేస్తూ సహకరించడం వల్ల నెల దాటినా ఉద్యమం పరిఢవిల్లుతున్నది.కులధన సంకుచిత రాజకీయనాయకులు, వారి అనుబంధ వ్యాపారమీడియా డబ్బులు అడగకుండా ఇస్తున్న నిరంతర నిస్సార ప్రచార ప్రసారాలతో, రగులుతున్న జ్వాలలు అంటూ రోజూ పేజీలకు పేజీలు నింపుతున్న సీమాంధ్ర దినపవూతికల ప్రతిదిన తద్దిన వార్తా ప్రచురణలతో సమైక్య ఉద్యమం ఉరిమే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. ఇదే తెలంగాణను ఆపడానికి సాగుతున్న కుట్ర. శ్రీధర్ దేశ్‌పాండే ఈ ఉద్యమాల రహస్యాన్ని విప్పిచెప్పారు. 1973లో వీరే జై ఆంధ్ర అన్నారు. జై ఆంధ్ర అంటే పరోక్షంగా జై తెలంగాణ అన్నట్టే. కాని అది జై ఆంధ్ర కాదు. అది నిజమైన నై తెలంగాణ. 2013లో సరిగ్గా నలభై ఏళ్ల తరువాత ఆ జై ఆంధ్రులే సమైక్యాంధ్ర అంటున్నారు. వీరు చెప్పేదొకటి చేసేది మరొకటి. తెలంగాణసొమ్ముతో తెలంగాణనే వ్యతిరేకించే సమర్థులు వీరు. కొత్తగా తెదేపా చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ అన్యాయ అధ్యా యం ప్రారంభమైంది.
ఇదివరకు డిసెంబర్ 23న అంతకుముందు చేసిన ప్రకటననుంచి యూనియన్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్న రీతిలో కాకుండా పదేపదే తెలంగాణ ఏర్పాటుపైన మడమ తిప్పం అని సోనియా, మన్మోహన్, దిగ్విజయ్ చాలా స్పష్టంగా ప్రకటిస్తూనే వచ్చారు. రాష్ట్ర విభజన తప్పనిసరైతే కోస్తాంవూధను తప్ప మిగిలిన రెండు ప్రాంతాలను చీల్చ మంటున్నారు ఈ సమైక్యాంవూధులు. రాయలసీమ నాలుగు జిల్లాలను రెండుగా విభజించాలనే ప్రతిపాదన. తెలంగాణనుంచి హైదరాబాద్ ను వేరు చేయాలనే ప్రతిపాదన. హైదరాబాద్‌ను రెండో రాజధాని లేదా శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతం లేదా పదేళ్ల సంయుక్త రాజధాని లేదా తాత్కాలిక యూటి అందులో శాంతి భద్రతల అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఈ విధంగా రకరకాల డిమాండ్లు. కొత్తగా సిటీ స్టేట్‌లు అనే వాదాన్ని ఢిల్లీ నగరంలో ప్రచారంలోకి తెచ్చారీ సీమాంధ్ర కాంట్రాక్టు రాజకీయ నాయకులు తెలంగాణ పదిజిల్లాలు, హైదరాబాద్ రాజధానిగా పూర్తి స్థాయి రాష్ట్రాన్ని అధికారాల మినహాయింపులు లేకుండా ఇస్తేనే తెలంగాణ ప్రజ నమ్ముతుంది. అందాకా నమ్మదు. ఇందులో ఏ తేడా వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. సీమాంవూధలో సమైక్య ఉద్యమం సెంటిమెంటు ఏదైనా ఉంటే దాన్ని వై ఎస్ ఆర్ సెంటిమెంట్ తో రంగరించి మొత్తం నాకేయడానికి జగన్ పార్టీ సిద్ధంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ అసలు పార్టీ, తుకడా పార్టీలు ఏంచేస్తాయో తెలంగాణ వారికన్న హైకమాండ్ వారికి బాగా తెలుసు. తెలుగుదేశం ఏమైపోతుందో వారికీ తెలుసు. తెలంగాణ బిల్లు వచ్చేదాకా తెరాస విలీనం ప్రసక్తే లేదని చెప్పి కేసీఆర్ కొంత జాగ్రత్తపడ్డారు. కాని తెలంగాణ ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం తెరాస ఏ పరిస్థితిలోనూ విలీనం కాకపోవడమే న్యాయం, సమంజసం.బిల్లు వచ్చినా అందులో చిల్లులు ఏమైనా ఉంటాయేమోనని, ఆ చిల్లుల్లోంచి తెలంగాణ ప్రయోజనాలన్నీ కారిపోతాయని అనుమానించవలసిన కర్తవ్యం తెలంగాణ నాయకుల మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చామన్న ఖ్యాతికోసం తపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులపైన ఉంది.
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి