3, సెప్టెంబర్ 2013, మంగళవారం

విభజన వేళ.. ఆగని ఉద్యోగ దోపిడీ


9/3/2013 2:08:09 AM
-వైద్యరంగంలో సీమాంవూధుల అడ్డగోలు పోస్టింగ్‌లు
-అర్హులైన తెలంగాణవారికి మొండిచేయి
-డెంటల్ కాలేజీలో క్రిమినల్ కేసులున్న వ్యక్తికి చార్జి
ఉస్మానియా ఆస్పవూతిలోనూ అదే తీరు
-తెలంగాణ సీనియర్‌ను కాదని సూపరింటెండెంట్‌గా జూనియర్
-వారి నియామకం నిబంధనలకు విరుద్ధం
-అడ్డుకున్న తెలంగాణ మెడికల్ జేఏసీ, టీజీడీజే
-డీఎంఈ కార్యాలయం ముట్టడి
ఆ రెండు పోస్టులూ తెలంగాణవారివే
-న్యాయం చేయకపోతే వైద్యసేవలు ఆపేస్తాం
-తెలంగాణ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (టీ మీడియా):విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలోనూ సీమాంధ్ర నేతలు తమ దోపిడీ బుద్ధిని వదులుకోలేదు. ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కారణం. seemandra
దానిపైనే ఉద్యమం నిర్మితమై.. ఇప్పుడు విభజనకు రంగం సిద్ధమైంది. ఈ సమయంలోనూ సీమాంధ్ర పెద్దలు తెలంగాణవారికి దక్కాల్సిన పోస్టులను తమవారికి కట్టుబెట్టుకోవడం.. అదీ తెలంగాణకు చెందినవారిలో అర్హులు ఉన్నప్పటికీ.. వారిని కాదని తమవారిని అందలం ఎక్కించుకోవడం తెలంగాణవాదుల్లో ఆగ్రహం కలిగించింది. నిమ్స్ డైరెక్టర్‌గా సీమాంధ్ర ప్రాంతానికి చెందిననరేంవూదనాథ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీమాంధ్ర సర్కారు.. తదుపరి రెండు రోజుల వ్యవధిలో మరో రెండు పోస్టులను తనవారికి కట్టబెట్టుకుంది. పీజీ డెంటల్ కాలేజీలో నాలుగేళ్ల క్రితమే న్యాయంగా తెంగాణవారికి దక్కాల్సిన ప్రిన్సిపల్ పోస్టును ఇవ్వకుండా తొక్కిపెట్టిన అధికారులు, ఆగస్టు 31తో రిటైర్ అయిన పోస్టులోకి అనేక క్రిమినల్, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ జిల్లాలకు ప్రాణదాతగా ఉన్న ఉస్మానియా ఆస్పవూతిలో తెలంగాణ ప్రాంత డాక్టర్ కన్నా ఎంతో జూనియర్ అయిన సీమాంధ్ర డాక్టర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఉస్మానియా ఆస్పవూతిలో ఆగస్టు 31తో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న రాందాస్ రిటైర్ అయ్యారు. దీంతో ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు చెందిన శివరామిడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్, మెడికల్ జేఏసీ, టీఎన్జీవో నాయకులు డాక్టర్ బీ రమేష్, డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్‌డ్డి, డాక్టర్ రాంసింగ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉస్మానియాలో నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా ఉస్మానియా సూపరింటెండెంట్ శివరామిడ్డి చాంబర్‌కు వెళ్లారు. సీనియారిటీ ప్రకారం ఈ పోస్టులోకి జీఎంహెచ్ మెటర్నిటీ ఆస్పవూతిలో ఉన్న సువర్ణ రావాలని, కనుక ఈ పోస్టు వద్దని లేఖ రాయాలని శివరామిడ్డిని కోరారు. ఆయన ససేమిరా అన్నారు.

దీంతో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సువర్ణను శివరామిడ్డి కుర్చునే కుర్చీలో కుర్చోబెట్టారు. ఐదవ ర్యాంకులో ఉన్న సువర్ణను కాదని, 19వ ర్యాంకులో శివరామిడ్డికి ఎలా ఆర్డర్ ఇస్తారని ఉద్యోగులు మండిపడ్డారు. సూపరింటెండెంట్ కుర్చీలో కుర్చున్న సువర్ణ మీడియాతో మాట్లాడుతూ తాను శివరామిడ్డి కంటే ర్యాంకింగ్‌లో ముందున్నానని, న్యాయంగా ఈ పోస్టు తనకే రావాలని అన్నారు. తెలంగాణ ఆడపడచుగా సువర్ణకు ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగే అన్ని అర్హతలు ఉన్నాయని టీజీడీఏ అధ్యక్షుడు బీ రమేష్ అన్నారు. తెలంగాణ వైద్యులకు అన్యాయం చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈలు నియంతపోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ స్థానంలో సువర్ణను కూర్చోబెట్టిన తరువాత శివరామిడ్డి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయారు.

ఉస్మానియా పీజీ డెంటల్ కాలేజీలోనూ..
ఉస్మానియా పీజీ డెంటల్ కాలేజీలో సీమాంవూధకు చెందిన ప్రిన్సిపల్ కమలాదేవి ఆగస్టు 31న రిటైర్ అయ్యారు. ఈ పోస్టులోకి సీమాంధ్ర ప్రాంతానికే చెందిన అన్నపూర్ణకు చార్జి ఇచ్చారు. అయితే ఆమెపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్నది. ఆమెకు చార్జి ఇవ్వడానికి గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర అధికారులు రాష్ట్రం విడిపోయే సమయంలో చివరి నిమిషం వరకు తెలంగాణవారి పదవులు లాక్కోవాలనే తలంపుతో ఆమెకే చార్జి ఇచ్చారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విజయవాడలోని పీజీ కాలేజీలో నాలుగేళ్లుగా ప్రిన్సిపల్ పోస్టు ఖాళీగా ఉంది.

అందరికంటే జూనియర్ వ్యక్తి అక్కడ ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. ఇక్కడున్న సీమాంవూధులు విజయవాడకు వెళ్తే వాస్తవానికి నాలుగు సంవత్సరాల క్రితమే తెలంగాణ డాక్టర్‌కు ప్రిన్సిపల్ పోస్టు దక్కాల్సి ఉంది. కానీ అధికారులు అక్కడ పోస్టును ఖాళీ పెడుతూనే హైదరాబాద్‌లోని పోస్టులో సీమాంవూధులతో నింపుతున్నారు. పైగా అనేక అవకతవకలు, విచారణలు, కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి చార్జి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. ఈ ప్రిన్సిపల్ పోస్టులోకి తెలంగాణ ప్రాంత డాక్టర్ బాల్‌డ్డిని నియమించాలని అనేకసార్లు మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసి విజ్ఞప్తి చేసినా.. కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే చార్జి ఇచ్చారని అసోసియేషన్ నేతలు చెప్పారు.

ఈ విషయంలోనే తెలంగాణ మెడికల్ జేఏసీ, టీజీడీఏ నాయకులు సోమవారం జై తెలంగాణ నినాదాలు చేస్తూ పీజీ డెంటల్ కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ కుర్చీలో కుర్చున్న అన్నపూర్ణను నిలదీశారు. దీనిపై స్పందించిన డాక్టర్ అన్నపూర్ణ ప్రిన్సిపల్ సీటులో డాక్టర్ బాల్‌డ్డిని కూర్చోబెట్టి బయటకు వెళ్లిపోయారు. అనంతరం టీజీడీఏ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ రమేష్, మెడికల్ జేఏసీ నాయకులు డాక్టర్ రాజేశ్వరరావు, నాగేందర్‌లు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వైద్య కళాశాలల్లో తెలంగాణ వైద్యులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్‌ను నియమించే విషయంలోనూ ఇలాగే ప్రవర్తించారని, తాము నాడు చేసిన పోరాటాలతో తెలంగాణ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ను నియమించారని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టులోకి, ఉస్మానియా పీజీ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులోకి తెలంగాణ ప్రాంతం వారిని నియమించే వరకు ఆందోళన చేస్తామని రమేష్ హెచ్చరించారు. వీరిద్దరికీ నియామకపు ఆర్డర్లు వచ్చే వరకు హైదరాబాద్‌లో వైద్యసేవలు నిలిపివేస్తామని చెప్పారు.

డీఎంఈని నిలదీసిన వైద్యులు
ఈ రెండు ఘటనల తరువాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వద్దకు వచ్చిన టీజీడీఏ, మెడికల్ జేఏసీ నాయకులు డీఎంఈని నిలదీశారు. ఈ రెండు పోస్టుల్లోనూ తెలంగాణ వారికే అవకాశం ఉన్నా ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. పైగా సీమాంవూధులకే పోస్టులు ఇవ్వడం వెనుకున్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పెద్ద పెట్టున తెలంగాణ ఉద్యోగులు తరలిరావడంతో తెలంగాణ ప్రాంతం వారికే ఆర్డర్లు ఇచ్చేలా ప్రయత్నిస్తానని, తనకు ఒక గంట సమయం కావాలని డీఎంఈ కోరారు. ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసి వివరాలు చెప్పి వస్తానని వెళ్లిన డీఎంఈ శాంతారావు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా తన చాంబర్‌కు తిరిగి రాలేదు. దీనిపై తెలంగాణఉద్యోగులు మండిపడుతున్నారు. ఉస్మానియా సూపరింటెండెంట్‌గా సువర్ణను, ఉస్మానియా పీజీ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాల్‌డ్డిని నియమించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ మొత్తంగా వైద్యసేవలు నిలిపి వేసి సమ్మె చేస్తామని టీజీడీఏ అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఈ కార్యక్షికమంలో టీజీడీఏ నాయకులు ప్రవీణ్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి