3, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలంగాణతో కయ్యం వద్దు


తెలంగాణ విభజన ప్రక్రియ మొదటి ఘట్టం ప్రారంభమై నాలుగేళ్లు కావస్తున్నది. రెండవ ఘట్టం ప్రారంభమై దాదాపు నెల రోజులు అవుతున్నది. రాష్ట్రముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి కేంద్ర మంత్రులకు రాష్ట్ర విభజన జరుగుతున్న సమాచారం ఉన్నదని సోనియాగాంధీ తెలియచేశారు. అన్ని తెలిసి కూడా, అన్నింటికి అంగీకరించి కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు తిరోగమనానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. కొత్త కొత్త రాజకీయ సూత్రాలు వల్లిస్తున్నారు. కాలం చెల్లిన అప్రజాస్వామికమైన మొబ్రోకసీని ‘మందస్వామ్యాన్ని’ సూచిస్తున్నారు. వేల ఏళ్ల క్రితం రోమ్ అనే పట్టణంలో ఇది వాడకంలో ఉండేది. నిరంకుశ మూక బలంతో, సంఖ్యాబలంతో, జనానికి అవాకులు చెవాకులు చెప్పి, భావావేశానికి గురిచేసి అధికారం కైవసం చేసుకునే వారు. దాన్ని ఇప్పుడు అమలు చేయమంటున్నారు! ఘోరం. సభ్య సమాజం మొబోక్షికసీని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రవిభజన నిర్ణయాన్ని చట్టసభల్లో ఓడించాలని ఆంధ్రకాంక్షిగెస్ నాయకులే ప్రబోధిస్తున్నారు. జాతీయ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, సామాజిక వర్గాలు, సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వాములు అంగీకరించిన నిర్ణయాన్ని సవాల్ చేయడం న్యాయమేనా? భారతదేశంలోని ఏ పార్టీయైనా లేక ఏ ప్రభుత్వమైనా లేక ఏ పలుకుబడి గలిగిన నాయకుడైనా, సామాజికవేత్త అయినా, ఆంధ్ర విభజన వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థించారా? ఆ న్యాయ వ్యవస్థ అయినా స్వాతంత్య్రం కోరే వారి కి అడ్డుపడుతుందా?

‘ఆంధ్ర రాష్ట్ర విభజనపై నిర్ణయాలు తీసుకొనేది జాతీయ పార్టీలు కాదు. ప్రభుత్వాలు కాదు, ఉద్యమించే ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది. సమయం రాగానే ముందుకు వస్తాం. ప్రభుత్వాలు సరియైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలే ప్రభుత్వానికి సెలవు ప్రకటించుతారు.’ ఇది ముఖ్యమంత్రి ఉవాచ. ఇది రాజ్యాంగ ధిక్కరణ కాదా! గవర్నర్ ఆయనను బర్తరఫ్ చేయాలి. దేశ న్యాయవ్యవస్థ సుమోటోగా ఆయనను అభిశంసించాలి’.లగడపాటి తిరుగుబాటు చేయమంటున్నాడు ‘ఇక సందేహించేది లేదు మనం ఊరుకునేది లేదు. దేనికైనా తెగిస్తాం. హైదరాబాద్ మా అబ్బ సొత్తే. ఎంతో అభివృద్ధి చేశాం. నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ అన్ని తెలు గు ప్రాంతాలే. ఏ ఒక్క భాగాన్ని విడిపోనీయం’ అని చిందులేస్తున్నారు. గావుకేకలు పెడుతున్నారు. ఒక సీనియర్ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీ వీరాభీమా ని ఇప్పుడు ‘కోన్ కిస్కా’ అంటున్నాడు. ఆంధ్ర నాయకులు రెండు సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. తెలంగాణ, ఆంధ్ర ఒడంబడికలు, హక్కులు, ప్రాంతీయ కమిటీ, ముల్కీ రూల్స్ రద్దు చేయకపోతే విడిపోతామని విజృంభించి రద్దు చేయించారు. ఈసారి తెలంగాణ రాజధాని నగరంలో భాగస్వామ్యం కావాలని పోరాడుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా సమైక్యత అనే ఏకపక్ష డిమాండ్‌ను ముందుకు తోస్తున్నారు. విభజన ప్రక్రియ రద్దు చేసే వరకు పోరాటం అగదంటున్నారు. తెలంగాణ ప్రాంతం ఏకధాటిగా 57 ఏళ్లుగా రాష్ట్ర విభజన జరగాలని కోరుతున్నది. కారణాలు కో కొల్లలు. వివక్ష, పక్షపాతం, నిధుల చౌర్యం, భూములపై దురాక్షికమణ, నీటిదోపిడీ ఇంకా ఎన్నో ఘోరాలు, నేరాలు లాంటవి. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఆధీనంలో, పాలనలో ఉన్న శాటిలైట్ రాష్ట్రం కాదు. పరాధీన ప్రాంతం కాదు. ఆంధ్రుల జాగీర్ కాదు. వలసవూపాంత కాదు. తెలంగాణ 224 ఏళ్లుగా సర్వ స్వతంత్ర రాష్ట్రం. ప్రపంచంలోని 60 ఉన్నత దేశాలతో సమానంగా జనాభా భౌగోళిక ప్రాంతం గల దేశం. సంపదలో ప్రపంచం లో ఏడవ స్థానంగా నిలిచిన రాష్ట్రం. సరోజనీనాయు డు, నెహ్రూ, బిల్‌క్లింటన్, ఒబామా ఇంకెందరో విశిష్ట వ్యక్తులు కొనియాడిన రాష్ట్రం. దీని ఉనికినే ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు? తెలంగాణ చరివూతలో వడబోసి వెదికినా ఎక్కడా లేదంటున్నారు. అంతా ఆంధ్రమే అంటున్నారు!

వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆంధ్ర తెలంగాణపై యుద్ధ నగారా మోగించడం తగదు. తెలంగాణ విప్లవ గడ్డ అని మరువకూడదు. తెలంగాణ విప్లవానికే విప్లవం నేర్పింది. పోరాటాలకే పోరాటం నేర్పింది. రాజుల, రారాజుల, భూస్వాముల అన్యాయాన్ని ఎదిరించి మెడలు వంచింది. తెలంగాణ మూడున్నర కోట్ల జనాభా హైదరాబాద్‌కు ఒక ‘కూతపెట్టు’ దూరంలో ఉండే విధంగా వ్యూహాత్మకంగా నిర్మాణం చేయబడ్డది. పిలిస్తే నాలుగు గంటల వ్యవధిలో 10లక్షల మంది పొగవుతారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో తెలంగాణ సభలకు పిలిస్తేనే లక్షలాది మంది తరలి వచ్చిన విషయాన్ని ప్రత్యక్షంగా అందరూ చూశారు. కాబట్టి లక్ష గళాలతో సభలు పెడుతాం. హైదరాబాద్ నడ్డిబొడ్డున్నే ఉద్యమాలు చేస్తం అన్నది మంచి ఆలోచనకాదు. ఉద్యమాలు సంఘర్షణ కోసం, అంతర్ యుద్ధాలకోసం చేయబడవు. ఉద్యమాలు ప్రారంభించిన వారికి వాటిని అదుపులో పెట్టడం కూడా తెలియాలి. ముగిం పు కూడా తెలియాలి. రెచ్చగొట్టి తప్పించుకోవడం ఉద్యమ లక్షణం కాదు. తెలుగు సోదరుల మధ్య విరోధం వద్దు. సమైక్యత వద్దు. కానీ.. సఖ్యత, స్నేహం, ఉండితీరాలి. జాగో, భాగోలు ఇక ముందు చెల్లవు. వాటిని పట్టించుకోవద్దు. మీకు ఎంతగానో అభిమానం ఉన్న హైదరాబాద్ రాజధాని గేట్లు తెరిచే ఉంచుతాం. మీరు రావచ్చు. పోవచ్చు. క్రతువులు, కార్యాలు, పండుగలు చేసుకోవచ్చు. వాణిజ్య వ్యాపారాలు చేసుకోవచ్చు. మా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో అన్ని సమస్యలపైన అనుమానాల నివృత్తికి చేసుకుందాం. ఉద్యమాలు మానండి. స్నేహం స్వీకరించండి. మన ఇరు ప్రాంతాల కొత్త రాష్ట్రాల నిర్మాణానికి మనం శక్తి సామర్థ్యాలను ఉపయోగించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.

ఆంధ్ర సోదరులు నేర్పరులు, విద్యావంతులు, కష్టపడే వారు. సంపదను పెంచుటలో ప్రావీణ్యం, పరిపాలన అనుభవం, లౌక్యం తెలిసిన వారు. కార్యదీక్షాపరులు, పట్టుదల పౌరుషం కలవారు. వారికి సహజ సంపద ఉంది. తరతరాలకు సరిపోయే గ్యాస్ సంపద ఉంది. వేలాది మైళ్ల పొడవు సముద్ర తీరం, నౌకాయాణం ఉంది. పోర్టులున్నాయి. మూడు పైర్లు పండించుకొనే సామర్థ్యం గల బంగారు భూమి ఉం ది. నాలుగు వైపుల, గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వందలాది ఉపనదులు ఉన్నాయి. భూతల స్వర్గంలాంటి కోనసీమ, అరకువ్యాలీ ఉంది. రంగురాళ్లు, బైరైట్, ఇనుము, అల్యూమినియం ఇంకా ఎన్నో ఖనిజ గనులున్నాయి. డజన్ల కొద్ది చెక్కర ప్యాక్టరీలు, వందలాది రైస్‌మిల్లులు, వేలాది చేపల చెరువులు, రొయ్యల పెంపక కేం ద్రాలు, పండ్లతోటలు, మొక్కల ఉత్పత్తి కేంద్రాలు, పశుసంపద, పాడి సంపద అపారంగా ఉన్నాయి. విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు దండిగా ఉన్నాయి. లక్షల కోట్ల విలువ చేసే సినిమా రంగం, అందాలు చిందించే హీరోలు, హీరోయిన్లు, 24 టీవీ ఛానల్లు, వార్తాపవూతికలు ఉన్నాయి. వేలాది మైళ్ల పొడవు జాతీయ రహదార్లు, రైల్వేలైన్లు ఉన్నాయి. కామధేనువు లాంటి తిరుపతి, కనకదుర్గ, అన్నవరం దేవాలయాలు, నాలుగు మహానగరాలు, కూతపెట్టు దూరంలో మదురాసు, బెంగుళూరు రాజధాని నగరాలు ఉన్నాయి. స్టీలు, ఫర్టిలైజర్, సిమెంట్ ఫ్యాక్టరీలు దండిగా ఉన్నాయి.అబ్బో .. ఎంత సంపద. తరతరాలు తిన్నా తరగని ఇన్ని నిక్షేపాలు, ఇంత సిరి సంపద ప్రపంచంలో ఎవరికి వుండదు. భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. అయినా తెలంగాణ విడవబోమని, విభజనను ఒప్పుకోబోమని, పోరాటాలకైనా సిద్ధమేనని గొంతెత్తి అరుస్తున్నారు. ఆంధ్ర సంపద నుంచి కొంత భాగం త్యాగం చేస్తే తెలంగాణ కూడా సంతృప్తి చెందుతుందేమో, నమ్మకంలేదు. అయినా ప్రయత్నించండి. కొంత త్యాగానికి సిద్ధపడండి.కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగం చట్టసభల సం ఖ్యా బలం విభజనకు ప్రాతిపదిక కాదని నొక్కి వక్కాణించింది. అసెంబ్లీ,పార్లమెంటులోని మెజార్టీ కొలమానం కాదన్నది. న్యాయ సూత్రాలు రకరకాలు, అనేకం. వాటి వివరణ లోతు తెలుసుకోకుండా తెలంగాణను అడ్డుకుంటామని వీరంగం చేయడం ఎందుకు? సమైక్యత కోరే వారు సామరస్యం పాటించాలి. వైషమ్యాలు పెంచకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో కారణాల కోసం విభజనలు జరిగాయి. బ్రిటిష్ దేశానికి రాత పూర్వ క రాజ్యాంగంలేదు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సామాజిక న్యాయం, సహజ న్యాయం, ప్రకృతి సూత్రా లు, న్యాయస్థానాల తీర్పులే రాజ్యాంగమని నిర్దేశించుకున్నారు. అట్టి బ్రిటన్ దేశంలో అంతర్భాగమైన వేల్స్ స్కాట్‌ల్యాండ్, ఐర్లండ్ అనే కౌంటీలు దశాబ్దాలుగా పోరాటాలు చేసి తమ స్వాతంత్య్రం సాధించుకున్నాయి. విభజనకు బ్రిటన్ ఒప్పుకోక తప్పలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో విడిపోయింది. అమెరికా దేశం తమ స్వాతం త్య్రం కోసం ఒకే జాతి, ఒకే రంగు, ఒకే మతం వారితో పోట్లాడి తమ ప్రత్యేకత చాటుకున్నది. తమిళ తంబీలు శ్రీలంకలో భూ భాగస్వామ్యం కావాలని పోరాడి నష్టపోయారు. కాబట్టి ఇతరుల హక్కులపై, ఇతరుల భూ భాగంపై రాజ్య విస్తరణ చేస్తామనడం చెల్లదు. వలసవాదం చెల్లదు. తెలంగాణపై ఆంధ్రాకు ఎలాంటి హక్కులేదు. కాబట్టి ఉద్యమం ఆపండి. తెలంగాణతో చేతులు కలపండి. మేం సమైక్యత ఒప్పుకోం. కానీ సఖ్యత కోరుకుంటామని తెలంగాణ ప్రజలుగా తెలియజేస్తున్నాం.
- జగపతిరావు వెలిచాల
స్వాతంత్య్ర సమరయోధుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి