3, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలంగాణపై కేబినెట్‌కు నోట్20 రోజుల్లోపే


-సిద్ధం చేస్తున్న కేంద్ర హోం శాఖ.. హోం మంత్రి షిండే వెల్లడి
-పార్లమెంటు సమావేశాలవల్లే జాప్యం.. సమావేశాలు ముగిశాక తెలంగాణపై దృష్టి
-కేబినెట్ ఆమోదించాకే అసెంబ్లీకి
-ముసాయిదా బిల్లు పంపనున్న కేంద్రం
-విభజన అనంతరం సమస్యలపై మంత్రుల కమిటీ నియామకం!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 (టీ మీడియా): గత 34 రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.shindee
గతంలో తెలంగాణకు మద్దతిచ్చిన టీడీపీ, వైఎస్సార్సీపీలు తమవైఖరిని మార్చుకుని సమైక్యరాగం ఆలపిస్తున్నప్పటికీ, సొంత పార్టీలోని సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నా.. తెలంగాణ ఏర్పాటు తథ్యమంటున్న కాంగ్రెస్.. తాను తీసుకున్న నిర్ణయాన్ని ముందుకే తీసుకెళ్లాలని తీర్మానించుకుంది. ఇందుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర హోం శాఖ 20 రోజుల్లోపు కేంద్ర కేబినెట్‌కు అందించనుంది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కేంద్ర కేబినెట్‌లో తీర్మానం ఆమోదం కోసం మేం ఒక నోట్ సిద్ధం చేస్తున్నాం. మేం ఆ నోట్‌ను ఖరారు చేసిన తర్వాత దానిని పరిశీలన నిమిత్తం న్యాయశాఖకు పంపిస్తాం. ఆ నోట్‌ను 20 రోజుల్లోపే కేబినెట్ ముందుకు పంపించగలమని భావిస్తున్నాం’ అని షిండే సోమవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ సిఫారసు చేసి నెలరోజులు దాటిపోయినా ఇంకా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందునే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, ఈ నెల ఆరుతో సమావేశాలు ముగిసిన తర్వాత ప్రక్రియ వేగం పుంజుకుంటుందని షిండే జవాబిచ్చారు.

‘ఆహార భద్రత బిల్లు వంటి కీలక పార్లమెంటరీ అంశాలతో కేంద్ర ప్రభుత్వం తీరికలేకుండా ఉన్నది. సెప్టెంబర్ ఆరు తర్వాత మేం తెలంగాణ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది’ అని ఆయన తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజీనామాలకు కూడా సిద్ధపడుతున్నా.. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసే ఉద్దేశంతో లేదన్న స్పష్టమైన సంకేతాలు షిండే మాటల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు రాజీనామాలకు సిద్ధపడ్డారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీని మరోసారి కలిసిన తర్వాత వారు రాజీనామాలు చేయవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షిండే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, టీడీపీ సభ్యుల మధ్య లోక్‌సభలో తీవ్ర వాగ్యు ద్ధం, సభ నుంచి పలువురు సభ్యుల సస్పెన్షన్ జరిగిన రోజే షిండే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. జూలై 31న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ముందుకు తీసుకు విషయలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

అందులో ఒకటి తెలంగాణ బిల్లును సిద్ధం చేయడమైతే.. మరోటి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా బెదిరింపులు చేస్తున్న ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను లొంగదీయడంగా పేర్కొంటున్నాయి. హోంశాఖ అందించే నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించి, విభజన తర్వాత తలెత్తే అంశాలను పరిష్కరించేందుకు మంత్రుల బృందాన్ని నియమించనుంది. అదే సమయంలో కేంద్రం ఆమోదించిన ముసాయిదా బిల్లును ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీకి పంపుతారు. ఆంధ్రవూపదేశ్ విభజనతో ఏర్పడే తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రం కానుంది. నిజానికి కేబినెట్ కంటే ముందు ఆంధ్రవూపదేశ్‌కు తీర్మానాన్ని పంపాలని భావించినా.. నేరుగా కేబినెట్ ఆమోదానికి పంపాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకున్నదని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన అల్లర్లను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనతతో వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే నేరుగా కేంద్ర కేబినెట్ ఈ తీర్మానం చేపట్టనున్నట్లు చెబుతున్నారు.

కేబినెట్ ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి, అటు నుంచి ఆయన ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీకి అభివూపాయం నిమిత్తం పంపిస్తారు. విభజనపై అసెంబ్లీ అభివూపాయాన్ని తీసుకోవడం ఆర్టికల్ 3 ప్రకారం నామ మాత్రమే. అసెంబ్లీ తన అభివూపాయాన్ని తెలియజేస్తూ తన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపుతుంది. దానిని రాష్ట్రపతి కేంద్ర కేబినెట్‌కు పంపుతారు. అదే సమయంలో ఏర్పాటు చేసే మంత్రుల కమిటీ ఉభయ ప్రాంతాల మధ్య నీళ్లు, భూమి, విద్యుత్, ఆదాయం వంటి పంపకాలపై చర్చించి వాటాలు ఖరారు చేస్తుంది. బిల్లుకు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు, సవరణలు ఉంటే చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అట్లా ఆమోదం పొందిన బిల్లు ‘ఆంవూధవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్టు-2013’ గా చట్టం అవుతుంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు ఉభయ సభల్లోనూ సాధారణ మెజార్టీతో ఆమోదం పొందేదిశగానే కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి