9/2/2013 12:13:20 AM
స్పీకర్ అధికారాలు ఆర్టికల్ 374(ఎ)
చట్టసభల్లో కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న
సభ్యులను స్పీకర్ ఒక తీర్మానం ద్వారా నిర్ధిష్ట కాలవ్యవధికి సభ నుంచి
సస్పెండ్ చేయడం సాధారణం అయితే ఇటీవల లోక్‌సభ స్పీకర్ అసాధారణ రీతిలో
ఆర్టికల్ 374 (ఎ) కింద కొంతమంది సభ్యులను సస్పెండ్ చేయడంతో స్పీకర్
అధికారాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.ఆగస్టు-23వ తేదీన సభా కార్యక్రమాలకు
అంతరాయం కలిగిస్తున్న 12 మంది లోక్‌సభ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన
విషయం తెలిసిందే. అయితే అనూహ్య రీతిలో లోక్‌సభ నియమావళిలోని నిబంధన 374(ఎ)
కింద ఆ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది.
తొలిసారి స్పీకర్ 374(ఎ)ను ఉపయోగించడంతో లోక్‌సభ నియమావళి, స్పీకర్ అధికారాల పట్ల ఆసక్తికర చర్చకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అధికారాలు, ప్రధానంగా సభానిర్వహణలో స్పీకర్‌కు ఎలాంటి అధికారాలు ఉన్నాయన్న విషయాలను పరిశీలిద్దాం.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-93 ప్రకారం లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఎన్నుకోబడ్డ స్పీకర్ సభాపతిగా వ్యవహరిస్తాడు. స్పీకర్ 3 రకాల ఆధారాల ద్వారా అధికారాలను వినియోగిస్తారు. అవి : 1. భారత రాజ్యాంగం ద్వారా లభించే అధికారాలు 2. లోక్‌సభ నియమావళి ఆధారంగా లభించే అధికారాలు 3. పార్లమెంటరీ సాంప్రదాయాల ఆధారంగా లభించే అధికారాలు. లోక్‌సభ సజావుగా కొనసాగడానికి ఒక నియమావళిని రూపొందించారు. ఆ నియమావళిలో సభా కార్యక్రమాల నిర్వహణ విషయంలో స్పీకర్ ప్రధానంగా రూల్-349, 350, 351, 352, 354, 357, 371, 373, 374, 374(ఎ) నిబంధనల ఆధారంగా సందర్భానుసారంగా సభా కార్యకలా పాలపై నియంత్రణ చేస్తూ సభను హుందాగా కొనసాగేలా చేస్తాడు.ఇటీవల 374(ఎ) ప్రకారం ఆటోమేటిక్ సస్పెన్షన్‌ను స్పీకర్ ఉపయోగించి 12 మంది లోక్‌సభ సభ్యులను తొలగించడం జరిగింది కాబట్టి 374(ఎ)ను గూర్చి తెలుసుకుందాం. 374(ఎ)ను 14వ లోక్‌సభ కాలంలోనే లోక్‌సభ నియమావళిలో చేర్చారు. ఎవరైనా సభ్యులు లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని భావిస్తే సభ్యులను నేరుగా సస్పెండ్ చేసేందుకు లోక్‌సభ స్పీకర్‌కు అధికారం కల్పించే నిబంధన ఇది. ఈ నిబంధన ఉపయోగించడం స్పీకర్ నిర్ణయాధికార పరిధిలోకి వస్తుంది. 374(ఎ) ఉపయోగించమని ప్రభుత్వం తీర్మానం పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. 374(ఎ) ప్రకారం ఫలానా సభ్యుడిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటిస్తే ఆ క్షణం నుంచే సస్పెన్షన్ అమలులోకి వస్తుంది. 374(ఎ) ప్రకారం సస్పెండ్ అయిన సభ్యులు 5 రోజులపాటుగాని లేదా లోక్‌సభ సమావేశాలు ముగిసే దాకా గానీ రెండింటిలో ఏది తక్కువైతే అంతకాలం సస్పెన్షన్‌లో వుంటారు. కావాలనుకుంటే సభ తీర్మా నం ద్వారా సస్పెన్షన్‌ను మధ్యలోనే ఎప్పుడైనా ఎత్తివేయవచ్చు.సభ్యులు పదేపదే వెల్‌లోకి దూసుకువచ్చినా, సభా నియమాలను ఉల్లంఘిస్తూ నినాదాలు చేయడం, ఇతరత్రా మరే విధంగానైనా, సభా కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తున్నా సదరు సభ్యుడు లేదా సభ్యులను స్పీకర్ నేరుగా సస్పెండ్ చేయవచ్చు. సస్పెండ్ అయిన వెంటనే సభ్యుడు సభ నుంచి వెళ్ళిపోవాలి. సభ్యుడు సస్పెన్షన్ కాలంలో పార్లమెంటు సెంట్రల్‌హాల్లోకి కూడా ప్రవేశించడానికి అనుమ తించరు. ఈ నిబంధన లోక్‌సభ నియమావళిని రూపొం దించినప్పుడు లేదు. కానీ, పార్లమెంటు సభ్యులలో విలువల క్షీణత, సభా నియమావళి, సభా కార్యకలాపాలపట్ల అవగాహనా రాహిత్యం వల్ల ప్రజాస్వామ్య అంతిమ లక్ష్యం దెబ్బతినకుండా ఉండడానికి గత లోక్‌సభ కాలంలో ఈ నిబంధన పొందు పరిచారు.స్పీకర్ లోక్‌సభ ముఖ్య ప్రతినిధి. అతనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా ఉంటుంది. సభా వ్యవహరంలో అంతిమ నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉంటుంది. సభా సమావేశాలను గౌరవప్రదంగా జరిగేలా చూడడం స్పీకర్ బాధ్యతే. లోక్‌సభ నియమావళిలోని 349, 350, 351, 352, 354, 357, 371, 373, 374ల ఆధారంగా స్పీకర్ సభా నిర్వహణ విషయంలో పూర్తి అధికారాలను కలిగి ఉంటాడు.ఈ నిబంధనల ఆధారంగా స్పీకర్‌కు ఈ క్రింది చర్యలకు పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఉంది.
1. సభ్యులు సభలో నిశ్శబ్దాన్ని పాటించకపోవడం,
2. ఇతర వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వ్యాఖ్యానాలు చేయడం.
3. సభలో నినాదాలు ఇవ్వడం.
4. సభలో పెద్దగా నవ్వడం.
5. సభలో బ్యాడ్జీలు ధరించడం, నిరసన తెలపటం.
6. స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళడం.
7. ఆయుధాలు, ప్రమాదకర వస్తువులతో సభకు హాజరవడం.
ఈ కార్యకలాపాలు ఏ సభ్యుడు చేసినా స్పీకర్ వారి చర్య తీవ్రత ఆధారంగా వారిని సభనుంచి సస్పెండ్ చేయడం లేదా హెచ్చరించడం చేసే అధికారం కలిగి ఉంటాడు. స్పీకర్ ఎవరి పేరును సంభోదిస్తే ఆ వ్యక్తి మాత్రమే సభలో మాట్లాడాలి. ఇతర సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించకూడదు.
-రూల్-355 ప్రకారం ఒక సభ్యుడు మరొక సభ్యుడు ప్రసంగిస్తున్నపడు ఇంకేదైనా సమాచారం కావాలనుకుంటే స్పీకర్ ద్వారా మాత్రమే ప్రశ్నించాలి తప్ప నేరుగా ప్రశ్నించకూడదు.
-రూల్-351 ప్రకారం ఒక సభ్యుడు సభలో కూర్చుని మాట్లాడకూడదు. ప్రత్యేక సందర్భాలు (అనారోగ్య పరిస్థితులు, అంగవైకల్యం వగైరా) ఉన్నప్పుడు మాత్రమే స్పీకర్ ముందస్తు అనుమతి తీసుకొని కూర్చుని మాట్లాడవచ్చు.
-రూల్-356 ఎవరైనా సభ్యుడు సభా మర్యాదలు పాటించకుండా ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ సభకు ఆటంకం కలిగిస్తుంటే స్పీకర్ అతని ప్రసంగాన్ని అర్ధంతరంగా నిలిపి వేయవచ్చు.
-రూల్-361 ప్రకారం స్పీకర్ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే ఏ సభ్యుడూ సభ నుంచి వెళ్ళిపోకూడదు.
-రూల్-363 స్పీకర్ ఏదైనా బిల్లు గురించి చర్చిస్తున్న సందర్భంలో ఏ బిల్లు ఎంత సమయంలోపు చర్చించాలి అని సమయ నిర్దేశనం చేస్తాడు.
-రూల్-366 ఏదైనా ఒక అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన తరువాత తిరిగి ఏ సభ్యుడూ ఆ విషయం గూర్చి మాట్లాడకూడదు.
-రూల్-372 అత్యవసర ప్రజా ప్రాతినిధ్యం కలిగిన అంశంపై మంత్రి వ్యాఖ్యానించడానికి స్పీకర్ అవకాశం ఇచ్చిన తర్వాత సభ్యులు మరల ప్రశ్నలు లేవనెత్తకూడదు.
-అంతేకాకుండా రాజ్యాంగాన్ని, లోక్‌సభ నియమాలను, పార్లమెంటు ప్రక్రియలను వ్యాఖ్యానించడం విషయంలో కూడా అంతిమ అధికారం స్పీకర్‌కే ఉంటుంది. ఏదైనా ప్రత్యేక సందర్భంలో లోక్‌సభ నాయకుడు కోరినట్లయితే లోక్‌సభ ప్రత్యేక సమావేశాలను లేదా రహస్య సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఏదైనా బిల్లుపై సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసే అధికారం, ఒక బిల్లు ఆర్థిక బిల్లు లేక సాధారణ బిల్లు అని నిర్ణయించే అధికారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా లోక్‌సభ సభ్యుల అనర్హతలను ప్రకటించే అధికారం కూడా స్పీకర్‌కే ఉంటుంది.స్పీకర్ అధికారాల విషయంలో న్యాయస్థానంలో సవాలు చేసే అధికారం మౌలిక రాజ్యాంగాన్ని అనుసరించి ఎవరికి లేదు. అంటే లోక్‌సభ నియమావళి విషయంలో గాని రాజ్యాంగ బద్ధంగ స్పీకర్‌కు లభించే అధికారాల విషయంలోగాని సాంప్రదాయకంగా స్పీకర్ నిర్వహిస్తున్న అధికారాల విషయంలోగాని పార్లమెంటు సభ్యులు గాని, పౌరులుగాని ఏ విషయంలోనైనా స్పీకర్ నిర్ణయం సమంజసమా? కాదా? అని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి అవకాశం లేదు. ఈ నియమాన్ని పొందుపరచడంలో రాజ్యాంగ నిర్మాతలు గొప్ప దార్శనికతను ప్రదర్శించారనిపిస్తుంది. ఒకవేళ సభా నిర్వహణ విషయంలో స్పీకర్ నిర్ణయాలను న్యాయ స్థానంలో సవాలు చేసే అవకాశం ఉంటే, నియమాల ఉల్లంఘన ద్వారా అనర్హత వేటు పడ్డవారు, లేదా పార్టీ ఫిరాయిం పుల ద్వారా అనైతిక చర్యలకు పాల్పడ్డవారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ పోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం ఏర్పడవచ్చని భావించి స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయరాదనే నిబంధన పొందుపరిచారని భావించవచ్చు. అయితే గణేష్ వాసుదేవ మౌలంకర్ నుంచి సోమనాథ్ ఛటర్జీ వరకు అత్యున్నత పార్లమెంటరీ విలువలను, సాంప్రదా యాలను నెలకొల్పి నిష్పక్ష పాతంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య అత్యున్నత వేదికైన పార్లమెంట్ (లోక్‌సభ) గొప్పదనాన్ని ఇనుమడింప చేశారు. కానీ, అపరిమిత అధికారాలున్న స్పీకర్ రాజకీయ ప్రయోజనాలకోసమో, ఇతర సెపయోజనాలకోసవెూ లేక రాజకీయ దురుద్దేశంతోనో, లేక భావోద్వేగాల ప్రభావం వల్లనో ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా సభ్యుడిని సస్పెండ్ చేయడం గాని, లేక అనర్హుడిగా ప్రకటించడం గాని చేస్తే, ప్రశ్నించే అధికారం రాజ్యాంగ బద్ధంగా ఎవరికి లేకపోతే స్పీకర్ నియంతగా మారే అవకాశం ఉంది కదా? అనే అనుమానం వ్యక్తమవుతుంది. రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్‌లుగా నియమితులయ్యే వ్యక్తులు అత్యున్నత పరిణితి కలిగి ప్రజాస్వామ్య విలువల పట్ల బలమైన విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి అలాంటి సందేహాలు అనవసరమని భావించారు. కాని ఏ సందర్భంలోనూ ప్రజా స్వామ్యం అపహాస్యం కాకూడదని ప్రజాస్వామ్యంలో ఎవరు నియంత కాకూడదని భావించి సుప్రీంకోర్టు kihota Hollohan VS wachilhu కేసు 1992లో తీర్పును ఇస్తూ స్పీకర్ రాజకీయ దురుద్ధేశ్యంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు అని ప్రకటించడం జరిగింది.స్పీకర్, గౌరవనీయ సభ్యులు సభా నియమాలు, పార్ల మెంటరీ సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తూ సహృద్భావ వాతావరణంలో సమావేశాలు కొనసాగిస్తే ప్రజా స్వామ్యం మరింత వికాసవంతంగా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి